
సెల్లారు వద్ద వదిలేసి వెళ్లిన ఐదురోజుల పసికందు
గుంటూరు ఈస్ట్: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో కన్న తల్లి మమకారాన్ని చంపుకొని పురిటిలోని బిడ్డను అనాథగా వదిలేసి వెళ్లింది. జీజీహెచ్ అత్యవసర విభాగం సెల్లార్‌లో ఐదు రోజుల పసిగుడ్డు ఏడవడం విని సమీపంలోని సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూశారు. అక్కడ బిడ్డ పరిస్థితికి చలించిపోయారు. చుట్టుపక్కల బిడ్డకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ఐదు రోజుల మగ శిశువును 108 పిల్లల వార్డుకు తరలించారు. వార్డులోని ఎన్‌ఐసీ విభాగంలో పసికందును ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పసికందు చేతి మణికట్టు, కాలుకు తెల్ల ప్లాస్టర్లు చుట్టి ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment