మెట్రో రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
హైదరాబాద్: మెట్రో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నిండా ముంచారు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో రాయల్ ప్లేస్‌మెంట్ కన్సల్టెన్సీ సుమారు 150 మంది నుంచి లక్షల రూపాయల్లో వసూళ్లు చేసింది.
మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన పలువురు బాధితులు సంస్థ నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.