reddys lab
-
రెమ్‌డెసివిర్ తయారీకి రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతి
అగనంపూడి (గాజువాక): దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణంలోని రెడ్డీస్ ల్యాబ్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మం జూరయ్యాయి. ఈ మేరకు దువ్వాడ వీఎస్ఈజెడ్ పరిపాలనా భవనంలో నిర్వహించిన యూనిట్ అప్రూవల్ కమిటీ (యూఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూఏసీ చైర్మన్, వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆవుల రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డీస్ ల్యాబ్‌తోపాటు మరో సంస్థ ఫ్ట్రాక్సీ దరఖాస్తు చేశాయని, ముందుగా రెడ్డీస్ ల్యాబ్‌కు అనుమతిచ్చామని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్ జూన్ నాటికి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తుందన్నారు. నెలకు వంద మిల్లీ లీటర్ల సామర్థ్యంతో 3.5 లక్షల బాటిళ్లు, 5 వందల మిల్లీలీటర్ల సామర్థ్యంతో 7 లక్షల ఇంజక్షన్లు తయారు చేసేలా యూనిట్‌ను సిద్ధం చేస్తున్నట్టు రెడ్డీస్ ల్యాబ్ హెడ్ మీనన్ చెప్పారని తెలిపారు. ఇప్పటికే నక్కపల్లి సెజ్‌లోని హెట్రో డ్రగ్ ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నారని, అలాగే ఏపీసెజ్‌లోని లారస్ కంపెనీ 38.3 మిలియన్ హెచ్‌సీక్యూ టాబ్లెట్లను అమెరికా, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెనడా, బెల్జియమ్, మయన్మార్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయన్నారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నక్కపల్లిలోని ఆనర్ ల్యాబ్‌కు వంద కేజీల మాల్నూపిరవీర్ మందుల తయారీకి అనుమతులిచ్చినట్లు ఆయన తెలిపారు. -
మే 1 నుంచి స్పుత్నిక్- వి: మీకు ఈ విషయాలు తెలుసా?
న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ - వి భారత్‌కు రానుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు రెడ్డీస్ ల్యాబ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్- వికి సంబంధించిన వివరాలు.. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ 'స్పుత్నిక్' ను ప్రయోగించింది. అందుకు గుర్తుగా రష్యన్ గవర్నమెంట్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు స్పుత్నిక్ - వి అని నామకరణం చేసింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, మెర్స్ వైరస్ లను అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. స్పుత్నిక్- వి వినియోగానికి కేంద్రం అనుమతి వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ లో మిగిలిన కరోనా వ్యాక్సిన్ల తరహాలో స్పుత్నిక్ - వి 91.6 శాతం వైరస్ ను అడ్డుకుంటుందని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు ఇప్పటికే 3.8 మిలియన్ల మంది ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారని, 97.6 శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తేలిందని చెప్పింది. ఈ ప్రకటన తరువాత రెండు నెలలకే అంటే ఏప్రిల్ 12న స్పుత్నిక్ - వి వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జర్నల్ ఆఫ ఇండియా (డీసీజీఐ) అనుమతులు జారీచేసింది. రెండు డోసులు ఒకేలా ఉండవా? స్పుత్నిక్ - వి అనేది ఆస్ట్రాజెనెకా టీకా తరహాలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ఇతర కరోనా వ్యాక్సిన్ల తరహా కాకుండా స్పుత్నిక్ -వి విభిన్నం. ఇతర సంస్థలకు చెందిన వ్యాక్సిన్ల రెండు డోసుల మోతాదులు ఒకే విధంగా ఉంటాయి. కానీ స్పుత్నిక్ - వి టీకా మోతాదులు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అందులో ఒక టీకా డోసు కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్ కోవిడ్ -2 యొక్క స్పైక్ ప్రొటీన్ ను అడ్డుకుంటే, రెండో టీకా డోసు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. స్పుత్నిక్ - వి ధర ఎంత ? ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన వ్యాక్సిన్ల ధర కంటే స్పుత్నిక్ - వి ధర కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. స్పుత్నిక్ -వి కి పోటీగా ఉన్న ఆస్ట్రాజెనెకా ఒక్కడోస్ ఖరీదు 4డాలర్లుగా ఉంది. స్పుత్నిక్ -వి ధర 10డాలర్లుగా ఉంది. అయితే భారత్ లో మాత్రం వ్యాక్సిన్ ధర పది డాలర్ల కన్నా తక్కువగానే ఉటుందని ఇప్పటికే రష్యా సూచించింది. 60కి పైగా దేశాలకు స్పుత్నిక్ - వి పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో రష్యా తయారు చేసిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే స్పుత్నిక్- వి తయారీకి నిధుల్ని సమకూర్చిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) మనదేశానికి చెందిన 5 సంస్థలతో 850 మిలియన్ లేదా 85 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాలు కుదుర్చుకుంది. స్పుత్నిక్- వి పనితీరుపై అనుమానాలా? స్పుత్నిక్- వి క్లినికల్ ట్రయల్స్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది ఆగస్ట్ 10 న రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ముగిసిన వెంటనే ఈ వ్యాక్సిన్ వినియోగానికి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. వాస్తవానికి క్లినికల్ ట్రయల్స్ మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? ఒకవేళ వ్యాక్సిన్ వినియోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనేది చెక్ చేస్తారు. ఇక రెండో దశలో ఎంత మోతాదులో ఇవ్వాలి. మూడో దశలో ఎంతమేరకు పనిచేస్తుంది. అసలు పనిచేస్తుందా? లేదా? అని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. కానీ స్పుత్నిక్ - వి విషయంలో అలా జరగలేదు. రెండో దశ ట్రయల్స్‌లో ఉండగానే అనుమతులు ఇవ్వడంపై వ్యాక్సిన్ వినియోగంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో క్లినికల్ ట్రయల్స్ గురించి వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో లాన్సెట్ అనే జర్నల్ తన కథనంలో టీకా సురక్షితంగా ఉండడమే కాదు ప్రభావవంతంగా పని చేస్తోందని పేర్కొంది. మరి త్వరలో భారత్ లో పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉండబోతుందనే అంశంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. -
రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ జమీర్ అహమ్మద్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ జాబ్‌మేళా గుంటూరు, కర్నూలులో నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరులో ఈ నెల 16, 17న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో ఈ నెల 22, 23న రాత పరీక్ష, ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ, వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు(రాజ్‌విహార్): డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరు మహమ్మద్ అంజాద్ అలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్(2015–16 సంవత్సరాల్లో) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని, వీరికి హైదరాబాద్, మిర్యాలగూడ..తదితర ప్రాంతాల్లోని రెడ్డీస్ సంస్థల్లో రెండేళ్ల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఏడాదికి రూ.1.45లక్షల వరకు ఉపకార వేతనం ఇవ్వడంతోపాటు పై చదువుకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సబ్సిడీపై క్యాంటీన్, హాస్టల్ సౌకర్యం కల్పిస్తారని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 20 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియేట్ ఎంపీసీ, బైపీసీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ 08518 277153, 91601 05162, 98499 01149 నంబర్లుకు సంప్రదించవచ్చని తెలిపారు. -
రెడ్డి ల్యాబ్స్ రూ. 9.5 కోట్ల విరాళం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎన్ఆర్) కింద పారిశ్రామిక వేత్తలు తమవంతు బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం రెడ్డిల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు రవికుమార్, ప్రసాద్, బాలేశ్ సీఎన్ఆర్ కింద రూ.9.5 లక్షల చెక్కును కలెక్టర్ స్మితాసబర్వాల్కుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పారిశ్రామికవేత్తలు జిల్లా అభివృద్ధికి తమవంతు చేయూతనందించాలని కోరారు. ఈ నిధులను వసతి గృహాల మౌళిక వసతుల మెరుగు, ఇతర సామాజిక అంశాలపై వెచ్చిస్తున్నామనీ, వీటికి సంబంధించిన వివరాలను జిల్లా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నామని ఆమె తెలిపారు. సామాజిక బాధ్యతతో జిల్లా అభివృద్ధికి విరాళమిచ్చిన రెడ్డి ల్యాబొరేటిస్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.