కర్నూలు(రాజ్‌విహార్): డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్(2015–16 సంవత్సరాల్లో) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని, వీరికి హైదరాబాద్, మిర్యాలగూడ..తదితర ప్రాంతాల్లోని రెడ్డీస్ సంస్థల్లో రెండేళ్ల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఏడాదికి రూ.1.45లక్షల వరకు ఉపకార వేతనం ఇవ్వడంతోపాటు పై చదువుకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సబ్సిడీపై క్యాంటీన్, హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 20 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ 08518 277153, 91601 05162, 98499 01149 నంబర్లుకు సంప్రదించవచ్చని తెలిపారు.