రెడ్డి ల్యాబ్స్ రూ. 9.5 కోట్ల విరాళం | Reddy's Labs. 9.5 million donation | Sakshi
Sakshi News home page

రెడ్డి ల్యాబ్స్ రూ. 9.5 కోట్ల విరాళం

Published Sat, Dec 21 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Reddy's Labs. 9.5 million donation

కలెక్టరేట్, న్యూస్‌లైన్:  కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎన్‌ఆర్) కింద పారిశ్రామిక వేత్తలు తమవంతు బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం రెడ్డిల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు రవికుమార్, ప్రసాద్, బాలేశ్  సీఎన్‌ఆర్ కింద రూ.9.5 లక్షల చెక్కును కలెక్టర్ స్మితాసబర్వాల్‌కుకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పారిశ్రామికవేత్తలు జిల్లా అభివృద్ధికి తమవంతు చేయూతనందించాలని కోరారు. ఈ నిధులను వసతి గృహాల మౌళిక వసతుల మెరుగు, ఇతర సామాజిక అంశాలపై వెచ్చిస్తున్నామనీ, వీటికి సంబంధించిన వివరాలను జిల్లా వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నామని ఆమె తెలిపారు. సామాజిక బాధ్యతతో జిల్లా అభివృద్ధికి  విరాళమిచ్చిన రెడ్డి ల్యాబొరేటిస్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement