YSR Pension Kanuka
-
ఏపీలో ఫించన్ పథకం పేరు మార్పు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అందుకు తగ్గట్లే మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తాలుకా గుర్తులనూ చెరిపేసే అడుగులు వేశారు. ఇందులో ఒకటే.. ఫించన్ల పథకం పేరు మార్పు. 2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఫించన్లు అందించేది. కాకపోతే.. లబ్ధిదారులు స్వయంగా వెళ్లి క్యూ లైన్లలో నిలబడి ఆ డబ్బును అందుకోవాల్సి వచ్చేది. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితి మారింది. ఫలితంగా.. గత ఐదేళ్లుగా వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట వలంటీర్ వ్యవస్థ ద్వారా..అదీ ఒకటో తేదీనే.. ఇంటికే పెన్షన్లు చేరేవి. అయితే ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకం పేరు మార్చేశారు. ఏపీలో ఫించన్ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధిరించారు. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది.రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు. -
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్‌లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న -
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
వైఎస్ జగన్ వచ్చేసారి మాత్రమే కాదు శాశ్వత సీఎంగా ఉంటారు: లబ్దిదారులు
-
ఏపీలో పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు ఇవే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్3 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 6 వరకు (మొత్తం నాలుగు రోజులు) పెన్షన్లను పంపిణీ జరగనుంది. అయితే సచివాలయ సిబ్బంది కొరత కారణంగా రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం విధివిధానాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ.. విధివిధానాలు సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్న సచివాలయాలు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది. -
పచ్చ కుట్ర: వృద్ధులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులకు అవస్థలు పడుతున్నారు. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ పడింది. కేంద్ర వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు ఇబ్బందులు తప్పదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే పెన్షన్ అందనుంది. దీంతో నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ జరిగేది. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: పింఛన్లపై బాబు డబుల్ గేమ్ -
కోడ్ ముగిసేదాకా.. సచివాలయాల్లోనే పింఛన్లు
సాక్షి, అమరావతి: ఎన్నికల నేపథ్యంలో వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌లు వేసినందున తిరిగి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు వచ్చే రెండు మూడు నెలల పాటు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పింఛన్ల పంపిణీని లబ్ధిదారుల ఇంటి వద్ద కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద చేపడతారు. సచివాలయాల వద్ద సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ లేదా ఐరిస్ వివరాలను నిర్థారించుకుని పెన్షన్లు అందచేస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని వారం క్రితమే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు మూడో తేదీ నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ► కోడ్ కారణంగా సచివాలయాల వద్ద జరిగే పింఛన్ల పంపిణీలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సచివాలయాల సిబ్బంది అందరి సేవలను వినియోగించుకోవాలని సెర్ప్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వలంటీర్ల ప్రమేయం లేకుండా కేవలం సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రమే ఫించన్ల పంపిణీని కొనసాగించాలని స్పష్టం చేసింది. ► గతంలో మాదిరిగానే సచివాలయాల వద్ద కూడ లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ లేదా ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలోనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ► పింఛన్లు పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు. ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల కోడ్ నియమాలను తప్పునిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ► సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదు డ్రా వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిట్నరింగ్ అధికారులకు ఆయా మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లు ముందుగానే తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయాలవారీగా విడుదల చేసే డబ్బుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను ప్రభుత్వమే జారీ చేస్తుంది. వాటిని సంబంధిత మండల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంటాయి. ► పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాల సిబ్బంది వద్ద అదనంగా ప్రింగర్ ప్రింటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది .అందరూ పింఛన్ల పంపిణీలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో ఏ రోజు ఎంత మందికి ఇచ్చారనే వివరాలను సేకరించడంతోపాటు సంబంధిత రోజు మిగిలిపోయే నగదును తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు అప్పగించారు. ► ఎవరైనా లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారికి ప్రత్యేకంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆధర్యంలో రియల్ టైం బెనిఫిషీయర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఆర్బీఐఎస్) విధానంలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించింది. ► ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపుపై అంక్షలు ఉన్నందున పింఛన్ల డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేసే బాధ్యతను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శితో పాటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అప్పగించగా వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో పాటు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు అప్పగించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందరికి కొత్తగా ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్లైన్ లాగిన్లను అందుబాటులో ఉంచుతున్నామని, తమ మొబైల్ ఫోన్లలో పింఛన్ల పంపిణీ యాప్‌ను సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవాలని సెర్ప్ సూచించింది. ఆయా సచివాలయాల పరిధిలో పింఛన్ లబ్ధిదారులందరి వివరాలు అక్కడ పనిచేసే సిబ్బంది మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
AP: పింఛన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు, బయో మెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే: సజ్జల -
అవ్వాతాతలపై బాబు పగ..
-
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పింఛను కానుక పంపిణీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయం(శుక్రవారం) నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల పింఛన్‌ను మార్చి ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు ప్రారంభించారు ఈ మేరకు పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,958.52 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పింఛను అందజేసే సమయంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రమాణీకరణ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛను అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పింఛన్లను నూరు శాతం పంపిణీ చేయాలని వలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00ల వరకూ 23.99 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. 15.87 లక్షల మందికి సుమారు రూ.469 కోట్లు పెన్షన్ల అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఠంఛన్‌గా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1961.13 కోట్లను విడుదల చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ పరిధిలో ఉండే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రూ.1,961.13 కోట్లను బుధవారం ఉదయానికే జమ చేసింది. ఆయా సచివాలయాల సిబ్బంది బుధవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీని దాదాపుగా పూర్తి చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. -
పింఛన్లపై రామోజీ వంచన రాతలు
-
జగనన్న వచ్చాడు...పెన్షన్ ఇచ్చాడు..
-
వృద్దులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ మోపిదేవి
-
పండుగలా పింఛన్ల పంపిణీ
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
-
సీఎం జగన్ పాలనలో అర్హులైతే చాలు పెన్షన్ అందిస్తున్నారు: కడుబండి
-
YSR Pension Kanuka Photos: ఏపీ వ్యాప్తంగా ఫించన్ కానుక సంబరాలు (ఫొటోలు)
-
ఈ అవ్వ మాటలు వింటే..ఆయన బాగుంటే అందరం బాగుంటాం
-
సీఎం జగన్ కు అవ్వాతాతలు పాలాభిషేకం..
-
సీఎం జగన్ పై పెన్షన్ లబ్ధిదారుల ప్రశంసలు
-
పేదల జీవితంలో ఆనందమే లక్ష్యం...
-
Andhra Pradesh: ఊరు మారింది
‘‘చంద్రబాబు హయాంలో పింఛన్ కేవలం రూ.1,000 మాత్రమే ఉండేది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే రూ.2 వేలు చేశారు. ఆ ఎన్నికలే రాకపోతే చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచేవారా?’’ – కాకినాడ సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా అవ్వా తాతలకు రూ.3,000 చొప్పున పింఛన్‌ను మన రాష్ట్రంలో మాత్రమే అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మాట నిలబెట్టుకుంటూ పింఛన్ మొత్తాన్ని పెంచి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా 66.34 లక్షల మందికి టంఛన్‌గా ఇంటి వద్దే చేతిలో పెడుతున్నామన్నారు. ఇందుకోసం నెలకు రూ.2 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరేలా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచామన్నారు. నాడూ నేడూ.. ఇదే రాష్ట్రం, అంతే బడ్జెట్, నిరుపేదలూ అదే సంఖ్యలో ఉన్నా చంద్రబాబు హయాంలో మేలు చేయాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? బటన్లు ఎందుకు నొక్కలేదు? ఇవాళ మీ బిడ్డ ఇవన్నీ ఎలా చేయగలుతున్నాడు? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అవ్వా తాతలకు పింఛన్ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుకుంటూ వెళతానంటూ నాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, వలంటీర్లు, వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానుల ఆధ్వర్యంలో ఈనెల 8వతేదీ వరకు ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాకినాడకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. క్యాలెండర్లో కాదు.. జీవితంలో మార్పు అవ్వాతాతల పెన్షన్ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతాం అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆదాయం, ఆనందం పెరగాలి. మరింత మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్లాలి. అలాంటి గొప్ప కార్యక్రమంలో ఇవాళ పాలు పంచుకుంటున్నా. నా వలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు.. పెన్షన్ తీసుకుంటున్న వీళ్లందరి పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే పెద్ద వయసు వల్ల గానీ, విధిరాత వల్ల గానీ తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నారు. అటువంటి 66.34 లక్షల మంది అవ్వాతాతలకు, అభాగ్యులకు, వితంతువులకు మంచి చేస్తూ మన ప్రభుత్వం సామాజిక పెన్షన్‌ను రూ.3,000 చేసింది. ఈ రోజు మనం పెన్షన్ల కోసం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. నెలలో ఒకటో తారీఖు మిగిలిన ప్రపంచానికి సెలవు, పండగ రోజు కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం, నా వలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూసే రోజు. సూర్యోదయానికి ముందే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వకు, తాతకు మంచి మనవడిగా, మనవరాలిగా చేయూతనిస్తున్న నా వలంటీర్లకు మాత్రం అది సెలవు రోజు కాదు. వెయ్యితో సరిపుచ్చిన బాబు.. మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల దాకా అవ్వా తాతలకు పెన్షన్ కేవలం రూ.1,000 ఇచ్చిన రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్నికలు రావడంతో రెండు నెలల ముందు మాత్రమే పెన్షన్ రూ.2 వేలు చేశారు. ఎన్నికలు రాకపోయి ఉంటే చంద్రబాబు పెంచేవారా? ఆలోచన చేయమని ప్రతి అవ్వా తాతను కోరుతున్నా. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పెన్షన్ కింద సగటున కేవలం రూ.58 వేలు మాత్రమే ఇవ్వగా ఇవాళ మీ బిడ్డ పాలనలో నాలుగున్నరేళ్లలో ప్రతి అవ్వాతాత చేతిలో పింఛన్ల కింద రూ.1.47 లక్షలు పెట్టాం. దివ్యాంగులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారి చేతుల్లో కనీసం రూ.1.82 లక్షలు పెట్టాం. నాడు పడిగాపులు, లంచాలు గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. నాడు పెన్షన్ కావాలంటే పడిగాపులు కాయాలి. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. మీది ఏ పార్టీ? అని మొదట ప్రశ్న అడిగేవారు. చాంతాడంత క్యూలో నిలబడాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడిస్తారో తెలియదు. అడుగడుగునా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే కానీ పని జరగని దుస్థితి. నేడు అర్హతే ప్రామాణికం ఈ రోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఇవాళ ఎక్కడా వివక్ష లేదు. ఎవరూ లంచం అడిగేవాడు లేడు. కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరికి ఏ పార్టీ అని కూడా ఎవరూ అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం.. నా కష్టంగా భావించి ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి చెల్లెమ్మకూ తోడుగా నిలబడే కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతోంది. కారణం.. మీ జగన్ ఇవాళ ఇంగ్లిషు మీడియం అంటే మీ జగన్! మంచి చదువులంటేనే మీ జగన్! ట్యాబ్లంటే మీ జగన్! గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్‌పీలు వచ్చాయంటే దానికి కారణం మీ జగన్! గత ప్రభుత్వం కంటే పెన్షన్ 3 రెట్లు పెంచింది ఎవరంటే దానికి కారణం కూడా మీ జగనే. ఇవన్నీ కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. మీ ఇష్టం.. ఏ గ్రామాన్నైనా తీసుకోండి ఇవాళ రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి కుప్పం దాకా ఏ గ్రామాన్నైనా తీసుకోండి. మీ ఇష్టం.. ప్రతి గ్రామంలోనూ మార్పు కనిపిస్తోంది. అడుగు పెడుతూనే ప్రతి గ్రామంలోనూ గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం గోచరిస్తుంది. అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. ప్రతి గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థతోపాటు ఇంటి వద్దకే అందుతున్న రేషన్, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ కనిపిస్తాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమూ కనిపిస్తుంది. నాడు–నేడుతో గ్రామంలో మారిపోయిన స్కూళ్లు, ఆస్పత్రులతో మన కళ్ల ఎదుటే మార్పులు కనిపిస్తాయి. మెరుగులు దిద్దిన 108, 104 కనిపిస్తాయి. గతంలో 1,050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇవాళ 3,250 ప్రొసీజర్లకు వర్తింపచేస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలబడ్డాం. రైతులకు పగటి పూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అండగా నిలబడుతున్నాం. వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్కూళ్లలో ఐఎఫ్‌పీ తరగతి గదులు కనిపిస్తాయి. కేవలం 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే చోటుచేసుకున్న మార్పులు ఇవన్నీ. మీరే.. మా స్టార్ క్యాంపెయినర్లు సామాన్యులే ప్రచార సారథులు రాజకీయ పార్టీలకు ప్రచార సారథులుగా సర్వ సాధారణంగా ఉద్దండులే ఉంటారు! వైఎస్సార్ సీపీకి మాత్రం నాలుగున్నరేళ్లుగా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు. ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యుల కోణంలోనే ఆలోచిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితే మీరే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని నిండు మనసుతో చెబుతున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కుట్రపూరిత పొత్తులు, కుయుక్తులను ఆయన ఎన్నడూ నమ్ముకోలేదు. మాట ఇస్తే నిలబెట్టుకోవాలనే ఆరాటం, విశ్వసనీయత చాటుకోవడమే లక్ష్యంగా వడివడిగా సాగుతున్నారు. మరి ఆ స్టార్ క్యాంపెయినర్లు ఏమంటున్నారో తెలుసుకుందామా? నా పెద్దబిడ్డ జగన్ ఉన్నాడనే ధైర్యం.. కాళ్లరిగేలా తిరిగినా గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వలేదు. మీరు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్ తీసుకున్నా. ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నా పిల్లలకు కూడా అన్నీ అందుతున్నాయి. ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటున్నా. కొడుకులు చూడకున్నా నాకు పెద్ద బిడ్డ జగన్ ఉన్నాడనే ధైర్యంతో ఉన్నా. కరోనా సమయంలో ఇంటికే బియ్యం ఇచ్చారు. మందులు పంపారు. ఆరోగ్యశ్రీలో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు. ఇంకేం కావాలి మాకు? మీరు మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. అలాగే చేస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకూ జగన్ బాబుకే ఓటేసి గెలిపించుకుంటా. – వరలక్ష్మి, లబ్ధిదారు, కాకినాడ నిస్సహాయ కుటుంబానికి నవరత్నాల నీడ.. కరోనా సెకండ్ వేవ్‌లో మా ఆయనకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించినా దురదృష్టవశాత్తూ చనిపోయారు. ఎలా బతకాలిరా దేవుడా అని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో వితంతు పింఛన్ వచ్చింది. కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ.50 వేలు కూడా అందాయి. ఆ డబ్బుతో చిన్న షాప్ పెట్టుకుని జీవిస్తున్నా. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.1.70 లక్షల దాకా లబ్ధి పొందా. మా అత్తకు పింఛన్ ఇస్తున్నారు. నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మీరు ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు. – కృష్ణవేణి, లబ్ధిదారు, కాకినాడ రూ.400 కోట్లు ఎక్కడ?.. రూ.2 వేల కోట్లు ఎక్కడ? గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ల కోసం నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కేవలం పెన్షన్ల కోసం నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంతో మొట్ట మొదటి రోజు నుంచే రూ.2,250కి పెన్షన్లను పెంచాడు. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్లి ఈ రోజు రూ.3,000 వరకూ తీసుకుని పోయాం. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులైన నా అన్నదమ్ముల ముఖంలో చిరునవ్వులు చూడాలని కోరుకున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ రూ.1,000 పెన్షన్?.. ఎక్కడ రూ.3,000 పెన్షన్? ఎక్కడ 39 లక్షల పెన్షన్లు?.. ఎక్కడ 66.34 లక్షల పెన్షన్లు? నెలకు 400 కోట్ల రూపాయలు ఎక్కడ? నెలకు రూ.2 వేల కోట్లు ఎక్కడ? ఒక్క పెన్షన్లే కాకుండా ఏ పథకాన్ని తీసుకున్నా గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించాలి. మీ బిడ్డ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నా. పేదల మీద ప్రేమ, వారికి తోడుగా ఉండాలనే తపనతో అడుగులు పడ్డాయి. ప్రతి అడుగులోనూ మార్పు కనిపిస్తోంది. పేదల పట్ల ప్రేమ కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పట్ల మంచి అన్నలా ఆప్యాయత కనిపిస్తోంది. -
సీఎం జగన్ పాలనలో అర్హులైతే చాలు పెన్షన్ అందిస్తున్నారు: రోజా
-
చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే: సీఎం
-
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
ముసలవ్వ స్పీచ్ కు దద్దరిల్లిన కాకినాడ
-
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. ►22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ►ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ►ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు ►కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు ►ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే ►అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు ►ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు ►అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు ►చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర ►అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది ►ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు ►ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి ►అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ ►కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు ►అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? ►అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు ►గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ►అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది ►చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు ►ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు ►గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు ►ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ►గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు ►45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం ►వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం. ►ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం ►అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం ►ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది ►ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ►రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది ►అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ►ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. ►గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి ►వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి ►1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం ►రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ►కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి ►ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్.. ట్యాబులంటే మీ జగన్ ►గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్ ►గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్ ►ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి ►ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది ►ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు ►కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ►రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ►అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా ►మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు ►మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు ►మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు ►మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు ►అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. -
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు (ఫొటోలు)
-
Live: వైఎస్ఆర్ పెన్షన్ కానుక..కాకినాడలో సీఎం జగన్ బహిరంగ సభ
-
పెన్షన్ పెంపు..కాకినాడలో పండగ వాతావరణం
-
సీఎం జగన్ కాకినాడ పర్యటన
-
నేడు కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామే: సీఎం జగన్
Updates: ►తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడలో ముగిసిన సీఎం జగన్ పర్యటన ►సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ►చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా?. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు. ►గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నాం. ►చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా పాట్నర్. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 చూపించవు. ►2014 ఎన్నికల్లో దత్తతండ్రి, దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు. ►53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నాం. ►ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం. ప్రతీ గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతీ గ్రామంలో మార్పు తెచ్చాం. ►ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం. నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించాం. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ప్రభుత్వమే మాత్రమే. చంద్రబాబు హయాంలో ఇవ్వన్నీ ఎందుకు జరగలేదు. ►రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని నేతలు వస్తారు. అలాంటి వారితో జాగ్రత్త’ అంటూ కామెంట్స్ చేశారు. ►కాకినాడలో ఆర్వోబీని ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►పింఛన్ల పెంపు ఉత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ►పింఛన్ల మొత్తం రూ.1,967.34కోట్ల మెగా చెక్ ఆవిష్కరణ ►సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడ చేరుకున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ►మరికాసేపట్లో ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న సీఎం జగన్ ►అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ ఫించన్ కానుక రూ.3 వేలకు పెంపు. ►అనంతరం నగరంలో రూ.94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించినున్న ముఖ్యమంత్రి జగన్ ►సీఎం జగన్ రాకతో జనసంద్రమైన కాకినాడ నగరం ►రోడ్ షోలో పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు ►కాకినాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3వేలకు పెంపును ప్రారంభించనున్న సీఎం సాక్షి, తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్. పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేయనున్నారు. పర్యటన ఇలా.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. వైఎస్సార్సీపీ రికార్డు.. ►గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ. 1,000.. ►ఐతే జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ ఒక్కో లబ్దిదారునికి రూ.3,000 ►గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు ►జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు ►గత ప్రభుత్వంలో సగటున ఖర్చు చేసిన మొత్తం నెలకు రూ. 400 కోట్లు మాత్రమే ►జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెలకు రూ. 1,968 కోట్లు, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాదాపు ఐదు రెట్లు అధికం ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు.. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
గడప వద్దే లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్న వలంటీర్లు
-
ఏపీలో ఉత్సహాంగా సాగుతున్న పింఛన్ల పంపిణీ
-
ఆంధ్రప్రదేశ్‌లో పండుగలా పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారులకు 3 వేల చొప్పున పింఛన్లు పంపిణీ ప్రారంభం...ఇంకా ఇతర అప్డేట్స్
-
అవ్వాతాతల కళ్లల్లో ఆనందం..ఆయన ఏం చేసినా ప్రజలు కోసమే
-
ఏపీలో పండుగలా పెన్షన్లు పంపిణీ
-
AP: పండుగలా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూ రు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లను విడుదల చేసింది. పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇలా సీఎం జగన్ తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో సోమవారం రాష్ట్రంలో పలు మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ పెన్షన్ లబ్దిదారులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. -
అవ్వాతాతలకు న్యూ ఇయర్ గిఫ్ట్..నేటి నుండి 3 వేలు పెన్షన్
-
ఆంధ్రప్రదేశ్‌లో ‘సామాజిక’ సంబరం.. 3 వేల రూపాయలకు పెంచిన ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ నేటి నుంచి పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: రేపటి నుంచి వైఎస్సార్ పెన్షన్ రూ.3000
సాక్షి, అమరావతి: రేపు(సోమవారం) ప్రజలంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొత్త ఏడాది నుంచి ఏపీలో పెన్షనర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుక మూడు వేలకు పెరగనుంది. పెన్షన్‌దారులకు మూడు వేలు అందనున్నాయి. కాగా, సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా జగనన్న ప్రభుత్వం మనసుతో పెంచి ఇస్తున్న.. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్, పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ఇకపై ప్రతీ నెలా రూ.3,000 ►రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, గ్రామస్తులు అందరూ ఒకటో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ►3 జనవరి, 2024న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటూ, పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేయనున్నారు. ►దీంతోపాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డుల పంపిణీ. ►దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►గత పాలనలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ కేటగిరిలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ.1,000. అయితే, జగనన్న ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి పెన్షన్ నెలకు రూ. 2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ రూ.3,000 దాకా తీసుకొచ్చింది. ప్రతీ నెలా ఠంచన్‌గా అందిస్తూ.. ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
66 లక్షల మంది పెన్షనర్లకు సీఎం జగన్ లేఖ
-
పింఛన్ రూ.3,000.. లబ్ధిదారులకు సీఎం లేఖ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు దేశంలో రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. ఒకటవ తేదీన వలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ, వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి, జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రియమైన అవ్వాతాతలకు.. మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు 2024 జనవరి 1 నుంచి.. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక మీ చేతికి అందే పెన్షన్ రూ.3000 అవుతుంది. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను.. కష్టాలు, కన్నీరు తుడిచే వారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను నేను స్వయంగా చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి.. మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూ.చా. తప్పక పెన్షన్లను పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో అందిస్తునందుకు సంతోషిస్తున్నాను. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం రూ.1,000 ఉండేది. ఆ ఐదేళ్లలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూ.58 వేలు. అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి.. కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికీ సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ, పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు, పెన్షన్ తీసుకోవడానికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు. కానీ, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీన.. అది ఆదివారమైనా, మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెపుతూ మన వలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి, ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు.. మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా.. మనది మనసున్న ప్రభుత్వం. మనది పేదలు, మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వం. దేశంలోనే రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతోనే ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని.. ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ.. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమతో మీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఒకటి నుంచి పెరిగిన పింఛన్ల పంపిణీ
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.2,750ను రూ.3 వేలకు పెంచినట్టు డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. పెరిగిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి ఒకటి నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 3న కాకినాడలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని, అదే రోజు కలెక్టరేట్ కార్యాలయాల్లో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, మంత్రులు, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 18 రకాల పింఛన్లు 2,44,840 ఉన్నాయని, వాటికి రూ.67.57 కోట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. వీటిలో 8 రకాల పింఛన్లను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచడం ద్వారా పంపిణీ సొమ్ము రూ.72.66 కోట్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,44,840లకు అదనంగా ఆరునెలలకు ఒకసారి కొత్తగా మంజూరయ్యే పింఛన్లు సుమారు 10,000 వరకూ ఉన్నాయన్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతుందని, దీంతో పింఛన్లు 2,54,000కు చేరుకుని, వీటి పంపిణీ నిమిత్తం రూ.75 కోట్లు వరకూ ఖర్చు అవుతుందన్నారు. నిడదవోలు అర్బన్‌లో జనవరి ఒకటో తేదీన, నిడదవోలు రూరల్, తాళ్లపూడి, గోకవరం, దేవరపల్లి మండలాల్లో రెండున, అనపర్తి, కడియం, సీతానగరాల్లో మూడున, పెరవలి, బిక్కవోలు, చాగల్లు, కొవ్వూరు రూరల్, కొవ్వూరు అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం అర్బన్, రాజానగరాల్లో నాలుగున, గోపాలపురం, రంగంపేటల్లో ఐదో తేదీన, కోరుకొండ, నల్లజర్ల, ఉండ్రాజవరం మండలాల్లో ఆరున పింఛన్ల పంపిణ జరుగుతుందన్నారు. -
అవ్వాతాతలకు పెన్షన్ల పెంపు మొదలు ఎన్నికల హమీలన్నీ పూర్తిగా నేరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటన ..ఇంకా ఇతర అప్డేట్స్
-
అవ్వాతాతల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు
-
సీఎం జగన్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం
-
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల నుంచి అవ్వాతాతల వైఎస్సార్ పెన్షన్ కానుక 3 వేల రూపాయలకు పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..ఇంకా ఇతర అప్డేట్స్
-
అవ్వాతాతల వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు
-
అవ్వాతాతల వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వా తాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ బాధితులకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను అందజేయనున్నారు. ఈ పెన్షన్‌ను డిసెంబర్ నుంచే రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ జీఓ జారీచేశారు. పెరిగిన పెన్షన్‌ను జనవరి 1న పింఛన్‌దారులకు అందజేయనున్నట్లు ఆ జీఓలో పేర్కొన్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నూటికి నూరు శాతం అమలుచేసి చూపించారు. నాడు రూ.400 కోట్లు.. నేడు రూ.2వేల కోట్లు.. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు అర్హులైన దాదాపు 23 లక్షల మంది కొత్త వారికి వైఎస్సార్ పెన్షన్ కానుకను మంజూరు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల నిమిత్తం నెలనెలా సరాసరిన రూ.400 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్‌తో ఏకంగా రూ.2,000 కోట్లు వ్యయం చేస్తోంది. నిజానికి.. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయకుండా ఎవరైనా మృతిచెందితేనే వారి స్థానంలో కొత్తవారికి మంజూరు చేసేవారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాత్రం సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్లను మంజూరు చేస్తోంది. ఇక సామాజిక పెన్షన్ల కోసం నెలకు రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉదంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమే. -
AP: ఏపీలో పెన్షన్ మూడు వేలకు పెంపు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్ అమలులోకి రానుంది. ఏపీలో పెన్షన్‌దారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి రూ.3వేల పెన్షన్ అమలులోకి రానుంది. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. -
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచుతున్న ప్రభుత్వం
-
పెన్షన్ తో మూడు పూటలా తింటున్నం..
-
దేశ చరిత్రలోనే అత్యధిక పెన్షన్..చెప్పాడంటే..చేస్తాడంతే
-
3 వేలు పెన్షన్ పై లబ్ధిదారులు హర్షం
-
ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
-
వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
65.33 లక్షల మందికి రూ.1,800.96 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,33,781 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డిసెంబర్ 1న ఠంచన్‌గా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800.96 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం పేర్కొన్నారు. పింఛన్ నగదును ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించినట్లు చెప్పారు. సచివాలయాల వలంటీర్లు శుక్రవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. లబ్ధిదారులకు పింఛన్ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలను అమలు చేస్తున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదు రోజుల్లోనే నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15 వేల మంది సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు భాగస్వాములు అవుతారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు. -
ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల పై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు
-
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ఒకటో తేదీనే అవ్వాతాతల చేతికి పింఛన్
-
వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3,000
విజయనగరం అర్బన్: అవ్వాతాతలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రస్తుతం ఇస్తున్న రూ.2,750 పింఛన్ డబ్బులను మరో రూ.250 పెంచి రూ.3,000 అందజేస్తామని సోమవారం ప్రకటించారు. దీంతో రెండు వారాల ముందుగానే అవ్వాతాతలకు దసరా పండగ వచ్చినట్టయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి విజయవాడ వేదికగా చేసిన ప్రకటనతో పింఛన్‌దారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.2వేలు ఉన్న పింఛన్‌ను రూ.250 పెంచుతూ జగన్మోహన్రెడ్డి తొలిసంతంకం చేశారు. అప్పటి నుంచి ఏటా జనవరిలో రూ.250 చొప్పున పెంచుతూ ప్రస్తుతం రూ.2,750 అందజేస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారులు ఇలా.... విజయనగరం జిల్లాలో కొత్తగా 11,400 మందికి పింఛన్లు మంజూరు చేశారు. వీరితో కలిపి వివిధ కేటగిరీల్లో మొత్తం 2,83,764 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం రూ.2,750 చొప్పున వీరందరికీ ప్రతినెలా రూ.78.31 కోట్లను ప్రభు త్వం అందిస్తోంది. జనవరి నుంచి రూ.250 పెంచిన తరువాత రూ.3 వేల చొప్పున రూ. 85.42 కోట్లు ప్రతినెలా పింఛన్‌దారులకు అందనుంది. జనవరి నుంచి అదనంగా మరో రూ.9.11 కోట్లు జిల్లాలోని పింఛన్‌దారులకు ప్రభుత్వం కేటాయించనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్‌దారులకు రూ.వెయ్యి ఇచ్చే వారు. 2019 సార్వ త్రిక ఎన్నికలకు నాలుగునెలల ముందు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీకొట్టిన టీడీపీ ప్రభుత్వం పింఛన్‌ను రూ.2 వేలకు పెంచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.2,750 చేసింది. మరోవైపు దివ్యాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.5 వేలు చొప్పున పింఛన్ డబ్బులు అందజేస్తోంది. కొత్త సంవత్సరం నుంచి రూ.3వేలు పింఛన్ వైఎస్సార్ పింఛన్ కానుక వచ్చే ఏడాది జనవరి నెల నుంచి రూ.250 పెంచుతూ మొత్తం రూ.3 వేల ఇవ్వనున్నాం. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెలా రూ.78.31 కోట్లను పింఛన్‌దారులకు అందజేస్తున్నాం. పెరిగిన మొత్తంతో కలిపి ఇప్పుడున్న పింఛన్‌దారులకు జనవరిలో రూ.85.42 కోట్లను అందజేస్తాం. – ఎ.కళ్యాణచక్రవర్తి, పీడీ, డీఆర్డీఏ -
‘వైయస్ఆర్ పింఛను కానుక’ పథకం ఇది కానుక మాత్రమే కాదు ఎందరికో ఆధారం.. ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసా.
