వచ్చే నెల 8 నుంచి జాతీయ చెస్ పోటీలు
వచ్చే నెల 8 నుంచి 16వ తేదీ వరకూ 46వ జాతీయ జూనియర్ అండర్–19 చదరంగం ఛాంపియన్‌షిప్–2016, 31వ జాతీయ జూనియర్ అండర్–19 బాలికల చదరంగం ఛాంపియన్‌షిప్–2016 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. స్థానిక ఎసెంట్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘాల ప్రోత్సాహంతో ఎసెంట్
రాజమహేంద్రవరం సిటీ :
వచ్చే నెల 8 నుంచి 16వ తేదీ వరకూ 46వ జాతీయ జూనియర్ అండర్–19 చదరంగం ఛాంపియన్‌షిప్–2016, 31వ జాతీయ జూనియర్ అండర్–19 బాలికల చదరంగం ఛాంపియన్‌షిప్–2016 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు తెలిపారు. స్థానిక ఎసెంట్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘాల ప్రోత్సాహంతో ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన స్థానిక షెల్టాన్ హోటల్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు రానున్నారన్నారు. ప్రతి రాష్ట్రం నుంచీ ఎనిమిదిమంది క్రీడాకారులు తప్పనిసరిగా హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఈ పోటీలను సుమారు రూ.30 లక్షలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఎసెంట్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ జి.శ్రీదేవి తెలిపారు. క్రీడాకారులు తొమ్మిది రోజులపాటు 11 రౌండ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ కూడా పాల్గోన్నారు.