october 8th
-
8న మెగా జాబ్మేళా
మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన గుడివాడలోని కేటీఆర్ ఉమెన్స్ కాలేజ్లో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ జాబ్మేళాలలో 20 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థుల అర్హతను బట్టి ఎంపిక జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీ, డిప్లమో, ఇంటర్, బీ–ఫార్మసీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన వారు ఇంటర్వ్యూలు హాజరుకావచ్చునని సూచించారు. -
8న బతుకమ్మ మహా ప్రదర్శన
హన్మకొండఅర్బ¯ŒS : బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈనెల 8వ తేదీన బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెకక్టర్ వాకాటి కరుణ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. నగరంలో ఎంపిక చేసిన 19 కేంద్రాల్లో మహిళలు బతుకమ్మ ఆడుకుంటారన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బతుకమ్మ సంబురాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడుకునే స్థలాలను చదును చేయడంతోపాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించినట్లు చెప్పారు. జేసీ ప్రశాంత్జీవ¯ŒSపాటిల్, డీఆర్వో శోభ, డీడీ జగ¯ŒS, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 8 నుంచి జాతీయ చెస్ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ : వచ్చే నెల 8 నుంచి 16వ తేదీ వరకూ 46వ జాతీయ జూనియర్ అండర్–19 చదరంగం ఛాంపియన్షిప్–2016, 31వ జాతీయ జూనియర్ అండర్–19 బాలికల చదరంగం ఛాంపియన్షిప్–2016 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. స్థానిక ఎసెంట్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘాల ప్రోత్సాహంతో ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన స్థానిక షెల్టాన్ హోటల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు రానున్నారన్నారు. ప్రతి రాష్ట్రం నుంచీ ఎనిమిదిమంది క్రీడాకారులు తప్పనిసరిగా హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఈ పోటీలను సుమారు రూ.30 లక్షలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. క్రీడాకారులు తొమ్మిది రోజులపాటు 11 రౌండ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ కూడా పాల్గోన్నారు. -
8న ‘కృష్ణా’ వివాదంపై సుప్రీం విచారణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్లో ప్రచురించరాదంటూ టీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇదే అంశాన్ని పేర్కొంటూ ఏపీ, కర్ణాటకలు వేసిన పిటిషన్లతోపాటు తీర్పును గెజిట్లో ప్రచురించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతున్న మహారాష్ట్ర పిటిషన్ను కూడా కలిపి సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్లో ఇంతవరకు తమకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ముందు వినిపించే అవకాశం రానందున, తమ వాదనలు విన్నాకే తుది తీర్పు వెలువరించాలని కోరింది. తమ వాదనలు వినకుండా కేవలం 3 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే నదీ జలాల్లో తమకు అన్యాయం తప్పదని పేర్కొంది. నీటి లభ్యత, మిగులు జలాలు, క్యారీఓవర్లపై గతం బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు భిన్నంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందని, ఇది కేంద్ర జల సంఘం విధానాలకు విరుద్ధమని నివేదించింది.