8న మెగా జాబ్‌మేళా
మచిలీపట్నం :
కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గుడివాడలోని కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ జాబ్‌మేళాలలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీ, డిప్లమో, ఇంటర్, బీ–ఫార్మసీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలు హాజరుకావచ్చునని సూచించారు.