-
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 65.78 లక్షల మంది పెన్షనర్లకు రూ. 1813.60 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రతీ నెల మాదిరిగానే ఒకటో తేదీ తెల్లవారుజామునుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00 ల వరకూ 25.58 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది. 16.82 లక్షల మందికి రూ.463.41 కోట్లు అందజేశారు వాలంటీర్లు. -
లోకేష్ చేపట్టింది యువ గళం పాదయాత్ర కాదు.. యమ గళం
-
అవ్వాతాతల పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం రికార్డు
-
మేము ఆదివాసులం.. మా గడప గడపకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు
-
మాలాంటి ఎంతోమందికి వైయస్ఆర్ పింఛను కానుక భరోసా
-
ఏ దిక్కు లేని నాకు జగన్ పెద్ద కొడుకు అయ్యాడు
-
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
-
జగనన్న వచ్చిన తర్వాత మాకు అంతా మంచే జరుగుతుంది
-
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నతి లోన్ ద్వారా మా కుటుంబానికి భరోసా ఇచ్చారు
-
ఏపీలో పెన్షన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పంపిణీ (ఫొటోలు)
-
ఏపీలో ఉత్సాహంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ
-
AP: పింఛన్ల పండగ.. తెల్లవారుజామునుంచే పంపిణీ మొదలుపెట్టిన వాలంటీర్లు
AP: పింఛన్ల పండగ.. తెల్లవారుజామునుంచే పంపిణీ మొదలుపెట్టిన వాలంటీర్లు -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
-
AP: రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పింఛన్ పంపిణీ
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుఝాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 63. 33 లక్షల మంది పెన్షనర్ల కోసం.. రూ. 1,747.38 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా.. వృద్ధులు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆసరా కోసం పింఛన్లు నెలవారీగా అందజేస్తూ వస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఈ నెలకుగానూ రూ. 1,747.38 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ కోసం నిధులను శనివారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయడు వెల్లడించారు. పించన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉన్నా.. అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయాల్లోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్డీఏ పీడీ కార్యాలయాల్లోనూ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఏమాత్రం శ్రమ, ఇబ్బందులు లేకుండా ఇంటికే వలంటీర్లు పెన్షన్లు వెళ్లి అందజేస్తూ వస్తున్నారు. ఈ జనసంక్షేమ పథకం కోసం నిధుల కేటాయింపు విషయంలో వెనకడుగు వేయట్లేదు సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో బయటపడ్డ మరో మార్గదర్శి స్కాం -
‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ‘జగన్‌బాబు దేవుడయ్యా... ఇంట్లో పిల్లలు పట్టించుకోకపోయినా ప్రతి నెలా ఒకటో తేదీకల్లా జీతం ఇచ్చినట్లు వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపి మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు. పిల్లల ఆదరణలేని అనేకమంది వృద్ధ దంపతులను సొంత కొడుకులా ఆదుకుంటున్నాడు. జబ్బు చేసినా పెద్ద వైద్యం చేయించి ఆదరణ లేని మాలాంటి ముసలోళ్లను కాపాడుతున్నాడు..’ అంటూ కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వృద్ధుడు మోపిదేవి లీలాజలం కన్నీరు పెట్టుకున్నాడు. పెదపట్నంలో మంగళవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ‘జగనన్నే మా భవిష్యత్’లో భాగంగా గ్రామ సర్పంచ్ గడిదేసి అనూష, వైఎసాస్ర్సీపీ నాయకుడు గడిదేసి రాజు తదితరులు పెదపట్నంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు ఈ క్రమంలో 85 ఏళ్ల వయసు కలిగిన మోపిదేవి లీలాజలం అనే వృద్ధుని ఇంటి వద్దకు వెళ్లగా... ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తమకు కలిగిన మేలును వివరిస్తూ ఆనందంతో కన్నీరుపెట్టారు. -
Fact Check: ‘అక్కసు’కి అంతే లేదు.. పింఛన్లపై ‘ఈనాడు’ తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ అక్కసుకు అవ్వా తాత, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగులు.. ఇలా ఎవరూ అతీతం కాదు. ఎవరికి మంచి జరిగినా తన ఓర్వలేనితనాన్ని అక్షర రూపంలో కక్కుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ప్రజలకు చేస్తున్న మంచి కార్యక్రమాలపై అసత్య వార్తలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏనాడూ ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబుని తిరిగి పీఠం ఎక్కించడమే లక్ష్యంగా ఈనాడు అబద్ధపు కథనాలు సాగుతుంటాయి. ఇందులో భాగంగానే అవ్వాతాతలకు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ఇచ్చే పింఛనుపైనా తన అక్కసును వెళ్లగక్కింది. ప్రభుత్వం ఆలోచన కూడా చేయని విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ పచ్చి అబద్ధాలను అచ్చేసింది. ‘పింఛనుదారులపై మరో పిడుగు’ అంటూ మంగళవారం ఈనాడు పత్రికలో వచ్చిన కథనంపై ‘ఫ్యాక్ట్ చెక్’. ఈనాడు కథనం: ‘పింఛనుదారులపై మరో పిడుగు. సచివాలయానికి 15 కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటేనే పింఛను అందించే వీలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వాస్తవం: ‘ప్రభుత్వం సంతృప్త స్థాయిలో దాదాపు 63.42 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. సూర్యుడు ఉదయించక ముందే పింఛన్లను గ్రామ వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి అందించే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. పింఛన్లను మరింత సులభతర మార్గంలో అందించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లబ్దిదారులు సెక్రటేరియట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకునేందుకు జియో ఫెన్సింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి సాఫ్ట్వేర్ నమూనాలో అధికారులు చిన్న మార్పు చేశారు. పింఛన్లు మరింత సమర్ధంగా, అత్యంత సులభంగా అందించడానికి అవసరమైన సమాచార సేకరణలో భాగంగా మాత్రమే.. అదీ ప్రయోగాత్మకంగానే జరుగుతుందని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. ‘ఈనాడు’ కథనం: సచివాలయం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వలంటీర్లు పింఛన్లు అందించే సదుపాయం ఉంటుంది. 15 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంటే పింఛను అందించే అవకాశం వలంటీర్లకు ఉండదు. వాస్తవం: ప్రభుత్వం ఉత్తర్వులే జారీ చేయనప్పుడు 15 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలో ఉన్నవారికి పింఛన్లు అందించరన్నది పూర్తిగా తప్పు. అర్హులకు పింఛను ఎలా ఇవ్వాలో అనే ఆలోచనే తప్ప ఎలా ఎగ్గొట్టాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. నా మనవడు జగనయ్య చల్లగా ఉండాలయ్యా.. ఈ చిత్రంలో నడవలేని స్థితిలో మంచంపై కూర్చొని ఉన్న వృద్ధురాలి పేరు రామలక్షుమ్మ. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఎస్బీఐ కాలనీలో ఉంటోంది. ఆ ప్రాంత వలంటీర్ భాస్కర్ ఉదయాన్నే ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. దీంతో రామలక్షుమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. నా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ దీవించింది. పేదల పక్షపాతి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ, కులం, మతం అన్న తారతామ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యి నాలుగేళ్లు పూర్తి కాకమునుపే దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా ఏకంగా సుమారు రూ.2 లక్షల కోట్లపైగా పేద ప్రజలు నేరుగా లబ్ధి పొందారు. అందుకే సీఎం జగన్ పేదల పక్షపాతిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయని చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియాకు ఇది మింగుడు పడని విషయమే. అందుకే వైఎస్ జగన్‌పై విషం చిమ్మి, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయాలన్న కుయుక్తులతో ‘ఈనాడు’ తప్పుడు కథనాలు రాస్తోంది. ఉద్దేశపూర్వక విష ప్రచారంపై చర్యలు తీసుకుంటాం: సెర్ప్ ‘పింఛనుదారులపై మరో పిడుగు’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం ఖండించింది. ‘ఈనాడు పత్రిక అసత్య వార్తలు రాయడం ద్వారా ప్రజలు, పింఛను లబ్దిదారులకు తప్పుడు సమాచారం అందించినట్టు అవుతుంది. తప్పుడు రాతలతో లబ్దిదారులను ఆందోళనకు గురిచేసినట్టు అవుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విష ప్రచారంగానే భావిస్తూ, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సెర్ప్ కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడానో.. ♦ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అవ్వా తాతలు, వితంతువుల, దివ్యాంగులు పింఛను మంజూరు చేయండంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కష్టనష్టాలకోర్చి ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా పింఛను మంజూరయ్యేది కాదు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పింఛను మంజూరుకు లబ్దిదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హులు ఉంటే గ్రామ, వార్డు వలంటీర్లే వారి వద్దకు వెళ్లి దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయంలో దానిని అందజేస్తారు. అర్హతల మేరకు వారికి పింఛను మంజూరు కాగానే ఆ మంజూరు పత్రాన్ని ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు. ♦ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి నియోజకవర్గానికి 200 – 300 కొత్త పింఛన్లు మంజూరు చేసేది. వాటిని కూడా జన్మభూమి కమిటీ (ఆ కమిటీల్లో ఉండేది ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే) సభ్యులు మంజూరు చేసేవారు. కేవలం తమ పార్టీకి ఓటు వేసిన వారికి లేదంటే లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేసేవారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం మూడేళ్లలోనే 24.69 లక్షల కొత్త పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ♦ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవ్వాతాతలు, దివ్వాంగులు ఎవరైనా పింఛను కావాలంటే ప్రతి నెలా ఆ ఊరిలో ఆఫీసుకు వెళ్లి పడిగాపులు పడాలి. తమ ఊరిలో ఎప్పుడు పింఛన్ల పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి ఎండలో కూర్చొని ఉసూరుమంటూ తిరిగి వెళ్లే దయనీయ పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పింఛనుదారులకు ఈ బాధలు తప్పాయి. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు లేదా వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పింఛను అందజేసే విప్లవాత్మక మార్పునకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయి. ఎవరికీ పైసా ముట్టజెప్పాల్సిన అవసరం లేకుండానే పింఛను సొమ్ము మొత్తం చేతికి వస్తోంది. ♦ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల పంపిణికీ నెలకు సరాసరిన కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ. 1,750 కోట్ల దాకా ఖర్చు పెడుతోంది. ‘‘పింఛనుదారులపై మరో పిడుగు’’ అంటూ 04–04–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన వార్తను ప్రభుత్వం ఖండిస్తోంది. ఇది తప్పుడు వార్త. సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా దీన్ని రాశారు. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. 1/5 pic.twitter.com/U22dGTOTVD — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) April 5, 2023 -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ
-
YSR Pension Kanuka: ఒక పోస్ట్‌మాస్టర్ పెన్షన్ కథ!
నాపేరు తబ్బిబ్బు మహానందప్ప. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జన్మించాను. ఆ కాలంలోనే అంటే 1961 లో పీయూసీ చదివి కర్నూల్ మెడికల్ కాలేజీలో 1961–63 సంవత్సరాలలో 3 సంవత్సరాల కాంపౌండర్ కోర్సు, 1965లో హిందీ ప్రవీణ ప్రచారక్ కోర్సులను పూర్తి చేశాను. ఆ తర్వాత 1970లో గ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చూసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడ్డాను. పోస్ట్ మాస్టర్ ఉద్యోగం అదనపు శాఖా ఉద్యోగం (ఈడీ) కావడంతో జీతం చాలా తక్కువ వచ్చేది. ఉద్యోగం ప్రారంభంలో నా జీతం 30 రూపాయలు మాత్రమే. అలవెన్సు కింద మరో 15 రూపాయలు ఇచ్చేవారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 36 ఏళ్ళు పనిచేసి 2006 సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనిదే అయినా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ లేదు. పోస్ట్ మాస్టర్‌గా సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ కంటి తుడుపుగా గ్రాట్యుటీ పేరుతో కేవలం 48 వేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపారు. ఆ డబ్బులు కనీస అవసరాలను కూడా తీర్చలేక పోయాయి. అరకొర జీతంతోనే మా బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సేవలను అందించాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా బ్రాంచ్ ఆదాయం నెలకు రెండువేల రూపాయలు ఉండేది. నేను రిటైర్ అయ్యే నాటికి ఆ ఆదాయం నెలకు 25 వేల రూపాయలకు పెరిగింది. నా జీతం మాత్రం ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందాన పదవీ విరమణ నాటికి 2,800 రూపాయలే. గ్రామీణ ప్రజలకు తపాలా సేవలను అందించడంతోపాటు కాంపౌండర్‌గా శిక్షణ పొంది ఉండటంవల్ల వైద్యసేవలు కూడా అందించాను. పదవీ విరమణ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మాత్రమే కనబడింది. నా జీవన పోరాటంలో భాగంగా మైదుకూరులో నివాసం ఉంటూ ఈ వయసులో కూడా వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలం, గుడిపాడులో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో పార్ట్ టైం హిందీ బోధకుడిగా పనిచేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం అందచేసే ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ కింద గత నెల దాకా 2,500 రూపాయలు అందించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని మరో 250 రూపాయలు పెంచడం ఆనందదాయకం. పెరిగిన మొత్తంతో కలిపి 2,750 రూపాయలు జనవరి 1వ తేదీ కానుకగా అందుకున్నాను. మా వార్డ్ వాలెంటీర్ ‘యాష్మిన్’ అనే అమ్మాయి ప్రతి నెలా ఒకటో తేదీనే మా ఇంటి కొచ్చి ఠంచనుగా పింఛన్ అందచేస్తోంది. ఈ పింఛనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. (క్లిక్ చేయండి: అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం) – టి. మహానందప్ప, రిటైర్డ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మైదుకూరు -
TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!
సాక్షి, చిత్తూరు(పలమనేరు): టీడీపీ నాయకులు గురువారం మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన ఇద్దరు దివ్యాంగులు, వారి తల్లిని పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయానికి పిలిపించి, వారితో అయ్యా.. తమకు పింఛన్ రాలేదని చెప్పించి, డ్రామా ఆడించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ ఇదంతా ఒట్టి డ్రామానేనని అధికారులు తేల్చారు. ఆ నిజాన్ని మళ్లీ సోషల్ మీడియాలో పెట్టి, నిరూపించారు. ఈ సంఘటన గురువారం పలమనేరులో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పచ్చినిజాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన వీరమ్మ(55)కు వితంతు పింఛను ప్రతినెలా రూ.2750, ఈమె కుమారులైన శంకరయ్య(25), లక్ష్మీనారాయణ(24)కు దివ్యాంగ పింఛన్లుగా ఒక్కొక్కరికి రూ.3 వేలు మొత్తం రూ.8,750 ప్రతినెలా అందుతోంది. ఈ నేపథ్యంలో పింఛన్ల సామాజిక తనిఖీలో భాగంగా గతనెల 27న గంటావూరు సచివాలయ అధికారి జలంధర్, వెల్ఫేర్ సెక్రటరీ శివకుమార్ వారికి సిక్స్‌స్టెప్ వ్యాలిడేషన్ ఫారాలను ఇచ్చారు. గత నెల 28న వారి ఇంటిని కొలచి, రికార్డులోకి ఎక్కించారు. నిబంధనల మేరకు ఇల్లు ఉండడంతో పింఛన్లుకు అర్హులేనంటూ ఆన్లైన్లో వారికి పెన్షన్ మంజూరు చేశారు. చదవండి: (నువ్వు గెలవలేవు.. నన్ను ఓడించలేవు) ఈనెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఆ వార్డు వలంటీర్ సింధు, అక్కడి పంచాయతీ కన్వీనర్లు, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలసి ఆ కుటుంబంలోని ముగ్గురికి పింఛన్లను అందజేశారు. ఇందుకు సంబంధించి వారు సంతకాలు చేశారు. అయితే వారిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఇకపై మీకు పింఛన్లు రావని బెదిరించినట్టు తెలిసింది. పింఛన్లు నమ్ముకుని బతికే తమకు వచ్చేనెల పింఛన్లు రావేమోనని వారు టీడీపీ నాయకులు సూచనలతో పట్టణంలోని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఇంటి ముందు ఆర్తనాదాలు చేస్తూ వెళ్లి తమ కుటుంబంలో అందరికీ పింఛన్లు తొలగించారని చెప్పడం, ముందుగానే పథకం పన్నిన టీడీపీ నేతలు ఆ సంఘటనను వీడియో తీసి, సోషల్ మీడియా వైరల్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, అక్కడి కౌన్సిలర్లు రవి, కన్వీనర్ జాఫర్ అక్కడకు వెళ్లి వాస్తవాలను మళ్లీ వారినోటే చెప్పించారు. వారు పింఛను తీసుకున్నట్టు ఆధారాలను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రభుత్వం అర్హులకు పింఛన్లులిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జనం అసహ్యహించుకుంటున్నారు. -
జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలి: టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు
సాక్షి, పెళ్లకూరు(తిరుపతి జిల్లా): పార్టీటలకు అతీతంగా పారదర్శకమైన పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు కొనసాగాలని పెళ్లకూరు టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బత్తిన రత్నయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆయన 1985లో టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్ద ఉంటున్నారు. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి పలకరించడంతో ఆయన తన వయస్సు 70 ఏళ్లు అని చెప్పడం, దానికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్లైన్లో పొందుపరిచిన వెంటనే కొత్తగా పింఛన్ మంజూరైంది. పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బత్తిన రత్నయ్య నాయుడు కూడా పింఛన్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. చదవండి: (Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?) -
సీఎం జగన్ వల్లే మాకు మేలు
పిఠాపురం: కాకినాడ జిల్లా తాటిపర్తికి చెందిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న సత్యనారాయణకు చేనేత పింఛన్, ఆయన మనవరాలికి దివ్యాంగ పింఛన్ వచ్చింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం పింఛన్లు అందించారు. తొలిసారి పింఛన్ అందుకున్న సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం వైఎస్ జగన్ దయ వల్లే తనకు పింఛన్ రావడంతో పాటు తన మనవరాలు వైకల్యాన్ని జయించిందన్నారు. ‘నా మనవరాలు లిఖితశ్రీ పుట్టుక నుంచే దివ్యాంగురాలు(మూగ, చెవుడు). మాది నిరుపేద కుటుంబం. ఆపరేషన్ చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకుంటోందని తెలిసి.. అధికారులను కలిశాను. వారు ఒక చెవికి ఆపరేషన్ మాత్రమే చేస్తామని, సీఎం జగన్‌ను కలుసుకుంటే పూర్తిగా ఆపరేషన్ చేసే అవకాశం ఉందన్నారు. తాను టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడిని అయినందున తనకు సాయం చేస్తారో లేదోనని భయపడ్డాను. కానీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చొరవతో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. విపక్ష పార్టీ వాడినని చూడకుండా ఆయన వెంటనే ఎంత ఖర్చయినా పాపకు వినికిడి, మాట వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మా మనవరాలికి చెవులకు ప్రభుత్వమే రూ.14 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించడమే గాక, ఏడాదిన్నర పాటు ఉచితంగా మందులు కూడా ఇచ్చింది. ఇప్పుడు నా మనవరాలు కోలుకుంది. దానికి సీఎం వైఎస్ జగనే కారణం’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. -
కనికరించిన పింఛన్!
పెరవలి: ఆమె పేరు దోనెల కృష్ణవేణి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి. 35 ఏళ్ల వయసున్న ఆమె పుట్టుకతో దివ్యాంగురాలు(మూగ,చెవుడు). అవివాహితురాలైన ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణవేణికి వికలాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో వైకల్యం 30 శాతమేనంటూ తిరస్కరించారు. జన్మభూమి కమిటీలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఇక ప్రయత్నాలు మానుకున్నారు. అయితే వీరి విషయం తెలుసుకున్న పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్ చొరవ తీసుకుని ఎంపీడీవో రమేష్‌కు చెప్పి కృష్ణవేణి వికలాంగ పింఛన్ దరఖాస్తును ఆన్లైన్ చేయించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్నాయుడి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఎంపీపీ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఈ దరఖాస్తును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరు చేయించారు. బుధవారం ఖండవల్లిలో నిర్వహించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తల్లి లక్ష్మీపార్వతితో కలసి కృష్ణవేణి పింఛన్ అందుకుంది. ఆ సమయంలో తల్లీ కూతుళ్ల ముఖాల్లో చెప్పలేని ఆనందం తొణికిసలాడింది. సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలి.. అప్పుడే మాలాంటోళ్లకి మేలు జరుగుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
జన గోదారి!
రాజమహేంద్రవరం నుంచి సాక్షిప్రతినిధి: పెన్షన్ పెంపు వారోత్సవాల సభకు తరలివచ్చిన జనసందోహంతో గోదారమ్మ పులకించిపోయింది. రూ.2,500 నుంచి రూ.2,750కి పింఛన్ల పెంపు వారోత్సవాలలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటున్నారని తెలిసి వృద్ధులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రాజమహేంద్రవరం తరలివచ్చారు. సభాస్థలి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ముఖ్యమంత్రి జగన్ రాకకు అరగంట ముందుగానే కిక్కిరిసింది. పలువురు లోపల ఖాళీ లేకపోవడంతో రోడ్లపైనే నిలుచుని ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యాక తిరుగుముఖం పట్టడం కనిపించింది. నగర వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మున్సిపల్ స్టేడియంలోని హెలీపాడ్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్, డీలక్స్ సెంటర్, సాయికృష్ణా ధియేటర్, రంభ ఊర్వశి మేనక థియేటర్, చర్చిగేట్, ఆర్యాపురం, నందంగనిరాజు జంక్షన్, వై జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు దారికిరువైపులా ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్టేడియం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకోవడానికి సీఎంకు అరగంటపైనే పట్టింది. ► సీఎం జగన్ తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ నిరీక్షిస్తున్న పలువురి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. ఆధార్ నమోదు కేంద్రం స్టాల్ వద్ద వృద్ధురాలు జి.చెల్లాయమ్మను పలకరించగానే భావోద్వేగానికి గురై నిలబడేందుకు ప్రయత్నించింది. ఆమెను సీఎం వారిస్తూ మోకాళ్లపై కూర్చోవడంతో చల్లగా ఉండాలని, మళ్లీ నువ్వే సీఎంగా వస్తావయ్యా అంటూ దీవించింది. ► కల్లుగీత, నేత కార్మికులు, చర్మకారులు, డప్పు వాయిద్యకారులు, ట్రాన్స్జెండర్లు తదితర పెన్షన్‌దారులతో సీఎం మాట్లాడి సమస్యలను సావధానంగా ఆలకించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ధవళేశ్వరానికి చెందిన కోరుమిల్లి మేఘన పరిస్థితిని తండ్రి రాజన్న ప్రసాద్ సీఎం దృష్టికి తేవడంతో సమస్య పరిష్కరించాలని తూర్పుగోదావరి కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. అనంతరం పెన్షన్‌దారులతో ముఖ్యమంత్రి గ్రూపు ఫొటో దిగారు. బస్సులో ఉన్నా, ప్రజల గురించే.. సభా ప్రాంగణానికి సీఎం జగన్ బస్సులో వెళుతుండగా ఆర్ట్స్ కాలేజీ వై.జంక్షన్ వద్ద ఓ మహిళ పాపను ఎత్తుకుని పరుగులు తీస్తుండటాన్ని అద్దంలో గమనించి వెంటనే వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన చెట్టి సూర్యకుమారిని దగ్గరకు పిలిచి ఆమె కుమార్తె డయానా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. పుట్టిన ఏడో నెల నుంచే స్పైనల్ మస్కిలర్ ఎట్రోపి టైప్–2 వ్యాధితో నడవలేని స్థితిలో ఉందని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతం కావడంతో పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. ఉద్యోగం పోయింది.. ఆదుకోండి సారూ తన భార్య ప్రసన్న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, కుమార్తె కీర్తన బ్లెస్సీ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు గుండెకు రంధ్రం పడిందని, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఆర్నెల్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారని రాజమహేంద్రవరం తుమ్మలావకు చెందిన సిరికొండ సురేష్ సీఎం జగన్ ఎదుట విలపించాడు. మంత్రులు, ఎంపీలు చెప్పినా ఏఈ, ఎంఈలు ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ రోదించాడు. తల్లీ బిడ్డలకు వైద్య సేవలందించడంతో పాటు సురేష్ ఉద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం సూచించారు. సొరియాసిస్ బాధిత చిన్నారికి పెన్షన్, వైద్యం.. పుట్టుకతో సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న తన మూడేళ్ల కుమారుడి వైద్యం కోసం సాయం అందించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడవల్లికి చెందిన విజ్జిన అమ్మాజీ ముఖ్యమంత్రి ఎదుట మొర పెట్టుకుంది. హెలీపాడ్ వద్ద సీఎంను కలిసిన ఆమె కుమారుడు వికాస్ చికిత్స కోసం ప్రతి నెలా మందులు వాడాల్సి వస్తోందని, కొబ్బరి ఒలుపు కార్మికుడైన తన భర్త ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతోందని తెలిపింది. చిన్నారి వికాస్‌కు వైద్యసేవలు అందించడంతో పాటు నెలకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలు పెన్షన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ సేవలు అందకపోతే తన కార్యదర్శికి తెలియచేయాలంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా కల్పించడంతో అమ్మాజీ కళ్లు చెమర్చాయి. కిడ్నీ బాధితుడైన లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన 16 ఏళ్ల సాయి గణేష్ తన తండ్రితో కలిసి సీఎం జగన్ వద్ద తన కష్టాలను మొర పెట్టుకున్నాడు. బాధితుడికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందేలా తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. సీఎం జగన్ తన కుమారుడి సమస్యను సావధానంగా ఆలకించి వెంటనే స్పందించటాన్ని జీవితాంతం మరువలేమని సాయిగణేష్ తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనన్నా గత ప్రభుత్వ హయాంలో నా భర్త చనిపోతే ఎవరూ పట్టించుకోలేదన్నా. నాకు ఇద్దరు పిల్లలు. జన్మభూమి కమిటీల చుట్టూ పెన్షన్ కోసం రోజుల తరబడి తిరిగా. మీరు సీఎం అయ్యాక వలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. నెల తిరగకుండానే వితంతు పింఛన్ చేతిలో పెట్టారు. నా పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విద్యా దీవెన రూ.75 వేలు, వసతి దీవెన రూ.20 వేలు చొప్పున నాలుగేళ్లలో రూ.3,80,000 లబ్ధి పొందే అవకాశం మీ ద్వారా వచ్చింది. చిన్న కుమారుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున రెండేళ్ళకు రూ.30,000 అమ్మఒడి వచ్చింది. నా పిల్లలకు మేనమామ జగనన్న ఉన్నాడనే ధీమాతో చదివిస్తున్నా. నాకు ఇంటి పట్టా ఇచ్చారు. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. నా కుమారుడికి యాక్సిడెంట్ అయితే నాకంటే ముందే 108 వచ్చి ఆసుపత్రిలో చేర్చింది. ఆరోగ్యశ్రీ కార్డుతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని చెబుతా’ – కోటా సామ్రాజ్యం, వితంతు పెన్షనర్, రాజమహేంద్రవరం. -
Rajahmundry: పింఛన్ల పెంపు వారోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు.. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో..
-
మీ బిడ్డగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా: సీఎం వైఎస్ జగన్
సాక్షి, తూర్పు గోదావరి: పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు.. రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వాళ్లందరికీ అందుతున్నాయి. ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని, అది మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోందని సీఎం జగన్ సగర్వంగా ప్రకటించుకున్నారు. కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు. పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసం పాడుపడుతున్నాం. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే.. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదు, అవినీతికి తావు లేదు, కత్తిరింపులు లేవు, ఎగ్గొట్టడాలు లేవు. ఇప్పుడు.. ఎక్కడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కేవలం అర్హత అనే దాని ప్రామాణికంగా పింఛన్ అందిస్తున్న వ్యవస్థ మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. ఇది మనసున్న పరిపాలన. చెడు చేసిన వాళ్లకు సైతం మంచి చేయాలనే తపనే తప్ప మరొక ఉద్దేశ్యమే కనిపించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. -
రెండ్రోజులుగా కోలాహలంగా పెన్షన్ పెంపు వారోత్సవాలు
-
పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది: సీఎం జగన్
12:34PM సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది: సీఎం జగన్ పెన్షన్‌ను నెలకు రూ. 2,750కి పెంచాం 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్ అందిస్తున్నాం పెన్షన్లు పెంచుతూ పోతామన్న హామీని నిలబెట్టుకున్నాం ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అర్హులకు బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కారుడు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం గత ప్రభుత్వంలో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు గత ప్రభుత్వంలో కేవంల 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌దారుల సంఖ్య పెరిగింది పెన్షన్ కోసం నెలకు రూ. 1765 కోట్లు ఖర్చు చేస్తున్నాం మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62, 500 కోట్లు ఖర్చే చేశాం గతంలో మాదిరిగా ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు ఆనందంగా పెన్షన్ పొందుతున్నారు రూ. 2,750 నుంచి రూ. 10 వేల వరకూ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్ ఇస్తున్నాం గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ. 400 కోట్లు మా ప్రభుత్వంలో నెలకు పెన్షన్లకే రూ. 1,765 కోట్లు ఇస్తున్నాం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకున్నారు కందుకూరులో జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు జనం తక్కువగా వచ్చారని కందుకూరు ఇరుకు రోడ్డులో సభపెట్టారు చిన్నసందులో జనాల్ని నెట్టి 8 మందిని చంపింది చంద్రబాబే డ్రోన్ షాట్ల కోసం కందుకూరు సభలో 8 మందిని చంపేశారు గుంటూరు సభలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు తానే మనుషులను చంపేసి మానవతావాదిలా డ్రామాలాడతాడు షోటోషూట్ కోసం, డ్రోన్ షాట్ల కోసం చంద్రబాబు వెంపర్లడతారు మనుషులను చంపేసిసా ఈనాడు, ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు అడగరు ఎన్టీఆర్ పార్టీని, ట్రస్ట్‌ను చంద్రబాబు లాక్కున్నారు ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తాడు ఫోటోషూట్, డ్రామాలే చంద్రబాబు నైజం పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కేసులు వేస్తున్నారు పేదవాడికి ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దన్నారు రాష్ట్రంలో జరుగుతుంది కులాల యుద్ధం కాదు.. పేదవాడికీ, పెత్తందారి వ్యవస్త మధ్య యుద్ధం జరుగుతోంది నేను ప్రజలనే నమ్ముకున్నా 12:27PM సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది’ అని తనకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. - సంక్షేమ పథకాల లబ్ధిదారు కోటా సామ్రాజ్యం 12:16PM ఎంపీ మార్గాని భరత్ స్పీచ్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. మన అందరి ప్రియతమ దేవుడిచ్చిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి గారికి స్వాగతం అంటూ ఎంపీ భరత్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. జనవరి 1వ తేదీ ప్రపంచం మొత్తం పండుగ జనవరి 2వ తేదీ వైకుంఠ ఏకాదశి తెలుగు ప్రజలందరికీ పండుగ ఈరోజు( జనవరి3వ తేదీ, మంగళవారం) అవ్వా-తాతల పండుగను రాజమహేంద్రవరంలో జరుపుకోవడానికి సీఎం జగన్మోహన్రెడ్డి ఇక్కడకి రావడం మూడో పండుగ. తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళుతున్న వ్యక్తి సీఎం జగన్ దేశంలో అత్యంత శక్తిమంతురాలైన సోనియా గాంధీని సైతం లెక్క చేయకుండా ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా సింహంలా గర్జించిన వ్యక్తి సీఎం జగన్ అని ఈరోజు తెలియజేస్తున్నా అవ్వా-తాతల్ని ఎంతో ప్రేమగా పలకరించే వ్యక్తి సీఎం జగన్ అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అమ్మా బాగున్నావా.. అని ఆప్యాయత చూపించే వ్యక్తి మన సీఎం జగన్ అలా పలకరించడంలో ఆనాడు స్వర్ణయుగంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని చూశాం.. ఈరోజు మన జగన్మోహన్రెడ్డి గారిని చూస్తున్నాం గత ప్రభుతంలో చంద్రబాబు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇచ్చేవాడు అది కూడా కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాడు ఆ పెన్షన్ కాస్తా ఇప్పుడు 2,750 చేశారు మన సీఎం జగన్ అది కూడా సుమారు 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు అలా రికార్డు స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం ఏపీలో మాత్రమే జరుగుతుంది 11:55AM వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రాజమండ్రిలో మున్సిపల్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ 11:08AM జాంపేట ఆజాద్ చౌక్ సెంటర్ కు చేరుకున్న సిఎం జగన్ రోడ్డు షో సీఎం జగన్‌కు భారీ స్వాగతం పలికిన ప్రజలు ►సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు, అధికారులు 11:00AM ►రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్ ►10: 27AM రాజమండ్రి బయల్దేరిన సీఎం జగన్ ►పెన్షన్ పెంపు నిర్ణయంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ(మంగళవారం) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ►వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ►రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,750 పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జిల్లాకు 9,147 అదనపు పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఆయన అక్కడి లబ్ధిదారుల మనోభావాలను తెలుసుకోనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూరే విధంగా పెన్షన్ వారోత్సవాలు ప్రకటించనున్నారాయన. ►మరోవైపు గత రెండు రోజులుగా పెన్షన్ పెంపు వారోత్సవాల కోలాహలం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా ఇందులో పాల్గొంటున్నారు కూడా. ఇక సీఎం వైఎస్ జగన్ రాక సందర్భంగా రాజమండ్రిలో భారీ ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ గ్రౌండ్ వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే
ఒక దీపం వెలిగింది. మౌనరోదన మోములో సంతోషం వెల్లివిరిసింది. జీవన తేజంతో నవ్వులు పూయించింది. చీకట్లు ముసిరిన ఆ ఇంట ప్రభాత వెలుగులు నింపాయి. ఆ దివ్యాంగురాలి జీవనానికి ఆసరా దొరికింది. ఆమె జీవితానికి భరోసాగా నిలిచింది. ఆ ప్రభావ ప్రభాత దీపిక పేరే ‘పింఛన్’. అర్హులైన అభాగ్యులపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. కావలి: ఆమెకు 28 ఏళ్లు. పుట్టుక నుంచే శరీరంలో ఏ అవయవం పని చేయదు. కదల్లేదు. మాట్లాడలేదు. శారీరకంగా.. మానసికంగా దివ్యాంగురాలు. 20 ఏళ్లుగా ఆమె బతుకు దెరువుకు ఆసరాగా సామాజిక పింఛన్ కోసం కుటుంబ సభ్యులు అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. కావలి పట్టణం 39వ వార్డులోని మూర్తిశెట్టివారివీధికి చెందిన ఈశ్వరమ్మ దివ్యాంగురాలు. తండ్రి చనిపోయాడు. తల్లి సైతం మానసికంగా కుంగిపోవడంతో ఆమె పనులే ఆమె చేసుకోలేని దయనీయ పరిస్థితి. తల్లికి వైఎస్సార్ వితంతు పింఛన్ కానుక వస్తోంది. తల్లిని, చెల్లిని సోదరుడు కూలి పనులు చేసి పోషిస్తున్నాడు. అతని భార్యే ఇటు అత్తను, అటు దివ్యాంగురాలైన ఆడపడుచుకు సపర్యాలు చేస్తోంది. వలంటీర్ చొరవతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వచ్చాక ఆ దివ్యాంగురాలి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆమెకు పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఆమెకు ఆధార్‌కార్డు లేదు. రేషన్ కార్డులేదు. దీంతో ఆమెకు పింఛన్ మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆమెకు వేలిముద్రలు ఆధార్ కార్డుకు సరిపోవడం లేదు. కుడి చేయిలో ఒక వేలి ముద్ర మాత్రమే రికగ్నైజ్ అవుతోంది. అధికారులు చర్యలు చేపట్టి ఆమెకు ఆధార్ కార్డు ను వచ్చేలా చేశారు. ఈలోగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న వార్డుకు ఎంపికైన వలంటీర్ గణవరపు అనూషా ఆమెకు పింఛన్ కల్పించేందుకు స్వయంగా తన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని తిరిగి కృషి చేసింది. పింఛన్ మంజూరు కోసం తొలుత రేషన్‌కార్డు మంజూరు చేయడానికి సాంకేతిక కారణాలతో ఆధార్ లింక్ కాక పెండింగ్‌లో పడింది. దీంతో రెండు మూడు సార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పర్మినెంట్ నంబరుతో తల్లి రేషన్‌కార్డులో ఈశ్వరమ్మను యాడ్ చేయించింది. చివరగా సదరం సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు నెల్లూరుకు తిరిగింది. కరోనా రావడం తో సదరం సర్టిఫికెట్ల మంజూరు నిలిచిపోయింది. ఇటీవల సదరం సెంటర్ పునః ప్రారంభం కావడంతో ఎట్టకేలకు సదరం సర్టిఫికెట్ మంజూరు కావడంతో పింఛన్‌కు నమోదు చేసింది. తాజాగా మంజూరు అయిన పింఛన్ల జాబితాలో ఆమె పేరు వచ్చింది. ప్రభాత వేళ.. ఆనంద హేళ ఆమెకు పింఛన్ మంజూరు కావడంతో ప్రభాత వేళ మంచు తెరలను దాటుకుంటూ స్వయంగా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వలంటీరు, సచివాలయ ఉద్యోగులను వెంట పెట్టుకొని ఆ యువతి ఇంటికి వెళ్లి పింఛన్ వచ్చిన విషయాన్ని తెలియజేశారు. దీంతో భావోద్వేగంతో ఆనంద భాష్పాలు కార్చింది. చాలా కాలం తర్వాత తనకు పింఛన్ వచ్చేలా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సైగలు చేసింది. ఎమ్మెల్యే సైతం ఆమెను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో పాటు రూ.3 వేల నగదు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతుందని చెప్పారు. అన్ని విధాలా వలంటీర్లు స్వయంగా సేవా దృక్పథంతో పని చేసి ప్రజలకు అండగా ఉంటారని ఈ ఉదంతం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. (క్లిక్: సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..) -
దేశంలో అత్యధికంగా ఏపీలో 64 లక్షల మందికి పైగా పెన్షన్ల పంపిణీ
-
నెల్లూరు: సర్వేపల్లి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కాకాని
-
ఏపీకి మరో 20 ఏళ్ళు సీఎం వైఎస్ జగనే ఉంటారు : బంగి అనంతయ్య
-
YSR పెన్షన్ కనుక...పుట్టింటోళ్ళు ఆస్తి ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు
-
గన్ షాట్: వాళ్లకు పెన్షన్.. వీళ్లకు టెన్షన్
-
ఏపీలో పెన్షన్ వారోత్సవాలు
-
ఏపీలో జనవరి1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం రూ. 2,750ని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. కొత్తగా 2 లక్షల 31 వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి పైగా ఏపీలో పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ నిలిచింది. జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. కాగా ఇప్పటి వరకు రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను 2,750కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన మొత్తాన్ని జనవరి 1 నుంచి లబ్దిదారులకు అందజేయనుంది. -
జనవరి 3న రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో జనవరి 3న జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. ఆ ప్రకారం.. సీఎం జగన్ జనవరి 3వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్‌షో ద్వారా ప్రభుత్వ ఆర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు వస్తారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్ భరోసా పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశం ఇస్తారు. నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అధికారులందరూ సమన్వయంలో పనిచేసి సీఎం జగన్ రాజమహేంద్రవరం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, సీఎం పర్యటించే దారి పొడవునా, సభావేదిక వద్ద బారికేడ్లు తదితర ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. చదవండి: (జనసేన నాయకుడి వేధింపుల పర్వం.. ప్రేమిస్తున్నానంటూ హల్చల్) -
తొలిరోజు 88.59% పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/తాడికొండ: రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 88.59 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజూము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం 62,31,221 మందికి పింఛన్ల కోసం రూ.1,584.86 కోట్లు కేటాయించింది. మొదటి రోజు 55,20,026 మందికి రూ.1,403.70 కోట్లు అందించారు.. రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు కూడా.. అమరావతి రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం అందజేసే పింఛన్లను కూడా గురువారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. తుళ్లూరు మండలంలో 16,200 మంది లబ్ధిదారులకుగాను తొలిరోజు 12,423 మందికి (76.69 శాతం మందికి) వలంటీర్లు పింఛను డబ్బు అందజేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో తొమ్మిది గ్రామాల్లో 5,796 మందికిగాను 5,400 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని పేదలు మొత్తం 17,173 మందికి ఇప్పటివరకు వారి బ్యాంకు ఖాతాల్లో సీఆర్డీఏ ద్వారా పింఛను డబ్బు జమచేసేవారు. -
ఏపీలో పింఛన్ల పండగ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,584.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.89 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 48.53 లక్షల మందికి రూ.1233.96 కోట్లు అందజేశారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఐదు రోజుల్లోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. చదవండి: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ -
AP: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం 62.33లక్షల మంది పెన్షనర్లకు రూ.1585.60 కోట్లను విడుదల చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 57.42 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. 35.79 లక్షల మందికి రూ.908.63 కోట్లు అందజేశారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. -
వైఎస్సార్ పెన్షన్ కానుక.. అవ్వా తాతలకు పండగ
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు సూర్యోదయానికి ముందే.. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి... సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు -
AP: ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం ఇది!
సాక్షి, తాడేపల్లి: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు ఏ ఆటంకం లేకుండా అందాలనేది జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్లే మేనిఫెస్టోను ప్రకటించి.. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతున్నారు సీఎం వైఎస్ జగన్. కులం, మతం, పార్టీ, ప్రాంతం.. లేకుండా అవినీతి, పక్షపాతానికి తావు లేకుండా పారదర్శకంగా.. నేరుగా లబ్ధిదారుల వద్దకే చేరుతున్నాయి కూడా. ఈ తరుణంలో.. రాష్ట్రంలోని వయోవృద్ధులకు, అర్హులైన ఇతరులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద.. నెలవారీ ఫించన్లను అందజేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రతి నెల ప్రారంభంలో గ్రామ వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ను దగ్గరుండి అందజేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2022 నెలకు సంబంధించిన ఫించన్‌ను అక్టోబర్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు వలంటీర్లు. ఆ నగదు అక్షరాల 1,590.50 కోట్ల రూపాయలు. సుమారు 62.53 లక్షల మంది ఫించన్‌దారులకు ఈ నగదు పంచబోతున్నారు వలంటీర్లు. అయితే గత ఏడేళ్లలో సెప్టెంబర్ నెల గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. సెప్టెంబర్ 2022 - రూ.1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 - రూ.1,397 కోట్లు సెప్టెంబర్ 2020 - రూ.1,429 కోట్లు సెప్టెంబర్ 2019 - రూ.1,235 కోట్లు సెప్టెంబర్ 2018 - రూ. 477 కోట్లు సెప్టెంబర్ 2017 - రూ. 418 కోట్లు సెప్టెంబర్ 2016 - రూ. 396 కోట్లు సెప్టెంబర్ 2015 - రూ. 405 కోట్లు.. ఇలా గత ప్రభుత్వం మధ్యలో కోత ద్వారా పెన్షన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. అధికారంలోకి రాగానే అర్హులైన వాళ్లందరినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది . అంతేకాదు లబ్ధిదారులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వేల కోట్ల రూపాయలను సకాలంలో అందజేస్తూ తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది జగనన్న ప్రభుత్వం. -
జనవరి నుంచి పింఛన్ రూ.2,750
కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు.. అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం. చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం. ఆరు నాన్ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. చదవండి: కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్ చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ చేశాం. మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ చేయూత పథకం ఉపయోగపడింది. అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్ ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. -
ఏపీలో పెన్షన్ల పండుగ
-
ఏపీలో పింఛన్ల పండగ.. కొనసాగుతున్న ‘వైఎస్సార్ పెన్షన్ల కానుక’ పంపిణీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.20 గంటల వరకు 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ (ఫోటోలు)
-
ఏపీలో పింఛన్ల పండగ.. కొత్తగా 3.10 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62,79,486 మంది లబ్ధిదారులకు రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం విడుదలచేసింది. తెల్లవారుజామున నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల వరకు 80.28 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే 50.40 లక్షల మందికి రూ.1280.20 కోట్లు అందజేసినట్లు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. ఆర్బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
62.79 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 62,79,486 మంది లబ్ధిదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి వైఎస్సార్ పింఛన్ కానుక కింద డబ్బులు పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్మును అందజేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడానికి 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, ఆర్బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. -
చెప్పాడంటే..చేస్తాడంతే..
-
తలుపుతట్టి.. కానుక ఇచ్చి.. (ఫోటోలు)
-
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ (ఫోటోలు)
-
ఏపీ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
-
ఏపీ: కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: బుధవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1, 543.80 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 07.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. -
YSR Pension Kanuka: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం
తన సుదీర్ఘ పాదయాత్రలో... అడుగడుగునా కనిపించిన అవ్వాతాతలతో మాట్లాడి - వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించారు. వారికి ఎంత పింఛను వస్తుంది? ఎలా ఇస్తున్నారు? తదితర విషయాలపై అవగాహన పెంచుకున్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక పథకాన్ని సమగ్రంగా రూపొందించి.. మేనిఫెస్టోలో ప్రకటించారు. పాలన చేపట్టగానే పింఛన్ సొమ్మును పెంచుతామని, అర్హత వయస్సును తగ్గిస్తామని, అర్హత వున్నవారందరికీ పింఛన్లు ఇస్తామని వాగ్ధానం చేశారు. అంతేకాదు దీర్ఘకాలిక రోగులకు పింఛన్ ఇస్తామన్నారు. అలా సామాజిక పింఛన్ల విషయంలో పలు హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ హామీలన్నిటిని నిలబెట్టుకున్నారు. అదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్న లక్షలాది కుటుంబాలు చెబుతున్నాయి. అవ్వాతాతల పింఛన్ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేది.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారు.. అంతే కాదు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు... ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ - అదే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పింఛన్లు పెరిగాయి. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతు మంచానికే పరిమితమైన వారికి పదివేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు. కుటుంబంలో ఒకరికే కాదు.. అర్హత వున్నవారందరికీ పింఛన్ ఇస్తున్నారు. ఇలా పింఛన్ల పథకంలో అనేక మార్పులు తెచ్చి సామాన్య కుటుంబాలను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కిస్తున్నారు. చదవండి: జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు రావి హేమలత.. ఈమె కుటుంబం 18 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నందపాలెం నుంచి విశాఖ నగరానికి వలస వచ్చింది.. హేమలత భర్త నారాయణరావు విశాఖలోని రైల్వేస్టేషన్ సమీపంలో టిఫిన్ దుకాణం పెట్టుకొని దానిద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు.. అదే సమయంలో ఈమె కూడా రెండు మూడు ఇళ్లలో పని చేస్తూ తనవంతుగా కుటుంబానికి అండగా నిలిచేది.. అలాంటి సమయంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ కుటుంబం సాఫీగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో... భర్త నారాయణరావు అకాల మరణం చెందారు. ఈ హఠాత్ పరిణామంతో హేమలత ఆమె పిల్లలు భయాందోళనలకు గురయ్యారు.. కుటుంబ నావ ముందుకు సాగేది ఎలా ...పిల్లలు చదువులు , భవిష్యత్తు ఎలా వుంటుంది. ఇలా అనేక ప్రశ్నలతో హేమలతకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇలాంటి సమయంలో వాలంటీర్ ఈమె ఇంటికి వచ్చారు. వితంత్రు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టించారు. అంతే కాదు ఈమె భర్త నారాయణరావు అకాల మరణానికి సంబంధించి వైఎస్సార్ బీమా కూడా ఈమెకు లభించేలా చూశారు. విశాఖ జిల్లాలోనే ఇంకొక కుటుంబాన్ని సాక్షి పలకరించింది..ఈ పెద్దామె పేరు సూరాడ మహాలక్ష్మి...విశాఖ నగరం అక్కయ్యపాలెం 43వ వార్డులో నివసిస్తున్నారు. ఈమె వయస్సు సుమారు 70 సంవత్సరాలు.. వయసు మీద పడడంతో ఏ పనీ చేయలేని పరిస్థితి.. పది అడుగులు వేయాలంటే ఆయాసం....నెల నెల మందులు వేసుకోవాల్సిందే.. మహాలక్ష్మికి ఒక కుమారుడు ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.. వారు కూడా ఈమెతోనే ఉంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వాలంటీరే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారని మహాలక్ష్మి మనుమరాలు తబితా అంటోంది. పింఛన్ల పథకానికి సంబంధించి ఆ మొత్తాన్ని రూ. 2, 250కి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవం రోజున సంతకం చేశారు. అంతే కాదు ఈ మొత్తాన్ని దశలవారీగా పెంచుతూ మూడువేల రూపాయలకు తీసుకుపోతామని ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది జనవరినుంచి 2500 రూపాయలు చేశారు. పింఛన్లు తీసుకోవడానికి గతంలో లాగా ఎక్కడా క్యూ లైన్లు లేవు.. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి వారి తలుపు తట్టి మరీ వారి యోగక్షేమాలు తెలుసుకొని పింఛన్లు అందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా... అర్హత వుంటే చాలు పథకాలు అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ప్రకారం అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తమ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్ కానుక అందుకుంటున్నవారి సంఖ్య దేశంలోనే అధికంగా వుంది. సామాన్య కుటుంబాల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు అవ్వాతాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. అవ్వాతాతలకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. దేశవ్యాప్తంగా పెన్షన్లను ఇస్తున్న రాష్ట్రాల్లో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. చంద్రబాబు హయాంలో 36 లక్షల మందికి పెన్షన్లు వస్తే... వైఎస్ జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి అందిస్తోంది. సామాజిక పింఛన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రతి నెలా కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు 1500 కోట్లు ఖర్చు చేస్తోంది.. అంతే కాదు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటిదగ్గరకే వెళ్లి పింఛన్ ఇస్తుండడంతో అవ్వాతాతలు ఆనందంగా వున్నారు. పింఛన్లను డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా.... ఆంధ్రప్రదేశ్ గుర్తింపుపొందింది. ఇలా పింఛన్ల విషయంలో అనేక ప్రత్యేకతలు కలిగిన వైఎస్ జగన్ ప్రభుత్వం... అవ్వాతాలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకే కాదు...దీర్ఘకాల రోగాలతో మంచానికి పరిమితమైన వారికి కూడా పింఛన్లు అందిస్తోంది. విశాఖ జిల్లా చోడవరం పట్టణం మారుతీ నగర్ లో కనకమహాలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. ఈమె నాలుగు సంవత్సరాలుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతోంది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఈమె దీర్ఘకాల రోగులకు ఇచ్చే పింఛనుకు అర్హురాలు. అందుకే ఈమెకు నెల నెలా వైఎస్ జగన్ ప్రభుత్వం పదివేల రూపాయల పింఛను ఇస్తోంది.. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ మొత్తం 1500 రూపాయలుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇది పదివేల రూపాయలైంది. దాంతో ఈమె అప్పుల పాలవ్వకుండా ప్రభుత్వం ఇస్తున్న ఆ పింఛన్‌తో క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటోంది. మహాలక్ష్మికి నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు ఆడపిల్లలున్నారు. వారందరి పెళ్లిళ్లకు ఆస్తి అంతా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధి సమస్యలు మొదలయ్యాయి..మందులు, చికిత్సలు, హాస్పిటల్ ఖర్చులు అదనంగా వచ్చిపడ్డాయి.. దాంతో ...పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి సంతోషంగా శేష జీవితాన్ని గడుపుదామనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఒకపక్క అనారోగ్యం, మరో పక్క ఖర్చులు..ఇలాంటి పరిస్థితుల్లో ఈమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెలా పదివేల రూపాయల పింఛన్ ప్రతినెలా ఒకటోతేదీన ఠంచన్‌గా ఇస్తుండడంతో ఆ డబ్బుతో డయాలసిస్ చేయించుకోగలుగుతున్నానని ఆర్థికపరమైన ఒత్తిడి తొలగిపోయిందని ఈమె అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరుదాకా విశాఖనుంచి అనంతపురం దాకా అందరూ ఇదే మాట చెబుతున్నారు. మంచం నుంచి కదల్లేని వికలాంగుడి పేరు ఓబుళయ్య. భార్య పేరు ఉమారాణి. వీరు అనంతపురం పట్టణంలో నివసిస్తున్నారు. ఓబుళయ్యకు వికలాంగ పింఛన్ కింద 3000, ఉషారాణికి 2500 రూపాయల పింఛన్ వస్తోంది. వీరు ఈ డబ్బుతోనే మందులు, నిత్యావసర వస్తువుల కొనుక్కుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో చెప్పులు అరిగేలా తిరిగినా పింఛన్ ఇవ్వలేదని.. ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొని.... క్రమంగా తప్పకుండా పింఛన్ ఇస్తున్నారని వీరు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ కోసం ప్రభుత్వం చెప్పిన కార్యాలయందగ్గరకు వెళ్లి క్యూలో నిలబడాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పొద్దున్నే ఇంటిదగ్గరకు వచ్చి ఇస్తున్నారని పండ్ల వ్యాపారం చేస్తున్న హబీబుల్లా అంటున్నారు. పింఛన్ తోపాటు తనకు వ్యాపార నిర్వహణకోసం పదివేల రూపాయల రుణం కూడా ఇచ్చారని ఆయన చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇంటిదగ్గరకే వచ్చి నేరుగా లబ్ధిదారులకు నగదు అందిస్తున్నారు. గతంలో పింఛన్ కావాలంటే ఎక్కడో ఉన్న కమ్యూనిటీ హాలో, పాఠశాలకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ దుస్థితి లేదు. నేరుగా ఇంటికే వచ్చి ఇవ్వటంతో అవ్వాతాతలు సంతోషిస్తున్నారు. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ (ఫోటోలు)
-
వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ (ఫొటోలు)
-
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. 47 లక్షల మందికి రూ.1193.88 కోట్లు పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. సెలవు రోజైనా ఆదివారం కూడా పెన్షన్లు అందించారని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. చదవండి: శాసనమండలి చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం అయినప్పటికీ 60 లక్షల 80 వేల మందికి పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు. కొన్ని దూర ప్రాంతాల్లో నగదు తీసుకు వెళ్లడానికి వీలుగా లేని ప్రాంతాల్లో స్వల్పంగా అందక పోవచ్చని, స్వల్ప మొత్తం అందకపోతే తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. అనవసరపు ప్రచారాలతో అవ్వ తాతలు ఆందోళన చెందే అవకాశం వుందన్నారు. ఈ రాత్రి తొమ్మిది, పదికల్లా వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారనీ, మారుమూల ప్రాంతాల్లో నగదు తీసుకువెళ్లలేని వారి వల్ల ఆలస్యం అయి వుంటుందని మంత్రి పేర్కొన్నారు. -
ఠంఛనుగా తప్పుడు రాతలు!
అంతా ఠంచన్‌గానే!! బురద జల్లటం గానీ... ఒక పద్ధతిలో అబద్ధాలు ప్రచారం చేయటంలో గానీ ‘ఈనాడు’ను మించిన వాళ్లెవరూ లేరనే అనుకోవాలి. సెలవు రోజైనా... పండగ రోజైనా పట్టించుకోకుండా వలంటీర్ల సైన్యం ప్రతినెలా ఒకటవ తేదీనే ఫించను దారుల్ని ఇళ్లకు వెళ్లి మరీ పెంచిన పింఛను డబ్బులతో పలకరిస్తోంది. 90 శాతం మందికి ఒకటో తేదీనే పింఛను అందుతోంది. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు కనిపించవు. ఇప్పుడు ఇలా ఠంచనుగా చెల్లిస్తున్న విషయాన్ని గానీ... చంద్రబాబు హయాంలో 5వ తేదీదాకా అసలు పంపిణీయే మొదలుపెట్టనప్పుడు కానీ ఆయన పత్రికలో ఎలాంటి వార్తలూ ఉండవు. మరిప్పుడు ‘ఠంఛన్ తప్పిన పింఛను’ లాంటి రాతలెందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నది వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి. ఎంతెంత విషప్రచారం చేసినా ఆయన మనోబలం ఇసుమంత కూడా చెదరటం లేదు మరి!!. బాబు హయాం... గుర్తులేదా రామోజీ? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెన్షన్లంటేనే ఓ ప్రహసనం. నడవ లేని అవ్వాతాతలు కూడా చచ్చీ చెడీ పింఛను డబ్బులు కోసం ప్రతి నెలా గ్రామాల్లోని పంచాయతీ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఎప్పుడిస్తారో తెలియదు కనక రోజుల తరబడి వెళుతూ పడిగాపులు కాయాల్సి వచ్చేది. అసలు 2014–2019 మధ్య ఏ ఊళ్లో ఎప్పుడు పింఛను పంపిణీ చేస్తారో తెలిస్తే ఒట్టు!. గ్రామ కార్యదర్శులు నెలలో ఏదో ఒక రోజు వచ్చి పంపిణీ చేసి ళ్లేవారు. అదెప్పుడో తెలియక అవ్వాతాతలు ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో పడిగాపులుగాసి చివరకు ఊసూరు మంటూ వెళ్లేవారు. ఈ పింఛన్ల పంపిణీ ఎంతలా సాగే... దంటే కొన్ని నెలల్లో ఏకంగా 19–24 రోజుల పాటు పంపిణీ చేస్తూనే ఉండేవారు. 2017 ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పింఛన్ల పంపిణీ సాగితే, అదే ఏడాది జులైలో 24 రోజులు, 2018 ఏప్రిల్, జూన్ నెలలో 19 రోజులు కొనసాగిందీ ప్రహసనం. విచిత్రమేంటంటే అద్దాల్లోంచి చూసే రామోజీకి జనం ఇబ్బందులేవీ కనిపించనేలేదు. అవ్వాతాతల కష్టాలుపడే ఫోటోలకు ‘ఈనాడు’లో చోటు దక్కితే ఒట్టు. అదే మరి ‘‘మన’’ మార్కు జర్నలిజమంటే!!. కొత్తవే కాదు... ఉన్నవాళ్లకూ ఎగ్గొట్టుడే!! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రతి నెలా లబ్ధిదారులందరికీ పింఛను అందటమనేది కలే. 2018 ఫిబ్రవరిలో 44.06 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినా... ఇచ్చింది మాత్రం 39 లక్షల మందికే. ఆ ఒక్కనెలే కాదు. ఐదేళ్ల పాటు ప్రతి నెలా నాలుగైదు లక్షల మందికి మొండి చెయ్యే. వారు మరుసటి నెల దాకా వేచి చూడాల్సిందే. పైపెచ్చు అప్పట్లో ప్రభుత్వం పింఛన్లపై చేసిన ఖర్చు నెలకు రూ.400 కోట్లు. అది కూడా ఒకేసారి కాకుండా రెండు మూడు విడతలుగా విడుదల చేసిన దుస్థితి. వీటికి తోడు ‘ఒకరు మరణిస్తే వారి స్థానంలో మరొకరికి పెన్షన్’ అనేలా ‘శాచ్యురేషన్’కు బాబు ఇచ్చిన నిర్వచనం తెలిస్తే మతితప్పడం ఖాయం. 2017–18 సంవత్సరాల్లో పెన్షన్ కోసం వచ్చిన 4.35 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఇంకేం చెప్పాలి? కాకపోతే వీటిపై ఒక్క విమర్శా చేయకపోవటమనేదే రామోజీ మార్కు పాత్రికేయం. (చదవండి: నాడు జీవచ్ఛవం.. నేడు జీవనాడి..) ఏప్రిల్ 1... ఎందరికిచ్చారో తెలుసా? అర్హులెవ్వరికీ... పింఛను రాలేదనే పరిస్థితి ఉండకూడదన్నది వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే పింఛనుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పైపెచ్చు అవ్వాతాతలు పింఛన్ల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి లేకుండా జగన్ ఓ సేవా సైన్యాన్ని సృష్టించారు. 2020 ఫిబ్రవరి నుంచి ఈ సైన్యం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లిచ్చే విప్లవానికి నాంది పలికింది. అప్పటి నుంచి పింఛనుదార్లకు ఒకటో తేదీ ఒక్కటి చాలు. ఈ ఏడాది జనవరిలో 61.74 లక్షల మందికి పింఛను మంజూరు చేస్తే, అందులో 61.64 లక్షల మందికి ఐదో తేదీలోగానే రూ.1555.49 కోట్ల మేర పంపిణీ జరిగింది. మొత్తం లబ్దిదారులలో 99.07 శాతం మందికి డబ్బులు చేరాయి. ఫిబ్రవరిలో 99.04 శాతానికి, మార్చిలో 99.13 శాతానికి 5వ తేదీలోగానే పంపిణీ పూర్తయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడం, 2న ఉగాది, 3న ఆదివారం... వరసగా సెలవులొచ్చినా ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50.43 లక్షల మందికి అంటే 82.64 శాతం మందికి రూ. 1281 కోట్లు డబ్బులు పంపిణీ చేశారు. (చదవండి: జర్నలిజమా లేక అధికార పిచ్చా!) 10 శాతం మందికి... ఈ ఒక్క నెలలో... 4వ తేదీన వర్కింగ్ డే అయినా... 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సెలవొచ్చింది. స్కూళ్లక్కూడా సెలవులు రావటంతో అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పలువురు లబ్దిదారులు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, బందువుల ఇళ్లకు వెళ్లడంతో మిగిలిన వారికి పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. వలంటీర్లు వెళ్లినా పలు చోట్ల లబ్దిదారులు అందుబాటులో లేక 4 సాయంత్రానికి 90.46 శాతం మందికే పింఛన్లందాయి. మిగిలిన వారికి కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ ఒక్క నెలలో మాత్రమే 11వ తేదీ వరకు పంపిణీని పొడిగించారు అధికారులు. ఆలోగా అందరికీ అందాయి కూడా. కాకపోతే రామోజీకిది నచ్చలేదు. ఆలస్యమైనా ఎందుకిచ్చారన్న తీరులో ‘ఠంచను’ తప్పారంటూ తప్పుడు రాతలకు దిగారు. నిజానికి గతంలో లబ్దిదారులు ఒక నెల పింఛను తీసుకోకపోయినా, మరుసటి నెలలో ఇచ్చేవారు. కానీ, హైదరాబాద్ సహా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం ఉండే అనర్హులు కూడా పింఛన్లు పొందుతున్నారన్న ఉద్దేశంతో 2021 అక్టోబరు నుంచి ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలన్న నిబంధన తెచ్చారు. పాపం.. అదీ నచ్చలేదు రామోజీకి. – సాక్షి, అమరావతి -
కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు: బూడి ముత్యాలనాయుడు
సాక్షి, విశాఖపట్నం: ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే పెన్షన్ ఇస్తుంటే.. కొన్ని పత్రికలు ఐదో తేదీన ఇస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే బాధ కలిగి మాట్లాడుతున్నా. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పెంచుతామని చెప్పారు. కానీ జనం నమ్మలేదు. జగన్ కూడా ఒకేసారి పెంచుతామని చెప్పలేదు దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి అలాగే పెంచుతున్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ కోసం నాలుగు వందల కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం రూ.1,570 కోట్లు ఇస్తోంది. చంద్రబాబు, రామోజీరావుకు సీఎం జగన్ పాలన చూసి కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు. టీడీపీ హయాంలో ఈ పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. అర్హతలే ప్రామాణికంగా వాలంటీరు, సచివాలయం వ్యవస్థ పని చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జగన్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. లంచం ఇస్తే టీడీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా.. అర్హులకు మాత్రమే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. చదవండి: (పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్!) పాలన విషయంలో సీఎంను విమర్శించే అర్హత, హక్కు ప్రతిపక్షాలకు లేదు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని ప్రతిపక్షం, కొన్ని పచ్చ పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం అమలు ఆగదు. ఇప్పటికే సీఎం జగన్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించారు. రేషన్ కోసం, పెన్షన్ కోసం అరుగుల మీద కూర్చొనే స్థితి నుంచి ఇంటి వద్దకే అందించే వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారు' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1551.16 కోట్లను విడుదల చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7.40 నిమిషాల వరకు రాష్ట్రంలో 35.27 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇప్పటిదాకా 21.52 లక్షల మంది లబ్ధిదారులకు రూ.545.94 కోట్లను అందజేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. -
AP: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని తెలిపారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందచేస్తారన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్దంగా ఉన్నారన్నారు. పెన్షన్ అందచేసే సందర్భంలో లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్ తో పాటు ఐరిస్, ఆర్బిఐఎస్ విధానాన్ని కూడా వినియోగిస్తారని తెలిపారు. పెన్షన్ మొత్తాలను అయిదు రోజుల్లో నూరుశాతం పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 15 వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డిఏ కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు. -
ఆ పెన్షనే వారికి ఆధారం!
జగనన్న ప్రారంభించిన సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఎంతో మంది పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగు లకు జీవనాధారం అయ్యింది. అయితే ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవడం కోసం పెన్షన్ దారులు చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు వస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు పెన్షన్ అందించ డంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది. ఈ పెన్షన్లలో కేంద్రం ఇచ్చే నగదు వాటా అతి స్వల్పం మాత్రమే. ఏపీ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ. 200 మాత్రమే. మిగిలిన రూ. 2,300 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 200 మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,800 ఇస్తున్నది. ఎన్నికల వాగ్దానం ప్రకారం, ఏ రాష్ట్రాలలో లేని విధంగా చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, హెచ్ఐవీ కలిగి ఉన్నవారు అర్హతను బట్టి నెలకు రూ. 2,500 పెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులకు నెలకు రూ. 3,000 పెన్షన్‌గా అందజేస్తోంది. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల కంటే చాలా వేగంగా అమలు చేయడానికి సహాయపడుతోంది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం అమలు గురించి తెలుసుకోవడానికి ఏడు పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్‌ల (పీటీజీ) గ్రామాలను సందర్శించి అక్కడున్న పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడడం జరి గింది. పీటీజీలు ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో, కొండవాలు ప్రాంతాల్లో, ఊరికి దూరంగా అడవులలో నివసిస్తుంటారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్న జగనన్న ఇంటివద్దకు పెన్షన్ పథకం వారికి వరంగా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ఈ పెన్షన్ నగదును తీసుకోవడానికి మేజర్ గ్రామ పంచాయితీ కార్యా లయం లేదా పోస్టాఫీసుకు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామ వాలంటీర్ ప్రతినెలా ఒకటవ తేదీన క్రమం తప్పకుండా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇంకా అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హులైన వారి పేరు వారం రోజుల లోపు సంక్షేమ పథకంలో చేర్చబడుతుంది. ప్రస్తుతం నేను సర్వే చేసిన గ్రామాల్లో అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ వస్తోంది. కొంతమంది దివ్యాంగులు సదరం నివేదికల గురించి వేచి చూస్తున్నారు. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల్లో ఆర్థిక భద్రతను పెంచింది. పెన్షన్ లబ్ధిదారులు ఎవరిపైనా ఆధారపడకుండా వారికి వచ్చే మొత్తాన్ని ఆహారం కోసం, మందుల కోసం, బట్టల కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం వెచ్చిస్తున్నారు. కొందరు వారికొచ్చిన పెన్షన్‌లో కొంత భాగాన్ని వారి పిల్లలకు, మనమళ్లకు ఇస్తున్నారు. కొంతమంది వృద్ధులపై... వారి పిల్లలు పెన్షన్ నగదు కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఆడవారిపై అధికంగా ఉంది. మారుమూల అటవీ ప్రాంతాల్లో సిగ్నల్స్, నెట్ వర్క్ సమస్యలు ఉండడం ద్వారా కొంతమందికి పెన్షన్ పంపిణిలో జాప్యం అవుతోంది. బయోమెట్రిక్ విధానాన్ని కొత్త సాంకేతికతతో పునర్వ్యవస్థీకరించడం ద్వారా, ఇంటర్నెట్ సదుపాయాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మొత్తం మ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలతో పీటీజీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. (క్లిక్: మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?) - డా. ముట్లూరి అబ్రహం ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ -
వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
-
వైఎస్సార్ పింఛన్లు 50.75 శాతం పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం తొలిరోజు 50.75 మేర పూర్తయింది. రాష్ట్రంలో 61.51 లక్షల మందికిపైగా సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.73 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సాంకేతిక కారణాలతో బ్యాంకుల నుంచి నగదు విడుదల ఆలస్యమైంది. దీంతో తొలిరోజు పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయలేకపోయారు. గతనెల వరకు పెన్షన్ నిధులను సీఎఫ్ఎంఎస్ ద్వారా బదిలీ చేయడంతో కేవలం మూడు నుంచి ఐదుగంటల్లో ఆ నిధులు సచివాలయ ఖాతాలకు చేరేవి. కానీ ఈ నెలలో సీఎఫ్ఎంఎస్ విధానానికి బదులు పీఎఫ్ఎంఎస్ విధానంలో బదిలీ చేయడంతో బ్యాంకుల నుంచి నిధుల బదిలీకి 16 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దీంతో మంగళవారం 31,22,227 మంది లబ్ధిదారులకు రూ.793.82 కోట్లను పంపిణీ చేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి వచ్చేనెల నుంచి నిధుల బదిలీ ఆలస్యం కాకుండా చూస్తామని బ్యాంకులు ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు సమాచారం. కోమాలో ఉన్న వ్యక్తికి పింఛను కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లబ్ధిదారు వద్దకు వెళ్లి కుటుంబసభ్యులకు పింఛను అందజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామ వలంటీరు మస్తానమ్మ. గ్రామానికి చెందిన శేషయ్య ఆరోగ్యం సరిగా లేక కోమాలోకి వెళ్లాడు. అతడికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీరు మస్తానమ్మ నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కోమాలో ఉన్న శేషయ్య వేలిముద్రలు తీసుకుని ఆయన కుటుంబసభ్యులకు పింఛను నగదు అందజేశారు. పక్క రాష్ట్రానికి వెళ్లి పంపిణీ చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ సర్కిల్ సచివాలయం 26వ వార్డు వలంటీర్ నాగూర్‌బాబు తన పరిధిలోని పింఛనుదారుకు తమిళనాడు వెళ్లి మరీ డబ్బు అందజేశారు. ఆ వార్డు క్లస్టర్ పరిధిలోని మహేశ్వరి అనారోగ్యంతో తమిళనాడులోని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ 80 కిలోమీటర్ల దూరంలోని తిరువళ్లూరు వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. పెన్షన్ అందుకున్న మహేశ్వరి సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్ అర్హులందరికి పెన్షన్ అందిస్తున్నారన్న ఎమ్మెల్యే
-
అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్న తమ్మినేని సీతారాం
-
నువ్వు లేకపోతే ముసలోళ్లం లేము నాయనా
-
వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
-
పండగలా జరుగుతున్న 'వైఎస్సార్ పెన్షన్ కానుక' పంపిణీ
-
‘గతంలో అర్హత ఉన్నా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను 2500 రూపాయలకు పెంచారని వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందుతుందన్నారు. ఈ మేరకు ఎంపీ చిత్తూరులో ఆదివారం మాట్లాడుతూ.. ఎవరి రికమెండేషన్ లేకుండానే పథకాలు ఇంటిటికీ చేరుతున్నాయన్నారు. గతంలో అర్హత ఉన్నా కూడా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ పెన్షన్ పెంచిందని దుయ్యబట్టారు. పిల్లలు అందరూ చదువుకుని ప్రయోజకవంతులు అవ్వాలనేదే సీఎం జగన్ ఉద్దేశ్యమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు, అప్పుడే కుటుంబాలు బాగుపడుతాయనేది ఆయన ఆలోచన అని కొనియాడారు. అందుకే పెచ్చులు ఊడిపోయే పాఠశాలలను నాడు-నేడుతో అబివృద్ది చేశారని, పిల్లలకు యూనిఫాం, భోజనం, అమ్మ ఒడి ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో చదివి ఢిల్లీలో ఉద్యోగం కావాలంటే కష్టమని అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష మీడియా తీసుకొచ్చామని చెప్పారు. చదవండి: బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే? ‘చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కానీ పెద్దవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలా? చిన్న పిల్లలకు ఎవ్వరికీ ఓట్లు లేవు, కేవలం అందరి జీవితాల్లో మార్పు కోసమే ఈ పథకాలు. ప్రతి పథకం మహిళలకు అందిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తే చంద్రబాబుకు వచ్చే బాధ ఏంటి?. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఒక మాట చెపితే దానికి కట్టుబడి ఉంటారు. పేదలకు ఇళ్ళు లేవని ఇప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ’ అని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్‌లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు
-
కష్టకాలంలోనూ సీఎం వైఎస్ జగన్ పింఛన్లతో ఆదుకుంటున్నారు
-
కులం, మతం, పార్టీలు చూడలేదు
ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాడు. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు. అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రతినెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే వలంటీర్ మీ గడప ముందుకు వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పింఛన్ డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు ► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు. ► ఈ రోజు పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్ అందేలా సాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. -
వారు పేదల శత్రువులు
పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లపై హక్కులు, ఇంగ్లిష్ మీడియం.. ఇలా ప్రతి మంచి కార్యక్రమానికీ ఏదో విధంగా అడ్డు తగలడమే వారి లక్ష్యం. చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని.. సినిమా టికెట్ల రేట్లు నిర్ణయిస్తే, దాని మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్లా.. పేదల గురించి ఆలోచించే వాళ్లు? ఇలాంటి వారందరూ పేద వాడికి శత్రువులు కాదా? ఆలోచించండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘పేదలకు మంచి చేస్తుంటే చూడలేని కొందరు వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఇలాంటి మంచి పనులు చేసిన చరిత్ర లేని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి వారందరూ పేదలకు శత్రువులే’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కొత్త సంవత్సరం రోజున శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. అందులోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నామన్నారు. అవ్వాతాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతాం.. అని ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి సమక్షంలో పింఛన్ మొత్తాన్ని రూ.2,250కు పెంచుతూ సంతకం చేసి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ మొత్తాన్ని రూ.2,500కు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అభాగ్యులెందరున్నారో తెలుసా? ► ఈ జగన్ చేస్తున్న ధోరణి సరిగా లేదని చెప్పే వాళ్లు చాలా మంది ఉంటారు. మంచి చేస్తుంటే దాన్ని విమర్శించే వాళ్లూ ఉంటారు. వీళ్లందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తమకు తాముగా జీవితమంతా కష్టపడినా నాలుగు రూపాయలు కూడా మిగిలించుకోలేని నిర్భాగ్యులు ఎంత మంది ఉన్నారో వీళ్లెవరికైనా తెలుసా? ► కన్నపిల్లల నుంచి ఎటువంటి సహాయం లేని అభాగ్యులు, భర్తను కోల్పోయి తమకు తాము సంపాదించుకునే శక్తి లేని వితంతువులు, వివిధ సంప్రదాయ కుల వృత్తులలో తమ జీవితాలనే ధారపోసి, వయస్సు మళ్లుతున్న దశలో ఈరోజు ఆ కుల వృత్తి కొనసాగించలేక, ఆర్థికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్థకంగా మారిన వృత్తులు ఎన్ని ఉన్నాయో వీళ్లందరికి ఎవరికైనా తెలుసా? ► ఇలాంటి వాళ్లకు మనం సాయం చేస్తే దాన్ని మంచి అంటారా? లేక చెడు అంటారా? విమర్శించే ఇటువంటి వాళ్లందరికీ మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజు సామాజిక పింఛన్లు నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కేవలం క్యాలెండర్లు మాత్రమే మారటం లేదు. దాదాపు 62 లక్షల కుటుంబాల్లో మరిన్ని చిరునవ్వులు రాబోతున్నాయి. ► ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు.. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి చేయవలసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి చేపడతారు. ► పుట్టుకతో కానీ, పుట్టిన తర్వాత కానీ.. అంగ వైకల్యానికి గురైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న వారికి, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమీయా, హీమోఫీలియా, బోధకాలు, చివరికి పక్షవాతం వచ్చి మంచానికో, వీల్ చెయిర్‌కో పరితమితమైన వాళ్లకు, కండరాల క్షీణత, కుష్టు వ్యాధి, కాలేయం, గుండె వంటివి ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన నిరుపేదలకు.. వీళ్లందరికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ► దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న, అత్యధిక మొత్తాన్ని పెన్షన్లుగా ఇస్తున్న రాష్టం మనదే. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలలు ముందు వరకు ఇస్తున్న పెన్షన్ ఎంతనేది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. రూ.1,000 మాత్రమే. ► నేను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టినప్పటి నుంచి గత నెల వరకు మనం ఇచ్చిన పెన్షన్ రూ.2,250. ఇప్పుడు రూ.2,500. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమే. ఈ రోజు మనందరి ప్రభుత్వం దాదాపు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తోంది. ఎంత తేడానో ఆలోచించండి. ► గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. ఈ రోజు మనందరి ప్రభుత్వం ఏకంగా నెలకు రూ.1450 కోట్లు వెచ్చిస్తోంది. ఈ మొత్తం ఇకమీదట రూ.1,570 కోట్లు. ఈ 31 నెలల పాలనలో, కరోనా కష్ట కాలంలో, ఇతరత్రా ఇబ్బందులెన్ని ఉన్నప్పటికీ.. పేదల ఇక్కట్లు ఇంకా ఎక్కువ అని భావించి.. వారికి తోడుగా ఉండాలని ఒక్క పెన్షన్ల కోసమే దాదాపు రూ.40 వేల కోట్లపై చిలుకు ఖర్చు చేశాం. కులం, మతం, పార్టీలు చూడలేదు ► ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు. అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం. గత ప్రభుత్వానికి, నేడు మనందరి ప్రభుత్వానికి మధ్య ఒక్కసారి తేడా గమనించండి. ► ప్రతి నెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే మీ గడప ముందుకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో వలంటీర్ తలుపుతట్టి.. గుడ్ మార్నింగ్ చెప్పి, ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారు. ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు ► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు. ► ప్రతినెలా ఒకటో తారీఖునే దాదాపు 95 శాతం మందికి పెన్షన్లు వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. వాళ్లు ఇళ్ల వద్ద లేకపోతే 5వ తేదీ వరకు మూడు నాలుగుసార్లు వాళ్ల ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యవస్థ దేశం మొత్తం మీద ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. మిగిలిన రాష్ట్రాలు మన మాదిరిగా చేయడానికి ఆరాట పడుతున్నాయి. ► ఈ రోజు పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్ అందేలా సాయం చేస్తారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓర్వలేకే విమర్శలు ► ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని.. ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారు. ఇలాంటి వారు ఏ రోజూ కూడా పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించాలని, మన పిల్లల మాదిరే వాళ్లూ గొప్పగా చదవాలని ఆలోచించలేదు. పైగా ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వాళ్లు వీళ్లే. ► పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ఆ పేదలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతుంటే ఓర్వలేక పోతున్నారు. గతంలో వారు చేయక, ఇప్పుడు మనం చేస్తుంటే.. అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి, స్టేలు తీసుకొచ్చే అధ్వాన్నమైన పరిస్థితి. ఇటువంటి వాళ్లు మనల్ని విమర్శిస్తున్నారు. ► రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమొగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని.. అంటే కులాల మధ్య అసమతుల్యత కారణంగా ఇబ్బందులు వస్తాయని కోర్టులకెళ్లి పిటిషన్లు వేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా? ► పేదలు అవసరమొచ్చినప్పుడు వాళ్ల ఇంటిని అమ్ముకునే లేక తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ, లేదా ఈ పెద్దవాళ్లు చేస్తున్నట్టు వాళ్ల పిల్లలకు ట్రాన్స్ఫర్ చేసే స్వేచ్ఛతో.. పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటే కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తూనే ఉంటారు. సినిమా టికెట్ల విషయంలోనూ ఇంతే. ► మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కారణాలతో, రకరకాల కోణాలతో రాజకీయ స్వార్థంతో అడ్డుతగలడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారికి 2022లో అయినా మంచి ఆలోచనలు కలగాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాడు. ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను. -
అభివృద్ధిని చూసి ప్రతిపక్షలు ఓర్వలేకపోతున్నాయన్న:సీఎం జగన్
-
ఏపీలో పెన్షన్ల పండుగ ..
-
వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు (ఫోటోలు)
-
పెద్దాయన మాటలకి దద్దరిల్లిన గుంటూరు సభ
-
ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్
సాక్షి, గుంటూరు జిల్లా: మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామన్నారు. నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానన్నారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం ‘‘పెన్షన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది. మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. పడిగాపులు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. లబ్ధిదారులకు ఇబ్బంది ఏర్పడితే వాలంటీర్లను కలవాలి. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటీఎస్ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ పెన్షన్ స్టాల్స్ ను పరిశీలించిన సీఎం జగన్
-
వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు.. ప్రారంభించిన సీఎం జగన్
Live Updates గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పెంచిన పింఛన్లను అవ్వాతాతలకు సీఎం జగన్ పంపిణీ చేశారు. ►నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని సీఎం అన్నారు. ►గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్ ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. గత ప్రభుత్వం చాలా మంది పెన్షన్లను తొలగించిందన్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం శనివారం మరో పెద్ద ముందడుగు వేసింది. ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి.. ♦అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. ♦రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్ రిపోర్టు సైతం పేర్కొంది. ♦కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంది. ♦2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆంధ్రప్రదేశ్: 5 రోజుల పాటు పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
సాక్షి, అమరావతి : జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తోంది. శనివారం నుంచి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచి చెల్లించబోతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అవ్వాతాతలకు చెల్లిస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని వైఎస్ జగన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పెన్షన్ల పెంపుదల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల వరకు పెంచుతామన్న మాటకు కట్టుబడి పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పాల్గొని పెన్షన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు. రూ.45 వేల కోట్లు ఖర్చు ► రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.1,570.60 కోట్లు విడుదల చేసింది. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసింది. వీరందరికీ శనివారం నుంచి పెంచిన మొత్తాలతో పెన్షన్ చెల్లింపులు చేయనున్నారు. ► వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పెన్షన్లకు రూ.45 వేల కోట్లు ఖర్చు చేశారు. 24 కేటగిరిల కింద పెన్షన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► 2.66 లక్షల మంది వలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రతినెలా ఒకటో తేదీనే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, వారి చేతికే పెన్షన్ సొమ్మును అందిస్తున్న ప్రక్రియ లేదు. ► దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి కూడా ప్రభుత్వం మెడికల్ పెన్షన్లు అందిస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 18.36 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు. పెన్షన్లలో మనమే ఎక్కువ దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నది మన రాష్ట్రమే. ప్రతినెలా సుమారు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. ఇందుకు ప్రతి నెలా సుమారు రూ.1,450 కోట్లకు పైగా కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు రూ.18 వేల కోట్ల మేరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జనవరి నుంచి పెరిగిన పెన్షన్లతో ప్రతి ఏటా పెన్షన్ల కోసం చేసే ఖర్చు రూ.20 వేల కోట్లకు చేరుతోంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి -
జనవరి 1న గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని హెలిప్యాడ్ స్థలాన్ని, వాహనాల పార్కింగ్, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌లతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం హోంమంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నారని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడులో నిర్వహించడం, దీనికి సీఎం విచ్చేయనుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ,రైతుభరోసా) ఎ.ఎస్. దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.రాజకుమారి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం), కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఆనంద్‌నాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ మాధవిసుకన్య, డీఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్ పాల్గొన్నారు. సీఎం పర్యటనపై సమీక్ష అనంతరం రాష్ట్ర హోం మంత్రి సుచరిత కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలోనూ హోంమంత్రి, ఎమ్మెల్సీలు ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతోనూ సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై చర్చించారు. చదవండి: (Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం) సీఎం పర్యటన ఇలా.. గుంటూరు వెస్ట్: జనవరి 1న జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ వివరాలను సీఎంఓ బుధవారం ఖరారు చేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం కార్యాలయం నుంచి బయలుదేరి 10.35 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10.55 గంటలకు ప్రత్తిపాడు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55 గంటల నుంచి 11.10 గంటల వరకు ప్రత్తిపాడులో స్థానిక ప్రజాప్రతినిధులతో ముచ్చటిస్తారు. 11.11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శిస్తారు. 11.15 గంటల నుంచి 12.30 గంటల వరకు ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో పెన్షనర్లకు నగదు అందజేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభా స్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని 12.55 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన 2.30 గంటలపాటు సాగనుంది. -
AP: 1.33 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1.33 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుంది. జనవరి ఒకటో తేదీ నుంచే కొత్త పింఛన్ల డబ్బులు చెల్లిస్తారు. ప్రస్తుతం పింఛను లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఇస్తున్న రూ. 2,250 మొత్తాన్ని జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పింఛన్లలో కోత పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తుంటే.. వారికి చెంపపెట్టులా ప్రభుత్వం పింఛన్లు పెంచుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల్లో 17,03,250 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. తాజాగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మందితో కలిపి వీరి సంఖ్య 18.36 లక్షలు అవుతుంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. దీనికి తోడు గతంలో లబ్ధిదారులు వృద్ధాప్యంలో సైతం ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం గ్రామ పంచాయతీ లేదా వార్డు కార్యాలయాల వద్దనో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్దో గంటల తరబడి వేచి చూడాల్సివచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఆనారోగ్యంతో ఉన్న వారు తదితరులు ఇంటి వద్ద లేదా వారు ఎక్కడ ఉంటే అక్కడే పింఛను డబ్బులు తీసుకుంటున్నారు. చదవండి: (ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా) కొత్త వారి మంజూరు పత్రాలు సిద్ధం జనవరి నుంచి కొత్తగా పింఛన్లు పొందుతున్న 1.33 లక్షల మంది మంజూరు పత్రాలను ఇప్పటికే జిల్లాల్లో సిబ్బంది అందజేశారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ చెప్పారు. ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉందని అన్నారు. తాజాగా మంజూరు చేసిన పింఛన్లతో కలిపి 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 18 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసిందని వివరించారు. -
Andhra Pradesh: పింఛన్ రూ.2,500
స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత కీలకం. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే గతంలో ఆ దరఖాస్తును పరిశీలించిన వారే మళ్లీ వెరిఫికేషన్ చేయకూడదు. ఆ అర్జీని పై అధికారి కచ్చితంగా పరిశీలించాలి. ఈ కీలక అంశాలు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ)లో ప్రధానం కావాలి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతా థృక్పథంతో ఉండాలి. స్పందనపై కలెక్టర్లు పూర్తిగా మనసు పెట్టాలి. కార్యక్రమం మరింత మెరుగుపడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పెద్ద వయసువారు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తాన్ని మాట ప్రకారం ముఖ్యమంత్రి మరింత పెంచారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ... మనస్ఫూర్తిగా ‘స్పందన’ స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు మనస్ఫూర్తిగా నిమగ్నం కావాలి. స్పందన అమలు యంత్రాంగాన్ని మరోసారి పరిశీలించాలి. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నాం. దీంతోపాటు వారానికి ఒక రోజు అర్జీలు తీసుకుంటున్నాం. ఒక సచివాలయం స్థాయిలో ప్రతి రోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశంపై అధికారుల సమీక్ష అవసరం. మండల స్థాయిలో కూడా అధికారులు పరిశీలించాలి. వారంలో ఒకరోజు మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేయాలి. మరింత మెరుగ్గా మన లక్ష్యాలు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. ఉగాది నాటికి పూర్తి కావాలి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్ క్లినిక్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. డిసెంబర్, జనవరిలో కార్యక్రమాలు ఇవీ.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్ 28న ప్రయోజనాలను అందచేస్తామని తెలిపారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఇప్పుడు వారికి ప్రయోజనాలు పంపిణీ చేస్తామన్నారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని అధికారులకు సీఎం సూచించారు. జనవరి 9న ఈబీసీ నేస్తం... అగ్రవర్ణ నిరుపేద మహిళలకు (45 – 60 ఏళ్లు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేసే ఈబీసీ నేస్తం పథకాన్ని జనవరి 9వతేదీన ప్రారంభించనున్నారు. ► జనవరిలోనే వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత చెల్లింపులు చేస్తామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ► ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.