మహానగరంలో బతకడం కష్టమే
* మెరుగైన వేతనాలు ఇస్తేనే ఉపయోగం
* జాబ్ మేళాలో ఉద్యోగాలు తిరస్కరించిన పలువురు
* మూడు ఏరియూల్లో 1734 మందికి అవకాశం
* నేడు, రేపు మరో మూడు ఏరియూల్లో మేళా నిర్వహణ
యైటింక్లయిన్ కాలనీ/మందమర్రి/ ఇల్లెందు అర్బన్ :
సింగరేణి యూజమాన్యం ప్రత్యేకంగా చొరవ తీసుకుని జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. చాలా సంస్థలు అరొకర వేతనంతో సరిపెట్టారు. ఇంత తక్కువ ఆదాయంతో హైదరాబాద్ వంటి మహానగరంలో బతకడం కష్టమేనని పలువురు నిరుద్యోగులు అంటున్నారు. అలాగే కొన్ని సంస్థలు డిపాజిట్ చేస్తేనే అవకాశం కల్పిస్తామని చెప్పడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు డిపాజిట్ చేసే స్థితే ఉంటే ఉద్యోగం కోసం ఎందుకు వస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. మెరుగైన వేతనా లు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరికొందరు ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడానికి తోడ్పడుతుం దని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సింగరేణి పరిధిలోని ఇల్లెందు, మందమ ర్రి, ఆర్జీ-2 ఏరియూల్లో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం జాబ్ మేళా ఇంట ర్వ్యూలు నిర్వహించి 1734 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇందులో ఇల్లెందు 416, ఆర్జీ-2లో 525, మందమర్రిలో 793 మంది ఉన్నారు. చాలా మందికి వెంటనే ఆర్డర్లు అదజేశారు. ఇంటర్వ్యూలను ఆయా ఏరియాల జీఎంలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు.
డిపాజిట్ చేయనంటే ఉద్యోగమివ్వలేదు
నేను ఐటీఐ ఫిట్టర్ పూర్తి చేశాను. జాబ్ మేళాకు వెళ్తే ఇన్ఫోసాఫ్ట్ హెచ్‌ఆర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. కాకపోతే రూ.5వేలు డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్ చెల్లించే స్తోమత ఉంటే ఈ జాబ్ మేళాకు ఎందుకు వస్తాను. చెల్లించనందుకే జాబ్ ఇవ్వడానికి నిరాకరించారు. డిపాజిట్ చేయమనడం సరికాదు.
- మణికంఠ, ఇల్లెందు
హాస్టల్ వార్డెన్‌గా పనిచేశాను
మా నాన్న రామస్వామి ఓసీపీ-3 సీహెచ్‌పీలో పనిచేస్తున్నాడు. ఇన్నాళ్లు ఏ ఉద్యో గం లేక హాస్టల్ వార్డెన్‌గా నేలకు రూ.4 వేల వేతనానికి పనిచేస్తున్నాను. సింగరేణి నిర్వహించిన మెగా జాబ్‌మేళాల్లో జీ4 ఎస్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. నెల లకు రూ.10వేల వేతనమని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.
- ఈదునూరి గణేష్, యైటింక్లయిన్కాలనీ, కరీంనగర్
సద్వినియోగం చేసుకుంటా..
జాబ్ మేళాలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మా నా న్న జీడీకే-10ఏ గనిలో చైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మేళా లో యూరేకఫోర్బ్స్‌లో ఉద్యోగం ఇచ్చా రు. నెలకు రూ.6వేలు. వేతనం తక్కువే. అరుునా ఉద్యోగం చేస్తూనే ఉన్నతచదువులతో మరింత ముందుకు వెళ్తా.
- సీహెచ్.శ్వేత, కార్మికుడి కుమార్తె,
యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతా..
నాన్న సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నాను. మేళాకు హాజరయ్యూను. నెలకు రూ. 7వేలు ఇస్తూ కార్వీసొలూషన్‌లో ఉద్యో గం ఇస్తామన్నారు. ఈ జీతంతో హైదరాబాద్‌లో ఉండడం కష్టమే. ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా.
- ఎన్.వెంకటేశ్, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్
ఇక్కడే అవకాశం.. ఆనందంగా ఉంది
నేను డిగ్రీ చేశాను. ఇన్ని రోజులు మంథనిలోని ఫెస్టిసైడ్ షాప్‌లో రూ.5వేలకు ఉద్యోగం చేశాను. ఇప్పుడు నెలకు రూ.10వేల జీతం ఇస్తామని శ్రీరాం ఇన్సూరెన్స్‌లో జాయిన్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రాంతంలో అవకాశం లభించడం ఆనందంగా ఉంది.
- కె.రమేష్, సూరయ్యపల్లి, మంథని
చదువుకుందామనే ఆశతో..
నేను బీటెక్ చేశాను. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తున్నారు. వారిపై ఆధారపడకుండా ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదవాలనే ఆశతో ఇక్కడకి వచ్చాను. మంచి అవకాశం లభించింది. కార్వీకంపెనీలో రూ.7వేల వేతనంతో ఉద్యోగం ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటూ ఇంజినీరింగ్ చదువు పూర్తిచేస్తా. సంస్థను ఎల్లప్పుడూ మర్చిపోలేను.
- రవళిశ్రీ, బీటెక్, కేకేనగర్, వెంకట్రావ్‌పల్లి(కరీంనగర్)
ఉద్యోగం ఓకే.. వేతనమే తక్కువ
Published Sun, Jan 31 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement
Advertisement