Sikkolu
-
వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు
సిక్కోలు అంటే వెనుకబాటు.. సిక్కోలు అంటే వలసలు.. సిక్కోలు అంటే కిడ్నీ సమస్య.. సిక్కోలు అంటే ఉపాధి గోస.. ఇదంతా నిజమే గానీ.. ఇప్పుడది గతం. ఆ చేదు అనుభవాల పునాదులపై ప్రగతి పూలు పూస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ క్రితం రాష్ర్టంలో జరిగిన అధికార మార్పిడి వెనుకబడిన, చిన్న చూపునకు గురైన శ్రీకాకుళం జిల్లా నెత్తిన పాలు పోసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదద్దుతోంది. సంక్షేమ పథకాల రూపంలోనే అక్షరాలా రూ.15 వేల కోట్లు జిల్లాలోని పేద లబ్ధిదారులకు నేరుగా అందించిన ప్రభుత్వం.. జిల్లా ప్రజల అర్థ శతాబ్ది కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తూ ఉందిలే మంచి కాలం ముందూ ముందునా.. అంటూ.. జిల్లా భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనికి తోడు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రానున్నాయి. ఇక దశాబ్దాలుగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వతంగా పారదోలేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి, 800 గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దానం గుండెలపై కుంపటిని దింపేసినట్లు అయ్యింది. మరోవైపు ఆఫ్ షోర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది. ► పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43కిలోమీటర్ల మేర 312 రోడ్లు వేసేందుకు మంజూరు చేసింది. ఇందులో 266 రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదే స్కీమ్‌లో కొత్తగా రూ.46.72 కోట్లతో 205.68 కిలోమీటర్లతో 83 రహదారులు మంజూరు చేసింది. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్లకు సంబంధించి 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్ల తో 21 రహదారుల నిర్మాణం పూర్తి చేసింది. ►పీఎంజీఎస్‌వై బ్యాచ్–1 కింద రూ.51.27కోట్లతో 11పనులు మంజూరు చేయగా ఇప్పటికే 10 పనులు పూర్తి చేసింది. బ్యాచ్–2లో రూ. 38.23కోట్లతో 8పనులు మంజూరు చేయగా ఆరుపూర్తయ్యాయి. రెండు ప్రగతిలో ఉన్నాయి. ► ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవునా రూ.73.25 కోట్లతో 54 రోడ్ల పనులు చేపట్టారు. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవునా 312 పనులు చేపడుతున్నారు. ► ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవునా 83 పనులు చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. ►నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.48 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87కోట్లు మంజూరు చేశారు. కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి ఉద్దానానికి ఊపిరి కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు వలసలకు స్వస్తి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో మూలపేట పోర్టు జలయజ్ఞం..ఫలప్రదం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. పుష్కలంగా తాగునీరు.. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది. రూ.1552.36 కోట్లతో 4822 నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీల్లో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4కోట్లతో పనులు చేపడుతున్నారు. అందుబాటులో వైద్యం.. ► సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి. ►జిల్లాలో కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలను కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. పాతపట్నంలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని రూ.4.2 కోట్లు, జొన్నవలస ఆసుపత్రిని 2.45 కోట్లు, లావేరులో రూ.1.20 కోట్లు, సోంపేట సామాజిక ఆసుపత్రిని రూ.4.60 కోట్లు, బారువ సామాజిక ఆసుపత్రిని రూ. 5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ►నాడు నేడు కింద 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. విద్యాభివృద్ధికి పెద్దపీట.. ► వైఎస్సార్ కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ►జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు. ►పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హారి్టకల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శా్రస్తులపేట వద్ద క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. కీలక అభివృద్ధి పనులు ►రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ►రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ►ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. ►జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ►నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచే భాగంలో జిల్లాలో 27 ఫిష్ ఆంధ్ర డెలీయస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ►శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. పల్లెకు కొత్తరూపు.. ►పల్లెలు సరికొత్త రూపు రేఖలు సంతరించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. కళ్లెదుటే ఆస్తులు కని్పస్తున్నాయి. ►రైతులకు సేవలందించేందుకు రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నారు. ►గ్రామ సచివాలయాల కోసం రూ.262 కోట్లతో 654 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికిపైగా పూర్తయ్యాయి. ►రూ.31.20 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల కోసం 195 భవనాలను నిర్మిస్తున్నారు. ►వైఎస్సార్ విలేజీ హెల్త్ క్లినిక్స్ కోసం రూ.93.62 కోట్లతో 535 భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పూర్తయ్యాయి. ∙వ్యవ‘సాయం’ ►జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా కింద 3.21 లక్షల మంది రైతులకు రూ 1919.46 కోట్లు అందించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ►రూ.424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను (వరి,మినుములుతో పాటు ఇతరాలు) సబ్సిడీ ధరపై అందించారు. 82,745 మెట్రిక్ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నేనొ, యూరియా వంటివి ఆర్బీకేల ద్వారా అందించారు. ►సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్ యంత్రసేవా పరికరాలు అందజేశారు. చిన్న, సన్నకార రైతులకు 505 ట్రాక్టర్లు, మలి్టపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇవన్నీ చేయడంతో సాగుతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. మనబడి నాడు–నేడు ►ఫేజ్–1: జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కలి్పంచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.286.22 కోట్లు వెచ్చించింది. ► ఫేజ్–2: జిల్లాలో నాడు–నేడు రెండో ఫేజ్ కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదులను నిర్మించి, మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. ఇందుకోసం రూ.427.73 కోట్లు కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. -
‘వండర్’ వరలక్ష్మి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో సత్తా చాటుతున్న సిక్కోలు విద్యార్థిని
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు విద్యార్థిని కూటికుప్పల వరలక్ష్మి సాఫ్ట్‌బాల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఏసియన్ యూనివర్సిటీ మహిళల(సీనియర్స్) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2022 పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు డిసెంబర్ 17 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో జరగనున్నాయి. త్వరలో భారత జట్టు సభ్యులతో కలిసి ఆమె శిక్షణ తీసుకోనుంది. కొత్తవలస నుంచి బ్యాంకాక్‌కు.. వరలక్ష్మి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొత్తవలస. ఆమె తల్లిదండ్రులు కూటికుప్పల రాజు, భారతి దినసరి కూలీలు. పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. తొగరాంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న సమయంలో వరలక్ష్మి సాఫ్ట్‌బాల్ క్రీడపై ఆసక్తి కనబరిచింది. అక్కడి ఫిజికల్ డైరెక్టర్ మొజ్జాడ వెంకటరమణ ఆమెకు సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో ఆమె జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయికి ఎంపికైంది. సాఫ్ట్‌బాల్ క్రీడలో పిక్చర్(బౌలింగ్) చేయడంలో వరలక్ష్మి దిట్ట. 2012లో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటిసారి పాల్గొన్న వరలక్ష్మి తన అద్భుత ఆటతీరుతో.. జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తాను పాల్గొన్న ప్రతి పోటీలోను రాణించింది. 2019–20లో రాజస్తాన్‌లో జరిగిన సౌత్‌జోన్ సీనియర్ నేషనల్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో వరలక్ష్మి ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ జట్టు రజత పతకం సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యానాంలో జరిగిన ఆసియా కప్ సెలెక్షన్స్‌లో కూడా పాల్గొని ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది. వీరికి మధ్యప్రదేశ్‌లో శిక్షణా శిబిరం నిర్వహించగా.. వరలక్ష్మి సత్తా చాటి బ్యాంకాక్‌లో జరిగే ఏసియన్ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యింది. వరలక్ష్మి మరోవైపు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. తొగరాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే ఇంటర్ పూర్తిచేసిన ఆమె.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ కాలేజీలో డిప్లమో ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రతిభకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని వరలక్ష్మి నిరూపిస్తోందని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మ, నాన్న కూలి పనులకు వెళ్తుంటారు. మా అమ్మా, నాన్నతో పాటు మా గురువు, పీడీ వెంకటరమణ ప్రోత్సాహం వల్లే నేను ఆటలో ముందుకెళ్లా. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జాతీయ సీనియర్ జట్టుకు ఎంపిక కావడమే నా లక్ష్యం. – కూటికుప్పల వరలక్ష్మి, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో
వజ్రపుకొత్తూరు రూరల్/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్ (పెద్దపాలేరు), గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. -
సిక్కోలు చిన్నోడు ‘హర్డిల్స్’లో దూకుడు
సాక్షి, అమరావతి: పేదరికం అడ్డుగోడలను అధిగమించి సిక్కోలు చిన్నోడు చిన్ననాటి నుంచే ‘హర్డిల్స్’లో అదరగొడుతున్నాడు. గొప్ప అథ్లెట్ కావాలన్న ఆకాంక్షతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నాడు. లావేటి యశ్వంత్ కుమార్ (20) రెండేళ్ల వ్యవధిలో 13 జాతీయ పతకాలను సాధించి క్రీడాలోకం దృష్టిని ఆకర్షించి మెరుపు వేగంతో అంతర్జాతీయ ట్రాక్‌వైపు దూసుకెళ్తున్నాడు. సీనియర్లతో తలపడి మరీ.. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామానికి (పాత శ్రీకాకుళం జిల్లా) చెందిన యశ్వంత్ కుమార్ హర్డిల్స్ 110 మీటర్ల విభాగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి సూరంనాయుడు ప్రోత్సాహంతో క్రీడల్లో అడుగుపెట్టాడు. గతేడాది గౌహతిలో జరిగిన 36వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా లక్ష్యాన్ని 13.92 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. సీనియర్ విభాగాల్లో సైతం పోటీపడి పతకాలు సాధించడం గమనార్హం. పాటియాలా సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ మీట్లో కాంస్యం, ఢిల్లీలో అండర్–23 అథ్లెటిక్స్ మీట్లో రజతం, వరంగల్ సీనియర్ ఓపెన్ ఈవెంట్లో 5వ స్థానంతో సత్తా చాటాడు. ఈ ఏడాది సీనియర్ విభాగంలోకి అడుగిడిన యశ్వంత్ ఫిబ్రవరిలో మంగుళూరులో జరిగిన ఇంటర్ వర్సిటీ పోటీల్లో ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున 110 మీటర్ల లక్ష్యాన్ని 14.32 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణంతో మెరిశాడు. కసరత్తు చేస్తున్న యశ్వంత్ కుమార్ రెండేళ్లుగా బళ్లారిలో శిక్షణ యశ్వంత్ రెండేళ్లుగా బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సిడ్నీ ఒలింపిక్ హర్డిల్స్ స్వర్ణ పతక విజేత మాజీ అథ్లెట్ అనియర్ గార్సియా పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ ఉత్తమ టైమింగ్ 14.10 సెకన్లుగా ఉంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలంటే 13.62 సెకన్లు, ఒలింపిక్స్‌కు 13.32 సెకన్లు (పోటీల్లో విజేతల ప్రతిభను బట్టి ఈ సమయం మారుతుంటుంది) వేగం ఉండాలి. అండర్ 16, 18, జూనియర్, సీనియర్ హర్డిల్స్ ఎత్తులో వ్యత్యాసం ఉండటం, జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్ పోటీల్లో పాల్గొన్న అనుభవం యశ్వంత్‌కు అంతర్జాతీయ పోటీల్లో సులభంగా అర్హత సాధించేందుకు దోహదపడనుంది. రెండేళ్ల క్రితమే సీనియర్ ఏషియన్ ఇండోర్, జూనియర్ ఏషియా, జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించినప్పటికీ కరోనా అడ్డుతగిలింది. ఏషియన్, కామన్వెల్త్కు సిద్ధం.. ప్రస్తుతం సీనియర్లో విభాగంలో సిద్ధాంత్ తింగాలియ పేరుతో ఉన్న రికార్డు (13.48 సెకన్లు) బద్ధలుగొట్టి అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందేలా యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29న కర్నాటకలో జరిగే ఖేలో వర్సిటీ పోటీల ద్వారా వరల్డ్ వర్సిటీ పోటీలకు, జూన్‌లో ఇంటర్ స్టేట్ చాంపియన్ షిప్ ద్వారా కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టేలా టెక్నిక్‌పై దృష్టి సారించాడు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి... యశ్వంత్ హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి నుంచి తొమ్మిది వరకు చదివాడు. అనంతరం గోల్కొండలోని బాయ్స్ స్పోర్ట్స్ కోమ్ (ఆర్మీ ఆర్టీ సెంటర్ సెలక్షన్లో ఎంపికై) సీబీఎస్సీలో టెన్త్ పూర్తి చేశాడు. ఇంటర్ దూరవిద్యలో పూర్తైంది. తరువాత గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని టెన్విక్ అకాడమీలో (అనిల్ కుంబ్లే అకాడమీ) అంతర్జాతీయ శిక్షకుడు అద్రిమామ్(దక్షిణాఫ్రికా), ఎరిక్ డిక్సన్ (అమెరికా) వద్ద ఏడాది పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో డిగ్రీ ఫైనలియర్ బీకాం చదువుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. యశ్వంత్ తండ్రి సూరంనాయుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నేషనల్ వాలీబాల్, త్రోబాల్ రిఫరీగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమారులు. వారి భవిష్యత్తు కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. చిన్న కుమారుడు సిద్ధ వరప్రసాద్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడు. ట్రైనింగ్ సెంటర్లో భోజన, వసతి సౌకర్యాలను మాత్రమే సమకూరుస్తారు. కుమారుల ప్రాక్టీస్ కోసం అవసరమైన షూలు, పౌష్టికాహారం, దుస్తుల కోసం నెలకు దాదాపు ఇద్దరు రూ.10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సొంత గ్రామంలో చిన్న ఇల్లు మినహా ఆ కుటుంబానికి వేరే ఆస్తులు లేవు. 110 మీటర్ల హర్డిల్స్‌లో విజయాలు.. ► 32వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2021లో స్వర్ణం ► ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో స్వర్ణంతో పాటు 14.10 సెకన్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు ► 35వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ ► 31వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2019లో స్వర్ణం ► గుంటూరు జాతీయ జూనియర్–2019 పోటీల్లో ద్వితీయ స్థానం ► 17వ ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్–2019 రిలేలో (4 గీ 100) కాంస్యం. ► సౌత్‌జోన్ జాతీయ పోటీలు–2018లో 100 మీటర్ల మిడే రిలేలో స్వర్ణం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం ► 2016లో విశాఖలో జరిగిన అంతర్ జిల్లాల జాతీయ పోటీల్లో కాంస్యం సాయం కావాలి.. రోజుకు ఒక సెషన్ చొప్పున వారంలో ఆరు సెషన్లు శిక్షణ ఉంటుంది. జిమ్, ట్రాక్‌పై కఠినంగా శ్రమించాలి. ఫిట్నెస్ కాపాడుకుంటూ సెలవు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లోనూ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా. – లావేటి యశ్వంత్ కుమార్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
దైవం 'నైవేద్య' రూపేణా..
నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం రూరల్: ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం. ఊరి అమ్మోరికి.. ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు. పాకంతో పసందు ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది. గజముద్దలకు కేరాఫ్ ఉద్దానం నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు. అమ్మవారి స్వరూపం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గజముద్దను అమ్మోరు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. భక్తులు ఎంతో భక్తితో తలపై ధరించి ఊరేగిస్తారు. ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. – డీబీ పురుషోత్తం, అమ్మవారి పూజారి తరాల నుంచి తయారీ మా కుటుంబం తరతరాల నుంచి అమ్మవారి నైవేద్యం గజముద్దను తయారు చేస్తోంది. నాణ్యమైన ధాన్యం పేలాలను సేకరించి పవిత్రంగా తయారు చేస్తాం. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నెల వరకు గిరాకీ ఉంటుంది. – ధ్రౌపతి గుడియా, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం -
ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు
చక్కటి ప్రణాళిక, సమగ్రమైన అధ్యయనం, సలక్షణమైన నిర్ణయంతో జిల్లాలో వైఎస్సార్ సీపీ టీడీపీ నోరు మూయించింది. ఒక్క విమర్శకు కూడా తావు లేని విధంగా సిక్కోలు పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ‘ఎచ్చెర్ల’ వెళ్లిపోతే రోడ్డెక్కుదామని వేచి చూసిన ప్రతిపక్షానికి నోట మాట రాకుండా సమాధానం చెప్పింది. కీలకమైన ఆ ప్రాంతాన్ని సిక్కోలులోనే ఉంచేస్తూ టీడీపీకి ఊహించని షాకిచ్చింది. రాజాం, పాలకొండ వాసులకు కూడా మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాల అభిమానాన్ని చూరగొంది. సాక్షి, శ్రీకాకుళం: విమర్శ చేద్దామనుకున్న వారి నోళ్లు మూతబడ్డాయి. ఆందోళనలతో హడావుడి చేద్దామని భావించిన వారి నినాదాలు మూగబోయాయి. సిక్కోలు పునర్ వ్యవస్థీకరణలో ప్రభుత్వం సమగ్రమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి, శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచడంతో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైఎస్ జగన్ సర్కారు ఈ నిర్ణయంతో వైరి పక్షం నోరు మూయించి, జనాల మనసులను మరోసారి గెలుచుకుంది. ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో ఆ జిల్లాలోకి వెళ్లిపోతుందని చాలాకాలంగా వాదనలు జరుగుతున్నాయి. అలా జరిగితే జిల్లా కేంద్రంలోని కొంత భాగం వెళ్లిపోతుందని, పైడిభీమవరం, నవభారత్ పారిశ్రామిక వాడలతో పాటు ట్రిపుల్ ఐటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఐటీఐ, పాలిటెక్నికల్ కళాశాల, జిల్లా శిక్షణా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వ్యవసాయ కళాశాల, పలు ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు, పో లీసు శాఖకు చెందిన ఏఆర్ విభాగం, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఫార్మా రంగం, జాతీయ రహదారి వంటివి జిల్లా కోల్పోతుందని అంతా అపోహలు సృష్టించారు. దీన్నే ఆయుధంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వేచి చూసింది. అయితే ప్రజలు, స్థానిక నాయకుల అభిప్రాయాల ను ప్రభుత్వం గౌరవించి ఎచ్చెర్లను శ్రీకాకుళంలోనే ఉంచడంతో టీడీపీ వ్యూహాలన్నీ చతికిలపడ్డాయి. చదవండి: (Andhra Pradesh New Districts: పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ) రెండు రెవెన్యూ డివిజన్లు.. 1466 రెవెన్యూ గ్రామాలు సరికొత్త సిక్కోలులో రెండు రెవెన్యూ డివిజన్లు, 921 పంచాయతీలు, 1466 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నా యి. వీటి పరిధిలో 5,53,830 కుటుంబాలు ఉంటాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 16 మండలాలు, టెక్క లి రెవెన్యూ డివిజన్లో 14 మండలాలు ఉంటాయి. శ్రీకాకుళం డివిజన్లో ఇప్పటికే ఉన్న ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గా ల మండలాలు, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పోలాకితో పాటు ఇంతవరకు పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఉన్న కొత్తూరు, హిరమండలం, సారవకోట మండలాలు కలుస్తాయి. టెక్కలి డివిజన్లో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గా ల మండలాలు, జలుమూరుతో పాటు ఇప్పటివరకు పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు కలుస్తాయి. ‘మన్యం’లోకి పాలకొండ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో రాజాం కొత్తగా పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటయ్యే మ న్యం జిల్లాలో పాలకొండ కలవనుంది. ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ డివిజన్ హోదా యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న రాజాం నియోజకవర్గ మండలాలు విజయనగరం జిల్లా పరిధిలోని బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో కలుస్తాయి. అలాగే, పాలకొండ డివిజన్లో ఉన్న పాతపట్నం నియోజకవర్గ మండలాలు టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో విలీనమవుతాయి. పాతపట్నం, రాజాం నియోజకవర్గాల మండలాలు పోతుండగా, కొత్తగా కురుపాం ని యోజకవర్గంలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి కలవనున్నాయి. మొత్తం ఆరు మండలాలతో పాలకొండ రెవెన్యూ డివిజన్ కొనసాగనుంది. చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) మరింత సౌలభ్యం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గం కలవడంతో ఆ ప్రాంత వాసులకు మరింత సౌలభ్యం కలగనుంది. 18.84 లక్షల జనాభాతో 3,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయనగరం ఏర్పాటవు తుంది. రాజాం వాసులకు శ్రీకాకుళం కంటే విజయనగరంతోనే లావాదేవీలు ఎక్కు వ. వ్యాపార, ఇతర వ్యవహారాలు, సంబంధాలు కూడా అక్కడితోనే ఎక్కువ. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక జిల్లాలోనే ఉండనున్నారు. ఇక, వారికి రెవెన్యూ డివిజన్‌గా ఉన్న బొబ్బిలి మరింత దగ్గరగా ఉండనుంది. రాజాం నియోజకవర్గం విలీనంతో విజయనగరం జిల్లాలోకి కొత్తగా 123 పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు, 68,003 హౌస్ హోల్డ్స్ వెళ్లనున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్: 16 మండలాలు (కొత్తగా కలిసేవి: కొత్తూరు, హిరమండలం, సారవకోట) టెక్కలి రెవెన్యూ డివిజన్: 14 (కొత్తగా కలిసేవి: పాతపట్నం, మెళియాపుట్టి) బొబ్బిలి రెవెన్యూ డివిజన్ : 11 (వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు,గజపతినగరం, మెరకముడిదాం) పాలకొండ రెవెన్యూ డివిజన్: 6 (వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని, జియ్యమ్మవలస, గరుగుబిల్లి) పార్వతీపురం రెవెన్యూ డివిజన్ : 10 (కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం,పార్వతీపురం,సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ) పాలకొండకు అనుకూలం.. పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో కలిసి 9.72లక్షల జనాభాతో 3,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో విలీనం అవుతుంది. దీని వల్ల జిల్లా కేంద్రం పార్వతీపురం వారికి మరింత దగ్గరవుతుంది. పాలకొండ వాసులకు కూడా శ్రీకాకుళం కంటే పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలోని వీరఘట్టం ప్రజలు శ్రీకాకుళం రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. భామిని వాసులైతే 98 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటైతే వీరఘట్టం ప్రజలు 30 కిలోమీటర్లు, భామిని మండల ప్రజలు 70 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. పాలకొండ నియోజకవర్గం విలీనం కావడం వల్ల మన్యం జిల్లాలోకి 146 గ్రామ పంచాయతీలు, 226 రెవెన్యూ గ్రామాలు, 59,488 హౌస్ హోల్డ్స్ కలవనున్నాయి. సముచిత ప్రాధాన్యం.. పరిపాలనా సౌలభ్యం, సత్వర సే వలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాం. వచ్చే నెల 26వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. మన జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం శుభపరిణామం నూతన జిల్లాల ఏర్పాటు శుభ ప రిణామం. జిల్లాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కొత్త జిల్లాలతో ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయి. సీఎం వినూత్న ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. – తమ్మినేని సీతారాం, అసెంబ్లీ స్పీకర్ గొప్ప నిర్ణయం జిల్లాల పునర్విభజన గొప్ప పరిణామం. ఎచ్చెర్ల విషయంలో జిల్లా వాసులకు భయం ఉండేది. కానీ ఇక్కడి మనోభావాలను సీఎం గౌ రవించారు. ఇందులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కృషి అధికంగా ఉంది. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మంత్రి సీఎంకు కృతజ్ఞతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనిర్వచనీయం. పరిపాలనా సౌలభ్యం కోసం సులభతరంగా పర్యవేక్షణ చేసేందుకు వీలుగా శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నూతన అధ్యాయం అన్ని ప్రాంతాలకు సమన్యా యం జరిగేలా సీఎం వైఎస్ జగ న్మోహన్రెడ్డి కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ఇది నూతన అధ్యాయం. – డాక్టర్ కిల్లి కృపారాణి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు -
సిక్కోలు నుంచి హైదరాబాద్ వెళ్లి..
శ్రీకాకుళం పాతబస్టాండ్: అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ లబ్ధిదారుకు వలంటీర్ ఆసరాగా నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లిమరీ ఆమెకు పింఛన్ నగదు అందించి నిబద్ధతను చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన వితంతువు ముక్క అప్పలనర్సమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వలంటీర్ దూబ రాజశేఖరరావు శుక్రవారం బయలుదేరి శనివారం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి చేరుకుని ఆమెకు మూడు నెలల పింఛన్ మొత్తం రూ.6,750 అందించాడు. వలంటీర్ చిత్తశుద్ధిని డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ అభినందించారు. -
సిక్కోలులో కరోనా ఎందుకొచ్చిందంటే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన పాతపట్నం సమీపంలోని సీది గ్రామానికి చెందిన యువకుడికి నెగటివ్ వచ్చినా అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. వారికి కరోనా లక్షణాలు లేనప్పటికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. ► ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్న యువకుడు గత నెల 19న స్వస్థలానికి వచ్చాడు. అప్పటి నుంచి కాగువాడ గ్రామంలోని అత్తవారింటిలో కుటుంబంతో కలిసి ఉన్నాడు. ► ఢిల్లీ నుంచి అతను ప్రయాణించిన రైలులో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో అధికారులు అతన్ని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ► ఢిల్లీలో తిరిగి విధుల్లో చేరేందుకు మెడికల్ సర్టిఫికెట్ కోసం పాతపట్నం సీహెచ్‌సీలో ట్రూనాట్ పరీక్ష చేయించుకోగా కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ, శ్రీకాకుళంలోని జెమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో నమూనా తీసి పరీక్షించగా నెగటివ్ వచ్చింది. అత్తింటి వారినీ పరీక్షించగా వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ► 28 రోజులు క్వారంటైన్ గడువు ముగిశాక అతను వివిధ ప్రాంతాలలో సంచరించాడు. ► అతనితో కాంటాక్ట్ అయిన 29 మందిని శుక్రవారం, 67 మందిని శనివారం క్వారంటైన్‌కు పంపించారు. ► మరోవైపు.. కాగువాడకు 3 కిలోమీటర్ల పరిధిలో గల పాతపట్నంతోపాటు కాగువాడ, సీది, కొరసవాడ, చుట్టుపక్కల 18 గ్రామాలను పూర్తిగా లాక్డౌన్ చేశారు. -
కేతన్.. సాధించెన్
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు క్రీడాకారులు రోజు రోజుకూ రాటుదేలుతున్నారు. అడు గు పెట్టిన ఆటలో అత్యున్నత శిఖరా లు అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయాణమే చేస్తూ జిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు మరో యువ కెరటం సిద్ధమవుతోం ది.సాఫ్ట్‌బాల్‌లో జిల్లా నుంచి భారత జట్టుకు ఆడేందుకు ప్రాతినిథ్యం వహించేందుకు ఓ కుర్రాడు సిద్ధమవుతున్నాడు. జిల్లాకు చందిన బడగల కేతన్ భారత అండర్–12 సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. జపాన్‌లోని మియాజికి వేదికగా జూలై 1 నుంచి 6 వరకు జరిగే అండర్–12 ఇంటర్నేషనల్ బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే భారత్ బేస్‌బాల్ ప్రాబబుల్స్ జట్టులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బడగల కేతన్కు చోటు లభించింది. ఈ మేరకు సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనైగర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు నుంచి ఎంపికైన సమాచారం జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు చేరింది. ఆటలపై మక్కువతో.. గార గ్రామానికి చెందిన బడగల హరిధరరావు, మైథిలి దంపతుల కుమారుడు కేతన్. నగరంలోని మహాలక్ష్మినగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఏపీఐఐసీ శ్రీకా కుళం జోనల్ మేనేజర్‌గా పనిచేస్తూనే జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్‌గా పలు క్రీడాసంఘాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. తల్లి గృహిణి. 9వ తరగతి చదువుతున్న అక్క మనశ్విత ఉంది. పిల్లలకు చదువుతోపాటు ఆటలను నేర్పించాలని త ల్లిదండ్రులు భావించారు. అందుకు అనుగుణంగా చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి పెం చుకున్న కేతన్ సాఫ్ట్‌బాల్ క్రీడను ఎంచుకున్నారు. 2017లో తన తండ్రి ప్రోత్సాహంతోనే సాఫ్ట్‌బాల్‌లో ప్రవేశం పొందిన కేతన్కు కరాటేలో కూడా ప్రావీణ్యత ఉండటం విశేషం. ఫ్యామిలీ మొత్తం క్రీడల నేపథ్యం.. కేతన్ తండ్రి హరిధరరావు రాష్ట్రస్థాయి వాలీ బాల్ క్రీడాకారుడు. పలు రాష్ట్రస్థాయి వాలీ బాల్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించారు. అక్క మనశ్విత జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడాకారి ణి. ఇటీవలి రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలక భూమిక పోషించింది. తల్లితో పా టు తండ్రి, అక్క ప్రోత్సాహంతో కేతన్ రెట్టిం చిన ఉత్సాహంతో పోటీల్లో రాణిస్తున్నాడు. జాతీయ పోటీల్లో రాణింపుతో చాన్స్.. కేతన్ నిరంతరం సాధన చేస్తున్న సమయంలో ఈ ఏడాది మే 7 నుంచి 9 వరకు తెలం గాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వేదికగా జరిగిన జాతీయ అండర్–12 బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించా డు. ఈ పోటీల్లో మెరుగైన ఆటతీరుతోపాటు చురుగ్గా కనిపించడంతో నేరుగా జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో కేతన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటా నుంచి జాతీయ జట్టుకు పరిగణనలోకి తీసుకున్నారు. కేతన్ ఆర్డీటీ అనంతపురం రెసిడెన్షియల్ క్యాంప్ లో బద్రీనా«థ్, నాయక్, ఓబులేష్, నాగేంద్ర, లక్ష్మీ శిక్షణలో రాటుదేరాడు. జిల్లాలో సాఫ్ట్‌బాల్ సంఘ కార్యదర్శి ఎంవీ రమణ, సీనియర్ ప్లేయర్లు మెలకువలు నేర్పారు. సిమ్లాలో జరిగే శిక్షణ శిబిరాలకు హాజరు ఇండియన్ సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ నుంచి వర్తమానం అందుకున్న కేతన్ తండ్రి హరిధర్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈనెల 6 నుంచి జరిగే శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు పయనమయ్యారు. శిక్షణ అనంతరం 16 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ప్రకటిస్తారు. ప్రస్తుతం కేత న్ ప్రతిభ, నిలకడైన ఆటతీరు, మైదానంలో చురుగ్గా ఉండే విధానం ఆధారంగా చూస్తే దాదాపుగా తుది జట్టులో ఛాన్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర, జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లా నుంచి మరో అంతర్జాతీ య క్రీడాకారుడు ఎంపికైనట్టే. జిల్లా నుంచి దేశం తరుపున ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న అతిపిన్న వయస్కునిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఇటీవలి బేస్‌బాల్ క్రీడలో జిల్లా నుంచి తోటాడ శ్రీను ఇండియన్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. 