తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో అంటూ ప్రారంభమయ్యే ఈ పండుగ ఆటపాటల సందడితో ఆనందభరితంగా ఉంటుంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు.
ఈరోజు మూడో రోజు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలంతా ముద్దపప్పు బతకమ్మను జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటారు
బతుకమ్మ పండుగలో మూడవ రోజు ‘విదియ’ కాబట్టి ఈ రోజున‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి, అందంగా అలంకరిస్తారు.
నైవేద్యంగా..
ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు.
(చదవండి: Dussehera 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment