రుణాను‘బంధం’ | financial attachment | Sakshi
Sakshi News home page

రుణాను‘బంధం’

Published Fri, Aug 26 2016 9:12 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

రుణాను‘బంధం’

రుణాను‘బంధం’

 కార్పొరేషన్‌ రుణాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షే..
ఎస్సీ, బీసీ, కాపు రుణాలంటూ ప్రభుత్వ ఆర్భాటం
కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు
లబ్ధిదారులను చులకనగా చూస్తున్న పలువురు బ్యాంకర్లు
 
            ఉద్యోగాలిచ్చేస్తామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. కనీసం జీవనోపాధికి రుణం కూడా మంజూరు చేయలేకపోతోంది. జీవన ప్రమాణాలు మెరుగుపరచుకునేందుకు.. ఎంతో ఆశతో ఉపాధి కోసం రుణానికి దరఖాస్తు చేసుకుంటే, అధికారులు, బ్యాంకర్లు తమ చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటున్నారు. ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందాలనుకుంటున్న నిరుద్యోగులు.. ప్రభుత్వం తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
– కొత్తపేట
 
జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆయా కార్పొరేషన్ల రుణాలు మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, కుప్పలు ðlప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆర్థిక సంవత్సరం గడచినా ఒక్కరికీ రుణం మంజూరు కాలేదు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. అధికార పార్టీ నేతల నేతృత్వంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో కొందరికి ప్రభుత్వ సబ్సిడీ మంజూరు కాగా, వారు బ్యాంకు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక మందికి ఆ సబ్సిడీ కూడా మంజూరు కాకపోవడంతో మండల పరిషత్‌ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధికారులు కార్పొరేషన్‌ ఈడీలకు ఫోన్లు చేసి, ఆరా తీస్తున్నారు. త్వరలో సబ్సిడీ పడుతుందన్న సమాధానమే మినహా, సబ్సిడీ పడిన దాఖలాలు మాత్రం లేవు. ఆయా బ్యాంకుల అధికారులను రుణం విషయమై అడిగితే, కొందరు చిన్నచూపు చూస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓSలబ్ధిదారుడు–బ్యాంకు మేనేజర్‌ మధ్య సాగిన సంభాషణ ఇది...
 
లబ్ధిదారుడు : సార్, మా లోన్‌ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు?
బ్యాంక్‌ మేనేజర్‌ : ఏం లోను?
లబ్ధిదారుడు : కాపు కార్పొరేషన్‌ లోనండి.
బ్యాంక్‌ మేనేజర్‌ : యూనిట్‌ ఏం పెట్టావు? అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. సబ్సిడీ రావాలి.
లబ్ధిదారుడు : ఎంపీడీఓ గారు మంజూరు చేసిన లబ్ధిదారుల జాబితా మేరకు మీ బ్యాంకుకు పంపించారు. అకౌంట్‌ ఓపెన్‌ చేశాను. సబ్సిడీ కూడా పడింది. వ్యాపారం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను.
బ్యాంక్‌ మేనేజర్‌ : అయితే నీ యూనిట్‌ చూడాలి.
లబ్ధిదారుడు : ఎప్పుడు వస్తారు?
బ్యాంక్‌ మేనేజర్‌ : నాకు ఖాళీ ఉండాలి కదా!
లబ్ధిదారుడు : తొందరగా వచ్చి చూసి లోను ఇప్పించండి సార్‌.
బ్యాంక్‌ మేనేజర్‌ : ఎలా ఇచ్చేస్తామయ్యా. ఈ బ్రాంచికి రూ.1.05 కోట్ల రుణ బకాయిలు#న్నాయి. అవి వసూలు కావాలి. అప్పుడు నీ లోను గురించి ఆలోచిస్తాను.
 
లోను మంజూరైంది కానీ..
గత ఏడాది నా భార్య కేశనకుర్తి గోవిందమ్మ పేరున డ్రైవాషింగ్‌ యూనిట్‌ కోసం బీసీ కార్పొరేషన్‌ లోనుకు దరఖాస్తు చేశాం. మంజూరైందన్నారు. బ్యాంకులో అకౌంటు ఓపెన్‌ చేయమంటే, చేశాం. మాతో పాటు దరఖాస్తు చేసుకున్న కొందరికి సబ్సిడీ కూడా మంజూరైందన్నారు. మాకు మాత్రం సబ్సిడీ పడలేదు. ఆ విషయమై ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నిసార్లు కలిసినా అదిగో వస్తుంది. ఇదిగో వస్తుంది అంటున్నారే మినహా సబ్సిడీ పడింది లేదు.
– కేశనకుర్తి వెంకటేశ్వరరావు, కొత్తపేట
 
బ్యాంకుల్లో లబ్ధిదారుల జాబితా
నిరుద్యోగులకు ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకున్నాం. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలు బ్యాంకులకు పంపించాం. వారు అకౌంట్లు తెరిచి, ఖాతా నంబర్లు పంపించాలి. అకౌంట్లు ఓపెన్‌ చేసినా పలు సాంకేతిక కారణాల వల్ల సబ్సిడీ విడుదల కాలేదంటున్నారు. ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సంప్రదిస్తున్నాం. అవసరమైతే బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా సంప్రదిస్తాం.
– వై.ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ, రావులపాలెం
 
జిల్లాలో రుణాలు తీరిది :
కార్పొరేషన్‌ దరఖాస్తులు మంజూరు యూనిట్లు సబ్సిడీ లోనింగ్‌ మంజూరు                                    
ఎస్సీ 9,559 4,303 1,613
బీసీ 10,077 4,180 1,730
కాపు 90,757 10,761 2,233 – 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement