మహబూబాబాద్‌లో బతుకమ్మలతో నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు
సాక్షి, నెట్‌వర్క్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లతో వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మె కొత్తరూపం దాల్చింది. గురువారం తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శనలతో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 25 రోజులుగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారు.
ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరహా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ నాయకులు రాజయ్య, వంగూరు రాములు, దాదేమియా, వెంకటేష్ యాదవ్, శిరీషారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment