సింగపూర్ మంత్రి షణ్ముగం ధీమా
ముంబై: సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికల్లో ఉన్న టాటా సన్స్ తమ దేశాన్ని కీలక భాగస్వామిగా ఎంచుకుంటుందని సింగపూర్ ధీమా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ దేశంగా తమకు పేరుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపింది. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం సింగపూర్ హోమ్ అఫైర్స్ శాఖ మంత్రి కె. షణ్ముగం ఈ విషయాలు తెలిపారు. సమావేశంలో సెమీకండక్టర్లపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు.
సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరికరాల ఉత్పత్తిలో 20 శాతం వాటా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. చిన్న దేశమే అయినప్పటికీ తమ దేశంలో 25 సెమీకండక్టర్ల ఫౌండ్రీలు ఉన్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, దాదాపు అయిదు దశాబ్దాలుగా సింగపూర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ తమతో జట్టు కట్టగలదని షణ్ముగం చెప్పారు. టాటా గ్రూప్ రూ. 91 వేల కోట్లతో గుజరాత్‌లో, రూ. 27,000 కోట్లతో అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్‌తో (పీఎస్‌ఎంసీ) చేతులు కలిపింది.
Comments
Please login to add a commentAdd a comment