Pension distribution
-
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
సాక్షి, అమరావతి: దంపతులంటే..? జీవిత భాగస్వాములంటే..? భార్యాభర్తలు కాదా? వైవాహిక బంధానికి కూటమి సర్కారు కొత్త భాష్యం చెబుతోంది! పేదల పింఛన్ల విషయంలో చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతోంది. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరణించిన పింఛన్‌దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎడాపెడా పింఛన్లకు కోత పెడుతూ.. అసలు కొత్త వాటి ఊసే లేకుండా చేసింది. ఆర్నెల్లలో దాదాపు 1.72 లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. మరోవైపు లక్షలాది దివ్యాంగ పింఛన్లపై ఏరివేతల కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్ల మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చే విషయంలో వింత విధానాలను అమలు చేస్తోంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో కేవలం భార్యకు మాత్రమే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. స్పౌజ్ అంటేనే భార్యా భర్తలని అర్థం! కానీ ఆ పదానికే అర్థం మార్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ఇంటికి ఒకే పింఛను విధానం ప్రకారం... ఎక్కడైనా భార్య చనిపోయి, ఆ కుటుంబంలో భర్త ఇప్పటికీ పింఛను పొందని పరిస్థితి ఉంటే... 70–80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పుడా ఆస్కారమే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. ప్రస్తుతం ఫించన్ తీసుకుంటూ కుటుంబంలో భర్త చనిపోతే అతని భార్యకు మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేసేలా జారీ చేసిన సర్క్యులర్ ఇది. అది కూడా నవంబర్ 1 తర్వాత చనిపోయిన వారికే వర్తించేలా.. 23 వేల మంది చనిపోతే.. ఐదు వేల మందికే! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య పింఛను లబ్ధిదారుల్లో దాదాపు 23 వేల మంది చనిపోగా స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వీరికి డిసెంబరులో పింఛన్లు మంజూరు కాగా నెలాఖరులో తొలి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12వ తేదీ నుంచి నవంబరు 1కి ముందు వరకు దాదాపు నాలుగున్నర నెలల వ్యవధిలో భర్తలు మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల కుటుంబాల్లో వారి భార్యలకు మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామంటూ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. 50 ఏళ్లకే పింఛను దేవుడెరుగు.. కూటమి సర్కారు వచ్చాక ఉన్న పెన్షన్లే ఊడగొడుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశిస్తున్నారు. ఎడాపెడా కోతలు.. ఒకవైపు కొత్తగా పింఛన్ల కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు ఎడాపెడా పెన్షన్లు ఏరివేస్తూ పింఛన్‌దారులను హడలెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత ఆర్నెల్లలో ఏకంగా 1,71,921 పింఛన్లను తగ్గించేసింది. గతేడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగగా, గత డిసెంబరు 31న కూటమి ప్రభుత్వం కేవలం 63,77,943 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే.పింఛన్లకు మరింత భారీగా కోతలు పెట్టేందుకు పక్షవాత బాధితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా దీర్ఘకాలిక జబ్బుల రోగులకు శల్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న 8.18 లక్షల మంది లబ్ధిదారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు మళ్లీ సమర్పించాలంటూ వారిపై కత్తి వేలాడదీసింది. ‘రియల్’ సీన్ ఇదీ.. గత ఐదేళ్లపాటు కోవిడ్ సమయంలోనూ ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే సజావుగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం రాగానే తూట్లు పొడిచింది. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రియల్‌టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సర్వేలో 12.7 శాతం మంది లబ్ధిదారులు తమకు ఇంటి వద్ద పెన్షన్లు అందడం లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరు శాతం మంది లబ్ధిదారులు తెలిపారు.నాడు నిరంతరం.. సంతృప్త స్థాయిలో..వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో నిరంతరం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గత ఐదేళ్ల పాటు కొత్తగా పింఛనుకు అర్హత పొందే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వలంటీర్లే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 60 ఏళ్ల దాటిన వారు సైతం కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేసింది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు రెండు లక్షలకు పైగా అర్జీలను కూడా కూటమి ప్రభుత్వం మూలన పడేసింది. -
సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ టెర్రర్
అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారనే కారణంతో విజయవాడ నగరంలోని 178 వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నగరపాలక సంస్థ అధికారులు మూడు మునిసిపల్ సర్కిళ్ల పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులకు వీటిని జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలపాలని నోటీసులలో పేర్కొన్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ఒక రోజు ముందే ప్రారంభించారు. విజయవాడలో 294 సచివాలయాల పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతినెలా 1వ తేదీనే వార్డు సచివాలయ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, వీఆర్వోలు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. ప్రతినెలా పెన్షన్ పంపిణీ చేసే బాధ్యతను ఏఎన్ఎం, వీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది. సచివాలయ ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఒక రోజు ముందు అంటే.. నవంబర్ 30వ తేదీనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వీఎంసీ అధికారులు నవంబర్ 29న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 5.30 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. వివిధ కారణాలలో కొందరు ఉదయం 7 గంటల తర్వాత పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. గంటన్నర ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నానికే పంపిణీ 95 శాతానికి పైగా పూర్తి చేశారు. విజయవాడ నగర పరిధిలో 67,376 మంది పెన్షనర్లు ఉండగా.. 64,099 మందికి అంటే 95.14 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు. అయినప్పటికీ పెన్షన్ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నగరపాలక సంస్థ అధికారులు 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో సగానికిపైగా నూరు శాతం పంపిణీని పూర్తి చేశారు. ఆస్పత్రులకు వెళ్లి పెన్షన్ అందజేసిన వారికి సైతం నోటీసులు జారీ అయ్యాయి. ఓ వైపు పెన్షన్ల పంపిణీ జరుగుతుండగానే.. సాయంత్రం 6గంటలకల్లా వీఎంసీ కార్యాలయానికి వచ్చి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు.పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితివలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వేధిస్తోంది. అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారి పల్లెలో ఓ సచివాలయ ఉద్యోగి ఉదయం 7.40 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. గ్రామంలో లేని ఇద్దరు వ్యక్తులకు మినహా అందరికీ ఉదయం 10 గంటలకల్లా పంపిణీ పూర్తి చేశారు. అయినా ఆ ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా 12 సచివాలయాల పరిధిలో 87.25 శాతం నుంచి 93.89 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయ్యింది. కానీ.. 94 శాతం పంపిణీ ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆ సచివాలయాల సిబ్బంది మొత్తానికి ఎంపీడీవో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 11 మంది సిబ్బంది పింఛన్ల పంపిణీని ఆలస్యంగా ప్రారంభించారంటూ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. బాపట్ల జిల్లా అనంతవరంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగి సాంబానాయక్ తన స్వగ్రామం నుంచి తెల్లవారుజామున 5 గంటలకే బయలుదేరి వస్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు సైతం షోకాజ్ నోటీసు జారీ అయింది.నోటీసులు ఉద్దేశపూర్వకమేవీఎంసీ అధికారుల తీరుపై వార్డు సచివాలయ కార్యదర్శులు మండిపడుతున్నారు. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారులు తమతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న తమపూ అధికారులు ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్లు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు ఇబ్బందులకు గురిచేయడాన్ని గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఖండిస్తున్నారు.మళ్లీ తగ్గిన పింఛన్లురాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య నెలనెలా తగ్గిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,57,162 మందికి పింఛన్ ఆగిపోయింది. కూటమి అధికారంలోకి రాకముందు ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా.. తాజాగా శనివారం 63,92,702 మందికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల డబ్బులు విడుదల చేసింది. ఈ నెలలోనే రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 21,472 మేర తగ్గిపోయింది. అంతకు ముందు నెలలో 24,710 మంది, దానికి ముందు నెలలో 22,601 మంది.. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లబ్ధిదారుల సంఖ్య పడిపోతూ వస్తోంది.కొత్తగా ఒక్కరికైనా పింఛన్ ఇవ్వలేదుకొత్తగా పింఛన్ల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. వైఎస్ జగన్ పాలనలో అర్హులు పింఛన్ కోసం ఏడాదిలో ఏ రోజైనా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేశారు. గత ఐదేళ్లలో పింఛన్ల పంపిణీకి సంబంధించి అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలో అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాతి నుంచి.. ఎన్నికల కోడ్ ముందు వరకు దాదాపు 2 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో ఆర్భాటం లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయగా.. ఇప్పుడు సీఎం మొదలు టీడీపీ నేతలంతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోలకు ఫోజులిస్తూ దండిగా ప్రచారం చేసుకుంటున్నారు.సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు» వచ్చిన సమయం, వెళ్లే సమయం నమోదు చేస్తేనే పనిదినంగా గుర్తింపు» లేకపోతే ఆ రోజుకు సెలవుగానే పరిగణన» స్పష్టంచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ» నేటి నుంచి కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడిసాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హాజరుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు సచివాలయంలో విధులకు వచ్చినప్పుడు గానీ, సాయంత్రం వెళ్లే సమయంలో గానీ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకునేవారు. ఒకసారి హాజరు నమోదైతే ఉద్యోగి ఆ రోజు విధులకు వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించేవారు. ఇక నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండూ నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఒకసారి మాత్రమే హాజరు నమోదైతే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం తెలియజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన ఎస్ఎంఎస్లలో స్పష్టంచేశారు. -
మెసేజ్ పెడితే సర్టిఫికెట్ పంపిస్తాం
బొమ్మనహాళ్ : రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తామన్నారు. పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా, లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామన్నారు. ఎవరైనా లంచం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి వితంతువు పెన్షన్ రూ.4 వేలు, బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి రూ.15 వేలు వికలాంగుల పెన్షన్ అందజేశారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు.రాష్ట్రంలో తాము ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్యం ధరలు కూడా తగ్గించామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించకూడదన్నారు. ఎక్కడా కూడా బెల్టు షాపులు పెట్టకూడదని, ఎవరైనా బెల్టు షాపులు తెరిస్తే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ‘మీ ఊర్లో ఇసుక మీరే తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చాను. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను ఉచితంగా తెచ్చుకోండి. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. అవసరమైతే నిలదీయండి. రెండో గేర్‌లో పోతా ఉంటే నాలుగో గేర్‌లోకి మార్చి స్పీడ్ పెంచండి’ అని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం డ్రోన్స్ నిఘా పెట్టామని, దానికి ‘డేగ’ అని పెరు పెట్టామని తెలిపారు. ‘నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. త్వరలో నైబర్‌హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. యువత అందరూ సెల్ఫోన్లో రూ.10 వేలు సంపాదించే మార్గం చూపిస్తాం. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం’ అని అన్నారు. -
టీడీపీ-జనసేన బాహాబాహీ
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు తలపడ్డారు. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, జనసేన ఇన్‌ఛార్జి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలోనే ఇరుపార్టీల నేతలు ఒకరినొకరు తోసుకుని గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఎవరికి వారు వెళ్లిపోయారు. అలాగే, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా ‘క్విట్ నెల్లిమర్ల’ అంటూ టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక ఏలూరు జిల్లా పైడిచింతపాడులో పింఛన్ల పంపిణీపై టీడీపీ, జనసేన నేతలు ఘర్షణపడి కొట్టుకున్నారు. చివరికి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గందరగోళంగా మారింది. ఇలా రెండు పార్టీల నేతలు తమదే పైచేయి కావాలని వివిధ నియోజకవర్గాల్లో పోటీపడుతూ.. ఘర్షణలకు దిగుతూ రభస సృష్టిస్తున్నారు.పైడిచింతపాడులో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలుపిఠాపురంలో కండువాలు, ఫొటోల గోల..పిఠాపురంలో శుక్రవారం కూటమి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ సమావేశం కూటమి నేతల బాహాబాహీకి వేదికగా మారిపోయింది. వేదికపై వేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేత వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్లవి పెద్ద ఫొటోలు వేసుకుని జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ది చిన్నఫొటో వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కురుమళ్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి మూడు పార్టీల కండువాలు వేసుకున్నారుగానీ వచ్చిన టీడీపీ నేతలు కేవలం వారివారి పార్టీ జెండాలే వేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ ఇకే మాటపై ఉంటుంటే ఇక్కడ మాత్రం టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తూ జనసేనను తొక్కేయాలని చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తోందా?.. మరి పిఠాపురంలో టీడీపీ ఎందుకు జనసేన, పవన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ కురుమళ్ల ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు అరుపులు, కేకలతో వేదికపైకి దూసుకురావడంతో రెండు పార్టీల నేతల కార్యకర్తల మధ్య తోపులాట, తన్నులాట చోటుచేసుకుంది. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను అదుపుచేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్మ, రాజశేఖర్, మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ నుంచి నిష్క్రమించారు. పింఛన్ల పంపిణీ కోసం డిష్యూం డిష్యూం.. మరోవైపు.. పింఛన్ల పంపిణీ కోసం గురువారం దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు గ్రామం పైడిచింతపాడు టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్లాటకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి.. గ్రామ టీడీపీ నాయకుడు సైదు సత్యనారాయణ వర్గీయులు దీపావళి రోజున వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ ముంగర తిమోతీ, మోరు సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు సచివాలయానికి చేరుకున్నారు. తాములేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన నాయకుడు ముంగర వెంకటేశ్వరరావు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందులో గాయపడిన జనసేన కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) కట్టాలని పోలీసులను కోరారు. అదే సమయంలో టీడీపీ వారు సైతం ఆస్పత్రికి చేరుకుని, తమకు గాయాలయ్యాయని, ఎంఎల్సీ కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలికి వారి ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కట్టారు. దీంతో జనసేన నేతలు విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చేరి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ నేతల చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏలూరు రూరల్ పోలీసులు జనసేన నేతలను అదుపులో తీసుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతలు ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి.. టీడీపీ నేత, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బంగర్రాజు శుక్రవారం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఆమె నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని హడావుడి చేశారు. ఆమె తీరుతో నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. నిజానికి.. రెండ్రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, బంగర్రాజు మధ్య హాట్‌హాట్‌గా వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
పింఛన్లపై పిడుగు
సూపర్ సిక్స్ హామీలిచ్చారు.. ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడంలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాలలో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులన్న కనికరం లేకుండా పింఛన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందాయి. ఇంకా అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పోర్టల్‌లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులిచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్ తొలగించడానికి ఎంపీడీవోలకు ఆప్షన్ ఇచ్చేశారు. కొత్త పెన్షన్ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటంటే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించబోతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వబోవడం లేదు.. సాక్షి, అమరావతి: సామాజిక పింఛన్లకు కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి ప్రతి నెలా ఠంఛన్‌గా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారులకు ‘మీ పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైంది’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామాల్లో అధికార టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేసి.. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారి పింఛన్ తొలగింపునకు అధికారులు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా గుర్తించిన వారి పేర్లను ప్రభుత్వ అధికారిక సామాజిక పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ నుంచి తొలగించే వెసులుబాటును ఆయా మండల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులకు మొబైల్ మేసేజ్ రూపంలో సమాచారం ఇచ్చారు. చెప్పినట్లు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి గత ఐదేళ్లలో ఏ పైరవీలు, రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా పింఛన్ డబ్బులు తీసుకున్న పేద లబ్ధిదారులకు మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పట్లో 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాల తరహాలోనే ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్ చేస్తున్నారు. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆపై పింఛన్ తొలగింపు నోటీసులు ఇప్పిస్తున్నారు. తాము చెప్పినట్లు చేయాలని కొన్ని చోట్ల బలవంతంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అర్హతను నిరూపించుకోవడానికి గడువివ్వరా? పేద లబ్ధిదారులు తాము పింఛను పొందేందుకు అర్హులమని నిరూపించుకోవడానికి వీలులేకుండా నోటీసులో అసాధ్యమైన గడువు విధిస్తున్నారు. దివ్యాంగులు తమ శరీర వైకల్యాలను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తాను దివ్యాంగుడిగా నిరూపించుకునే సర్టిఫికెట్లు పొందడానికి ‘సదరం’లో పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి స్లాట్లు విడుదల చేస్తూ అవకాశం ఇస్తుంది. స్లాట్లు విడుదలైన మూడు రోజుల్లోనే 90 రోజులకు సరిపడా పేర్ల నమోదు పూర్తయిపోతోంది. మిగిలిన వారు మళ్లీ మూడు నెలల దాకా ఆగాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ దివ్యాంగుడు ఎన్నో ఏళ్ల క్రితం వైద్య పరీక్షల అనంతరం తన శరీర వైకల్య సర్టిఫికెట్ పొంది, ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకుంటున్న నేపథ్యంలో.. ‘ప్రస్తుతం నువ్వు అర్హత లేకుండా పింఛను పొందుతున్నావు. నీ శరీర వైకల్యాలకు సంబంధించి 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించుకుని, ఆ సర్టిఫికెట్ అధికారులకు అందజేయాలి’ అని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఉద్దేశ పూర్వకంగా అతని పింఛను శాశ్వతంగా తొలగించేందుకు రంగం సిద్ధమైందని ఇట్టే అర్థమవుతోంది. వృద్ధాప్య పింఛను పొందే లబ్ధిదారులకు ఇచ్చే నోటీసుల్లో కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చి, ఆయా లబ్ధిదారుల ఆధార్‌లో మొదటి నుంచీ జరిగిన మార్పులు, చేర్పుల వివరాలతో కూడిన (అప్డేట్ హిస్టరీ ఫామ్) ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని నోటీసులు ఇస్తున్నారు. లేదంటే శాశ్వతంగా పింఛన్ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పింఛను లబ్ధిదారునికి పల్నాడు జిల్లా శావల్యాపురం ఎంపీడీవో జారీ చేసిన నోటీసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో..⇒ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పరిధిలో అక్కడి స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదుల కారణంగా ఆ మండల పరిధిలోని కేవలం 8 గ్రామాల్లో 209 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో షోకాజ్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు. ⇒ విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు 60 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు. ⇒ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయతీలో 13 మంది దివ్యాంగ లబ్ధిదారులపై స్థానిక టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మండలాధికారులు నోటీసు జారీ చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని స్థానిక అధికార పార్టీ నాయకుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నందిగాం మండలం నౌగాం పంచాయతీలో ఎనిమిది మంది దివ్యాంగులతో పాటు ఇద్దరు వృద్ధులు, కవిటి మండలంలో 9 మందికి నోటీసులు జారీ చేశారు. ఆమదాలవలసలో 8 మందికి, సరుబుజ్జిలి మండలం వ్యాసలిపేటలో 9 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలన్న టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు 730 మంది లబ్ధిదారులకు అధికారులు నోటీసులు అందజేశారు. ఒక్కో గ్రామంలో 10 నుంచి 50 మంది దాకా నోటీసులు ఇచ్చారు. కనగానపల్లి మండలం వేపకుంటలో 52 మందికి, భానుకోటలో 40 మందికి, నరసంపల్లిలో 25 మందికి, కోనాపురంలో 26 మందికి నోటీసులు ఇచ్చారు. పార్టీ నేతల కనుసన్నల్లో ‘పింఛన్లు’జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి ప్రభుత్వం జూలైలో తొలిసారి పింఛన్లు పంపిణీ చేసింది. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కొనసాగినా, ప్రతి చోటా పంపిణీ మొత్తం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలోనూ 2014–19 మధ్య వృద్ధులు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల పంపిణీలో ప్రతి అంశంలోనూ అప్పటి అధికార టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం విపరీతంగా కొనసాగిన విషయం తెలిసిందే. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు మొదలు, పంపిణీలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి జోక్యం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకం అమలు కొనసాగిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల పరిస్థితికి పూర్తి భిన్నంగా జూలై, ఆగస్టు నెలలో జరిగిన పింఛన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వెంట ఆ ప్రాంతంలోని స్థానిక అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ ఫొటోలు కూడా దిగారు. కొన్ని ప్రాంతాల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతో పింఛను డబ్బులు ఇవ్వకుండా ఆపేయించారు. పింఛన్ల పంపిణీలో ఆధిపత్యం కోసం పలు ప్రాంతాల్లో కూటమి పార్టీ నాయకులు పరసర్పం గొడవలు కూడా పడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్లు పొందేందుకు అర్హత ప్రమాణాలపై అప్పటి జన్మభూమి కమిటీల పేరుతో తనిఖీలు చేపట్టి లక్షల మంది పింఛన్లకు కోత పెట్టారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో 43.11 లక్షల మంది పింఛనుదారులు ఉన్న పరిస్థితిలో 2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు.. తదితర పదవులకు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు వేశారు. వారి ద్వారా పింఛన్లపై తనిఖీలు చేయించారు. దీంతో సెపె్టంబర్ నాటికి పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా పింఛన్లను తొలగించారు. అప్పట్లో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జన్మభూమి కమిటీ సభ్యులకే ఎక్కువగా భాగస్వామ్యం కల్పించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి పథకం మంజూరులోనూ లబ్ధిదారులు తమ పార్టీ వారా, కాదా అని నిర్ధారించుకుని.. పక్షపాతం చూపేవారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ రద్దు అయిన లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్ పొందిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ల -
పెన్షన్ పంపిణీ కోసం బాబు సర్కార్ తంటాలు..
-
వీడియో: కూటమిలో ఆధిపత్య పోరు.. జనసేన మహిళతో పచ్చ బ్యాచ్ వాగ్వాదం!
సాక్షి, అమరావతి/విజయనగరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పెన్షన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పెన్షన్ పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇదే సమయంలో కూటమి కార్యకర్తల్లో ఆధిపత్య పోరు కూడా కనిపించింది.కాగా, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నేతల్లో చిచ్చు రాజేసింది. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తోక పార్టీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెన్షన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గత ఐదు సంవత్సరాలు ఎటువంటి రాజకీయ రంగు అంటని పెన్షన్ల కార్యక్రమం.. నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పైచేయు కోసం టీడీపీ మరియు జనసేన నాయకుల ముష్టి ఘాతాలుజనసేన వీర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులు. #AndhraPradesh #YSRCP #YSJagan pic.twitter.com/qiVmB5Nvzy— Jagananna Connects (@JaganannaCNCTS) July 1, 2024 టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పెన్షన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పెన్షన్లు అందించారని లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
అన్నమయ్య జిల్లా: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు.ఈరోజు(జూలై 1వ తేదీ) పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ భార్య హరితారెడ్డి.. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతే కాకుండా ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024 -
ఏపీలో మొదలైన పెన్షన్ కష్టాలు (ఫోటోలు)
-
AP Pension: రూ.500 ఇస్తేనే పెన్షన్ ఇస్తా!
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి. (గమనిక: పైన ఫొటోలో పెన్షన్ పంపిణీ చేస్తున్న షేక్ కరిష్మా విజయనగరంలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రంగానే ఆ ఫొటోను వాడటం జరిగింది. కింది ప్రచురితమైన పల్నాడు వార్తకు.. ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం)పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్‌దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్‌ను సస్పెండ్ చేశారు. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంరాజకీయ జోక్యాలుఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంసంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్‌గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!పింఛన్ నగదు చోరీ?వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు. -
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
-
సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది ఫించన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యో గుల ద్వారా ఇంటివద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు జూలై 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేందుకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం చంద్రబాబు తొలి సంతకాలు చేసిన ఐదు ఫైళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి విలేకరులకు వెల్లడించారు. డీఎస్సీ 2024 ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ఇకపై నిరంతర ప్రక్రియగా ఏటా నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)ను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నియామకాల కంటే ముందే టీచర్లకు శిక్షణ డిసెంబర్ 10వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అధ్యయనం చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని నిర్దేశించారు.⇒ ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్ట్ 27 ఆఫ్ 2023) రద్దు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ‘సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారులు అనవసర సమస్యలు సృష్టిస్తారని గుర్తించాం. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వైరుధ్యం ఉంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. భూ యజమానులు ఒరిజినల్ డాక్యుమెంట్‌ను పొందే అవకాశాన్ని కల్పిస్తాం’ అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ⇒ సామాజిక పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ బకాయిలతో కలిపి మొత్తంగా రూ.7 వేలను జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ. 3 వేల నుంచి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ రూ.15 వేలకు, కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. డయాలసిస్, సికిల్‌సెల్ ఎనీమియా, థలసేమియా, హెచ్ఐవీ తదితర బాధితులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.⇒ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 4.4 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. డిమాండ్, సప్లై, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్‌ను అంచనా వేయడం, అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నైపుణ్య సర్వేను 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ⇒ రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. ⇒ విజయవాడలోని డా.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా తిరిగి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈమేరకు నిర్ణయం తీసుకుంది.⇒ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించింది.⇒ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఆరోగ్య పరిరక్షణ ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని, చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేలా కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని పేర్కొన్నారు. రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలిచ్చారు. మత్తు, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. విద్య, ఆరోగ్యం, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.7 శ్వేత పత్రాలుగత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాలని మంత్రి వర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం (ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జూలై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి వీటిని విడుదల చేయనున్నారు. -
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
-
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
-
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్ కో బ్యాచ్ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. -
పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..
-
పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..
-
పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..
-
అవ్వా తాతలపై పచ్చ పగ
-
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
-
దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ
-
కాసేపట్లో ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
పడిగాపులు.. చంద్రబాబుపై పెన్షన్‌దారుల ఆగ్రహం
Live Updates.. చంద్రబాబు కుట్రతో పెన్షన్‌దారులకు అష్టకష్టాలు ►పచ్చబ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరం ►సచివాలయాలకు మంచాల్లో వృద్ధులు, వికలాంగులు ►పెన్షన్ పంపిణీ సజావుగా సాగకుండా పచ్చ కుట్రలు ►ఐదేళ్ల నుంచి ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ►చంద్రబాబు కుట్రలకు ఓటుతోనే జావాబిస్తామంటున్న ప్రజలు కాకినాడ: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ సచివాయాలకు వచ్చి పింఛన్లు అందుకుంటున్న పెన్షన్ దారులు జిల్లా వ్యాప్తంగా 2,83,544 మంది పింఛన్ దారులకు రూ.84.02 కోట్లు మూడు రోజుల పాటు పంపిణీ ► ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం.. ►ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది. ►రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ►ఎన్నికల కోడ్ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. ►తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగిలిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ చేపడతారు. ►ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచివాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ►వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు. ►సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ► పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ► సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ►ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. ►పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిïÙయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి. ►ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్‌ను పాటించాలి. ►సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ లాగిన్లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. -
పెన్షన్ల పంపిణీపై నీచ రాజకీయం
-
పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు
-
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి: సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు’’ అని ఎక్స్ వేదికగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అదే ఎక్స్ లో మరో ట్వీట్ చేసిన జగన్.. ‘‘లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఏపీలో పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు ఇవే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్3 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్న సచివాలయాలు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది. -
పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు
కొండవీటి దొంగలో చిరంజీవిని ఎలాగైనా పట్టుకుంటానని. ఆయన్ను నిలువరిస్తానని ప్రతినబూనిన పోలీస్ ఆఫీసర్ విజయశాంతి ఆయన్ను వెంబడిస్తుంది. చిరంజీవిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరదు.. చివరకు ఆమె పెద్ద బురదగుంటలో పడిపోతుంది.. దీంతో చిరంజీవి వచ్చి నన్ను ఉచ్చులో దించుతామని నువ్వు రొచ్చులో పడ్డావేంటి అంటాడు. అచ్చం ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఐంది. రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జగన్‌ను నిలువరించేందుకు వేసిన వలంటీర్ల ఉచ్చు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాన్నిప్పుడు తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుంది టీడీపీ పరిస్థితి. వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో సీట్లు ప్రకటించిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎటునుంచి చూస్తున్నా ఎక్కడోచోట ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. దానికితోడు టీడీపీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేని చోట్ల తమ వాళ్ళను జనసేనలోకి పంపించి అక్కడ గ్లాసు గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ అలా టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్ళే.. ఇదిలా ఉండగానే తమ కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ వేసిన తప్పటడుగు ఇప్పుడు వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చిన్న గాయాన్ని గోక్కుని... గెలుక్కుని పెద్ద పుండుగా మార్చినట్లు ఐంది. ఇన్నేళ్ళుగా వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఐతే అది ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులమేరకు వాలనీర్లను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం దూరం పెట్టింది. అది సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని, అది తమకు లాభిస్తుందని టీడీపీ క్యాంప్ భావించింది. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళింది. ఫస్ట్ తేదీ వచ్చినా పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి టీడీపీ కారణం... చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నారు. లేకుంటే ఈపాటికి అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతోబాటు ఆ పార్టీ నాయకులూ ప్రచారం మొదలు పెట్టి.. ఈ అంశాన్ని ప్రజలకు వివరించారు. ఇంకేముంది... ప్రజలు.. దాదాపు 67 లక్షలమంది వృద్ధులు.. వికలాంగులు తిట్లు అందుకున్నారు. మా నోటికాడి కూడు ఆపేసారు... లేకుంటే ఈపాటికి మాకు పెన్షన్లు అందేవి.. చంద్రబాబు పెద్ద కుట్రదారు అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ ఎండల్లో వృద్ధులం ఎక్కడికి వెళ్తాం.. మా వాలంటీర్ ఉంటే మాకు చక్కగా పెన్షన్లు అందేవి.. ఈ చంద్రబాబు మాకు పెన్షన్లు ఆపేసాడు.. ఎన్నికల్లో అయన సంగతి చూస్తాం అంటున్నారు. రోజూ ఇంట్లోని రొట్టెముక్కల్ని తినేస్తున్న ఎలకను పట్టుకునేందుకు పిల్లి ఒక ఉచ్చు తయారు చేసింది... అది ఎలక మెడకు వేయబోతే తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో దాన్ని తీసుకోలేక పిల్లి గిలగిలా కొట్టుకుంది... అచ్చం ఇలాగే ఇంటింటికి వలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ తన ఓట్లను సునాయాసంగా ఎత్తుకుపోతున్న సీఎం వైయస్ జగన్‌ను అదుపు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు... వలంటీర్ల కాళ్లకు కర్ర అడ్డం బెట్టి వాళ్ళను పడగొట్టి తాను రేసులో ముందుకు పోదాం అనుకున్నారు... అయితే చంద్రబాబు ఆ కర్రను తన కాళ్ళమధ్య పెట్టుకుని తానే బోర్లా పడినట్లు ఐంది.. దీంతో ఇప్పుడు లేవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇది కాస్తా టీడీపీకి డ్యామేజ్‌గా మారింది. దీంతో ఇప్పుడు బాబు, టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. సచివాలయంలో లక్ష ముప్ఫైవేలమంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్లతో పెన్షన్లు ఇప్పించండి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు జగనొచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయంలోని లక్షా ముప్పైవేల ఉద్యోగులు ఉన్నారుగా వాళ్లతో పెన్షన్లు ఇవ్వండి అని సలహా ఇచ్చేసారు. మొత్తానికి కూటమి కూర్చిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఏదేదో చేసి ప్రభుత్వాన్ని గందరగోళపరుద్దామని భావించి తానే ఉచ్చులో చిక్కుకున్నట్లు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకున్న తాడును తప్పించుకునేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ అంశంలో పవన్ కల్యాణ్... బీజేపీలు సైలెంట్ గా ఉన్నాయ్... చంద్రబాబు చేసిన పెంటను తామెందుకు నెత్తికి రుద్దుకోవాలి అనుకున్నాయో ఏమో మరి ఆ పార్టీలు... దాని నేతలు మాత్రం ఈ అంశాన్ని విననట్లే ఊరుకున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
వలంటీర్లంటేనే వణికిపోతున్న పెత్తందారులు
పోగాలము దాపురించినప్పుడు ఇలాగే చేస్తుంటారు. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి.తెలుగుదేశం పరిస్థితి అలాగే తయారైంది. ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా తాము చేసిన కుట్ర ఫలించాయని తెలుగుదేశం పార్టీ నేతలు లోలోపల సంతోషించవచ్చేమో కాని, అదే వారికి రాజకీయంగా ఉరితాడు కాబోతోంది.వచ్చే రెండు నెలలు వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్ పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.ఇది ఏపీ ప్రజలకు శరాఘాతం వంటిదే. తెలుగుదేశం పార్టీ వలంటీర్ల వ్యవస్థపై నిత్యం విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. టీడీపీకి ఏజెంట్ గా మారిన మాజీ ఐఎఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రయోగించి ఈ మేరకు ఉత్తర్వులు తెప్పించారు. రమేష్ వలంటీర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడమే కాకుండా, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈనాడు రామోజీరావు ఎన్నోసార్లు వలంటీర్ల వ్యవస్థపై విద్వేషం కక్కుతూ వార్తలు రాయించారు. ✍️టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు వలంటీర్లను పలుమార్లు అవమానించారు. వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్లని, ఆడవాళ్లను ఇబ్బందిపెట్టేవారని ఇలా పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లను కిడ్పాపర్లుగా అబివర్ణించారు. ఏపీ ప్రజల పట్ల ఏ మాత్రం మానవత్వం లేనివారు, ప్రజల సంక్షేమం కోరుకోనివారు ,దుర్గార్గులు మాత్రమే ఇలాంటి ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తారు. నిమ్మగడ్డ రమేష్ అలాంటి విలన్ పాత్రను పోషించారని చెప్పాలి. కాకపోతే సినిమాలో విలన్ అంతిమంగా ఓడిపోయినట్లే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకోబోతోంది. రమేష్ కుమార్ ఆ పార్టీకి మేలు చేయాలనుకుని ఉండవచ్చుకాని జరగబోయేది కీడే అన్న సంగతి ఇప్పుడు బోదపడుతుంంది. ఈ విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఏకంగా ఏభైవేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తానని అబద్దపు హామీని కూడా ఇచ్చేశారు. ఇళ్త వద్దకే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారు. ✍️మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తమ వర్గం మీడియాను, ఇంకో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి ప్రజా వ్యతిరేకులను ఉపయోగించి వలంటీర్ల వ్యవస్థపై కేసులు వేయించారు.నీచమైన కధనాలు రాయించారు. దీనికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం ఆరంభించారు. అందుకు ప్రాతిపదికగా 2019 లో మొదటి దశలోనే ఎన్నికలు అంటే ఏప్రిల్ పదకుండు కల్లా ఎన్నికలు ముగియగా,ఈసారి అలాకాకుండా ఎన్నికలను నాలుగోదశకు మార్పించడంలో చంద్రబాబు బృందం సఫలం అయింది. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిలో గొడవలను సర్దుబాటు చేసుకోవడం కోసమే ఈ ఏర్పాటు అన్న అభిప్రాయం ఏర్పడింది.అలాగే ఐటి,సీబీఐ వంటి అదికారులు రంగప్రవేశం చేసి తమ వద్ద ఉండే నల్లధనం పట్టుబడకుండా జాగ్రత్తలు పడ్డారనుకోవాలి. అవి చాలవన్నట్లు ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై కాటు వేశారు.ఈ మూడు నెలలు వలంటీర్ల సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు. ✍️కాని దీనివల్ల వారికి ఈ ఆదేశమే యమపాశంగా మారబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని చెప్పడం వల్ల సకాలంలో వృద్దులకు పెన్షన్ అందే అవకాశం ఉండదు.దీనిపై ప్రజలలో నిరసన వస్తుంది.ఇప్పటికే ఆ నిరసనలను టీడీపీ చవిచూస్తోంది. ఇదంతా తెలుగుదేశం నిర్వాకమని తెలుసుకోవడం కష్టం కాదు. అప్పుడు బలహీనవర్గాల ప్రజలంతా, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీముల లబ్దిదారులంతా తెలుగుదేశంపై మరింత ఆగ్రహం చెందుతారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించినా, హైకోర్టు అబిప్రాయపడినా ఇప్పటికిప్పుడు రెండున్నర లక్షలమందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. గ్రామ,వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని అన్నప్పటికీ, వృద్దులంతా ఇబ్బంది పడతారు.దీనికి కారణం ఏమిటని వారు తెలుసుకుని టీడీపీని మరింత అసహ్యించుకుంటారు. వారు పట్టుబట్టి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడే ఆపివేసిన వలంటీర్ల వ్యవస్థను టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తారని జనం భావిస్తారు. ✍️అది టీడీపీకి మరింత శరాఘాతం అవుతుంది.అయితే ఈ ఆదేశాలతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పడానికి యత్నిస్తోంది. అందులో వాస్తవం ఎంతో కొంత ఉందని అనుకోవాలంటే,చంద్రబాబు వెంటనే ఎన్నికల సంఘానికి వలంటీర్ల సేవలను యధావిధిగా కొనసాగించాలని లేఖ రాయాలి. అలా చేస్తారా?చేయరు.పైగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్లు తమ వద్ద ఉన్న సిమ్ కార్డులు,టాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందచేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.దీంతో ఒకరకంగా వలంటీర్లకు స్వేచ్చ లబించవచ్చు.వారు తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలలో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిని లబ్దిదారులంతా ఎందుకు పెన్షన్ రాలేదని అడిగితే ఎటూ టిడిపినే కారణమని చెబుతారు.దానివల్ల ఎవరికి నష్టం జరిగేది ఊహించుకోవచ్చు. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీమ్ ఒకదానిని కేంద్రం అమలులోకి తెచ్చింది. ✍️అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కేంద్రం నుంచి అధికంగా గ్యాస్ సిలిండర్లు వచ్చేలా చేసుకున్నారు.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత కొణిజేటి రోశయ్య ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు కాని, చంద్రబాబు ,టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.పేదలకు గ్యాస్ కనెకక్షన్లు ,సిలిండర్లు ఇస్తుంటే కాంగ్రెస్ వారు అడ్డుకుంటున్నారని ఆరోపించేవారు. దానిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సందర్భంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించేది. కాని దానిని చంద్రబాబు తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. ఆ అంశంతో పోల్చితే వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం చేసిన నిర్వాకం చాలా పెద్దది. దారుణమైనది. ✍️అప్పుడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్ వల్ల కొన్నివేల మంది మాత్రమే ప్రయోజనం పొందేవారు. కాని ఇప్పుడు వలంటీర్ల వల్ల కోట్లాది మంది ప్రజలు సేవలు పొందుతున్నారు. అలాంటి సేవలపై కక్షకట్టి ఆపేశారన్న విమర్శ సహజంగానే టీడీపీ, చంద్రబాబులపై వస్తుంది. దీనిపై ఆత్మరక్షణలో పడే చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వడానికి సతమతం అవుతున్నారు. ఈలోగా అధికార వైఎస్సార్సీపీ ఈ పాయింట్ పై విరుచుకుపడింది. వృద్దులు, బలహీనవర్గాలంటే టిడిపికి గిట్టదని, చంద్రబాబు పెత్తందార్ల ప్రతినిది అని ,అందుకే పేదల పొట్టగొట్టే పని చేశారని ఆరోపించారు. ఏతావాతా టీడీపీకి ముందు నుయ్యి,వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తమకు సంబంధం లేదని అబద్దం చెప్పడానికి యత్నిస్తారు.కాని పలుమార్లు ఆయనతో సమావేశాలు పెట్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయించడం, గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు టీడీపీ మద్దతు ఇవ్వడం వంటి ఘట్టాలు జ్ఞప్తికి వస్తాయి. ✍️నిజానికి వలంటీర్ల వల్ల కేవలం పెన్షన్ లే కాదు..అనేక రకాల ఇతర సేవలు కూడా అందుతున్నాయి. అర్హులైన ప్రజలకు ఏదైనా స్కీము వర్తింప చేయదలిస్తే వలంటీర్ కు చెప్పేవారు. వలంటీర్లు వారినుంచి దరఖాస్తు తీసుకుని గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా తగు ఉత్తర్వులు పొంది,వాటిని లబ్దిదారులకు అందచేస్తుంటారు. ఎవరికి పుట్టిన తేదీ సర్టిఫికెట్, కులం ,ఆదాయం తదితర సర్టిఫికెట్లు అవసరమైనవారికి ఇళ్ల వద్దకే తెచ్చి ఇస్తుంటారు.ఇప్పుడు వాటన్నిటికి బ్రేక్ పడుతుంది.ఇప్పుడే ఆపేసి ప్రజలందరిని ఇబ్బందులకు గురి చేసినవారు ,ఎన్నికల తర్వాత ఏమి చేస్తారో అన్న సందేహం వస్తుంది. ఇవన్ని టీడీపీకి నష్టం చేసే అంశాలే అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభ ఎన్నికల తరుణంలో తెలుగుదేశం పార్టీ తనకు తానే ఉరితాడు పేనుకుని మరీ తన మేడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకోబోతోందన్న భావన కలుగుతుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పెళ్లి రోజునా విధులు నిర్వర్తించిన వాలెంటీర్
-
ఏపీలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ
-
పెన్షన్ల పెంపుతో వృద్ధుల్లో చిరుమందహాసం కనపడుతోంది: రాచమల్లు
-
ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్నారు: లబ్దిదారులు
-
మాకూ ఓ జగన్ కావాలి!
పంపాన వరప్రసాదరావు, వడ్డే బాలశేఖర్ – ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు: పక్క పక్కనే ఉన్న సరిహద్దు గ్రామాల్లో ఎంత తేడా! కూత వేటు దూరంలోని పల్లెలో ప్రతి గడపనూ సంక్షేమం పలకరిస్తుండగా ఆ అదృష్టం తమకు దక్కలేదని ‘తంబి’ నిట్టూరుస్తున్నాడు!! మిట్టపాళెం (ఆంధ్రప్రదేశ్), పున్నియం (తమిళనాడు) గ్రామాలు కలిసే ఉంటాయి కానీ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నందున ప్రజల జీవన ప్రమాణాలు, పొందుతున్న పౌరసేవల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. రైతులను ఆదుకోవడం నుంచి ఆరోగ్య సేవల వరకు..పింఛన్ల నుంచి మహిళా సాధికారత వరకు.. చదువుల నుంచి పౌరసేవల దాకా ప్రతి విషయంలోనూ మన సరిహద్దు గ్రామం మిట్టపాళెంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు వరుసలో నిలబెట్టింది. చెంతనే ఉన్న పల్లెలు కావడంతో ఆ తేడా కళ్లకు కట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. తమ పొరుగు గ్రామంలోని ప్రజలకు అందుతున్న సంక్షేమం, పౌరసేవలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్న తమిళనాడు వాసులు తమకూ జగన్ లాంటి నాయకుడు ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఏపీ – తమిళనాడు సరిహద్దు గ్రామాలను సందర్శించిన ‘సాక్షి’ ప్రతినిధుల బృందం మిట్టపాళెం, పున్నియం వాసులను పలుకరించి క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించింది. అక్కడ తాళం కప్ప.. ఇక్కడ అడిగిందే తడవు తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. కార్యదర్శి కాదు కదా కనీసం అటెండర్ కూడా అక్కడే లేరు. ఎందుకిలా? అని గ్రామస్తులను ఆరా తీయగా కార్యాలయానికి అధికారులు రోజూ రారని సమాధానమిచ్చారు. నెలలో కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటారని, ఏ పని కావాలన్నా 13 కి.మీ. దూరంలో ఉన్న పళ్లిపట్టులోని బ్లాక్ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెప్పారు. ఒకటికి పది సార్లు తిరిగితే కానీ చిన్న పని కూడా జరగదని పున్నియం గ్రామస్తుడు ఆర్.కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న మిట్టపాళెంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటైన గ్రామ సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. అయితే నాలుగేళ్ల క్రితం వరకు వీరు కూడా ఏ పని కావాలన్నా 15 కి.మీ. దూరంలో ఉన్న మండల కేంద్రం నగరి వెళ్లేవారు. నాడు చెప్పులరిగేలా తిరిగినా పనులు జరగని దుస్థితి. ఇప్పుడు గ్రామంలోనే సచివాలయం, ఆర్బీకేల రాకతో వలంటీర్ల ద్వారా గడప వద్దే సేవలన్నీ పొందగలుగుతున్నారు. ఇటీవలే జగనన్న సురక్ష క్యాంపైన్ ద్వారా పైసా ఖర్చు లేకుండా ఏకంగా 456 సేవలు పొందగలిగారు. కుల, ఆదాయ, జనన, మరణ ద్రువీకరణ పత్రాలే కాకుండా వన్ బీ, అడంగల్, మ్యుటేషన్ లాంటి అన్ని రకాల పౌరసేవలను ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురికాకుండా పొందగలుగుతున్నారు. ఆరోగ్యం ఆమడ దూరం.. ఇక్కడ ఇంటికే డాక్టర్ ప్రజారోగ్య పరిరక్షణ విషయానికి వస్తే 6 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున పున్నియం గ్రామంలో ఒక సబ్‌సెంటర్ ఉంది. ఒక ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) అందుబాటులో ఉంటూ బీపీ, షుగర్ లాంటి సాధారణ పరీక్షలు చేసి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందు బిళ్లలు ఇస్తున్నారు. డెంగీ, మలేరియా, వివిధ వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ టెస్ట్‌లు అందుబాటులో లేవు. టెలీ మెడిసిన్ సౌకర్యం లేదు. వైద్యుడి సేవలు పొందాలంటే 13 కి.మీ పైగా దూరంలో ఉండే స్వర్గపేట ప్రభుత్వాస్పతికి వెళ్లాల్సిందే. అదే ఏపీలో 2 వేలకు పైగా జనాభా ఉన్న మిట్టపాళెం పంచాయతీలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన ఎంఎల్‌హెచ్‌పీ, ఒక ఏఎన్ఎంతో పాటు ఆశావర్కర్ ఉన్నారు. ఈ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 వైద్య పరీక్షలు, టెలీమెడిసిన్ సౌకర్యం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బుగ్గ అగ్రహారం పీహెచ్సీ వైద్యుడు నెలకు రెండు సార్లు మిట్టపాళెం గ్రామాన్ని సందర్శిస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉంటున్నారు. బీపీ, షుగర్ బాధితులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలపై ఆరా తీసి అవసరమైన వైద్య సేవలందిస్తున్నారు. మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలు సైతం ఇక్కడ అందుబాటులోకి ఉన్నాయి. మిట్టపాళెం ప్రజలు నాణ్యమైన మెరుగైన వైద్యం కోసం వ్యయ ప్రయాసలకోర్చే పరిస్థితులు లేవు. ► తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియం పంచాయతీ పరిధిలో సామాజిక పింఛన్లతో పాటు ఇటీవలే ప్రారంభించిన కుటుంబానికి ఓ మహిళకు రూ.వెయ్యి ఆర్ధిక సాయం మినహా మరే పథకం ద్వారా సాయం అందడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ► ఏపీలోని మిట్టపాళెం పంచాయతీ పరిధిలో మిట్టపాళెంతో పాటు మిట్టపాళెం ఏఏడబ్ల్యూ (ఆది ఆంధ్రా వాడ), చిన్నతంగల్, మేలపట్టు, మేలపట్టు హెచ్‌డబ్ల్యూ (హరిజనవాడ) గ్రామాలుండగా 2,452 జనాభా నివసిస్తోంది. 930 కుటుంబాలున్నాయి. తమిళనాడులోని పున్నియం పంచాయతీ పరిధిలో పున్నియంతో పాటు నల్లవన్నెంపేట, పున్నియం కాలనీ గ్రామాల్లో 1,850 జనాభా, 450 కుటుంబాలున్నాయి. వాళ్ల మాదిరిగా పేదలమే అయినా.. మేకల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగేళ్లు నోటికెళ్లవు. రేషన్ సరుకులు మినహా ప్రభుత్వ పరంగా మాకెలాంటి సాయం అందడం లేదు. ఈ మధ్యే కుటుంబంలో మహిళకు రూ.1,000 ఇస్తున్నారు. అదీ కూడా అందరికి అందడం లేదు. అదే మిట్టపాళెం వాసులకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోంది. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. వాళ్ల మాదిరిగానే మేము పేదవాళ్లమే. అలాంటి సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుంది. –మణియమ్మ,, నల్లవెన్నంపేట, పున్నియం పంచాయతీ ప్రతి గడపకూ సాయం నాకు 3 ఎకరాల పొలం ఉంది. వరి, పూల తోటను సాగు చేస్తా. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. నాకు రూ.2,750 చొప్పున ప్రతి నెలా పింఛన్ వస్తోంది. నా భార్య జగదాకు చేయూత కింద ఏటా రూ.18,750 ఇస్తున్నారు. ఆసరా రూపంలో ఏటా రూ.10 వేలు జమ చేశారు. నా పెద్ద కుమారుడు మురుగన్‌కు ఇంటి రుణం ఇచ్చారు. కోడలికి అమ్మఒడి, ఆసరా వస్తోంది. గతంలో పథకాలు అందడం అటుంచి ఎలా దరఖాస్తు చేయాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు వలంటీర్లు ఇంటికొచ్చి వివరించి దగ్గరుండి మరీ దరఖాస్తు చేయిస్తున్నారు. ప్రతి గడపకూ సాయం అందుతోంది’. –బాలం రాజలింగం, చిన్నతంగల్, మిట్టపాళెం పంచాయతీ గౌరవంగా చూస్తున్నారు ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తారో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నాం. సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా పథకాల ద్వారా నేను కూడా లబ్ధి పొందా. ఆటో నడిపే నా భర్తకు వాహన మిత్ర వస్తోంది. మా అత్తకు చేయూత, ఆసరా, ఇళ్ల స్థలం వచ్చింది’ –జి.విజయలక్ష్మి, వలంటీర్, చిన్నతంగలి గ్రామం, మిట్టపాళెం పంచాయతీ మారుమూల పల్లెలకు వరం గతంలో పంచాయతీ కార్యదర్శి వారానికో పది రోజులకో ఒకసారి గ్రామానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయేవారు. ఎప్పుడొచ్చేది కూడా ప్రజలకు తెలిసేది కాదు. ఏ పని కావాలన్నా నగరి వెళ్లాల్సిందే. రాజకీయ నేతల సిఫారసులు, చేతులు తడపనిదే పనులయ్యేవి కావు. ఇప్పుడు సచివాలయం వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ పొలిమేర కూడా దాటడం లేదు. ఎలాంటి సిఫార్సులు, పైసా ఖర్చు లేకుండా పౌరసేవలు అందుతున్నాయి. వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుని సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. సచివాలయాలు వలంటీర్ వ్యవస్థలు మారుమూల పల్లెలకు నిజంగా ఓ వరం. –గురువా వినోద్‌కుమార్, మిట్టపాళెం సచివాలయ కన్వీనర్ ఏపీ స్థానికత పొందాలనిపిస్తోంది.. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎన్.మురుగన్ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు బ్లాక్ పరిధిలోని పున్నియం దళితవాడ నివాసి. మన రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం పక్కనే ఆ ఊరు ఉంటుంది. రైతు కూలీ, దివ్యాంగుడైన మురుగన్ రూ.1,200 పింఛన్ అందుకుంటుండగా ఇటీవలే రూ.1,500కి పెరిగింది. బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే పెన్షన్ డబ్బుల కోసం రోజూ ఎదురు చూడాల్సిందే. నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. మురుగన్ కుటుంబానికి సొంతంగా ఇల్లు కానీ ఇంటి స్థలంగానీ లేదు. గ్రామంలో ఎంతో మందిది ఇదే పరిస్థితి.పక్క గ్రామంలో తమలాంటి నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ అండగా నిలుస్తుండటాన్ని చూసినప్పుడు తమ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో సంక్షేమ పథకాలను అమలు చేస్తే బాగుంటుందని మురుగన్ కోరుకుంటున్నాడు. ‘వికలాంగులకు ఏపీలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. మాకు రూ.1,500 మాత్రమే వస్తోంది. ఆ పెన్షన్ సొమ్ము తీసుకోవడానికి కూడా పడిగాపులు కాయాలి. ఇవన్నీ చూసినప్పుడు పక్కనే ఉన్న సరిహద్దు గ్రామంలోకి వెళ్లి ఏపీ స్థానికత పొందాలనిపిస్తోందని చెబుతున్నాడు. చిత్తూరు జిల్లా మిట్టపాళెంలో నిర్మించిన సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాలు సుబ్రహ్మణ్యం సంబరం..! చిత్తూరు జిల్లా నగరి మండలం మిట్టపాళెం వాసి డి.సుబ్రహ్మణ్యం నిరుపేద వర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ.2,750 వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడు. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండడంతో ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం వస్తోంది. ఆయన భార్య హంసకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున జమ అవుతోంది. ఆయన ఇద్దరు పిల్లలకు పక్కా గృహ యోగాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పెద్ద కుమారుడికి భార్య పేరుతో వీకేఆర్ పురం లేఅవుట్లో రూ.3 లక్షల ఖరీదైన స్థలం, ఇంటి నిర్మాణానికి సాయం అందింది. రెండో కుమారుడికి సొంత స్థలంలో ఇంటి నిర్మాణ బిల్లును ప్రభుత్వం మంజూరు చేసింది. ‘నాకు వైఎస్సార్ హయాంలో మంజూరైన పింఛన్‌ను టీడీపీ ప్రభుత్వంలో తీసేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచడమే కాకుండా గతంలో ఎప్పుడూ మా కుటుంబం ఇంత లబ్ధి పొందలేదు’ అని సుబ్రహ్మణ్యం సంతోషంగా చెబుతున్నాడు. కూతవేటు దూరంలో ఎంత తేడా! తమిళనాడులోని సరిహద్దు గ్రామం పున్నియంలో నివసించే మల్లీశ్వరి చిన్నకారు మహిళా రైతు. ఎరువులు, విత్తనాలు కొనాలంటే ఎన్నో అగచాట్లు పడాలి. ఏది కావాలన్నా 13 కి.మీ.దూరంలోని పళ్లిపట్టుకు వెళ్లాల్సిందే. పీఎం కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో ఇచ్చే రూ.6 వేల సాయం మినహా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆమెకు ఎలాంటి పెట్టుబడి సాయం అందదు. ఆ పక్కనే కూతవేటు దూరంలోని మిట్టపాళెం వాసులకు మాత్రం ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు ముంగిటికే అందుతున్నాయి. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. రైతులు గిట్టుబాటు ధరలకు పంటలను విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడుగా నిలుస్తోంది. ఉచిత బీమా, విపత్తులతో నష్టపోతే నష్ట పరిహారాన్ని అందిస్తోంది. ఇవేకాకుండా మహిళలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ‘మిట్టపాళెంలో ఉన్న మా బంధువులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వింటుంటే సంతోషమనిపిస్తుంది. జగన్ పాలన చూస్తుంటే ఒక్కోసారి ఆంధ్రాలో పుట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కాసింత అసూయగానే ఉన్నా పొలం పుట్రా, పిల్లా పాపలను వదిలి వెళ్లలేం కదా’ అని మల్లీశ్వరి అంటోంది. అమ్మ తరపు బంధువుల్లో ఆశ్చర్యం.. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన టీకే తమిళసెల్వి మన రాష్ట్రంలోని సరిహద్దు గ్రామం మిట్టపాళెం నివాసి. నలుగురు సంతానం. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 తమిళసెల్వి బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. డిగ్రీ చదువుతున్న ఆమె కుమారుడికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుతున్నాయి. ఆమె భర్త వెంకటేష్‌కు రెండేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ౖబైపాస్ సర్జరీ జరిగింది. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. ఆమె కుటుంబానికి వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా రూ.13,500 ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేలోనే తీసుకుంటున్నారు. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి సీఎం జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. మా అమ్మ తరపు బంధువులంతా తమిళనాడులోనే ఉన్నారు. మాకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి గురించి చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారు. తమ పిల్లలకు ఆంధ్రాలో పెళ్లి సంబంధాలు చూడాలని కోరుతున్నారు’ అని తమిళ సెల్వి చెబుతోంది. -
రాష్ట్రంలో వయోవృద్ధులకు భరోసా ఇస్తున్న సీఎం జగన్..
-
ఠంచన్ గా పింఛన్..రాష్ట్రంలో వెల్లువలా పింఛన్ల పంపిణీ
-
1వ తేదీ వచ్చిందంటే చాలు పెన్షన్ దారుల్లో పండగ వాతావరణం
-
లోకేష్ చేపట్టింది యువ గళం పాదయాత్ర కాదు.. యమ గళం
-
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 62.99 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1, 735.36 కోట్లు విడుదల చేయగా, ఈరోజు(శనివారం) ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 11.00 ని.ల వరకూ 66.11 శాతం పెన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్లు. -
AP: పింఛన్ల పండగ.. తెల్లవారుజామునుంచే పంపిణీ మొదలుపెట్టిన వాలంటీర్లు
-
తొలిరోజు 88.59% పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/తాడికొండ: రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 88.59 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజూము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం 62,31,221 మందికి పింఛన్ల కోసం రూ.1,584.86 కోట్లు కేటాయించింది. మొదటి రోజు 55,20,026 మందికి రూ.1,403.70 కోట్లు అందించారు.. రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు కూడా.. అమరావతి రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం అందజేసే పింఛన్లను కూడా గురువారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. తుళ్లూరు మండలంలో 16,200 మంది లబ్ధిదారులకుగాను తొలిరోజు 12,423 మందికి (76.69 శాతం మందికి) వలంటీర్లు పింఛను డబ్బు అందజేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో తొమ్మిది గ్రామాల్లో 5,796 మందికిగాను 5,400 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని పేదలు మొత్తం 17,173 మందికి ఇప్పటివరకు వారి బ్యాంకు ఖాతాల్లో సీఆర్డీఏ ద్వారా పింఛను డబ్బు జమచేసేవారు. -
ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,584.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.89 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 48.53 లక్షల మందికి రూ.1233.96 కోట్లు అందజేశారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఐదు రోజుల్లోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. చదవండి: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ -
97.86% పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. మొత్తంమ్మీద గత నాలుగు రోజులుగా 60,98,340 మంది లబ్ధిదారులకు రూ.1,550.59 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 97.86 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని సెర్ప్ అధికారులు ఆదివారం తెలిపారు. మిగతా వారి కోసం సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
ఏపీలో పెన్షన్ల పండుగ
-
61.03 లక్షల మందికి రూ.1,551 కోట్లు పింఛన్లు పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.1,551.70 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. బుధవారం సాయంత్రం వరకు 61,03,930 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని.. సోమ, మంగళ, బుధవారాల్లో కలిపి ఇప్పటిదాకా 97.20 శాతం మందికి పంపిణీ చేసినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం మరో రెండు రోజుల పాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వలంటీర్లు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా.. పొదలకూరు/ఒంగోలు సబర్బన్: సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రభుత్వం కులం, మతం, రాజకీయం చూడదని సీఎం వైఎస్ జగన్ ప్రకటన పదే పదే వందల వేల ఘటనల్లో నిరూపితమవుతూనే ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు సమీపంలోని మర్రిపల్లికి చెందిన వెంపులూరు పుల్లయ్యగౌడ్(80) పాతికేళ్లు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మండలపార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కార్యవర్గసభ్యునిగా పనిచేశారు. వృద్ధాప్య కారణాల రీత్యా ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఆయన సతీమణి రమణమ్మ(75) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు. గ్రామ వైఎస్సార్సీపీ నేతలు వారి ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వృద్ధాప్య పింఛన్‌ను డయాలసిస్ పింఛన్‌గా మార్పించారు. బుధవారం ఆమెకు రూ.10 వేలు అందజేశారు. అలాగే, టీడీపీ మహిళా నేతకు వితంతు పింఛన్ అందించిన ఘటన ఒంగోలులో జరిగింది. ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 31వ డివిజన్లో టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వల్లెపు తిరుపతమ్మకు ఆమెపై పోటీచేసి విజయం సాధించిన వైఎస్సార్సీపీకి చెందిన నాగజ్యోతి నాగేశ్వరరావు పింఛన్ అర్హత కార్డుతో పాటు రూ.2,500 పింఛన్‌ను అందజేశారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతనంగా పింఛన్లు పొందిన వారికి నగదు అందజేశారు. -
ఒక్కరోజే రూ.1,383.34 కోట్ల పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/టెక్కలి/నందిగాం/నాయుడుపేట టౌన్: రాష్ట్రంలో అవ్వాతాతలతోపాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు తదితరులకు ప్రభుత్వం సోమవారం ఒక్క రోజే రూ.1,383.34 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఆగస్టులో 62.79 లక్షల మందికి పంపిణీ చేసేందుకు రూ.1,596.77 కోట్ల మొత్తాన్ని శనివారం నాడే అన్ని గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 3,10,222 మందికి ప్రభుత్వం కొత్తగా ఈ నెల నుంచే పింఛన్లు మంజూరు చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మొదటి రోజు ఆగస్టు 1నే 54,45,798 మందికి పింఛన్ నగదు అందజేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు పంపిణీ చేశారు. కాగా, తొలిరోజు 86.72 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. మరో నాలుగు రోజుల పాటు పంపిణీ కొనసాగుతుందని బూడి ముత్యాల నాయుడు తెలిపారు. టీడీపీ మాజీ సర్పంచ్‌కు పింఛన్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీలో టీడీపీ మాజీ సర్పంచ్ రాములమ్మకు వితంతు పింఛన్ మంజూరైంది. ప్రభుత్వ పారదర్శకతకు ఇదో నిదర్శనమని స్థానికులంటున్నారు. ఆమె సర్పంచ్‌గా ఉన్నప్పుడు భర్త మరణించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పింఛన్ మంజూరు కాలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాములమ్మకు పింఛన్ మంజూరు చేశారు. ఈ మేరకు సర్పంచ్ గుజ్జు మోహన్‌రెడ్డి చేతుల మీదుగా> ఆమెకు పింఛన్ అందజేశారు. 94 ఏళ్ల వయసులో పింఛన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన అక్కరపాక లక్ష్మమ్మకు 94 ఏళ్లు. ఆమె భర్త చనిపోయి చాలా ఏళ్లయింది. పింఛను కోసం గతంలో చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని లక్ష్మమ్మ చెబుతోంది. ఇక ఎప్పటికీ రాదనుకున్నానని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటికే పింఛను వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక పాలనకు నిదర్శనం శ్రీకాకుళం జిల్లా నందిగాంకు చెందిన ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహి టీడీపీ మండల అధ్యక్షుడిగా, కో ఆప్షన్ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వృద్ధాప్య పింఛన్‌కు అర్హత పొందడంతో ప్రభుత్వం ఆయనకు పింఛన్ మంజూరు చేసింది. స్థానిక సచివాలయం వద్ద ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఆయన పింఛన్ అందుకున్నారు. ఆ ఆనందంలో సీఎం జగన్ చిత్రపటానికి పాణిగ్రాహి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. -
62.79 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 62,79,486 మంది లబ్ధిదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి వైఎస్సార్ పింఛన్ కానుక కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్మును అందజేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడానికి 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, ఆర్బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. -
Andhra Pradesh: పింఛన్ల పంపిణీలో కొత్త రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈసారి కొత్తగా మరో 3,10,222 మంది పింఛను అందుకోనున్నారు. దీంతో వచ్చే ఒకటో తేదీన (ఆగస్టు 1న) పింఛన్లు అందుకొనే వారి సంఖ్య 62,79,486కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 43 నుంచి 44 లక్షల మందికే పింఛన్లు అందేవి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవ్వా తాతలతో పాటు ఇతరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో పింఛనుదారులలో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. అమానవీయమైన ఈ విధానానికి సీఎం జగన్ స్వస్తి పలికారు. సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతోంది. పైగా, పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయి. ఇప్పటికే పింఛను అందుకుంటున్న వారితో పాటు కొత్త వారికి కూడా వలంటీర్లు వారున్న చోటుకే వెళ్లి డబ్బు పంపిణీ చేస్తారు. కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రం, పింఛను కార్డు, పాస్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. రెండు రోజుల ముందే రూ.1,596.77 కోట్లు విడుదల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే పింఛన్ల డబ్బు రూ.1,596.77 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. 31వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రెండు రోజుల ముందు శనివారమే ఆ డబ్బు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతలో జమ చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అధిక శాతం సచివాలయ బాధ్యులు ఆ డబ్బును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందజేసినట్టు అధికారులు వివరించారు. -
58.04 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీ రెండో రోజుకు 95.90% పూర్తయింది. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలలో ప్రభుత్వం 60.52 లక్షల మందికి రూ.1537.68 కోట్లు విడుదల చేయగా.. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 58,04,471 మంది చేతికి రూ.1474.34 కోట్లు చేరాయి. మిగిలిపోయిన వారి కోసం మంగళవారం వరకూ వలంటీర్ల ద్వారా పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. బెంగళూరుకు వెళ్లి మరీ పింఛన్ పంపిణీ సదుం: చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లె సచివాలయం పరిధిలోని జోగివారిపల్లెకు చెందిన జగన్నాథరెడ్డి ఇటీవలే కంటి ఆపరేషన్ చేయించుకుని బెంగళూరులో ఉంటున్నారు. వలంటీర్ గణపతి శనివారం సుమారు 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆయనకు వృద్ధాప్య పింఛన్ అందించాడు. -
1వ తేదీనే రూ.1,335.78 కోట్ల పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారులకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 52,61,143 మందికి రూ. 1,335.78 కోట్లను అందజేశారు. మొదటిరోజే 86.92% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో మరో నాలుగు రోజులు పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా తారువలో వృద్ధులకు పింఛన్లు అందజేశారు. ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ కడప రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు పింఛను అందజేశారు వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన వలంటీరు గాయత్రి. కడప నగరంలోని ఎస్ఎఫ్సీ స్ట్రీట్‌కు చెందిన శ్రీదేవి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు గాయత్రి ఆస్పత్రికి వెళ్లి శ్రీదేవికి పింఛను అందజేశారు. దీంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన శ్రీదేవి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుయాలో చికిత్స పొందుతున్న వృద్ధుడికి.. చంద్రగిరి: చంద్రగిరి మండలం ఐతేపల్లికి చెందిన వృద్ధుడు నాగయ్య అనారోగ్యంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ ఫాజిలా, వలంటీర్ స్వర్ణ రుయా ఆస్పత్రికి వెళ్లి నాగయ్యకు పింఛను డబ్బు అందజేశారు. -
96.11 శాతం మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 60.75 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 58,39,005 మందికి రూ.1484.77 కోట్లు పంపిణీ చేశారు. 96.11% మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు.. మరో మూడు రోజుల పాటు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
54.69 లక్షల మందికి తొలిరోజే పింఛను
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: ఎండలు మండుతున్నా అవ్వాతాతలకు చిన్న కష్టం కూడా తెలియకుండా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. జూన్ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,75, 256 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,543.80 కోట్లను విడుదల చేసింది. ఒకటో తేదీనే 90.02 శాతం మందికి డబ్బుల పంపిణీ పూర్తయింది. ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంలో 53,69,548 మందికి రూ.1,364.53 కోట్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లాలో పలు మండలాల్లో ఇంటర్నెట్ వసతి లేని కారణంగా మరో లక్షమంది వరకు లబ్ధిదారుల నుంచి ఆఫ్‌లైన్ విధానంలో వేలిముద్ర లేదా సంతకం తీసుకుని పింఛన్లు పంపిణీ చేసినట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో మొత్తం 54.69 లక్షల మందికి రూ.1,390.53 కోట్లను తొలిరోజే పంపిణీ చేసినట్లు చెప్పారు. మరో నాలుగు రోజులు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని క్యాంప్ కార్యాలయంలో వెల్లడించారు. స్వయంగా పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం జరిగిన నేపథ్యంలో గత నెల 24వ తేదీ నుంచి ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. కొన్ని మండలాల్లో మాత్రం ఈ సేవల్ని పునరుద్ధరించారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపేసిన మండలాల్లో పెన్షన్‌దారులకు, రేషన్‌దారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెన్షన్‌కు, రేషన్‌కు బయోమెట్రిక్ అవసరం లేకుండా లబ్ధిదారుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రేషన్‌ను అందజేశారు. -
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
-
96.35 శాతం మందికి అందిన పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండురోజుల్లో ప్రభుత్వం 96.35% మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పూర్తిచేసింది. 58,65,578 మందికి వలంటీర్లు రూ.1,490.58 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలకు మొత్తం 60,87,942 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,547.17 కోట్లు విడుదలకాగా.. ఆదివారమే 53.26 లక్షల మందికి పంపిణీ పూర్తిచేసిన విషయం తెలిసిందే. మరో మూడురోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి డబ్బులు పంపిణీచేసే కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. రాయచూర్ వెళ్లి పింఛను పంపిణీ ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బృందావనం తండాకు చెందిన వలంటీర్ రామావత్ రమేష్‌నాయక్ తన క్లస్టర్ పరిధిలోని ఇద్దరు పెన్షన్‌దారులకు సోమవారం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వెళ్లి పెన్షన్ అందించారు. బృందావనం తండాకు చెందిన బాణావత్ ప్రసాద్‌నాయక్, పాత్లావత్ ఠాగూర్‌నాయక్ పట్టాలు అద్దెకు ఇచ్చి జీవనం సాగించేందుకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు వెళ్లారు. దీంతో 2నెలల నుంచి వారికి వస్తున్న వృద్ధాప్య పింఛన్ తీసుకోలేకపోయారు. వృద్ధాప్యం కారణంగా వారు రాలేకపోయారన్న విషయం తెలుసుకున్న వలంటీర్ రమేష్‌నాయక్ రాయచూర్ వెళ్లి పింఛన్ అందజేశారు. -
సెలవైనా.. ఠంచన్‌గా పింఛన్!
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: మహాశివరాత్రి పండుగ రోజున కూడా రాష్ట్రంలో సగంమందికి ఠంచన్‌గా పింఛన్ డబ్బులు చేరాయి. వలంటీర్లు తమ ఇంటిలో పండుగను కూడా పక్కన పెట్టి తెల్లవారుజామునుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61,25,228 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా వీరికి ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రభుత్వం రూ.1,557.06 కోట్లను విడుదల చేసింది. పండుగ, సెలవు రోజైనా 30,67,436 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వలంటీర్లు మంగళవారం పింఛన్ డబ్బులు అందజేశారు. దీంతో రూ.779.15 కోట్లు లబ్ధిదారుల చేతికి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 50.08 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి కాగా, మరో 4 రోజులు కూడా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 78 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. నెల్లూరు, విశాఖ, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో 50 శాతానికి పైనే పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. శభాష్ వలంటీర్స్... పండుగ పూట కూడా విధులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ వలంటీర్ డీవీ సుబ్బారెడ్డికి ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది. మంగళవారం 1వ తేదీ కావడంతో పింఛన్ లబ్ధిదారులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఓ ఆటోను అద్దెకు తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి తెల్లవారుజామునే పింఛన్ అందించాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వల్లివేడు గ్రామానికి చెందిన కోటపాటి చంద్రయ్యకు వలంటీర్ సుభాషిణి తన సొంత ఖర్చులతో 55 కి.మీ. దూరం వెళ్లి పింఛన్ అందజేసింది. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు బంకు సంధాన్ తిరుపతిలో మోకాళ్ల ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్నాడు. వలంటీర్ నాగూర్‌బాషా మంగళవారం తిరుపతికి వెళ్లి ఆసుపత్రిలో ఉన్న సంధాన్కు పింఛన్ అందించాడు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరుకండ్రిగకు చెందిన సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి, రాజమ్మలు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వలంటీర్ కుసుమ తన పరిధిలో ఉన్న లబ్ధిదారులకు వైఎస్సార్ పెన్షన్ కానుకను మంగళవారం ఉదయం 7 గంటలకే అందజేసి అనంతరం తిరుపతి బర్డ్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ కృష్ణవేణి, రాజమ్మ, సుబ్రమణ్యంలకు 10 గంటలకు పింఛను అందజేసింది. అటు పెళ్లి వేడుక.. ఇటు పింఛన్ల పంపిణీ వివాహమైన మర్నాడే రిసెప్షన్లో బిజీగా ఉండీ కూడా తన బాధ్యత మరువలేదు ఆ వలంటీర్. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ సచివాలయం–2లో పనిచేస్తున్న గ్రామ వలంటీర్ తిరివీధుల బాలగంగాధర్‌కు సోమవారం వివాహమైంది. ఇంటి నిండా బంధుమిత్రులతో సందడిగా ఉన్నప్పటికీ మంగళవారం నవ దంపతులిద్దరూ కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు. -
పండుగైనా, సెలవైనా పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: ఈ నెల మొదటి తేదీ మహాశివరాత్రి పర్వదినం. అదీగాక మంగళవారం ప్రభుత్వ సెలవు దినం. అయినా అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,25,228 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,557.06 కోట్లు విడుదల చేసింది. సోమవారం సాయంత్రానికే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేసే కార్యక్రమం పూర్తయినట్టు సెర్ప్ అధికారులు చెప్పారు. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్ అందించే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్ పింఛన్లు 50.75 శాతం పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం తొలిరోజు 50.75 మేర పూర్తయింది. రాష్ట్రంలో 61.51 లక్షల మందికిపైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.73 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సాంకేతిక కారణాలతో బ్యాంకుల నుంచి నగదు విడుదల ఆలస్యమైంది. దీంతో తొలిరోజు పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయలేకపోయారు. గతనెల వరకు పెన్షన్ నిధులను సీఎఫ్ఎంఎస్ ద్వారా బదిలీ చేయడంతో కేవలం మూడు నుంచి ఐదుగంటల్లో ఆ నిధులు సచివాలయ ఖాతాలకు చేరేవి. కానీ ఈ నెలలో సీఎఫ్ఎంఎస్ విధానానికి బదులు పీఎఫ్ఎంఎస్ విధానంలో బదిలీ చేయడంతో బ్యాంకుల నుంచి నిధుల బదిలీకి 16 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దీంతో మంగళవారం 31,22,227 మంది లబ్ధిదారులకు రూ.793.82 కోట్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి వచ్చేనెల నుంచి నిధుల బదిలీ ఆలస్యం కాకుండా చూస్తామని బ్యాంకులు ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు సమాచారం. కోమాలో ఉన్న వ్యక్తికి పింఛను కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లబ్ధిదారు వద్దకు వెళ్లి కుటుంబసభ్యులకు పింఛను అందజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామ వలంటీరు మస్తానమ్మ. గ్రామానికి చెందిన శేషయ్య ఆరోగ్యం సరిగా లేక కోమాలోకి వెళ్లాడు. అతడికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు మస్తానమ్మ నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కోమాలో ఉన్న శేషయ్య వేలిముద్రలు తీసుకుని ఆయన కుటుంబసభ్యులకు పింఛను నగదు అందజేశారు. పక్క రాష్ట్రానికి వెళ్లి పంపిణీ చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ సర్కిల్ సచివాలయం 26వ వార్డు వలంటీర్ నాగూర్‌బాబు తన పరిధిలోని పింఛనుదారుకు తమిళనాడు వెళ్లి మరీ డబ్బు అందజేశారు. ఆ వార్డు క్లస్టర్ పరిధిలోని మహేశ్వరి అనారోగ్యంతో తమిళనాడులోని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ 80 కిలోమీటర్ల దూరంలోని తిరువళ్లూరు వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న మహేశ్వరి సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్న తమ్మినేని సీతారాం
-
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62 లక్షల మందికి పెన్షన్లు
-
59.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినా ఆదివారం కూడా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60.81 లక్షల మందికి పింఛను డబ్బులు విడుదల చేయగా.. తొలి 3 రోజుల్లో 59,31,526 మంది (97.53 శాతం) లబ్ధిదారులకు రూ.1,385.16 కోట్లను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా సోమ, మంగళవారాల్లో వారి ఇళ్ల వద్దే వలంటీర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. -
విశాఖలో కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
-
ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
-
శభాష్ వలంటీర్లు: రాష్ట్రాలను దాటి మరీ పింఛన్ల పంపిణీ
ఓడీ చెరువు/ మడకశిర రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఇంటికే నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పింఛన్‌దారులు ఇంట్లో ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరీ ఇస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ నగదు వారి చేయికి అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు పింఛన్ అందజేసి వలంటీర్ ప్రశంసలు అందుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గోవిందమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మూడు నెలల నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో పింఛన్ పొందలేకపోయింది. మంగళవారం వలంటీర్ సురేశ్‌బాబు సొంత ఖర్చులతో బెంగళూరు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని 3 నెలల పింఛన్ రూ.6,750 అందజేశాడు. మడకశిర మండలం వైబీహళ్లి సచివాలయం పరిధిలోని గ్రామ వలంటీర్ హనుమంతేగౌడ్ తెలంగాణకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న దివ్యాంగురాలు లక్ష్మీదేవికి మంగళవారం మూడు నెలల పింఛన్ డబ్బు అందించారు. హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయం కళాశాలలో లక్ష్మీదేవి డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఆమె రెండు నెలల పింఛన్ తీసుకోలేదు. ఇది తెలుసుకున్న వలంటీర్ వెళ్లి పింఛన్ డబ్బు అందజేసినట్లు కార్యదర్శి పెద్దన్న తెలిపారు. -
మహాయజ్ఞంలా సాగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
-
ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్తవరవడి
-
కొత్తగా మరో 29,961 మందికి పింఛను
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మరో 29,961 మంది పేదలకు ప్రభుత్వం కొత్తగా ఈ నెలలో పింఛన్లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 1,726 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.10 వేల చొప్పున, మరో 28,235 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు సాధారణ పింఛన్లను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. వీరందరికీ జూన్ ఒకటో తేదీ నుంచే అధికారులు పింఛను డబ్బులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి జూన్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61,46,908 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకు రూ.1,497.63 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బయో మెట్రిక్ విధానంలో డబ్బులు పంపిణీ చేయనున్నారు. చదవండి: పేదలకు పెద్ద వైద్యం -
సిక్కోలు నుంచి హైదరాబాద్ వెళ్లి..
శ్రీకాకుళం పాతబస్టాండ్: అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ లబ్ధిదారుకు వలంటీర్ ఆసరాగా నిలిచాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లిమరీ ఆమెకు పింఛన్ నగదు అందించి నిబద్ధతను చాటుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెందిన వితంతువు ముక్క అప్పలనర్సమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వలంటీర్ దూబ రాజశేఖరరావు శుక్రవారం బయలుదేరి శనివారం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి చేరుకుని ఆమెకు మూడు నెలల పింఛన్ మొత్తం రూ.6,750 అందించాడు. వలంటీర్ చిత్తశుద్ధిని డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ అభినందించారు. -
తొలిరోజే 92.59% మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పింఛన్ల పంపిణీ కార్యాక్రమం కోలాహలంగా కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ప్రస్తుత నెలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 61,12,784 మందికి రూ.1,472.95 కోట్ల మేర పింఛను డబ్బులు విడుదల చేయగా.. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు 56,59,585 మందికి రూ.1,355.63 కోట్లు పంపిణీ చేశారు. తొలిరోజు 92.59% పంపిణీ పూర్తయింది. శుక్ర, శనివారాల్లో కూడా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కొనసాగనుంది. వివిధ కారణాల వల్ల గత రెండు మూడు నెలలుగా పింఛన్లు తీసుకోని వారికి బకాయిలతో కలిపి పంపిణీ చేశారు. 1,65,872 మందికి ఒక నెల బకాయితో కలిపి, 15,814 మందికి రెండు నెలల బకాయిలతో కలిపి ఈ నెల డబ్బులను అందజేశారు. ఐదుగురికి మూడు నెలలు, ఇద్దరికి నాలుగు నెలల బకాయిలు కూడా కలిపి పంపిణీ చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. దీక్షగా పంపిణీ.. వలంటీర్లు తెల్లవారుజామునే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. చికిత్స పొందుతున్న వారికి ఆస్పత్రులకే వెళ్లి సొమ్ము అందజేశారు. తన పెళ్లి ముహూర్తం సమీపిస్తున్నా.. పింఛను పంపిణీ చేసి మరీ వివాహ వేదికకు వెళ్లారు ఒక వలంటీరు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ.. పింఛన్ల పంపిణీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు మరో వలంటీరు. -
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
-
ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం
-
ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్థం
-
పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు..
సాక్షి, మహబూబ్‌నగర్ / వనపర్తి: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. నేడు రాష్ట్రంలో అత్యధికంగా 3,018 కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వనపర్తిలో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడమే కాక.. జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఓ పెన్షన్ పంపిణీదారుడి వల్ల చిన్నంబావి జోన్లో పది రోజుల వ్యవధిలో ఏకంగా 100 మందికి కరోనా సోకినట్లు సమాచారం. వివరాలు.. సుమారు పది రోజుల క్రితం గ్రామస్తులకు పెన్షన్ పంపిణీ చేయడం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఒక పోస్ట్‌మ్యాన్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని కలిసిన వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత వారు కలిసిన వారు వైరస్ బారిన పడ్డారు.(చదవండి: తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు) ప్రస్తుతం ఈ కేసులు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారాయి. పోస్ట్‌మ్యాన్‌ని కలిసిన వారిని గుర్తించి.. ఆ తర్వాత వారు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో మెగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ డ్రైవ్ ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోమ్ క్వారంటైన్‌తో పాటు లాక్డౌన్ పాటిస్తున్నారు. బుధవారం నాటికి వనపర్తిలో 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలో గత వారం రోజుల్లో 337 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. -
ఒక్కరోజే 97శాతం మందికి పింఛన్
సాక్షి, అమరావతి: ఆగస్టు1వ తేదీ రాగానే మళ్లీ 59,01,280 మంది అవ్వాతాతలకు ఠంచన్‌గా పింఛన్ సొమ్ములు చేతికి అందాయి. వలంటీర్లు శనివారం ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ అందజేశారు. ► పలు జిల్లాల్లో వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించారు. ► 97 శాతం మంది లబ్ధిదారులకు ఆగస్టు 1నే పింఛన్ చేతికి అందింది. ► ఈ నెల ప్రభుత్వం పింఛనుదారుల కోసం రూ.1,478.89 కోట్లు విడుదల చేయగా శనివారం రాత్రి 8 గంటల సమయానికి రూ.1,411.38 కోట్లు పంపిణీ పూర్తయింది. ► గత నెల వరకు పేద బ్రాహ్మణులు, కళాకారులు బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛన్లు అందుకుంటుండగా ఈ నెల వలంటీర్లు వారి ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. ► కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫొటోలను తీసుకుని వలంటీర్లు నగదు అందజేశారు. ► శనివారం విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో అత్యధిక శాతం పింఛన్ల పంపిణీ పూర్తవగా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యల్ప శాతం పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ► లాక్డౌన్, తదితర కారణాల వల్ల గతంలో రెండు నుంచి ఆరు నెలలపాటు పింఛన్ తీసుకోని 1,21,895 మందికి పాత బకాయిలతో కలిపి పింఛన్లు అందించారు. -
పంజాబ్‌లో పెన్షన్ స్కామ్ కలకలం
చండీగఢ్ : నెల తిరిగేసరికి వచ్చే కొద్దిపాటి మొత్తం కోసం వృద్ధులు మూడునెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో 65 ఏళ్ల మహిళ గుర్తెజ్ కౌర్ 750 రూపాయల పెన్షన్ కోసం ప్రతిరోజూ బ్యాంక్‌కు వెళుతున్నారు. తన కుటుంబానికి తానే పెద్దదిక్కని తమకు ఈ కొద్దిపాటి పెన్షనే ఆధారమని, మే నుంచి పెన్షన్ ఎందుకు జమకావడం లేదో అర్ధం కావడం లేదని వాపోయారు. ఇలాంటి వేలాది మంది లబ్ధిదారులకు కొద్దినెలలుగా పెన్షన్ సొమ్ము నిలిచిపోయింది. అర్హులకు దక్కాల్సిన పెన్షన్ సొమ్ము అడ్డదారిలో అనర్హులకు చేరడం పంజాబ్‌లో కలకలం రేపింది. 70,000 మందికి పైగా నకిలీ పెన్షన్‌దారులు 162.35 కోట్ల రూపాయల పెన్షన్‌ను పొందడంతో అర్హులకు దక్కాల్సిన ఆసరా లభించలేదు. అక్రమ లబ్ధిదారులను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం వారికి విడుదలైన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసినా రికవరీ పూర్తయి ఆ మొత్తం అర్హుల ఖాతాల్లో చేరేందుకు నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 2015లో వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు మహిళలకు 58 ఏళ్లు, పురుషులకు 65 సంవత్సరాల కనీస వయసును నిర్ధారించడంతో వేల సంఖ్యలో పలువురు నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని అధికారులు గుర్తించారు. ఒంటరి, వికలాంగ పెన్షన్లకూ అనర్హులు నకిలీ పత్రాలతో లబ్ధిదారులుగా మారారని తెలిపారు. సంగ్రూర్, బఠిండా, అమృత్సర్, ముక్త్సర్, మన్సా జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అక్రమ లబ్ధిదారులున్నారని అధికారులు వెల్లడించారు. చదవండి : ఓ వీల్‌చెయిర్ విజయం ఇక అక్రమ లబ్ధిదారుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీకి జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఉత్తర్వులతో 70,000కు పైగా కుటుంబాలు పెన్షన్‌ను కోల్పోతాయని అకాలీదళ్ ప్రతినిధి డాక్టర్ దల్జీత్ చీమా అన్నారు. ఈ ఉత్తర్వులు అమానవీయమైనవని అకాలీదళ్ పేర్కొనగా, అనర్హులకు పెన్షన్ మంజూరు చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఆప్ డిమాండ్ చేసింది. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వమే అక్రమ లబ్ధిదారులకు సాయపడిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందే జాబితాలో చేర్చిందని చెప్పారు. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంలో ఎంపికైన అక్రమ లబ్ధిదారులను తొలగించిందని తెలిపారు. -
కొత్తగా పింఛన్ అందుకున్న1,15,269 మంది
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బుధవారం కొత్తగా 1,15,269 మంది పింఛన్ డబ్బులు అందుకున్నారు. దీంతో మొత్తంగా 59.03 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్ డబ్బులను అందజేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయం నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దేకే వెళ్లి పింఛన్ డబ్బులు అందజేశారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు. ► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. ► లాక్డౌన్ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. ► కాగా, జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. -
తిరుపతిలో పెన్షన్లు అందజేత
-
పెన్షన్ లు అందిస్తున్న వాలంటీర్లు
-
ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం
-
ముందుగానే 3 నెలల పింఛను
న్యూఢిల్లీ: కరోనా ‘లాక్డౌన్’ నేపథ్యంలో వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్ఎస్ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్ఎస్ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. 79 ఏళ్ల వ రకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. -
సుదూర ప్రాంతాల్లో పింఛన్లు
చీరాల/వెలిగండ్ల: అనారోగ్యంతో బాధపడుతూ పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు కూడా వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు వెళ్లి నేరుగా పింఛన్ అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల 21వ వార్డు బోస్‌నగర్‌కు చెందిన ఎ.నాగేశ్వరరావు వృద్ధాప్య ఫించన్ లబ్ధిదారుడు. ఆయన కొద్ది నెలలుగా క్యాన్సర్‌తో భాదపడుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు పింఛన్ ఇచ్చేందుకు వలంటీర్ ఎస్.కె.నాగూర్‌బాబు, వెల్ఫేర్ సెక్రటరీ తోట పూర్ణచంద్రరావు సోమవారం చీరాల నుంచి 60 కి.మీ. మంగళగిరి వెళ్లి ఆస్పత్రిలో నాగేశ్వరరావుకు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ రూ.4,500 అందించారు. కాగా, వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పరిధిలోని పద్మాపురం వలంటీర్ జి.చిట్టిబాబు తన సొంత ఖర్చులతో 360 కి.మీ. దూరంలో ఉన్న చెన్నై వెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించుకున్న ఓ వృద్ధుడికి వృద్ధాప్య పింఛన్ అందజేశాడు. పద్మాపురం గ్రామానికి చెందిన గూడూరి నర్సయ్య షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పద్మాపురం వలంటీర్ చిట్టిబాబు సోమవారం చెన్నై వెళ్లి నర్సయ్యకు వృద్ధాప్య పింఛన్ అందజేశాడు. 93.67 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి సాక్షి, అమరావతి: వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ సోమవారం కూడా కొనసాగింది. మార్చి నెలకు సంబంధించి సోమవారం రాత్రి 8 గంటల వరకు 55,07,098 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. రూ.1,476.38 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆది, సోమవారాల్లో కలిపి 93.67 శాతం పంపిణీ పూర్తయింది. ఒకే రోజు 51.50 లక్షలు ఒక్క రోజులో 51.50 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం మీడియాకు తెలిపారు. ప్రభుత్వం 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోందని, గత ప్రభుత్వం కంటే ఇది ఎన్నో లక్షలు ఎక్కువని తెలిపారు. గతంలో కంటే లక్షలాది మంది కొత్తవారికి పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తుంటే.. ఈ ప్రభుత్వం తగ్గించేస్తోందని లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
పింఛన్ కార్దులు పంపిణీ చేసిన ధర్మశ్రీ
-
పింఛన్లు పంపిణీలో జాప్యం: వలంటీర్లపై వేటు
సాక్షి, కృష్ణా: పింఛన్లు పంపిణీలో జాప్యం చేసిన గ్రామ వలంటీర్లపై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. ఈ సందర్భంగా 850 మీటర్ల పైపులైను పునరుద్ధరణ, నూతన పైపులైన్ ఏర్పాటు నిమిత్తం రూ.7 లక్షల 47 వేల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మచిలీపట్నం 10వ వార్డులో పింఛన్లు ఇవ్వడంలో గ్రామ వలంటీర్లు రామకృష్ణ, అపర్ణ ఆలస్యం చేశారని మంత్రి దృష్టికి వచ్చింది. (గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం) దీంతో వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించడమే కాక అడ్మిన్ నవీన్ అలసత్వంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు పార్టీ ఇన్చార్జ్ మాడపాటి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచ్చాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విటల్, షేక్ సైదా, శేఖర్, వాలిశెట్టి రవిశంకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, ఏఈ పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. (ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ) -
లబ్ధిదారులకు పెన్షన్ అందజేత
-
సంక్షేమం డోర్ డెలివరీ
-
సచివాలయ వ్యవస్ధలో ఓ అద్భుతం
-
నేడు కూడా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి : వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ప్రతినెలా మూడు పనిదినాలు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీనే వాటి పంపిణీని ప్రారంభించిన వలంటీర్లు.. రెండో రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పింఛన్లు అందజేశారు. సోమవారం సాయంత్రం నాటికి 93 శాతం పూర్తికావడంతో మంగళవారం కూడా పింఛన్లను పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజాబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం 54,68,309 మంది పింఛనుదారులుండగా.. సోమవారం నాటికి 50,42,126 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని రాజాబాబు చెప్పారు. రూ.1,210 కోట్ల మొత్తం లబ్ధిదారులకు చేరిందన్నారు. వలంటీర్ల వల్ల ఎప్పుడూ లేని విధంగా ఈసారి 99 శాతం దాకా పింఛన్ల పంపిణీ జరిగే అవకాశం ఉందన్నారు. -
విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా పనిచేస్తున్నాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. పెన్షన్ల డోర్‌డెలివరీ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో తన నివాసంలో సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా ఉదయం నుంచి జరుగుతున్న పెన్షన్ల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో పెన్షన్లు కోసం క్యూలో ఉండి నిరీక్షించాల్సి వచ్చేదని, మధ్యవర్తుల ప్రమేయం ఉండేదని, పెన్షన్ల కింద ఇచ్చే సొమ్ములో అవినీతికి పాల్పడేవారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవంటూ లబ్ధిదారుల నుంచి వచ్చిన స్పందనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఇంటివద్దకే పెన్షన్లు అందించడంతో వారంతా చాలా ఆనందం వ్యక్తం చేశారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ పాలనలో విప్లవాత్మక మార్పుగా అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని, దీనికోసమే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇంటివద్దకే చేరుస్తున్నామని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి, లంచగొండి తనానికి, వివక్షకు తావులేకుండా పథకాలను లబ్ధిదారుల గడపవద్దకే చేర్చడానికి ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తిస్థాయిలో సంక్షేమ పధకాలు అందిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దీంట్లో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి అత్యంత పారదర్శకరంగా జాబితాను తయారుచేసి, ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో అతికించి సామాజిక తనిఖీల కోసం ప్రజలముందే పెట్టామని, అర్హులైనవారు మిగిలిపోతే ఎవర్ని ఎలా సంప్రదించాలి, ఎలా దరఖాస్తు చేయాలన్నదానిపై ఆ జాబితాలకిందే సమాచారం ఉంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఇదే చిత్తశుద్ధితో, పారదర్శకతతో మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నాని ఆయన అన్నారు. ఈనెలలో 25 లక్షల ఇళ్లపట్టాల లబ్ధిదారుల ఎంపిక, అలాగే విద్యావసతి(జగనన్న విద్యావసతి) పథకాలకు ఇదే రీతిలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. పెన్షన్లను ఇంటివద్దకే చేర్చి అవ్వాతాతలకు, తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి పెన్షన్లను వారి ఇంటివద్దకే అందించే కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులకు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన వద్దు: ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. ఎలాంటి సమస్య ఉన్నా పక్కనే ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలని సూచించారు. ఎవరెవరు అర్హులో గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేశామని, ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, వీటిని అధికారులు 5 రోజుల్లో పరిశీలించి, మంజూరు చేస్తారని సీఎం వైఎస్ జగన్ స్పష్టంచేశారు. రికార్డు స్థాయిలో ఒకేరోజు రూ.996.79 కోట్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (సాయంత్రం 8 గంటల వరకు) పదమూడు జిల్లాల పరిధిలో 996.79 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు. మొత్తం 41,87,919 మంది లబ్దిదారులకు నేరుగా వారి చేతికే పెన్షన్లను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.68 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఒకేరోజు మొత్తం లబ్దిదారులకు పెన్షన్ చేరాలనే ప్రయత్నంలో భాగంగా తొలిరోజే 75.47 శాతం మొత్తాన్ని పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచే గ్రామాలు, వార్డులలో ఇంటింటికీ వెళ్ళిన వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు లబ్ధిదారులకు నేరుగా పింఛను అందచేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది. పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్లలో బయోమెట్రిక్ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిర్వహించారు. ఎక్కడైనా బయోమెట్రిక్ సమస్య ఉత్పన్నమైతే, సరిచేసి మర్నాటికల్లా పింఛను చెల్లిస్తారు. పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం రూ.15,675.20 కోట్లు కేటాయించగా, శనివారం నాటి చెల్లింపుల కోసం రూ.1,320.14 కోట్లు విడుదల చేశారు. పెన్షన్ల చెల్లింపుల్లోనూ చంద్రబాబు సర్కార్ చిన్నచూపు గత చంద్రబాబు ప్రభుత్వంలో అయిదేళ్లలో ఏడాదికి గరిష్టంగా పెన్షన్ల కోసం కేటాయించిన మొత్తం రూ. 8,234.64 కోట్లు మాత్రమే. అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల చెల్లింపు కోసం అధికారం చేపట్టిన తొలి ఏడాది అంటే 2014–15లో రూ.3378.46 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 2015–16లో రూ.5221.73 కోట్లు, 2016–17లో రూ.5270.12 కోట్లు, 2017–18లో రూ.5436.94 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల ఏడాది కావడంతో 2018–19లో పింఛన్ల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.8234.64 కోట్లు కేటాయించింది. అధికారం చేపడితే పింఛను మొత్తం రూ.1000 నుంచి రూ.2 వేలు చేయడంతో పాటు, ఏటా రూ.250 పెంచుకుంటూ పోయి నాలుగేళ్లలో మొత్తం రూ.3 వేల పెన్షన్ చెల్లిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో, గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా రూ.2 వేల చొప్పున పింఛను చెల్లించింది. అందుకే ఎన్నికల ఏడాదిలో మాత్రం రూ.8 వేల కోట్లకు పైగా కేటాయించింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన రోజు సుమారు ఇరవై అయిదు శాతం కూడా లబ్దిదారుల చేతుల్లోకి వెళ్లక పోవడం పెన్షన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. -
ఏపీలో పింఛన్ల డోర్ డెలివరీ
-
ఫిబ్రవరి నుంచి ఫించన్ల డోర్ డెలివరీ
-
ఇంటింటా పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 54.64 లక్షల మందికిపైగా పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు పింఛన్లు 39 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా కొత్తగా 15.64 లక్షల మందికి పింఛన్లతో ప్రయోజనం కలగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామ, పట్టణ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పందన ద్వారా అందే దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం వరకు బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. స్పందనలో అధికారులు బాగా పనిచేశారని చాలామంది ప్రశంసించారన్నారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ... 15 నుంచి కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యం కార్డులు ‘‘వైఎస్సార్ నవశకం ద్వారా కొత్తగా బియ్యం కార్డులు, పెన్షన్ అర్హుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15వతేదీ నుంచి 21 వరకు వీటి పంపిణీని పూర్తి చేయాలి. నిర్దేశిత సమయానికి కార్డులు ప్రింట్ చేసి పంపిణీకి సిద్ధం చేయాలి. సామాజిక తనిఖీ ఫిబ్రవరి 2 కల్లా పూర్తి కావాలి. ఆ వెంటనే కార్డుల పంపిణీ చేపట్టాలి. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డుల మంజూరు జరుగుతుంది. ఇళ్ల స్థలం లేదని ఎవరూ చేయి ఎత్తకూడదు.. అర్హులైన పేదలందరికీ ఉగాదికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలి. 25 లక్షల మంది మహిళలకు వారి పేర్లతో రూ.10 స్టాంపు పేపర్‌పై ఇళ్లపట్టాలు జారీ చేస్తాం. లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలి. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలి., ప్రజాసాధికార సర్వేకి, ఇళ్ల పట్టాల మంజూరుకు ముడిపెట్టకూడదు. గతంలో ఇళ్లు పొందిన వారి వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న 2006 ఏడాది వివరాలతో సరిపోల్చి చూడాలి. గ్రామాల్లో నా పర్యటన సందర్భంగా ఇళ్ల స్థలాలు లేవని ఎవరూ చేతులు ఎత్తకూడదు. ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలకు మెజార్టీ లబ్ధిదారులు అంగీకారం తెలపాలి. మొక్కుబడిగా ఇస్తే ఎవరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడరని గుర్తుంచుకోవాలి. మనం ఇచ్చే ఇళ్ల స్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి. స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. లబ్ధిదారుడు సంతోషంగా ఉండాలి. లేదంటే డబ్బులు వృథా కావడమే కాకుండా లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుంది. ప్లాటింగ్ చేసేటప్పుడు ఈ అంశాలను కలెక్టర్లు కచ్చితంగా పరిశీలించాలి. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫిబ్రవరి 15 కల్లా అర్హుల జాబితా సిద్ధం కావాలి. 21 కల్లా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్లు పంపించాలి. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి ఫిబ్రవరి 25 కల్లా జరగాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ పూర్తి కావాలి. మార్చి 10 కల్లా సేకరించిన స్థలాల్లో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. మార్చి 15 కల్లా లాటరీలు కూడా పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరగాలి. నిర్మాణాలు పూర్తయ్యాకే వారిని తరలించాలి అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్ల్లను ఎక్కడ కేటాయిస్తున్నారో చూపించి అంగీకారం పొందాలి. వచ్చే ఏడాది చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాల్లో వీరికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలియచేయాలి. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి. అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో నివసించే వారిని ఎలాగూ రెగ్యులరైజ్ చేస్తాం. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. మనం దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలియచేయాలి. మనకు ఓటు వేయనివారైనా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం మంచి జరగాలి. దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలన్నీ ఈ ప్రభుత్వాన్నీ, అధికారులనూ గుర్తుంచుకుంటాయి. ఫిబ్రవరి 20న ‘వసతి దీవెన’ ప్రారంభం రాష్ట్రంలో దాదాపు 11.60 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసే ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఫిబ్రవరి 20వతేదీన ప్రారంభిస్తాం. మొదటి విడత కింద ఫిబ్రవరిలో డబ్బులు అందచేస్తాం. జూలై– ఆగస్టులో రెండో విడత డబ్బులు ఇస్తాం. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఈ డబ్బులను విద్యార్ధుల తల్లులకు అందచేస్తాం. జగనన్న వసతి దీవెన కింద ఐటిఐæ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తాం. ఏప్రిల్ చివరికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల వద్దే ఏర్పాటవుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే కార్యక్రమం. నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామాల్లోనే అందించడంతో పాటు రైతులు పంటవేసే సమయానికే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో సమూల మార్పులను తెస్తాం. పశు వైద్య సిబ్బంది కూడా వీటిల్లో అందుబాటులో ఉంటారు. పశువుల ఔషధాలు కూడా అక్కడే లభిస్తాయి. రైతు భరోసా కేంద్రాలకు భవనాలను సమకూర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలి. ఎవరైనా అవకాశం కోల్పోతే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి. మిగిలిన అన్ని పథకాల లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఏ సేవ ఎప్పుడనేది తెలియచేయాలి.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తుండగా ఇందులో 336 సేవలను కేవలం 72 గంటల్లో పూర్తి చేయాలని నిర్దేశించాం. మిగిలిన సేవలకు కూడా కాల వ్యవధి నిర్ణయించాం. ఏ సేవ ఎన్ని రోజుల్లో అందిస్తారనే వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించాలి. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు, వలంటీర్లు చురుగ్గా విధులు నిర్వర్తించేలా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన సందర్భంగా దరఖాస్తులకు సంబంధించి ఇచ్చే రసీదులపై వెంటనే స్పందించాలి. కలెక్టర్లు నేరుగా వీటి కార్యకలాపాలను పర్యవేక్షించాలి. దరఖాస్తుల స్వీకరణ, రశీదులు, పరిష్కారం అంతా డాష్ బోర్డులో కనిపించాలి. అధికారులు చాలకపోతే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తాం. మనం చేస్తున్న కార్యక్రమాలమీద ఏకాగ్రత లేకుంటే వ్యవస్థలో మార్పులు తీసుకురాలేం. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల పర్యవేక్షణను జిల్లాల్లో ఒక జేసీకి అప్పగించాలి. 15 నుంచి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అవ్వా తాతలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దాదాపు 1.25 కోట్ల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించాం. జూలై 31 దాకా మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేస్తాం. ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46 వేల మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. మనం దృష్టి పెట్టకుంటే ఆ పిల్లల పరిస్థితి అలాగే ఉండేది. శ్రద్ధ వహిస్తే ఎంతమందికి మంచి జరుగుతుందో దీని ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవ్వా తాతల మీద కూడా మనం ఇలాంటి శ్రద్ధ తీసుకుంటాం. ‘అమ్మ ఒడి’ తల్లులు 42,33,098 మంది అమ్మ ఒడి కింద 42,33,098 మంది తల్లులను గుర్తించామని, పథకం ద్వారా ఇప్పటివరకు 41,25,808 మందికి రూ.6,188 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 1,07,290 ఖాతాల ట్రాన్సాక్షన్స్ విఫలమైనట్లు గుర్తించామన్నారు. దీనికి కారణాలను పరిశీలించాలని సీఎం సూచించగా వివరాల నమోదులో తప్పుల కారణంగా ట్రానాక్షన్స్ ఫెయిల్ అయ్యాయని, ఈ వారంలో దీన్ని సరిదిద్దుతామని బ్యాంకు అధికారులు చెప్పారన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సెర్ప్‌లో ఆర్డీవో స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై రెండు వారాల్లో ఒక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పాఠశాలల్లో బాత్రూమ్స్ నిర్వహణపై దృష్టిపెట్టాలని, అంగన్వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. వర్షాకాలానికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉండాలి జనవరి 10 నుంచి ఉభయ గోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభమైందని, ఇప్పటివరకు 1,12,082 టన్నులు ఇంటివద్దే ప్రజలకు అందచేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 48 –72 గంటల్లో ఇసుక డోర్ డెలివరీ జరుగుతోందన్నారు. జనవరి 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభమవుతుండగా ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్ డెలివరీ మొదలు కానుందని తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కానుంది. 16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని అధికారులు పేర్కొనగా వర్షాకాలం వచ్చేసరికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం సూచించారు. దేశమంతా చర్చించేలా దిశ చట్టం అమలు దిశ పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్లు సిద్ధమవుతున్నాయని, మిగిలిన పోలీస్స్టేషన్లు కూడా ఫిబ్రవరి రెండో వారాంతానికి సిద్ధమవుతాయని డీజీపీ తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయని సీఎంకు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఎస్పీలు వెంటనే పరామర్శించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెచ్చిన దిశ చట్టం అమలు కూడా అదే రీతిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దళారుల నిర్మూలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించామని సీఎం పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని, మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. లంచగొండితనం లేకుండా, కోతలు లేకుండా ఉద్యోగికి నేరుగా జీతం వచ్చేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేస్తున్నామని సీఎం తెలిపారు. -
వితంతు, ఒంటరి మహిళల పింఛన్ నిబంధనల మార్పు
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల నిర్వచనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హత నిబంధనలను మార్పుచేశారు. దీని ప్రకారం.. - వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. - పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది. ఈ కేటగిరీ–2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్‌కు అర్హులైనా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. - అలాగే, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. - కుటుంబ పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్ ఇస్తారు. కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్ పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పెరిగిన పింఛన్.. ఇక టంచన్
సాక్షి, అమరావతి: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు విధి వంచితులైన ఇతరులకు పెరిగిన పింఛన్ సొమ్ము పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగులకు రూ.3 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.2,250 చొప్పున పంపిణీ చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగులో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో పెరిగిన పింఛన్ మొత్తాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా పంపిణీ చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని సెర్ప్ సీఈవో రాజాబాబు అన్ని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,85,787 మంది పింఛనుదారులు ఉండగా, పెరిగిన పెన్షన్ మొత్తం మేరకు జూన్ నెలకు సంబంధించి రూ.1,305.85 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు నెలల కిత్రం వరకు ఈ పింఛనుదారులకే ప్రతినెలా కేవలం రూ.569 కోట్లు మాత్రమే పంపిణీ అయ్యేది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ.5,436 కోట్లు, 2018–19లో రూ.8,234 కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేయగా.. ఇప్పుడు ఆ మొత్తం భారీగా పెరిగింది. ఇప్పుడున్న పింఛన్‌దారులకు పంపిణీ చేయడానికే ఏడాదికి రూ.15,670 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. లబ్ధిదారులకు సీఎం లేఖలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తం పెంచిన విషయాన్ని తెలియజేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు నేరుగా లేఖలు రాయనున్నారు. జూలై 8నుంచి మొదలయ్యే కార్యక్రమంలో లబ్ధిదారులకు పెంచిన మొత్తాలతోపాటు సీఎం రాసిన లేఖలను కూడా అధికారులు పంపిణీ చేస్తారు. పింఛనుదారులందరికీ కొత్త పింఛన్ పుస్తకాలను కూడా పంపిణీ చేయడానికి సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లను రూ.2 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2017 జూలై 9న ప్రకటన చేశారు. రెండేళ్ల పాటు పెన్షన్ల పెంపును పట్టించుకోని చంద్రబాబు సర్కార్.. ఆ తరువాత ఎన్నికల ముందు ఫిబ్రవరిలో పెంపు ప్రకటన చేసింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతానని హామీ ఇస్తూ.. రూ.2,250 నుంచి ఏటా పెంచుతూ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే అధికారికంగా పెంపు ప్రకటన చేశారు. -
8న ఇడుపులపాయకు సీఎం జగన్
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదిన జిల్లాకు రానున్నారు. తన తండ్రి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఆయన నివాళులు అర్పించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల విషయమై వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు బుధవారం అమరావతిలో చర్చించారు. డిప్యూటీ సీఎం అంజాద్బాష, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. ఫించన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. అవ్వతాతలను ఆదుకునే నిమిత్తం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఫించన్ పెంచుతామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫించన్ మొత్తాన్ని రూ.2250 పెంచుతూ తొలి సంతకం చేశారు. దీనిని జూలై నెలలో అందించనున్నట్లు ప్రకటించారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైఎస్సార్ ఫించన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
నవశకానికి నాంది పలికిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే సుపరిపాలన ప్రారంభమైంది. ప్రమాణ స్వీకార వేదిక నుంచే సంక్షేమ అజెండా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. అవినీతి నిర్మూలన, జవాబుదారీతనం, సత్వర సేవలు అందించడంతోపాటు పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్ పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేయడంతోపాటు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రకటించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా కొత్తగా 5.50 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ల ప్రయోజనంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 5.60 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నారు. నవయుగానికి శ్రీకారం ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి వైఎస్ జగన్ గురువారమే పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే అమలు చేయాలని ఆయన్ను ఎవరూ డిమాండ్ చేయలేదు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ తన తొలి అడుగులోనే మేనిఫెస్టో అమలు పట్ల నిబద్ధత కనబరిచారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేసి ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పథకాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 5.60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన కాల వ్యవధితో ప్రకటన చేశారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కార్యాచరణ ప్రకటించి రాజన్న రాజ్యం దిశగా ముందడుగు వేశారు. పింఛన్లతో సంక్షేమ రాజ్యం అవ్వా తాతలకు మాటిచ్చిన మనవడిగా పింఛన్లను పెంచుతూ సీఎం వైఎస్ జగన్ తొలి సంతకం చేశారు. నెలకు రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ను ఆయన నెలకు రూ.2,250కి పెంచారు. వచ్చే ఏడాది రూ.2,500కు, ఆ తరువాత ఏడాది రూ.2,750కు, ఆ తరువాత ఏడాది రూ.3 వేలకు పెంచుతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం సాయంత్రానికే ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితులకు ప్రస్తుతం నెలకు రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ను జగన్ నెలకు రూ.2,250కు పెంచారు. వికలాంగుల పింఛన్లలో అంతవరకు ఉన్న రెండు కేటగిరీలను ఒకే కేటగిరీ కిందకు తెచ్చారు. అందరికీ నెలకు పింఛన్‌ను రూ.3 వేలకు పెంచారు. డయాలసిస్ పేషంట్లకు ఇప్పటిదాకా నెలకు రూ.3,500 చొప్పున ఇస్తున్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఒక్క సంతకంతో లక్షల మందికి మేలు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా 5.50 లక్షల మంది పింఛన్ల పరిధిలోకి వచ్చి ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 23,30,377 వరకు ఉంది. గణాంకాల ప్రకారం ప్రస్తుతం అన్ని రకాల పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్య 53,32,592 వరకు ఉంది. సీఎం వైఎస్ జగన్ తన తొలి సంతకంతో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును తగ్గించడం ద్వారా ప్రయోజనం కల్పించిన వారితో కలిపితే ఈ సంఖ్య 58,82,592 మందికి చేరుకుంది. అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకంతోనే లక్షల మంది సంక్షేమానికి చర్యలు చేపట్టడం సీఎం వైఎస్ జగన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ అందించేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించారు. ఆగస్టు 15వతేదీ నాటికి ప్రతి గ్రామంలోనూ స్థానికులైన 10 మంది యువకులను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. అంటే ఒక్క నిర్ణయంతో ఆయన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గ్రామ వాలంటీర్లు నిజాయితీతో పనిచేసేందుకు నెలకు రూ.5 వేలు చొప్పున జీతాలు చెల్లించాలని జగన్ నిర్ణయించడం ఆయన ముందుచూపు, నిబద్ధతకు నిదర్శనం. సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం రాజకీయాలతో కలుషితమవుతున్న గ్రామాలను చక్కదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధానాన్ని ప్రకటించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించడం దేశంలోనే సంచలనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం తరహాలో గ్రామ సచివాలయాలను అక్టోబరు 2వతేదీనాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల అవసరాలను గ్రామ సచివాలయాల నుంచే సకాలంలో పరిష్కరించాలన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామ సచివాలయంలో విద్యావంతులైన పదిమంది స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 13,060 గ్రామాల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. లంచాలు లేని వ్యవస్థే లక్ష్యం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం, లంచాలు లేని వ్యవస్థను తీసుకు రావడం.. ఇదీ సీఎం వైఎస్ జగన్ విధాన నిర్ణయాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ పథకాల సక్రమ అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను సీఎం కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎం కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబరుతో కాల్ సెంటర్ ఆగస్టు 15 నాటికి ఏర్పాటు కానుంది. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరికైనా ఆలస్యం జరిగినా, అన్యాయం జరిగినా నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పథకాల అమలులో అలక్ష్యాన్ని ఉపేక్షించబోమని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చింది. సీఎం ఆలోచనా సరళిని అనుసరించి పని చేయాలనే భావన పెరిగింది. పాలనలో జవాబుదారీతనాన్ని పెంచుతూ సంక్షేమ రాజ్యం, గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారని పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. 5.60 లక్షల మందికి ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా సీఎం వైఎస్ జగన్ మరో కీలక సమస్యకు పరిష్కారం చూపించారు. ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా 5.60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లైంది. దూర ప్రాంతాలకు వలస పోతున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆగస్టు 15వతేదీ నాటికి గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల మందిని, అక్టోబరు 2వతేదీ నాటికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా 1.60 లక్షల మందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
వృద్ధుల పింఛన్ పాట్లు
సాక్షి,నల్లగొండ: పింఛన్ కోసం వృద్ధులు పోస్టాఫీస్ వద్ద ఉదయం 7 గంటల నుంచే పడిగాపులు కాస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండలో క్యూ లైన్లో నిల్చుని తాగడానికి నీరు కూడా లేకుండా గోస తీశారు. రెండు నెలలుగా పింఛన్ పెండింగ్‌లో ఉన్నా జనవరి మాసం పింఛన్ మాత్రమే ఇస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో నానా ఇబ్బందలు పడుతున్నామని వృద్ధులు బుధవారం సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఎండవేడిమి తట్టుకోలేక.. క్యూ లైన్లో నిల్చున్న పింఛన్‌దారులు -
దివ్యాంగుడికి పింఛను పంపిణీ
ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు బంధువుల ఇంటివద్ద కోలుకుంటున్న బాధితుడు నల్లూరు(కపిలేశ్వరపురం) : మండలంలోని నల్లూరుకు చెందిన గుత్తుల వీరవెంకట సత్యనారాయణ అలియాస్ కొండయ్య కుటుంబ సభ్యులకు అధికారులు శుక్రవారం పింఛను పంపిణీ చేశారు. పింఛను రాకపోవడంతో మనస్తాపానికి గురైన కొండయ్య గురువారం బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొండయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ప్రస్తుతం బంధువుల ఇంటి వద్ద కోలుకుంటున్నాడు. కాగా వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి సత్యనారాయణ (చిన్నా), సవిలే శరత్, నరాల వెంకట్రావు కొండయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అఘాయిత్యంతో పింఛను పంపిణీకి సంబంధం లేదు ఇంటి వద్ద ఇతర కారణాలతో అఘాయిత్యానికి పాల్పడి అందుకు పింఛను ఇవ్వకపోవడమేననడంతో çసంబంధం లేదని ఎంపీడీఓ అబ్రహం లింక¯ŒS శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలిముద్రలు, ఐరిష్ సమస్యలు తలెత్తడంతో సత్యనారాయణకు ఏడాది కాలంగా కార్యదర్శి వేలిముద్రతో పింఛను ఇస్తున్నామని, ఆధార్‌ను మీ సేవా కేంద్రంలో అప్డేట్ చేసుకోమని చెప్తున్నా లబ్ధిదారుడుస్పందించలేదన్నారు. అందువల్లే సెప్టెంబరు నుంచి పింఛన్ నిలిచిపోయిందని, ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు పింఛను అందజేశామని ఎంపీడీఓ తెలిపారు. కాగా ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్సై పెద్దిరాజు ఆత్మహత్యాయత్నం నేరం మీద కొండయ్యపై కేసు నమోదు చేశారు. -
గొట్టిపాటి వర్సెస్ కరణం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : – కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరువర్గాలు –ఉద్రిక్తతకు దారితీసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం – షామియానాలు వేయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి –వాటిని కూల్చివేయించిన మాజీ ఎంపీ కరణం – వందలాదిగా పోలీసు బలగాల మోహరింపు – ఆధిపత్య పోరుకు వేదికగా మారిన ఎంపీడీవో కార్యాలయం – బెంబేలెత్తిన బల్లికురవ ప్రజలు – ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూత అద్దంకి టీడీపీలో వర్గవిబేధాలు మరోమారు భగ్గుమన్నాయి. కరణం, గొట్టిపాటి వర్గాలు సై అంటే సై అంటున్నాయి. అదును దొరికితే కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో తర చూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా బుధవారం మండల కేంద్రం బల్లికురవ వేదికగా వీరిరువురూ గొడవకు సిద్ధపడ్డారు. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయి దుకాణాలు సైతం మూసి వేయడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గాలు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా గొడవకు దిగారు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి 2,600 పైచిలుకు పింఛన్లు కావాలంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి చినబాబు లోకేష్ కు విన్నవించగా మూడు వేల పింఛన్లు కావాలంటూ ఇదివరకే కరణం సైతం దరఖాస్తులు పెట్టారు. తాజాగా 2,800 ఫించన్లు నియోజకవర్గానికి మంజూరయ్యాయి. పింఛన్లు తానే మంజూరు చేయించానని చెప్పిన గొట్టిపాటి బుధవారం బల్లికురవ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కార్యాలయ ఆవరణలో షామియానాలు వేశారు. విషయం తెలుసుకున్న కరణం, ఆయన తనయుడు వెంకటేశ్‌లు ఉదయం 10 గంటలకే బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. షామియానాలు ఎందుకేశారంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. తనకు తెలియదంటూ ఎంపీడీవో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే పింఛన్లు పంచుతున్నారంటూ కరణం వర్గీయుల ఆయన దృష్టికి తెచ్చారు. పింఛన్లు తాను కూడా మంజూరు చేయించానని, అధికారులు పంపిణీ చేయాలి కానీ ఎమ్మెల్యే పంపిణీ చేయడమేంటంటూ ఆగ్రహించిన కరణం షామినాయాలు తీసివేయాలంటూ ఆదేశించారు. అంతే అక్కడున్న ఆయన వర్గీయులు షామియాయాలు పీకివేశారు. అనంతరం నాగార్జున సాగర్ నీటి విడుదల నేపథ్యంలో నీటి వాడకంపై కరణం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష ప్రారంభించారు. అడకత్తెరలో అధికారి.. పింఛన్లు పంపిణీ చేసేందుకు 10.30 గంటల సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే షామియానాలు కింద పడవేసి ఉండటంతో విషయం ఆరా తీశారు. కరణం వర్గీయులు పీకివేశారంటూ తెలిసి, ఆగ్రహించిన ఆయన ఎంపీడీఓకు ఫోన్ చేసి షామియానాలు ఎందుకు పీకివేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ తనకు తెలియదని చెప్పాడు. పింఛన్లు పంపిణీ చేద్దామని ఎమ్మెల్యే కోరగా తనను వదిలివేయాలంటూ ఓ మొక్కు మొక్కి కార్యాలయంలో జరుగుతున్న కరణం సమీక్షకు హాజరయ్యారు. అప్పటికే అక్కడ వెయ్యి మందికిపైగా కరణం వర్గీయులు ఉండగా, గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున పోగయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. బల్లికురవలో కర్ఫ్యూ వాతావరణం.. నేతల మధ్య గొడవ చూసి బెంబేలెత్తిపోయిన బల్లికురవ వాసులు ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూసివేశారు. దీంతో బల్లికురవ బంద్‌ను తలపించింది. అటు కరణం, ఇటు గొట్టిపాటిలు బల్లికురవ వస్తుండటంతో ముందే జాగ్రత్తపడ్డ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, దర్శి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రీరాంబాబుల నేతృత్వంలో ఒంగోలు, దర్శి, అద్దంకి సీఐలు, ఎస్ఐలతో పాటు 200 మందికిపైగా పోలీస్ బలగాలు బల్లికురవలో మోహరించాయి. పారీ నేతలకు గొట్టిపాటి ఫిర్యాదు.. తన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన గొట్టిపాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, చినబాబు లోకేష్, నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గొడవకు దిగకుండా సర్దుకుపోవాలని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చినబాబు లోకేష్‌తో పాటు మిగిలిన నేతలు గొట్టిపాటికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ ఐదు మందికి తన సొంత డబ్బులు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కరణం ఒంటి గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొట్టిపాటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కరణం అక్కడే మకాం వేసి అధికారులతో సమీక్షను మొదలుపెట్టారన్న ప్రచారం సాగిం ది. ఎట్టకేలకు పోలీస్ బలగాల మోహరింపుతో గొడవ సద్దుమణగడంతో బల్లికురవ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
అధికార పార్టీ వారికే పింఛన్!
మంగళగిరి రూరల్ : రాజధాని పరిధిలోని గ్రామాల్లో అరులైన రైతు కూలీలకు, భూమిలేని రైతు కుటుంబాలకు పింఛన్ ఇవ్వడంలో అనేక అవకతవకలు జరిగాయి. ఒక్కో గ్రామంలో మొక్కుబడిగా నలుగురైదుగురికి పింఛన్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. రాజధాని ప్రాంతంలోని పేదలకు జీవన భృతిగా నెలకు రూ.2500 ల చొప్పున పింఛన్లు మంజూరు చేస్తామని, అవసరమైతే ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తామని మంత్రులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గ్రామా ల్లో ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) అధికారులు సర్వే నిర్వహించి మొత్తం 4542 మందిని అర్హులుగా గుర్తించి డీఆర్డీఏకు ప్రతిపాదనలు పం పారు. మండలంలోని కృష్ణాయపాలెంలో 394 మంది, యర్రబాలెంలో 1625 మంది, నవులూరులో 1333 మంది, నిడమర్రులో 372మంది, కురగల్లులో 404 మంది, బేతపూడిలో 136 మం ది, నీరుకొండలో 277మందితో తుది జాబితాలు తయారు చేసి డీఆర్డీఏ అధికారులు గ్రామాలకు పంపారు. అనంతరం సీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో టీడీపీ నేతలతో పింఛన్ కమిటీని నియమించారు. ఇంకేముంది వారు అడింది ఆట పాడింది పాట. అర్హులైన పేద రైతు కూలీలు, భూమి లేని రైతుల పేర్లను పక్కనబెట్టి టీడీపీకి చెందిన వారికి మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటి వరకు తమ పేర్లు జాబితాలో ఉన్నాయని మురిసిపోయిన వైఎస్సార్ సీపీ సానుభూతి ప రులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. కంటనీరు పెట్టుకుంటున్నారు. అన్ని అ ర్హతలు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీలో తమ కు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. అర్హులకు మొండిచేయి గ్రామాల్లో చాలా మంది అర్హులకు పింఛన్ మం జూరు కాలేదు. తమకు అన్యాయం చేశారని భూ మిలేని రైతులు, రైతు కూలీలు వాపోతున్నారు. అనర్హులే జాబితాలో అధిక సంఖ్యలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారు లు, కమిటీ సభ్యులు కుమ్మక్కై అనర్హులకు జాబి తాలో చోటు కల్పించారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. గ్రామాల్లో విచారణ జరిపి, అవసరమైతే రీ సర్వే నిర్వహించి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే... సెంటు భూమిలేదు సెంటు భూమి లేదు. వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయినా పింఛను మంజూరు చేయలేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తొలి జాబితాలో పేరు వచ్చినా తుది జాబితాలో పేరును తీసి నా కుటుంబానికి అన్యాయం చేశారు. - పులివర్తి నరసింహారావు, కృష్ణాయపాలెం అర్హత ఉన్నా పింఛను రాలేదు పింఛను వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. భూమి లేదు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడిని. ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నా. పింఛను జాబితాలో పేరు లేదు. అదేమని అడిగితే రెండవ జాబితాలో వస్తుందని చెబుతున్నారు. - బేతపూడి సుంకరి, నవులూరు ఆశలు అడి ఆశలు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉంది. అయినా పింఛను జాబితా లో పేరు రాలేదు. అదేమని అడిగితే మరలా దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. పింఛను వస్తే కుటుంబానికి ఆసరాగా వుంటుందని ఆశపడ్డా. నా ఆశలు అడియాశలుగానే మిగిలాయి. - వాసా శివపార్వతి, బేతపూడి పొలం ఉన్న వారికే పింఛన్లు ఇస్తున్నారు గ్రామంలో పొలం వున్న వారికే పింఛన్లు ఇస్తున్నారు. పొలం లేని నాబోటివారి పేర్లు జాబితాలో లేకుండా తొలగించారు. కుండలు అమ్ముకుని జీవించే నాపై ముగ్గురు ఆధారపడి ఉన్నారు. పింఛను వస్తే బాగుండేదనుకున్నా. ఏమి చేయా లో కూడా పాలు పోవడం లేదు. - శనగారపు భూలక్ష్మి, కురగల్లు రీ సర్వే చేయించాలి పింఛన్ల మంజూరులో లోపాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు పింఛన్లు రాకుండా చేశారు. రీ సర్వే చేయించి అర్హులకు పింఛన్లు వచ్చేలా చూడాలి. పింఛన్ల ఎం పిక కమిటీ వారు, సీఆర్డీఏ అధికారుల నిర్వాకం కారణంగానే పింఛను రాలేదు. - బొంతా సుబ్బమ్మ, కురగల్లు -
‘ఆసరా’లోనూ అవినీతే !
పెన్షన్ పంపిణీలో చేతివాటం లబ్ధిదారుల నుంచి రూ.100 వసూలు లబోదిబోమంటున్న పింఛన్‌దారులు నందిపేట : వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంటే, కొందరు అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల నుం చి కమీషన్లు వసూలు చేస్తున్నారు. పింఛన్ పంపిణీ చేసేటప్పుడే రూ.100 కట్ చేసుకుని మిగతా డబ్బు ఇస్తున్నా రు. ఇదేంటని అడిగితే పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆసరా పథకం కింద 800 మంది వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ వస్తోంది. మూడు రోజు లుగా గ్రామంలోని పోస్టాఫీసు ద్వారా పింఛన్ డబ్బు పం పిణీ చేస్తున్నారు. పెన్షన్ మంజూరు లిస్టులో పేరు ఉండి బయోమెట్రిక్ మిషన్‌లో వేలిముద్రలు రాని వారికి పంచాయతీ కార్యద ర్శి సంతకం సహాయంతో డబ్బులు అందించాలి. కాగా, బీపీఎం సారుుకుమార్, పంచాయతీ కార్యదర్శి మనోహర్ బుధవారం పింఛన్ పంపిణీ చేస్తూ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున కట్ చేసుకున్నారని, వద్దని కాళ్లు మొక్కినా, బతిమిలాడిన వినలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే రూ.100 ఇవ్వకుంటే పెన్ష న్ ఇవ్వబోమని బెదిస్తున్నారని చెప్పారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తామని అంటే ‘మీరెవరికైనా ఫోన్ చేసుకోండి.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి..’ అని గద్దిస్తున్నారని వాపోయారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని ‘సాక్షి’ వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పాడు. బీపీఎం సారుుకుమార్ను అడగగా.. గ్రామ సర్పంచ్ రామడ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి మనోహర్ సూచన మేరకే రూ.100 చొప్పున వసూలు చేస్తున్నామని చెప్పారు. -
‘ఆసరా’ లేదని దిగులు చెందవద్దు
సిద్దిపేట జోన్: పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగినా పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రక్రియను మళ్లీ ప్రారంభించామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసరా పథకం కింద పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో నిర్వహించిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ ప్రక్రియ గత నెలలోనే నిర్వహించాల్సి ఉందన్నారు. అర్హులందరికి ఆసరా వర్తింపజేసే విషయంలో జాప్యం జరిగినా నెల రోజుల పాటు విస్తృతంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టామన్నారు. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, జాబితాలో అర్హులు తమ పేరు లేదంటూ దిగులు చెందవద్దన్నారు. అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకం కింద 20 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 4 వేల కోట్లను కేటాయించిందని, మరోవైపు ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి నెలలో బియ్యం కోటాను 6 కిలోలకు పెంచుతూ కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యాన్ని అందిస్తామన్నారు. ఇందు కోసం రూ. 3 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద వర్గాల సంక్షేమానికి మొత్తంగా రూ. 7 వేల కోట్లతో బియ్యం, పింఛన్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట ప్రాంతాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు రైల్వే లైన్‌ను సాధ్యమైనంత త్వరలో సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్, మల్లికార్జున్, షఫీకూర్ రహమాన్, సాయిరాం, కనకరాజు, సంపత్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, శేషుకుమార్, శ్రీనివాస్‌గౌడ్, రవితేజ, ప్రభాకర్ పాల్గొన్నారు. లారీ డ్రైవర్లకు బీమా -మంత్రి హామీ సంగారెడ్డి అర్బన్: లారీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయడానికి తన వంతు కృషి చేస్తానని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సంగారెడ్డిలో తెలంగాణ లారీ ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవన్నారు. డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిరుపేద లారీ కార్మికులకు సొంత స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ లారీ కార్మికుల జీవితం ప్రమాదంతో కూడుకున్నదని, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లారీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాసిత్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌చారి, జలాలుద్దిన్ బాబా, లియాఖత్, అసోషియేషన్ నాయకులు నయీమొద్దీన్ ఎజాస్పాష, అబూబాకత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘ఆసరా’ రెండో విడత
పాతిక లక్షలకు పైగా లబ్ధిదారుల గుర్తింపు 22 లక్షల మందికి మంజూరు ఉత్తర్వులు జారీ రెండు నెలల పింఛన్ పంపిణీకి రూ.613 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడత ‘ఆసరా’ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం యంత్రాంగం సమాయత్తమైంది. బుధవారం నుంచి ఈనెల 15 వరకు జరగనున్న పింఛన్ల పంపిణీ నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అన్ని ఏర్పాట్లు చేసింది. ఆసరా పింఛన్ పథ కాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గతనెల్లో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. లబ్ధిదారుల ఎంపిక, పింఛన్ల మంజూరు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడడంతో మొదటి విడత పంపిణీలో కొద్దిమందికే నవంబర్ పింఛన్ అందజేశారు. తాజాగా కొత్త లబ్ధిదారులు కూడా తోడవడంతో వీరందరికీ నవ ంబర్, డిసెంబర్ (రెండు) నెలల పింఛన్ మొత్తాన్ని బుధవారం నుంచి అందజేయాలని అధికారులు నిర్ణయించారు. రూ.613 కోట్ల పంపిణీ.. ఆసరా పింఛన్ కోసం సుమారు 39 లక్షల దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 25,920,90 మందిని అర్హులుగా గుర్తించారు. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్వేర్ ఇబ్బందుల కారణంగా పింఛన్ మంజూరు ఉత్తర్వుల జారీకి ఆటంకం ఏర్పడిం ది. మంగళవారం నాటికి మొత్తం 22,13,901 మందికి ఆయా జిల్లాల కలెక్టర్లు పింఛన్ ఉత్తర్వులు జారీచేశారు. వీరందరికీ బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ పంపిణీ నిమిత్తం మొత్తం రూ.613.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే సుమా రు రూ.453 కోట్లు ఆయా జిల్లాలకు పంపామని, మిగిలిన సొమ్మును కూడా రెండ్రోజుల్లో పంపనున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. కమిటీల పర్యవేక్షణలో.. ప్రభుత్వం నియమించిన కమిటీల పర్యవేక్షణలోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. గ్రామ కమిటీలను మండల ఎంపీడీవో, పట్టణ/నగర కమిటీలను మున్సిపల్ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నగర కమిటీలను ఉప కమిషనర్లు, హైదరాబాద్ జిల్లాలో కమిటీలను మండల తహశీల్దార్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి కమిటీలనూ ఐదుగురు సభ్యులు ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో.. సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, స్థానిక వార్డు సభ్యుడు, ఎస్సీ/ఎస్టీ వార్డు సభ్యుడు, గ్రామ సమాఖ్య సభ్యురాలు ఉంటారు. పట్టణ/నగర కమిటీలో.. వార్డు కౌన్సిలర్/డివిజన్ కార్పొరేటర్, బిల్ కలెక్టర్/ వీఆర్వో, మురికివాడలకు చెందిన వార్డు సభ్యుడు, ఎస్సీ/ఎస్టీ వార్డు సభ్యుడు, పట్టణ/నగర సమాఖ్య సభ్యురాలు తప్పనిసరిగా ఉంటారు. -
పింఛన్ పంపిణీలో తొక్కిసలాట
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం పింఛన్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పింఛన్ల పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు, కొత్తగా మరికొన్ని మంజూరయ్యాయని కొంతమంది లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కార్యాలయ ఆవరణం పింఛన్ల లబ్ధిదారులతో నిండిపోయింది. ముందుగానే కార్యాలయం చాలా ఇరుగ్గా ఉంటుంది. కొత్తగా మంజూరైన పింఛన్ లబ్ధిదారుల జాబితాను మేనేజర్ ప్రసాద్ చదివి వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. దీంతో గందరగోళంగా తయారైంది. ఊపిరాడక పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛన్ మంజూరు కాని వారు మాకెందుకు రాలేదని అధికారులపై వాదనకు దిగారు. చేసేదిలేక మేనేజర్ పాసుపుస్తకాల్వికుండా లోనికి వెళ్లారు. దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కార్యాలయ గేట్ తోసుకుంటూ లోనికి పోయారు. ఈ తొక్కిసలాటలో పాపమ్మ అనే వృద్ధురాలు కిందపడింది. ఆమె చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. మరో మృద్ధురాలు సుబ్బమ్మ నడవలేక, కళ్లు సరిగా కనిపించక అక్కడే ఓ మూల కూర్చుని కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. ముందుచూపుగా అధికారులు అక్కడ క్యూ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. విషయాన్ని మేనేజర్ ప్రసాద్ పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి పరిస్థితిని నియంత్రించారు. 207 కొత్త పింఛన్లు మంజూరు ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులలో కొత్తగా 207 పింఛన్లు మంజూరైనట్లు మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో 180 వృద్ధులకు, 27 వికలాంగులకు కేటాయించారన్నారు. -
ఫింఛన్... టెన్షన్
బాన్సువాడ: ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఫించన్ల పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. గతంలో వివిధ రకాల సామాజిక ఫించన్లు పొందుతున్నవారితో పాటు, కొత్తవారికి ఫిం చన్లు పంపిణీ చేసేందకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, తమకు ఫించన్లు వస్తాయో రావోననే ఆందోళన కొందరు లబ్ధిదారులను వెంటాడుతోంది. వయోభారంలో ఉన్న పండుటాకులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వివిధ వృత్తిదారులు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఇటీవల ఫించను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో పోటీ పెరిగింది. కొత్త జాబితాతో కలవరం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శని వారం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభిం చారు. కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఫించన్ల కోసం ప్రతీ గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. గత నెల 20 నుంచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల విచారణ ప్రారంభించారు. మున్సిపాలిటీలలో విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అధికారుల రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు వృద్ధులు వారు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తహ శీలు కార్యాలయాలకు త ండోపతండాలుగా తరలి వచ్చి వాకబు చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే పరగడుపున అధికారుల వద్దకు చేరుకుని తమ గురించి విచారణ జరపాలని వేడుకొంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ నత్తనడకన సాగుతోంది. ఎక్కువ మందిని విచారించాల్సి రావడంతో బృందాలుగా వెళ్తున్న రెవెన్యూ సిబ్బంది, దరఖాస్తుదారుల చిరునామా లభిం చక ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులకు తలనొప్పి అనేక గ్రామాలలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా అర్హులు ఉండడంతో ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. సీలింగ్ మించి ఎంపిక చేయరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి గ్రామంలో ఐదు శాతం వృద్ధులు, ఐదు శాతం వితంతువులు, మూడు శాతం వికలాంగులను మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. గ్రామ జనాభా ఆధారంగా ఎస్సీలు 80 శాతం, ఎస్టీలు 75 శాతం, బీసీలు 50 శాతం, ఓసీలు 20 శాతం మేర ఫించన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. కొన్ని గ్రామాలలో ఓసీలు 20 శాతానికి మించి అర్హులున్నప్పటికీ వారు ఎంపికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం మండలానికి వెయ్యి ఫించన్లను అందించేందుకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఫించన్లు పొందుతున్నవారిలో సుమారు 50 వేల మంది తమ ఫించన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎందరు లబ్ధిదారులను ఎంపిక చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.