పెన్షన్ పంపిణీలో చేతివాటం
లబ్ధిదారుల నుంచి రూ.100 వసూలు
లబోదిబోమంటున్న పింఛన్‌దారులు
నందిపేట : వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంటే, కొందరు అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల నుం చి కమీషన్‌లు వసూలు చేస్తున్నారు. పింఛన్ పంపిణీ చేసేటప్పుడే రూ.100 కట్ చేసుకుని మిగతా డబ్బు ఇస్తున్నా రు. ఇదేంటని అడిగితే పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆసరా పథకం కింద 800 మంది వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ వస్తోంది. మూడు రోజు లుగా గ్రామంలోని పోస్టాఫీసు ద్వారా పింఛన్ డబ్బు పం పిణీ చేస్తున్నారు.
పెన్షన్ మంజూరు లిస్టులో పేరు ఉండి బయోమెట్రిక్ మిషన్‌లో వేలిముద్రలు రాని వారికి పంచాయతీ కార్యద ర్శి సంతకం సహాయంతో డబ్బులు అందించాలి. కాగా, బీపీఎం సారుుకుమార్, పంచాయతీ కార్యదర్శి మనోహర్ బుధవారం పింఛన్ పంపిణీ చేస్తూ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున కట్ చేసుకున్నారని, వద్దని కాళ్లు మొక్కినా, బతిమిలాడిన వినలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే రూ.100 ఇవ్వకుంటే పెన్ష న్ ఇవ్వబోమని బెదిస్తున్నారని చెప్పారు.
ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తామని అంటే ‘మీరెవరికైనా ఫోన్ చేసుకోండి.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి..’ అని గద్దిస్తున్నారని వాపోయారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని ‘సాక్షి’ వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పాడు. బీపీఎం సారుుకుమార్‌ను అడగగా.. గ్రామ సర్పంచ్ రామడ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి మనోహర్ సూచన మేరకే రూ.100 చొప్పున వసూలు చేస్తున్నామని చెప్పారు.
‘ఆసరా’లోనూ అవినీతే !
Published Thu, Aug 13 2015 4:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement