
అన్నమయ్య జిల్లా: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు.
ఈరోజు(జూలై 1వ తేదీ) పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ భార్య హరితారెడ్డి.. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతే కాకుండా ఎస్‌ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని ఎస్‌ఐ రమేష్ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చూడండి పోలీసులపై దౌర్జన్యం
ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు
నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024