8న బతుకమ్మ మహా ప్రదర్శన
హన్మకొండఅర్బ¯ŒS : బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈనెల 8వ తేదీన బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెకక్టర్ వాకాటి కరుణ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. నగరంలో ఎంపిక చేసిన 19 కేంద్రాల్లో మహిళలు బతుకమ్మ ఆడుకుంటారన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బతుకమ్మ సంబురాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడుకునే స్థలాలను చదును చేయడంతోపాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించినట్లు చెప్పారు. జేసీ ప్రశాంత్‌జీవ¯ŒSపాటిల్, డీఆర్వో శోభ, డీడీ జగ¯ŒS, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.