వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు | Srikakulam is moving towards development | Sakshi
Sakshi News home page

వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు

Published Thu, Jan 11 2024 1:40 PM | Last Updated on Thu, Jan 11 2024 1:42 PM

Srikakulam is moving towards development - Sakshi

సిక్కోలు అంటే వెనుకబాటు.. 
సిక్కోలు అంటే వలసలు..
సిక్కోలు అంటే కిడ్నీ సమస్య..  
సిక్కోలు అంటే ఉపాధి గోస..
ఇదంతా నిజమే గానీ.. ఇప్పుడది గతం.  ఆ చేదు అనుభవాల పునాదులపై ప్రగతి పూలు పూస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ క్రితం రాష్ర్టంలో జరిగిన అధికార మార్పిడి వెనుకబడిన, చిన్న చూపునకు గురైన శ్రీకాకుళం జిల్లా నెత్తిన పాలు పోసింది. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదద్దుతోంది. సంక్షేమ పథకాల రూపంలోనే అక్షరాలా రూ.15 వేల కోట్లు జిల్లాలోని పేద లబ్ధిదారులకు నేరుగా అందించిన ప్రభుత్వం.. జిల్లా ప్రజల అర్థ శతాబ్ది కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తూ ఉందిలే మంచి కాలం ముందూ ముందునా.. అంటూ.. జిల్లా భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనికి తోడు రెండు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు రానున్నాయి. ఇక దశాబ్దాలుగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వతంగా పారదోలేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్‌ సెంటర్, ఆస్పత్రి, 800 గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దానం గుండెలపై కుంపటిని దింపేసినట్లు అయ్యింది. మరోవైపు ఆఫ్‌ షోర్, వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. 
           

జిల్లాలో నాలుగేళ్లలో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది.    

► పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43కిలోమీటర్ల మేర 312 రోడ్లు వేసేందుకు మంజూరు చేసింది. ఇందులో 266 రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదే స్కీమ్‌లో కొత్తగా రూ.46.72 కోట్లతో 205.68 కిలోమీటర్లతో 83 రహదారులు మంజూరు చేసింది.  

► ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్లకు సంబంధించి 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్ల తో 21 రహదారుల నిర్మాణం పూర్తి చేసింది. 

పీఎంజీఎస్‌వై బ్యాచ్‌–1 కింద రూ.51.27కోట్లతో 11పనులు మంజూరు చేయగా ఇప్పటికే 10 పనులు పూర్తి చేసింది. బ్యాచ్‌–2లో రూ. 38.23కోట్లతో 8పనులు మంజూరు చేయగా ఆరుపూర్తయ్యాయి. రెండు ప్రగతిలో ఉన్నాయి.  

 ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవునా రూ.73.25 కోట్లతో 54 రోడ్ల పనులు చేపట్టారు. ఏపీ రూరల్‌ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్‌ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవునా 312 పనులు చేపడుతున్నారు.  

► ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్‌ వర్క్స్‌ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవునా 83 పనులు చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు.  

నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.48 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87కోట్లు మంజూరు చేశారు.  


 కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి 

ఉద్దానానికి ఊపిరి  
కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్‌ సెంటర్, అతిపెద్ద డయాలసిస్‌ సెంటర్‌ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు  ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం.   


వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు 

వలసలకు స్వస్తి
మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ల్యాండ్‌ లార్డ్‌ మోడల్‌ విధానంలో రూ.2,949.70 కోట్లతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.  మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. 


నిర్మాణంలో మూలపేట పోర్టు 

జలయజ్ఞం..ఫలప్రదం 
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ నడుంబిగించారు. వంశధార ఫేజ్‌ 2లోని స్టేజ్‌ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు.  
 
పుష్కలంగా తాగునీరు..  
ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది. రూ.1552.36 కోట్లతో 4822 నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4కోట్లతో పనులు చేపడుతున్నారు.

 అందుబాటులో వైద్యం.. 
► సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి.

►జిల్లాలో కొత్తగా రూరల్‌ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్‌ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలను కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. పాతపట్నంలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని రూ.4.2 కోట్లు, జొన్నవలస ఆసుపత్రిని 2.45 కోట్లు, లావేరులో రూ.1.20 కోట్లు, సోంపేట సామాజిక ఆసుపత్రిని రూ.4.60 కోట్లు, బారువ సామాజిక ఆసుపత్రిని రూ. 5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.  

►నాడు నేడు కింద 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు.    

విద్యాభివృద్ధికి పెద్దపీట..  

► వైఎస్సార్‌ కలల విద్యా సంస్థ ట్రిపుల్‌ ఐటీలో  రూ.131కోట్లతో జీప్లస్‌–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది.  

►జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు. 

►పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్‌ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్‌ కళాశాల,  వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో  హారి్టకల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌  మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శా్రస్తులపేట వద్ద క్రికెట్‌ స్టేడియం మంజూరు చేశారు.    

 కీలక అభివృద్ధి పనులు  
►రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు.   
►రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.  
►ప్రసాదం స్కీమ్‌ కింద శ్రీముఖలింగం టెంపుల్‌ సర్క్యూట్‌ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు.   
►జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు.  
►నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచే భాగంలో జిల్లాలో 27 ఫిష్‌ ఆంధ్ర డెలీయస్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు.  
►శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి.   

 పల్లెకు కొత్తరూపు.. 
►పల్లెలు సరికొత్త రూపు రేఖలు సంతరించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. కళ్లెదుటే ఆస్తులు కని్పస్తున్నాయి.  
►రైతులకు సేవలందించేందుకు  రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నారు.  
►గ్రామ సచివాలయాల కోసం రూ.262 కోట్లతో 654 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికిపైగా పూర్తయ్యాయి.  
►రూ.31.20 కోట్లతో వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల కోసం 195 భవనాలను నిర్మిస్తున్నారు.  
►వైఎస్సార్‌ విలేజీ హెల్త్‌ క్లినిక్స్‌ కోసం రూ.93.62 కోట్లతో 535 భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పూర్తయ్యాయి.    

∙వ్యవ‘సాయం’ 
►జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. వైఎస్సార్‌ రైతుభరోసా కింద 3.21 లక్షల మంది రైతులకు రూ 1919.46 కోట్లు అందించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. 

►రూ.424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను (వరి,మినుములుతో పాటు ఇతరాలు) సబ్సిడీ ధరపై అందించారు. 82,745 మెట్రిక్‌ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నేనొ, యూరియా వంటివి ఆర్‌బీకేల ద్వారా అందించారు.  

►సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్‌ యంత్రసేవా పరికరాలు అందజేశారు. చిన్న, సన్నకార రైతులకు 505 ట్రాక్టర్లు, మలి్టపుల్‌క్రాప్‌ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ వంటివి అందించారు. 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇవన్నీ చేయడంతో సాగుతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది.    

  

 మనబడి నాడు–నేడు

►ఫేజ్‌–1: జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్‌ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కలి్పంచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.286.22 కోట్లు వెచ్చించింది. 

► ఫేజ్‌–2:  జిల్లాలో నాడు–నేడు రెండో ఫేజ్‌ కింద పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదులను నిర్మించి, మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. ఇందుకోసం రూ.427.73 కోట్లు కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement