పుట్టిన శిశువును అపహరించేందుకు మహిళ యత్నం | Woman attempt to kidnap infant | Sakshi
Sakshi News home page

పుట్టిన శిశువును అపహరించేందుకు మహిళ యత్నం

Published Sat, Jan 24 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

Woman attempt to kidnap infant

గుంటూరు: నగరంలో ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువును అపహరించేందుకు శనివారం ఓ గుర్తు తెలియని మహిళ ప్రయత్నించింది. అనురాధ అనే యువతి ఈ నెల 20న ప్రభుత్వ ఆస్పత్రిలో పాపకు జన్మనించింది. తల్లి నిద్రిస్తుండగా బిడ్డను అపహరించింది. ఇంతలోనే బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. పక్కనే ఉన్న హోటల్‌లో ఓ మహిళ చేతిలో బిడ్డ ఉండటాన్ని గమనించి పట్టుకున్నారు. మహిళను పోలీసులకు అప్పగించారు. కొత్తపేట పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement