
అప్పలనర్సమ్మకు పింఛన్ అందిస్తున్న వలంటీర్ రాజశేఖరరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ లబ్ధిదారుకు వలంటీర్ ఆసరాగా నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లిమరీ ఆమెకు పింఛన్ నగదు అందించి నిబద్ధతను చాటుకున్నాడు.
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన వితంతువు ముక్క అప్పలనర్సమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వలంటీర్ దూబ రాజశేఖరరావు శుక్రవారం బయలుదేరి శనివారం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి చేరుకుని ఆమెకు మూడు నెలల పింఛన్ మొత్తం రూ.6,750 అందించాడు. వలంటీర్ చిత్తశుద్ధిని డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment