svit
-
ఎస్వీఐటీలో నేడు మైక్రోసాప్ట్ కంపెనీ జాబ్‌మేళా
రాప్తాడు(కనగానపల్లి): మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ (ఎస్వీఐటీ) కళాశాలలో మైక్రోసాప్ట్ కంపెనీ తరఫున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి. సూర్యశేఖరరెడ్డి తెలిపారు. స్థానిక కళాశాలలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైక్రోసాప్ట్ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆ కంపెనీ ఉప సంస్థ క్లెంట్ బైనరీ టైటాన్స్ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతోందన్నారు. బీటెక్ ఫైనల్ చదువుతున్న అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ నియామకాల్లో పాల్గొనవచ్చన్నారు. కంపెనీ ప్రతినిధులు గురువారం ఎస్వీఐటీ కళాశాల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని అర్హులైన వారికి రాత, మౌఖిక పరీక్షలతో పాటు గ్రూపు చర్చలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్ చెర్మెన్ చక్రధర్‌రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
– ఉత్సాహంగా తరలివచ్చిన విద్యార్థులు రాప్తాడు / హిందూపురం అర్బన్ : సాక్షి మీడియా గ్రూప్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ), బిట్ ఇంజినీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించింది. హంపాపురం వద్ద ఉన్న ఎస్వీఐటీ, హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షను నిర్వహించారు. అనంతపురం నుండే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మూడు గంటల పాటు కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షలను ఎస్వీఐటీలో సాక్షి దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ కేదార్‌నాథ్‌రెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, పర్యవేక్షించారు. హిందూపురంలో పరీక్ష పత్రాలను బిట్ కళాశాల చైర్మన్ పి.చంద్రమోహన్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ విడుదల చేశారు. సమయపాలన తెలిసింది - నవ్యశ్రీ, బాలాయేసు కళాశాల, హిందూపురం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ చాలా మాకు ఎంతగానో దోహదపడింది. ముఖ్యంగా ఈ పరీక్ష వల్ల సమయ పాలన బాగా తెలిసొచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రధాన పరీక్షపై పడుతున్న టెన్షన్ బాగా తగ్గిపోయినట్లే. థ్యాంక్స్ టు సాక్షి. మంచి ర్యాంకు వస్తుంది – హరిణిరెడ్డి, అనంతపురం ఎంసెట్ ఎగ్జామ్ అంటే చాలా భయంగా ఉండేది. పరీక్ష ఎలా రాయాలో కూడా తెలియదు. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ద్వారా పరీక్ష ఎలా రాయాలో తెలిసింది. కచ్చితంగా త్వరలో నిర్వహించే ఎంసెట్ మంచి మార్కులు సాధిస్తా. ఇలాంటి పరీక్షలను విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలి. -
ఎస్వీఐటీలో నేడు ఆన్ క్యాంపస్ డ్రైవ్
హంపాపురం (రాప్తాడు) : మండలంలోని హంపాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో నేడు(శనివారం) ఆన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ సి. సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వైస్ చైర్మన్ సి. చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ టి. సోమశేఖర్‌రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన ‘ట్రైజెంటో సాఫ్ట్వేర్ సొల్యుషన్స్’ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంజినీరింగ్ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈడ్రైవ్కు అర్హులని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఇంటర్య్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన విద్యార్థులు బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, వార్షిక ఆదాయం రూ. 2.40 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, పీడీ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీఐటీ విద్యార్థుల ప్రతిభ
హంపాపురం (రాప్తాడు): గత నెల 28న హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన నేషనల్ లెవల్ పేపర్ ప్రజెంటేషన్ లో తమ కళాశాల కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బ్రాంచ్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న పి.రేవతి, బి.శ్రీ పూజిత డేటా స్ట్రక్చర్ పేపర్లో మొదటి బహుమతి సాధించారన్నారు. రెండవ బహుమతి సీఎస్ఈ విద్యార్థులు ఈ.హర్షిత, జె.రమ్య, ఇంగ్లిష్ కమ్యూనికేష¯ŒS టాపిక్‌లో రెండవ బహుమతిని సీఎస్ఈ మొదటి సంవత్సరం విద్యార్థులు సి.ఆతియా ఆప్రోజ్, ఎం.పూర్ణ సుమత, ఫిజిక్స్‌లో మూడవ బహుమతిని మొదటి సంవత్సరం సీఎస్ఈ విద్యార్థులు కె.షాను, బి.లావణ్య సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఆయనతోపాటు కళాశాల చైర్మ¯ŒS సి.సోమశేఖర్‌రెడ్డి, సి.చక్రధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, పీడీ శ్రీనివాసుల నాయక్ అభినందించారు. -
నైపుణ్యానికే కొలువు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత - జేఎన్టీయూ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి - ఎస్వీఐటీలో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా - ఇంటర్వ్యూలకు 3 వేలమంది విద్యార్థుల హాజరు - వెయ్యి మందికి నేడు ఉద్యోగ నియామకపత్రాల జారీ రాప్తాడు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ ఉన్న వారికే ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాలలో చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో దేశంలోని 25 ప్రముఖ కంపెనీలతో జాతీయస్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ‘అనంత’తోపాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థలు తరగతి గదికే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగు పర్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. చైర్మన్ సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రతనాల్లాంటి విద్యార్థులు ఉన్నారన్నారు. ఆ రతనాలకు మెరిపించేందుకే జాబ్‌మేళా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకూ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాబ్‌మేళాలో ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుం విధించలేదన్నారు. వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో 25 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్వ్యూలు జరపడం ఇదే మొదటిసారని, అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కోచింగ్‌లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి చదివినా ఉద్యోగాలు వచ్చేది నమ్మకం లేదన్నారు. విద్యార్థులు కష్టపడకుండా ఉద్యోగాలు సాధించేందుకు తమ కళాశాలలో ఉద్యోగా మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగాలకు వెయ్యి మంది ఎంపిక.. జాతీయస్థాయి జాబ్‌మేళా విజయవంతం అయ్యింది. డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమో, ఫార్మసీ, 2015, 16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 3 వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు వివిధ గదులు కేటాయించారు. కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు రాత పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన జాబ్‌మేళాలో దాదాపు 1000 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వారికి ఆదివారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ఎస్వీఐటీ యాజమన్యం తెలిపింది. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ మార్కెటింగ్ మేనెజర్ అశ్విన్, ఫ్లేస్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్లు చందీల్, గణేష్, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి, కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, పీడీ శ్రీనివాసులునాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
4న ఎస్వీఐటీలో మెగా జాబ్‌మేళా
రాప్తాడు : హంపాపురంలోని ఎస్వీఐటీ కళాశాలలో ఈ నెల 4న జాతీయ స్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ జాబ్‌మేళాకు దేశంలోని 25 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 2 వేల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడతారని తెలిపారు. బెంగళూరుకు చెందిన జైన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్‌మేళాకు ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ , పాలిటెక్నిక్, 2015-16లో ఎంబీఏ పూర్తి చేసిన వారు, 2017లో ఫైనలియర్ డిప్లొమో, ఫార్మసీ చదువుతున్న వారు హాజరుకావచ్చన్నారు. మేళాకు వచ్చేవారికోసం ఆరోజు ఉదయం 8 గంటలకు అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. -
ఎస్వీఐటీలో ఘనంగా స్పోర్ట్స్ డే
హంపాపురం (రాప్తాడు) : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని హంపాపురం సమీపంలోని శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్ కళాశాల 7వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కళాశాలలో స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి , ప్రిన్సిపాల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు అవసరమన్నారు. అనంతరం పోటీల్లో గెలుపోందిన కళాశాల విద్యార్థులకు కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి బహుమతులను అందేజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కళాశాల ట్రెజరర్ రామసుబ్బమ్మ, సెక్రటరి సౌజన్య, ఏఓ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాసులు నాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.