సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్3 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది.
పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు
- సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ.
- దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్.
- మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ.
- ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్న సచివాలయాలు.
- ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది.
Comments
Please login to add a commentAdd a comment