money collected
-
కరోనా బూచి.. డబ్బు దోచి!
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కరోనా సమయంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి, అంత్యక్రియలకు అంబులెన్స్ నిర్వాహకులు రూ.85 వేలు వసూలు చేశారు. డెత్ సర్టిఫికెట్లో కరోనాతో చనిపోలేదని తెలుసుకుని అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది చేతిలో మోసపోయామని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరొకరు మోసపోవద్దని కోరారు. కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు(67) ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. (8,827 మంది డిశ్చార్జ్) పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందకముందే తరలించాలని తొందరపెట్టారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్ అక్కడి నుంచే ఫోన్లో అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్ పే ద్వారా సురేష్‌బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది. (అత్యధికంగా 69,878 పాజిటివ్, 945 మరణాలు) డెత్ సర్టిఫికెట్తో వెలుగులోకి.. సాయినాథ్‌రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూసి షాక్ తిన్నారు. సాయినాథ్‌రావు కరోనాతో చనిపోలేదని, సీఆర్ఎఫ్(క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేదా క్రానిక్ రీనల్ ఫెయి ల్యూర్)తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్ రేవతి పేరుతో ధ్రువపత్రం అందించారు. దీనిని వాట్సాప్ లో విదేశాల్లోని కుమారుడు క్రాంతి కిరణ్‌కు పంపించారు.జరిగిన మోసాన్ని తెలుసుకున్న అతను..విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. -
నమ్మించి నట్టేట ముంచేసి..
నల్లగొండ టూటౌన్ :అమాయక రైతులకు మాయమాటలు చెప్పాడు.. ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు.. రూ.కోటికిపైగా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టర్‌ను ఆశ్రయిం చా రు. వివరాలు.. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో లక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామం మొత్తం ముంపునకు గురైంది. దీంతో ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిం ది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన దేప ఈశ్వర్‌రెడ్డి ముంపు బాధితులకు హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మ బలికి సుమారు కోటి రూపాయాలకు పైగా వసూలు చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఈశ్వర్‌రెడ్డి 20 రోజుల నుంచి గ్రామానికి రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన రైతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లినా ఆచూ కీ లభించలేదు. తాము మోసపోయామని గ్రహించిన గ్రామానికి చెందిన 11 మంది రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సెల్ టవర్ ఎక్కిన యువకుడు ... తమ ఊరు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయామని, ఇలా తమను నిండా ముంచినా నాంపల్లి పోలీసులు తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ లక్ష్మాపురం గ్రామానికి చెందిన గడ్డి లింగయ్య అనే యవకుడు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. యువకుడు సెల్ టవర్ ఎక్కడంతో కలకలం రేగింది. డీఎస్పీ సుధాకర్, పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జేసీ నారాయణరెడ్డి సెల్ టవర్ దగ్గరకు వచ్చి యువకుడితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో కిందకి దిగాడు. పోలీసులు బాధిత రైతులతో పాటు టవర్ ఎక్కిన యువకుడిని జేసీ చాంబర్‌కు తీసుకెళ్లారు. జేసీ వారి నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడా.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అతని చేతిలో మోసపోయారని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విలేకరులకు తెలిపారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్‌తో మాట్లాడడం జరిగిందని తెలి పారు. మోసం చేసిన వ్యక్తి ఈశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతనిపై ఎల్బీనగర్లో కూడా మోసాలకు సంబంధించిన విషయంలో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ప్లాట్లు ఇప్పిస్తామని ఈశ్వర్‌రెడ్డి గ్రామస్తులతో పాటు అతని సమీప బంధువులను కూడా మోసం చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి రైతులు ఎవరు డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. – కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ -
ఎస్సైనంటూ డాక్టర్‌కు బెదిరింపులు
హైదరాబాద్ : ఎస్సైనంటూ ఓ వ్యక్తి చేస్తున్న బెదిరింపులపై హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం... రహ్మత్‌నగర్ జవహర్‌నగర్ ప్రాంతంలో వి. చంద్రశేఖర్ అనే వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన ఎండి. అస్లాం(35) అనే జ్వర బాధితుడు ఆ క్లినిక్‌లో వైద్యం చేయించుకున్నాడు. చికిత్స అనంతరం తాను ఉద్గిర్లో జరిగే వివాహానికి వెళ్తున్నట్లు చెప్పాడు. ఈ నెల 19వ తేదీన సందీప్ పాటిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ఉద్గిర్ ఎస్సైనంటూ పరిచయం చేసుకున్నాడు. క్లినిక్‌లో అస్లాంకు సరైన చికిత్స చేయకపోవటంతో అతడి పరిస్థితి సీరియస్‌గా ఉందని రూ.45 వేలు ఆస్పత్రి ఖర్చుల కోసం పంపించాలని చంద్రశేఖర్‌ను బెదిరించాడు. లేకపోతే కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ రూ.45 వేలు సందీప్‌పాటిల్ సూచించిన అకౌంట్‌కు బదిలీ చేశాడు. మరునాడే మళ్లీ ఫోన్‌చేసి అస్లాం పరిస్థితి విషమించిందని ఇంకో రూ.40 వేలు పంపాలంటూ ఆ ఆగంతకుడు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సందీప్ పాటిల్‌పై ఐపీసీ సెక్షన్ 419, 420, 506ల కింద కేసు నమోదు చేసి, జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెక్రటేరియట్లో ఉద్యోగాలంటూ టోకరా
బంజారాహిల్స్: నగరంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన రహ్మత్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది. సచివాలయం, జీహెచ్ఎంసీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకులను నమ్మించి లక్షలాది రూపాయలు దండుకున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. నిందితుడిని తక్షణం అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు బుధవారం పీఎస్‌లో బైఠాయించారు. వివరాల్లోకి వెళ్లితే... గోల్కొండ సమీపంలోని పుప్పాలగూడ కిజ్రా ఎన్‌క్లేవ్‌లో నివసించే మహ్మద్ ఫయాజ్(55) రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్ చుట్టుపక్కల నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ముఖ్యంగా సచివాలయం, జీహెచ్ఎంసీ, కోర్టులు, నిజాంక్లబ్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని వసూలు చేశాడు. 14 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ.70 వేల చొప్పున చెల్లించారు. అయితే ఎంతకూ ఉద్యోగాలు రాకపోగా ఇటీవల డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడటమే కాకుండా కేసుల్లో ఇరిస్తానంటూ బెదిరించాడు. గట్టిగా అడిగితే కులం పేరుతో దూషించామంటూ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడని సుజాత అనే బాధితురాలు తెలిపారు. ఆమెతో రాజు, నాగేష్, మహేష్ తదితర 14 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫయాజ్‌పై ఐపీసీ సెక్షన్ 406, 448, 420, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్రో రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్: మెట్రో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నిండా ముంచారు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో రాయల్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ సుమారు 150 మంది నుంచి లక్షల రూపాయల్లో వసూళ్లు చేసింది. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన పలువురు బాధితులు సంస్థ నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
విశాఖ: విశాఖపట్నంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 66 మంది బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మోసపోయామని భావించిన బాధితులు దీనిపై శుక్రవారం పోలీసు కమిషనర్ అమిత్ గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారినని, తనకు హెచ్‌పీసీఎల్ జీఎం తెలుసనని భోగరాజు రామకృష్ణ అనే వ్యక్తి నిరుద్యోగులకు వల విసిరాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి రూ.2 లక్షల వరకు డబ్బు వసూలు చేశాడు. దీనిపై బాధితులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం సీఐని ఆశ్రయిస్తే... తమపైనే తిరిగి కేసు పెట్టి అరెస్ట్ చేస్తానంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.