3 స్టేట్, 2 నేషనల్స్.. కేతన్ గడిచిన రెండేళ్లలో సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాణించి సత్తాచాటాడు. అసోసియేషన్ మీట్స్ ఇప్పటి వరకు మూడు రాష్ట్రస్థాయి పోటీలు, రెం డు జాతీయస్థాయి పోటల్లో ప్రాతినిధ్యం వహించి భళా అనిపించాడు. ఇందులో ఒక కాంస్య పతకం ఉండటం విశేషం. 2018 నవంబర్ 1 నుంచి 3 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన అండర్–11 జాతీ య బాలుర సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగాడు. ఈ పోటీల్లో ఆంధ్రా తృతీయ స్థానంలో నిలవడంతో కేతన్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. 2019–20 సీజన్లో అండర్–14 వయో విభాగంలో స్కూల్గేమ్స్పోటీలకు సన్నద్ధమవుతున్నాడు. శుభాకాంక్షలు తెలిపిన దాసన్న బడగల కేతన్ భారత అండర్–12 సాఫ్ట్‌బాల్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపిక కావడాన్ని పురస్కరించుకుని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి హ రిధర్, కేతన్లతో ఫోన్లో మాట్లాడిన దాసన్న జిల్లాకు అంతర్జాతీయ కీర్తి తీసుకొచ్చిందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మా న ప్రసాదరావు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మార్పు ధర్మారావు, ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావుతోపాటు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దానేటి శ్రీధర్, కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, పీఈటీ సంఘ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఆనంద్‌కిరణ్, పోలి నాయుడు, రాజారావు, సునీత, రమణ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు ఆడటమే లక్ష్యం భారత సాఫ్ట్‌బాల్æ జట్టుకు ఆడటం నా జీవిత లక్ష్యం. పేరెంట్స్, కోచ్‌ల ప్రోత్సాహంతో నిరంతరం సాధన చేస్తున్నాను. నేషన ల్స్ మీట్లలో రాణించాను. సెలెక్టర్లు నన్ను ఎంపికచేయడం సంతోషంగా ఉంది. ఫైనల్ టీమ్‌కు ఎంపిక అవుతానని నమ్మకం ఉంది. సిమ్లాలో జరిగే కోచింగ్ క్యాంప్‌కు హాజరవుతున్నాను. – బడగల కేతన్, సాఫ్ట్‌బాల్ భారత ప్రాబబుల్స్ జట్టు క్రీడాకారుడు -
వేమూరి రాధాకృష్ణ వ్యంగ్యంపై ఉరకవే మండిపాటు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉద్యమాలకు నిలయమైన శ్రీకాకుళం భాష, యాసపై ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వ్యగ్యంగా మాట్లాడం సరికాదని ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక (ఉరకవే) ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో ఉరకవే నాయకుడు అట్టాడ అప్పలనాయుడు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ‘పొట్టచింపితే హిందీ అక్షరం రాని ఉత్తరాంధ్ర’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సిక్కోలు నేలను హేళన చేసిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. రాధాకృష్ణకు ఉరకవే బహిరంగ లేఖ రాసేందుకు నిర్ణయించిందన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు, పత్రికాధిపతులు.. కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో కూరుకుపోయి హేళన చేయడం తగదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజా ఉద్యమం ద్వారా ఇటువంటివాటిని ఎండగడతామన్నారు. తొలుత శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలిలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయుకులు, కమ్యూనిస్టులు, పాత్రికేయులు, పలువురు మేధావులతో కలిసి నిరసన తెలియజేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన దువ్వాడ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రజాసంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, జయదేవ్, సనపల నర్శింహులు, వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, దివాకర్, టంక చలపతి, గురుగుబెల్లి బావాజీరావు, గొంటి గిరిధర్‌రావు, మిస్క కృష్ణయ్య పాల్గొన్నారు. -
ముగిసిన సిక్కోలు సంబరాలు
-
సిక్కోలుకు అన్యాయమే
► జిల్లాలో మేజర్ ప్రాజెక్టు ఒక్కటీ తెచ్చింది లేదు ►వైఎస్ హయాంలోనే బృహత్తర ప్రాజెక్టులు ►ప్రజాసమస్యలు చూడటానికే జగన్ పర్యటన ►వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం: ఈ మూడేళ్ల కాలంలోనే కాదు గత దఫా పదహారేళ్ల టీడీపీ పాలనలోనూ జిల్లాకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ జిల్లాకు చెప్పుకోదగిన మేజర్ ప్రాజెక్టు ఏదీ టీడీపీ ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూడేళ్ల కాలంలో లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... సిక్కోలు అభివృద్ధికి ఎంత వాటా కేటాయించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. చివరకు విభజన నష్టాన్ని పూడ్చేందుకు 12 జాతీయ సంస్థలను కేంద్ర ప్రభుత్వం 13 జిల్లాలున్న ఈ రాష్ట్రానికి ఇస్తే వాటిలో ఏ ఒక్కటీ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే శ్రీకాకుళం జిల్లాకు బృహత్తర ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు. ఆయన జీవించి ఉంటే వంశధార విస్తరణ ప్రాజెక్టు ఎప్పుడో రైతులకు అందుబాటులోకి వచ్చేదని ధర్మాన అన్నారు. ఈ ప్రాజెక్టు కొద్దిపాటి పెండింగ్ పనులను పూర్తి చేయడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. వంశధార నిర్వాసితుల నిరసనను, వారి ఆవేదనను వినే ప్రయత్నం ఏనాడూ చేయలేదన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరిగినా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి రెండు మూడు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో వంశధార నిర్వాసితులు కూడా అదే నిర్ణయాన్ని ఆశించడం సహజమేనన్నారు. ఒకే రాష్ట్రంలో భిన్నమైన విధానాలు అనుసరించడం వల్లే నిర్వాసితులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. వారి ఆవేదనను వినాలని, అక్కడున్న సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవాలని శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని ధర్మాన వివరించారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా, భవిష్యత్తులో రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టబోయే నాయకుడిగా జగన్ నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో సరైన పోషకాహారం తీసుకోలేని కుటుంబాల్లోనే కిడ్నీ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని ధర్మాన చెప్పారు. ప్రభుత్వం ప్రకటనల్లో కనిపిస్తున్నంత ఊరట అక్కడ ప్రజల్లో మాత్రం కనిపించట్లేదన్నారు. కిడ్నీ వ్యాధితో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి జగన్ పర్యటన సమంజసమేననడంలో సందేహం లేదన్నారు. ఇది అందరూ స్వాగతించాల్సిన కార్యక్రమమని ధర్మాన అభిప్రాయపడ్డారు. -
చివర్లో సిక్కోలు!
జిల్లాను అభివృద్ధి చేసేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకు 7. కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీడీజీ) ప్రకారం ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ర్యాంకులు అన్నీ అట్టడుగునే ఉన్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సిక్కోలే చివరి స్థానంలో ఉండటం జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కడుతోంది. ఒక్క సేవా రంగంలోనే పొరుగునున్న విజయనగరం జిల్లా కన్నా కాస్త మెరుగనిపించి అడుగు నుంచి రెండో స్థానంలో సిక్కోలు నిలిచింది. ఇక జిల్లా ఆర్థిక పరిస్థితిని చాటిచెప్పే తలసరి ఆదాయం విషయంలోనూ చివరి స్థానమే దక్కింది. టీడీపీ ప్రభుత్వం జిల్లా మంత్రికి, ఎమ్మెల్యేలకు ఇస్తున్న ర్యాంకులకు, ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన గణాంకాల ప్రకారం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధం లేకపోవడంతో గందరగోళానికి దారితీస్తోంది. * అభివృద్ధిలో మంత్రి అచ్చెన్నకు ఏడో ర్యాంకు! * ప్రభుత్వ గణాంకాలతో గందరగోళం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండేళ్ల కాలంలో ఏడుసార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్తానని పలు హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా ఏర్పాటు కాలేదు. వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తింపు ఉందని, ఆ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. పర్యాటకపరంగానూ జిల్లాకు పలు ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి జిల్లా స్థూల ఉత్పత్తిలో మెరుగవ్వాలంటే మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం గాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో జిల్లా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హామీలు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించిన గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థూల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లు ఉంది. దీనిలో రూ.72,219 కోట్ల భాగస్వామ్యంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, రూ.22,707 కోట్లతో సిక్కోలు చివరి స్థానంతో సరిపెట్టుకుంది. కృష్ణా జీడీడీపీతో పోల్చితే జిల్లా భాగస్వామ్యం మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం. పొరుగునున్న విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ ర్యాంకు దక్కించుకొని శ్రీకాకుళం కన్నా మెరుగనిపించింది. తలసరి ఆదాయం... ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి తలసరి ఆదాయమే ప్రధాన సూచిక. ఈ విషయంలోనూ సిక్కోలు చివరి స్థానానికే పరిమితమైంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 ఉంటే జిల్లాది రూ.74,638 ఉంది. ఉత్తరాంధ్రలోనే ఒకటైన విశాఖ జిల్లా రూ.1,40,628తో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈలెక్కన ఒక విశాఖ వాసి సగటు ఆదాయంలో సిక్కోలు జిల్లా నివాసి ఆదాయం సగం మాత్రమే. విజయనగరం కూడా రూ.86,223 తలసరి ఆదాయం పొంది 12వ ర్యాంకుతో జిల్లా కన్నా మెరుగనిపించింది. వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా రూ.1,64,086 కోట్లు ఉండగా దానిలో రూ.22,697 కోట్ల భాగస్వామ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. శ్రీకాకుళం మాత్రం కేవలం రూ.5,015 కోట్లతో చివరి స్థానానికి పరిమితమైంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోల్చితే ఈ రంగంలో సిక్కోలు వాటా నాలుగో వంతు కూడా లేదు. విజయనగరం జిల్లా రూ.5,894 కోట్లతో 12వ స్థానంతో జిల్లా కన్నా మెరుగ్గా ఉంది. పారిశ్రామిక రంగం అన్ని వనరులున్న శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తామని రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చినా ఆచరణలో కానరావట్లేదు. ఈ ప్రభావం జిల్లా జీడీపీపై స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర జీడీడీజీలో పారిశ్రామిక రంగం వాటా రూ.1,31,643 కోట్లు కాగా దానిలో రూ.24,532 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రంగంలో కూడా రూ.4,400 కోట్లతో సిక్కోలుకు చివరి స్థానమే దక్కింది. విశాఖతో పోల్చితే ఆరో వంతు కూడా లేకపోవడం గమనార్హం. విజయనగరం రూ.4,493 కోట్లతో కాస్త మెరుగైన స్థానంలో ఉంది. సేవా రంగం రాష్ట్ర జీడీడీపీలో సేవారంగం వాటా రూ.2,61,917 కోట్లు కాగా, దానిలో రూ.32,593 కోట్లతో విశాఖ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. సిక్కోలు మాత్రం రూ.11,571 కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో మాత్రం విజయనగరం (రూ.10,800)ను వెనక్కు నెట్టగలిగింది. విశాఖ జిల్లాతో పోల్చితే సిక్కోలుది మూడో వంతు ఉంది. -
సిక్కోలులో ఆగని ప్రభు రైలు
రైల్వేస్టేషన్‌కు వచ్చే రైళ్లకు ఆటోమెటిక్ తలుపుల ఏర్పాటు, పాల రవాణాకు ప్రత్యేక బోగీలు, ఆర్పీఎఫ్కు సెల్ సదుపాయం కూడా కల్పించలేదు. ఒడిశా నుంచి పాసింజరు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా మీదుగా నడుస్తున్నా ఇక్కడకు వచ్చేసరికే ఒడిశా ప్రయాణికులతో బోగీలు నిండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జిల్లా మీదుగా వెళ్లి, వచ్చే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను ప్రజలు కోరినప్పటికీ కనీసం ఈ బడ్జెట్లో కూడా దాన్ని పట్టించుకోలేదు. ప్రయాణికుల కష్టాలూ తీరలేదు. పలాస : జిల్లా ప్రజలకు ఈసారీ నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత పూర్తిస్థాయిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో సిక్కోలుకు ఏ మాత్రం లబ్ధిచేకూరలేదు. పార్లమెంటులో గురువారం రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం ఈ ప్రాంతం ఊసే ఎత్తలేదు. సామాన్యుల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మాత్రం ఎటువంటి ప్రయోజనం అదనంగా చేకూర్చలేదు. ఎప్పటిలాగే ఈసారీ మొండిచేయి చూపారు. విశాఖ కొత్త రైల్వేజోన్ ఊసే లేదు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు గల తెలుగు ప్రజలు, ప్రయాణికులు ఒడిశా అధికారుల కబందహస్తాల నుంచి బయటపడే అవకాశం లేకుండాపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వేజోన్ కొత్తగా ఏర్పడుతుందని, పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు గల రైల్వేస్టేషన్లు విశాఖపట్నంలో కలిపితే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కలుగుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే వారి ఆశలుఅడియాసలయ్యాయి. కనీసం రైల్వేజోన్ ప్రస్తావన కూడా రాలేదు. బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపించడమే కాకుండా కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా బడ్జెట్లో చోటు లభించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన కూడా రాలేదు. అలాగే కొత్త రైళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఇచ్ఛాపురం, ఆమదాలవలస (శ్రీకాకుళం జంక్షన్), పలాస రైల్వేస్టేషన్ల నుంచి రోజూ వేలాది మంది వివిధ ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణిస్తుండడం ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం ఆ శాఖకు వస్తోంది. పలాస రైల్వేస్టేషన్ ఏ-గ్రేడ్‌లో ఉండడంతో రోజుకు రూ.4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ స్టేషన్లో కనీసం మౌలిక సదుపాయాలు నేటికీ లేవు. వ్యాపార కేంద్రం కావడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువగా జీడిపప్పు ఇతర సరుకులు రవాణా అవుతుంటాయి. అయితే బడ్జెట్లో సరుకులపై రవాణా చార్జీలు మోపడం వల్ల వ్యాపారస్తులకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ స్టేషన్లో ప్లాట్ఫారం పైకప్పు కూడా లేదు. మరుగుదొడ్లు, మంచినీటి సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అలాగే ఇచ్ఛాపురం, సోంపేట, నౌపడ, ఆమదాలవలస వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్లను ఆధునీకరించి మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నా కనీసం దీన్ని కూడా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు పట్టించుకోలేదు. జిల్లాలో కొత్త రైలు లైన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించలేదు సరికదా కొత్త రైళ్లను వేయడానికి ప్రతిపాదనలు చేయలేదు. జిల్లాలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్ గేట్లు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రైవేటు కాంట్రాక్టు సిబ్బందితో నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల గేట్లు కూడా లేవు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి గురించి కనీసం ప్రస్తావన లేదు. కొత్త ఫ్లైఓవరు బ్రిడ్జిల ప్రస్తావన లేదు సరికదా నిర్మాణంలో ఉన్న పలాస, బెండి ఫ్లైఓవరు బ్రిడ్జిలు నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్లయినా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. నౌపడ, గుణుపూర్ రైల్వే లైన్ ను అభివృద్ధి చేయాలనే విషయాన్ని కూడా పాలకులు విస్మరించారు. బడ్జెట్‌కు ముందు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లాకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, కొత్త రైల్వేజోన్ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ప్రజాప్రతినిధులకు కేంద్రంలో కనీస గౌరవం లేదనడానికి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
సిక్కోలును అభివృద్ధి చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరినట్టు తెలిసింది. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వెనుకబడిన జిల్లాగా ఉండిపోయిన శ్రీకాకుళాన్ని భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిందేనని, ఇందుకు ఇక్కడ ఉన్న వనరులు, భూ లభ్యతపై వివరించినట్టు సమాచారం. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినటు అవుతోందని కలెక్టర్ వివరించినట్టు భోగట్టా. అలాగే వలసల్ని నివారించాలంటే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిందేనని వివరించారు. మొత్తం 29 అంశాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ ఉప్పల్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే వంశధార, వంశధార ప్రాజెక్టు ఫలాల్ని జిల్లా రైతులకు చేర వేయాలని, శివారు ప్రాంత రైతులకు కూడా సాగునీటిని చేర్చేందుకు పెండింగ్ పనుల్ని పూర్తిచేయాలని కోరారు. బి.ఆర్.రాజగోపాలరావు (వంశధార) రెండోదశ పనుల్ని సకాలంలో పూర్తిచేస్తే జిల్లా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని, పంటలు నష్టపోకుండా ఉండేందుకు ఈ నీరు ఎంతో అవసరమని వివరించారు. సాగు, తాగు నీటి సరఫరా, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా జిల్లా మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని సీఎంకు కలెక్టర్ వివరించారు. అలాగే ఫోర్టుల ఏర్పాట్లు, అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు..సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో అవసరమని వివరించారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. -
ఫైలిన్ తుఫాన్‌తో సిక్కోలు కుదేలు
-
పాతపట్నంలో మరో ప్రజా ప్రస్థానం 30th july 2013
-
జనం కోసం
-
218 వ రోజు పాదయాత్ర నేడు సాగేదిలా
-
గొడుగెత్తిన అభిమానం
-
సిక్కోలులో మరో ప్రజా ప్రస్థానం 22nd july 2013