Employed workers
-
వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు
సిక్కోలు అంటే వెనుకబాటు.. సిక్కోలు అంటే వలసలు.. సిక్కోలు అంటే కిడ్నీ సమస్య.. సిక్కోలు అంటే ఉపాధి గోస.. ఇదంతా నిజమే గానీ.. ఇప్పుడది గతం. ఆ చేదు అనుభవాల పునాదులపై ప్రగతి పూలు పూస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ క్రితం రాష్ర్టంలో జరిగిన అధికార మార్పిడి వెనుకబడిన, చిన్న చూపునకు గురైన శ్రీకాకుళం జిల్లా నెత్తిన పాలు పోసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదద్దుతోంది. సంక్షేమ పథకాల రూపంలోనే అక్షరాలా రూ.15 వేల కోట్లు జిల్లాలోని పేద లబ్ధిదారులకు నేరుగా అందించిన ప్రభుత్వం.. జిల్లా ప్రజల అర్థ శతాబ్ది కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తూ ఉందిలే మంచి కాలం ముందూ ముందునా.. అంటూ.. జిల్లా భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనికి తోడు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రానున్నాయి. ఇక దశాబ్దాలుగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వతంగా పారదోలేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి, 800 గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దానం గుండెలపై కుంపటిని దింపేసినట్లు అయ్యింది. మరోవైపు ఆఫ్ షోర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది. ► పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43కిలోమీటర్ల మేర 312 రోడ్లు వేసేందుకు మంజూరు చేసింది. ఇందులో 266 రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదే స్కీమ్‌లో కొత్తగా రూ.46.72 కోట్లతో 205.68 కిలోమీటర్లతో 83 రహదారులు మంజూరు చేసింది. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్లకు సంబంధించి 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్ల తో 21 రహదారుల నిర్మాణం పూర్తి చేసింది. ►పీఎంజీఎస్‌వై బ్యాచ్–1 కింద రూ.51.27కోట్లతో 11పనులు మంజూరు చేయగా ఇప్పటికే 10 పనులు పూర్తి చేసింది. బ్యాచ్–2లో రూ. 38.23కోట్లతో 8పనులు మంజూరు చేయగా ఆరుపూర్తయ్యాయి. రెండు ప్రగతిలో ఉన్నాయి. ► ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవునా రూ.73.25 కోట్లతో 54 రోడ్ల పనులు చేపట్టారు. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవునా 312 పనులు చేపడుతున్నారు. ► ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవునా 83 పనులు చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. ►నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.48 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87కోట్లు మంజూరు చేశారు. కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి ఉద్దానానికి ఊపిరి కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు వలసలకు స్వస్తి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో మూలపేట పోర్టు జలయజ్ఞం..ఫలప్రదం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. పుష్కలంగా తాగునీరు.. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది. రూ.1552.36 కోట్లతో 4822 నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీల్లో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4కోట్లతో పనులు చేపడుతున్నారు. అందుబాటులో వైద్యం.. ► సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి. ►జిల్లాలో కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలను కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. పాతపట్నంలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని రూ.4.2 కోట్లు, జొన్నవలస ఆసుపత్రిని 2.45 కోట్లు, లావేరులో రూ.1.20 కోట్లు, సోంపేట సామాజిక ఆసుపత్రిని రూ.4.60 కోట్లు, బారువ సామాజిక ఆసుపత్రిని రూ. 5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ►నాడు నేడు కింద 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. విద్యాభివృద్ధికి పెద్దపీట.. ► వైఎస్సార్ కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ►జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు. ►పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హారి్టకల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శా్రస్తులపేట వద్ద క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. కీలక అభివృద్ధి పనులు ►రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ►రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ►ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. ►జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ►నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచే భాగంలో జిల్లాలో 27 ఫిష్ ఆంధ్ర డెలీయస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ►శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. పల్లెకు కొత్తరూపు.. ►పల్లెలు సరికొత్త రూపు రేఖలు సంతరించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. కళ్లెదుటే ఆస్తులు కని్పస్తున్నాయి. ►రైతులకు సేవలందించేందుకు రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నారు. ►గ్రామ సచివాలయాల కోసం రూ.262 కోట్లతో 654 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికిపైగా పూర్తయ్యాయి. ►రూ.31.20 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల కోసం 195 భవనాలను నిర్మిస్తున్నారు. ►వైఎస్సార్ విలేజీ హెల్త్ క్లినిక్స్ కోసం రూ.93.62 కోట్లతో 535 భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పూర్తయ్యాయి. ∙వ్యవ‘సాయం’ ►జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా కింద 3.21 లక్షల మంది రైతులకు రూ 1919.46 కోట్లు అందించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ►రూ.424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను (వరి,మినుములుతో పాటు ఇతరాలు) సబ్సిడీ ధరపై అందించారు. 82,745 మెట్రిక్ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నేనొ, యూరియా వంటివి ఆర్బీకేల ద్వారా అందించారు. ►సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్ యంత్రసేవా పరికరాలు అందజేశారు. చిన్న, సన్నకార రైతులకు 505 ట్రాక్టర్లు, మలి్టపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇవన్నీ చేయడంతో సాగుతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. మనబడి నాడు–నేడు ►ఫేజ్–1: జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కలి్పంచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.286.22 కోట్లు వెచ్చించింది. ► ఫేజ్–2: జిల్లాలో నాడు–నేడు రెండో ఫేజ్ కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదులను నిర్మించి, మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. ఇందుకోసం రూ.427.73 కోట్లు కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. -
యంత్రాలతో కుతంత్రం
సాక్షి, గరివిడి (చీపురుపల్లి): జిల్లాలో పారిశ్రామిక రంగానికే వన్నె తెచ్చిన గరివిడి ఫేకర్‌లో కార్మికులు, యాజమాన్యం మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కార్మికులను తప్పించి యంత్రాలతో పని చేయించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. హైకోర్టు తీర్పు బేఖాతరు ఫేకర్ పరిశ్రమలో వేగన్, లారీ లోడింగ్ కార్మికులు 114 మంది, అన్లోడింగ్ కార్మికులు 132 మంది, స్టోరేజ్ కార్మికులు 23 మంది మొత్తం 269 మంది కొన్నేళ్లుగా (తాత, తండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా) ఫేకర్‌ను నమ్ముకుని పనిచేస్తున్నారు. వారిని తొలగించి యంత్రాలతో పనిచేసే ప్రయత్నం యాజమాన్యం గతంలో చేసింది. దీంతో కార్మికులు ఏకమై హైకోర్టులో కేసు వేయగా వారికి అనుకూలంగా 2012 డిసెంబర్ 31న తీర్పు వచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వెంటనే యాజమాన్యం కూడా వారిపై కేసులు వేసింది. ఈ తంతు జరుగుతుండగా కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఫేకర్ యాజమాన్యం 2014 ఫిబ్రవరిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్థంతరంగా ఫ్యాక్టరీని నిలిపి వేసింది. అప్పటి నుంచి సుమారు 43 నెలలు (ఏడాదిన్నర పాటు) లాకౌట్‌లో ఉంది. 2014 డిసెంబరు 9న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారిని విధుల్లోకి తీసుకోక తప్పలేదు. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరించి 43 నెలలు మూసివేసింది. మళ్లీ 2016 సెప్టెంబర్ 16న పరిశ్రమను తెరిచినా కార్మికులను పనుల్లోకి మాత్రం తీసుకోలేదు. 144వ సెక్షన్ విధింపు తమ సమస్యను కార్మిక శాఖమంత్రి, నారా లోకేష్, జిల్లా మంత్రి రంగారావు, ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, కలెక్టర్, కార్మిక శాఖాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం తమ గోడును వినిపించుకోవడానికి సైతం వీల్లేకుండా గరివిడి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకమై 144వ సెక్షన్ విధించారని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసు పహరాలో ఫేకర్‌లో యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. 269 మంది కార్మికులకు గండం వేగన్, లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను ఫేకర్ నుంచి బయటికి పంపించి వారి స్థానంలో యంత్రాలతో పని చేసుకునేందుకు ఫేకర్ యాజమాన్యం మళ్లీ సిద్ధపడింది. ఇప్పటికే యంత్రాలతో పనులు చేయిస్తోంది. కార్మికులు అడ్డుకుంటారన్న సందేహంతో పోలీస్ రక్షణలో యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారు. ఫేకర్ యాజమాన్యం నిర్ణయం వల్ల 269 మంది వేగన్, లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు రోడ్డున పడనున్నారు. మంత్రికి చెప్పినా శూన్యం ఫేకర్‌లో పనిచేస్తున్న వేగన్, లారీలోడింగ్, అన్లోడింగ్ కార్మికులు సమస్యలను కార్మిక సంఘాల నేతలు జిల్లా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు విన్నవించారు. 144వ సెక్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని అదే రోజు మంత్రి ఆదేశించినా అమలు కాలేదు. – రాజాన రమణ, కార్మిక సంఘాధ్యక్షుడు వెనక్కి తగ్గేది లేదు ఫేకర్ యాజమాన్యం సమస్యను నిర్వీర్యం చేసేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు సమస్య తీసుకెళ్లాం. నిరసనలు, దీక్షలు ఆపేందుకు యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి కార్మికుల హక్కులను కాపాడుకుంటాం. యాజమాన్యం బెదిరింపులకు భయపడం. – గంటా పాపారావు, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్మిక సంఘం -
నో మనీ.. నో వర్క
పలుగు పార చేతబట్టి..పూటంతా స్వేదం చిందిస్తూ పొట్టపొసుకునే దినసరి కూలీలకు ‘పెద్ద’ కష్టం వచ్చింది. చేసుకునేందుకు పనులు లేక.. చేతుల్లో చిల్లిగవ్వ లేక పస్తులుండే దుస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు నుంచి జిల్లాలో భవన నిర్మాణాలు నిలిచిపోవడమే ఇందుకు కారణం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలదీ.. ఇంచుమించూ ఇదే స్థితి. అక్టోబర్ నెలాఖరు వరకు కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిల్లో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటిన విడుదల చేసింది. బ్యాంకుల నుంచి పోస్టాఫీసుల ఖాతాలకు నగదు చేరింది. ఈ క్రమంలో పెద్ద నోట్లు రద్దు కావడంతో కూలీలకు అందాల్సిన నగదు పోస్టాఫీసుల ఖాతాల్లోనే ఇరుక్కుపోయింది. మూడు జిల్లాల్లో కలిపి సుమారు రూ.9.24 కోట్లు తపాలా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. బకా యిలు రాక.. చిల్లర దొరక్క.. పనుల్లేక ‘ఉపాధి’ కూలీలు విలవిల్లాడు తున్నారు. నల్లగొండ : గ్రామ పోలిమేరల్లో రోజూ వినిపించే పలుగు, పార సప్పుడు బంద్ అయింది. కేంద్ర సర్కార్ రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయ ప్రభావం ఉపాధి హామీ కూలీలపైనా పడింది. నోట్ల మార్పిడి, నగదు చెల్లిం పుల వ్యవహారం పోస్టాఫీసులకు అప్పగించడం.. అక్కడ సిబ్బంది కొరత కూడా తోడవ్వడంతో ఉపాధి కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసిన పనికి డబ్బులు అందక...చేతిలో చిల్లిగవ్వ లేక కూలీలు దిక్కుతోచని స్థితిలో అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే పే ఆర్డర్లు జనరేట్ చేసినప్పటికీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి కూలీలు మొరపెట్టుకున్నారు. నిధుల మెలిక... పోస్టాఫీసుల్లో నగదు నిల్వలను ఖాళీ చేస్తే గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మిగులు బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు అదే విషయాన్ని తేల్చిచెప్పారు. పోస్టాఫీసుల్లో నిల్వ ఉన్న నిధులను కూలీలకు చెల్లించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.17.13 కోట్లు కేంద్రం నుంచి కోరేందుకు వీలుంటుందని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. దీంతో కూలీలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్దామన్న అక్కడ కూడా చేదు సంఘటనలే ఎదురవుతుండటంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. నిలిచిన పనులు మూడు జిల్లాల్లోని గ్రామాల్లో ఉపాధి పనులు ఎక్కడా జరగడం లేదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను సంరక్షించే పనులు తప్పా మిగతా పనులు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఈ నెల మొదటి వారంలో ప్రతి రోజు పదకొండు వందల కూలీలు మాత్రమే పనికి వచ్చారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో సిబ్బంది కొరత కారణంగా దినసరి కూలీల హాజరు నమోదు చేయలేకపోతున్నారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో దినసరి కూలీల రిపోర్ట్ నిల్గానే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో 42,645 రకాల పనులు, యాదాద్రిలో 18,430, సూర్యాపేటలో 27 వేల రకాల పను లు సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. కానీ నల్లగొండ జిల్లాలో 502 గ్రామాలకు గాను 215 పంచాయతీల్లోనే పను లు జరుగుతున్నాయి. యాదాద్రిలో 331, సూర్యాపేటలో 325 పంచాయతీల్లో పనులు జరగడం లేదని తెలుస్తోంది. బకాయిలు చెల్లిస్తేనే.. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే మార్చినాటికి నల్లగొండ జిల్లా ఉపాధి కూలీలకు 96 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. దీనికి గాను ఇప్పటి వరకు 63 లక్షల పనిదినాలు కల్పించారు. 1,84,588 కుటుంబాలకు ఉపా ధి కల్పించగా...దాంట్లో వంద రోజుల పాటు లబ్ధిపొందిన కుటుంబాలు కేవలం 6,718 మాత్రమే. సూర్యాపేట జిల్లాలో 60 లక్షల పనిదినాలకు గాను 43 లక్షల పనిదినాలు కల్పించారు. ఈ జిల్లాలో 1,44,979 కుటుంబాలకు ఉపాధి కల్పించగా దాంట్లో వంద రోజుల పాటు పనిచేసిన కుటుంబాలు కేవలం 2,353 మాత్రమే. యాదాద్రి జిల్లాలో 28 లక్షల పనిదినాలకుగాను 19 లక్ష లు పనిదినాలు కల్పించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ జిల్లాలో ఉపాధి పనులకు డిమాండ్ తక్కువగానే ఉంటుంది. ఈ జిల్లాలో ఉపాధి పొందిన కుటుంబాలు 71,287...దీంట్లో 100 రోజుల పాటు లబ్ధి పొందిన కుటుంబాలు 1016 మాత్రమే. కూలీల వేతన బకాయిలు చెల్లిస్తే తప్పా వచ్చే మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేమని అధికారులంటున్నారు. -
ఉద్యోగం ఓకే.. వేతనమే తక్కువ
మహానగరంలో బతకడం కష్టమే * మెరుగైన వేతనాలు ఇస్తేనే ఉపయోగం * జాబ్ మేళాలో ఉద్యోగాలు తిరస్కరించిన పలువురు * మూడు ఏరియూల్లో 1734 మందికి అవకాశం * నేడు, రేపు మరో మూడు ఏరియూల్లో మేళా నిర్వహణ యైటింక్లయిన్ కాలనీ/మందమర్రి/ ఇల్లెందు అర్బన్ : సింగరేణి యూజమాన్యం ప్రత్యేకంగా చొరవ తీసుకుని జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. చాలా సంస్థలు అరొకర వేతనంతో సరిపెట్టారు. ఇంత తక్కువ ఆదాయంతో హైదరాబాద్ వంటి మహానగరంలో బతకడం కష్టమేనని పలువురు నిరుద్యోగులు అంటున్నారు. అలాగే కొన్ని సంస్థలు డిపాజిట్ చేస్తేనే అవకాశం కల్పిస్తామని చెప్పడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు డిపాజిట్ చేసే స్థితే ఉంటే ఉద్యోగం కోసం ఎందుకు వస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. మెరుగైన వేతనా లు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరికొందరు ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడానికి తోడ్పడుతుం దని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగరేణి పరిధిలోని ఇల్లెందు, మందమ ర్రి, ఆర్జీ-2 ఏరియూల్లో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం జాబ్ మేళా ఇంట ర్వ్యూలు నిర్వహించి 1734 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు. ఇందులో ఇల్లెందు 416, ఆర్జీ-2లో 525, మందమర్రిలో 793 మంది ఉన్నారు. చాలా మందికి వెంటనే ఆర్డర్లు అదజేశారు. ఇంటర్వ్యూలను ఆయా ఏరియాల జీఎంలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. డిపాజిట్ చేయనంటే ఉద్యోగమివ్వలేదు నేను ఐటీఐ ఫిట్టర్ పూర్తి చేశాను. జాబ్ మేళాకు వెళ్తే ఇన్ఫోసాఫ్ట్ హెచ్ఆర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. కాకపోతే రూ.5వేలు డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్ చెల్లించే స్తోమత ఉంటే ఈ జాబ్ మేళాకు ఎందుకు వస్తాను. చెల్లించనందుకే జాబ్ ఇవ్వడానికి నిరాకరించారు. డిపాజిట్ చేయమనడం సరికాదు. - మణికంఠ, ఇల్లెందు హాస్టల్ వార్డెన్‌గా పనిచేశాను మా నాన్న రామస్వామి ఓసీపీ-3 సీహెచ్‌పీలో పనిచేస్తున్నాడు. ఇన్నాళ్లు ఏ ఉద్యో గం లేక హాస్టల్ వార్డెన్‌గా నేలకు రూ.4 వేల వేతనానికి పనిచేస్తున్నాను. సింగరేణి నిర్వహించిన మెగా జాబ్‌మేళాల్లో జీ4 ఎస్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. నెల లకు రూ.10వేల వేతనమని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. - ఈదునూరి గణేష్, యైటింక్లయిన్‌కాలనీ, కరీంనగర్ సద్వినియోగం చేసుకుంటా.. జాబ్ మేళాలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మా నా న్న జీడీకే-10ఏ గనిలో చైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మేళా లో యూరేకఫోర్బ్స్లో ఉద్యోగం ఇచ్చా రు. నెలకు రూ.6వేలు. వేతనం తక్కువే. అరుునా ఉద్యోగం చేస్తూనే ఉన్నతచదువులతో మరింత ముందుకు వెళ్తా. - సీహెచ్.శ్వేత, కార్మికుడి కుమార్తె, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతా.. నాన్న సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నాను. మేళాకు హాజరయ్యూను. నెలకు రూ. 7వేలు ఇస్తూ కార్వీసొలూషన్లో ఉద్యో గం ఇస్తామన్నారు. ఈ జీతంతో హైదరాబాద్‌లో ఉండడం కష్టమే. ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా. - ఎన్.వెంకటేశ్, యైటింక్లయిన్ కాలనీ, కరీంనగర్ ఇక్కడే అవకాశం.. ఆనందంగా ఉంది నేను డిగ్రీ చేశాను. ఇన్ని రోజులు మంథనిలోని ఫెస్టిసైడ్ షాప్‌లో రూ.5వేలకు ఉద్యోగం చేశాను. ఇప్పుడు నెలకు రూ.10వేల జీతం ఇస్తామని శ్రీరాం ఇన్సూరెన్స్‌లో జాయిన్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రాంతంలో అవకాశం లభించడం ఆనందంగా ఉంది. - కె.రమేష్, సూరయ్యపల్లి, మంథని చదువుకుందామనే ఆశతో.. నేను బీటెక్ చేశాను. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తున్నారు. వారిపై ఆధారపడకుండా ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదవాలనే ఆశతో ఇక్కడకి వచ్చాను. మంచి అవకాశం లభించింది. కార్వీకంపెనీలో రూ.7వేల వేతనంతో ఉద్యోగం ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటూ ఇంజినీరింగ్ చదువు పూర్తిచేస్తా. సంస్థను ఎల్లప్పుడూ మర్చిపోలేను. - రవళిశ్రీ, బీటెక్, కేకేనగర్, వెంకట్రావ్పల్లి(కరీంనగర్) -
ప్రాణం తీస్తున్న ఎండలు
వడ దెబ్బతో 17 మంది మృత్యు వాత ►జిల్లాలో ముదిరిన ఎండలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. శనివారం ఒక్కరోజే 17 మంది వడదెబ్బతో మృతి చెందారు. పిల్లలు, వృద్ధులు, ఉపాధి కూలీలు ఎండల ధాటికి బెంబేలెత్తుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ►ఎర్రగుంట్ల నగర పంచాయతి పరిధిలోని వేంపల్లిరోడ్డులోని దళితవాడకు చెందిన వెంకటసుబ్బయ్య(55) అలియాస్ భద్రయ్య అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు తోపుడు బండిపై నిర్వహించే టిఫిన్ సెంటర్ల వద్ద కార్మికునిగా పనిచేస్తున్నాడు. ► అక్కా తమ్ముడు.. చిట్వేలి మండల పరిధిలోని కేఎస్ అగ్రహారం సంగాదేవపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన సుబ్బమ్మ(85), చేతిపట్టు వెంకటయ్య(75) మృతి చెందారు. వీరిద్దరూ అక్కాతమ్ముడు కావడం గమనార్హం. ►పుల్లంపేట మండల పరిధిలోని కొమ్మనవారిపల్లె గ్రామానికి చెందిన పోలి.చంగల్‌రెడ్డి(90) ఎండతీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. పోరుమామిళ్లకు చెందిన దుద్యాల సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందింది. ►పెనగలూరు మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహబూబ్‌బీ(70) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ►కడప నగర శివార్లలోని రామరాజుపల్లెలో పుష్పగిరి గంగమ్మ(68) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. ప్రతిరోజూ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించే ఆమె ఇటీవల ఎండలు ఎక్కువ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురై శనివారం మృతిచెందింది. ►ఒంటిమిట్ట మండలం చప్పిటవారిపల్లె గ్రామంలో ఓబులమ్మ(65) ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతిచెందింది. ►వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ►రైల్వేకోడూరు మండల పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన పెంచలమ్మ(50) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ►రాజంపేట మండలం సీతారామాపురం గ్రామంలో వెలకచెర్ల వెంకటరెడ్డి(60) వడదెబ్బతో మృతి చెందాడు. ►బద్వేలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాలలో శనివారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని రాజుపాళెం పంచాయతీ అప్పరాజుపేట గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి చెన్నమ్మ(62),బోవిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన వారిలో ఉన్నారు. ►బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామంలో జె.అచ్చమ్మ (75)అనే వృద్ధురాలు వడ దెబ్బతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ►సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాలి రామయ్య (55) వడదెబ్బతో మృతి చెందారు. రామయ్య శుక్రవారం వ్యవసాయ కూలి పనికి వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలిందని కుటుంబీకులు తెలిపారు. ఇదే మండలం జంగాలపల్లె గ్రామం దళితవాడకు చెందిన పాలెం వెంకటలక్షుమ్మ (65) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ►రైల్వేకోడూరు పట్టణం పగడాలపల్లెకు చెందిన మర్రిసుబ్బయ్య (70) మృతి చెందినట్లు ఆయన భార్య కృష్ణమ్మ తెలిపింది. ►ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో తులసి రామిరెడ్డి(65) మృతి చెందాడు. -
ఏసీబీకి చిక్కిన ఐకేపీ ఉద్యోగి
ఉపాధి కమీషన్ చెల్లింపునకు లంచం డిమాండ్ రూ.15వేలు తీసుకొంటూ దొరికిపోయిన ఐకేపీ సీసీ పాడేరు, న్యూస్‌లైన్ : ఉపాధి కూలీలకు చెల్లింపులు చేపట్టే గ్రామైక్య సంఘానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక కమీషన్ చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇందిరక్రాంతి పథం(ఐకేపీ) కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ (ఔట్సోర్సింగ్ ఉద్యోగి) ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహరావు నేతృత్వంలో హుకుంపేటలో ఈ దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీలోని గ్రామైక్య సంఘం కోశాధికారి బూర్జబారిక కుమారి ఉపాధి కూలీలకు గతంలో రూ.87 లక్షలు పంపిణీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రెండు శాతం కమీషన్‌గా రూ.1.74లక్షలు మంజూరు చేసింది. ఇవి చెల్లింపునకు రోజుల తరబడి ఐకేపీ సీసీ తాతాలు చుట్టూ గ్రామైక్య సంఘం సభ్యులు తిరుగుతున్నారు. ఈ నెల 20న రూ.1.07లక్షలకు చెక్ ఇచ్చారు. మిగతా రూ.67 వేల కోసం కోశాధికారి కుమారి అనేక సార్లు సీసీని ప్రాథేయపడ్డారు. రూ.30వేలు లంచం ఇస్తేనే ఈ బిల్లు మంజూరు చేస్తానని అతను తేల్చి చెప్పారు. సంఘానికి చెందిన సొమ్ములో ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా ఇవ్వలేమని, మహిళలంతా బతిమలాడినా సీసీ కరుణించలేదు. చివరకు రూ.15 వేలు ఇచ్చేందుకు మహిళలు అంగీకరించారు. ఈ వ్యవహారాన్ని కోశాధికారి కుమారి మామ బూర్జబారిక నిమ్మిరావు ఇటీవల విశాఖపట్నంలోని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనమేరకు రూ.15 వేలను నిమ్మిరావు హుకుంపేటలో ఉంటున్న సీసీ తాతాలుకు గురువారం అందజేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు చుట్టుముట్టి సీసీని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు మండల పరిషత్ కార్యాలయానికి తాతాలును తరలించి విచారించారు. పలువురు ఐకేపీ అధికారులను కూడా విచారించిన అనంతరం సీసీ తాతాలుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విశాఖపట్నంకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు.