ఉద్యోగాల పేరుతో భారీ మోసం | money collected from unemployees in vizag | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Published Fri, Dec 18 2015 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

money collected from unemployees in vizag

విశాఖ: విశాఖపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి  ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 66 మంది బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మోసపోయామని భావించిన బాధితులు దీనిపై శుక్రవారం పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్‌కు  ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారినని, తనకు హెచ్‌పీసీఎల్ జీఎం తెలుసనని భోగరాజు రామకృష్ణ అనే వ్యక్తి నిరుద్యోగులకు వల విసిరాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షల వరకు డబ్బు వసూలు చేశాడు. దీనిపై బాధితులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం సీఐని ఆశ్రయిస్తే... తమపైనే తిరిగి కేసు పెట్టి అరెస్ట్ చేస్తానంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement