నైపుణ్యానికే కొలువు | jobmela in svit | Sakshi
Sakshi News home page

నైపుణ్యానికే కొలువు

Published Sat, Mar 4 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

నైపుణ్యానికే కొలువు

- ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉజ్వల భవిత
- జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి
- ఎస్‌వీఐటీలో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా
-  ఇంటర్వ్యూలకు 3 వేలమంది విద్యార్థుల హాజరు  
- వెయ్యి మందికి నేడు ఉద్యోగ నియామకపత్రాల జారీ


రాప్తాడు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌వీఐటీ) ఇంజినీరింగ్‌ కళాశాలలో చైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సి.చక్రధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరకు చెందిన జైన్‌ యూనివర్సిటీ సహకారంతో దేశంలోని 25 ప్రముఖ కంపెనీలతో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ‘అనంత’తోపాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థలు తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. చైర్మన్‌ సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రతనాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. ఆ రతనాలకు మెరిపించేందుకే జాబ్‌మేళా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకూ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాబ్‌మేళాలో ఎటువంటి రిజిస్ట్రేషన్‌ రుసుం విధించలేదన్నారు. వైస్‌ చైర్మన్‌ సి.చక్రధర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో 25 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు జరపడం ఇదే మొదటిసారని, అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్‌లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివినా ఉద్యోగాలు వచ్చేది నమ్మకం లేదన్నారు. విద్యార్థులు కష్టపడకుండా ఉద్యోగాలు సాధించేందుకు తమ కళాశాలలో ఉద్యోగా మేళా నిర్వహిస్తున్నామన్నారు.

ఉద్యోగాలకు వెయ్యి మంది ఎంపిక..
జాతీయస్థాయి జాబ్‌మేళా విజయవంతం అయ్యింది. డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమో, ఫార్మసీ, 2015, 16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 3 వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు వివిధ గదులు కేటాయించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన జాబ్‌మేళాలో దాదాపు 1000 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి ఆదివారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ఎస్‌వీఐటీ యాజమన్యం తెలిపింది. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన జైన్‌ యూనివర్సిటీ మార్కెటింగ్‌ మేనెజర్‌ అశ్విన్, ఫ్లేస్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్లు చందీల్, గణేష్, ప్రిన్సిపల్‌ టి.సూర్యశేఖర్‌రెడ్డి, కళాశాల ట్రెజరర్‌ రామసుబ్బమ్మ, వైస్‌ ప్రిన్సిపల్‌ సత్యశ్రీ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ కిరణ్‌కుమార్, పీడీ శ్రీనివాసులునాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement