పడిగాపులు.. చంద్రబాబుపై పెన్షన్‌దారుల ఆగ్రహం | Pensions Distribution At Village Secretariat In AP Live Updates | Sakshi
Sakshi News home page

పడిగాపులు.. చంద్రబాబుపై పెన్షన్‌దారుల ఆగ్రహం

Published Wed, Apr 3 2024 10:52 AM | Last Updated on Wed, Apr 3 2024 4:38 PM

Pensions Distribution At Village Secretarias In AP Live Updates - Sakshi

Live Updates..

చంద్రబాబు కుట్రతో పెన్షన్‌దారులకు అష్టకష్టాలు
►పచ్చబ్యాచ్‌ ఫిర్యాదుతో పెన్షన్‌ పంపిణీకి వాలంటీర్లు దూరం
►సచివాలయాలకు మంచాల్లో వృద్ధులు, వికలాంగులు
►పెన్షన్‌ పంపిణీ సజావుగా సాగకుండా పచ్చ  కుట్రలు
►ఐదేళ్ల నుంచి ఇంటి వద్దే పెన్షన్‌ తీసుకున్న లబ్ధిదారులు
►చంద్రబాబు కుట్రలకు ఓటుతోనే జావాబిస్తామంటున్న ప్రజలు

కాకినాడ: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ
సచివాయాలకు వచ్చి పింఛన్లు అందుకుంటున్న పెన్షన్ దారులు
జిల్లా వ్యాప్తంగా 2,83,544 మంది పింఛన్‌ దారులకు రూ.84.02 కోట్లు మూడు రోజుల పాటు పంపిణీ

► ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం..

ఎండలు కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభు­త్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనా­రోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్‌ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం తప్పనిసరిగా వారి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు ఫించన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాలవారీగా బ్యాంకులలో మంగళవారం రాత్రి నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల కోడ్‌ కారణంగా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు.  

తప్పనిసరిగా ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్ర­త్యే­కంగా నిర్ధారించిన వర్గాలు మినహా మిగి­లిన కేటగిరీ పింఛనుదారులందరికీ ఆయా గ్రా­మ, వా­ర్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీ చేపడతారు.  
 

ఒక గ్రామ సచివాలయం పరిధిలో వివిధ గ్రామాలు ఉన్నచోట్ల ప్రత్యేక సిబ్బందిని నియ­మించి పంపిణీ చేస్తారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కో సచి­వాలయం పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.  
 

వేగంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సిబ్బంది సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో పంపిణీకి సరిపడినంత మందిని ఇందుకోసం కేటాయించుకోవాలని సూచించారు.  


 

సచివాలయాల వద్దకు వచ్చే పింఛనుదారులకు ఎండల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. పంపిణీ సమాచారాన్ని గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని  సూచించారు.

► పింఛన్ల పంపిణీ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 

 సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 6వతేదీ కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  

ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలకు ఇంటి వద్దే పంపిణీ సందర్భంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి. 

పింఛన్ల పంపిణీని సచివాలయాల వద్ద లబ్దిదారుల ఆధార్‌ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్‌ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలో చేపట్టాలి. ఎవరైనా లబ్దిదారుడి విషయంలో ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తితే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ లేదా వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ ఆధర్యంలో రియల్‌ టైం బెనిఫిïÙయర్స్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌బీఐఎస్‌) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలి.  

ఫింఛన్లు పంపిణీ చేసే సమయంలో ప్రచారాలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. తప్పనిసరిగా ఎన్నికల కోడ్‌ను పాటించాలి. 

సచివాలయాల సిబ్బంది అందరికీ కొత్తగా  íపింఛన్ల పంపిణీకి సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియ లాగిన్‌లు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్‌ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement