భారత వృద్ధికి వెన్నెముకగా ఉంటున్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా ఖర్చలు పెరగడం.. వంటి విభిన్న అంశాలు ఇందుకు కారణమని ఎలరా సెక్యూరిటీస్ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వల్ల లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల్లో వేతనాలు 0.5% తగ్గినట్లు ఎలారా పేర్కొంది.
ఎలరా సెక్యూరిటీస్ వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజల ఆదాయాలు గణనీయంగా ప్రభావితం చెందుతున్నాయి. మధ్యతరగతి, పేద ప్రజలు రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలకు చెందిన వస్తువుల పట్టణ డిమాండ్ క్షీణిస్తోంది. ఆయా కంపెనీ త్రైమాసిక వృద్ధికి సంబంధించి ముందుగా అంచనావేసిన దానికంటే బలహీనమైన వృద్ధి నమోదు అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గ్రామీణ విక్రయాలు 8% వృద్ధి చెందగా, పట్టణ విక్రయాలు 2% తగ్గాయి.
ఇదీ చదవండి: మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!
ప్రభుత్వం వస్తువుల డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీరేట్ల కోతలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ మార్గాలు అనుసరిస్తోంది. దాంతో వడ్డీరేట్ల కోత నిర్ణయం వాయిదా పడుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.5 శాతానికి కట్ చేశారు. అంచనాల కంటే భిన్నంగా జీడీపీ వృద్ధి నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు దేశవ్యాప్తంగా 23% పెరిగాయి. ఇంటి అద్దెలు పట్టణ ప్రజల ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment