సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వా తాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ బాధితులకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను అందజేయనున్నారు. ఈ పెన్షన్‌ను డిసెంబర్ నుంచే రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ జీఓ జారీచేశారు. పెరిగిన పెన్షన్‌ను జనవరి 1న పింఛన్‌దారులకు అందజేయనున్నట్లు ఆ జీఓలో పేర్కొన్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవ్వాతాతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నూటికి నూరు శాతం అమలుచేసి చూపించారు.
నాడు రూ.400 కోట్లు.. నేడు రూ.2వేల కోట్లు..
ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు అర్హులైన దాదాపు 23 లక్షల మంది కొత్త వారికి వైఎస్సార్ పెన్షన్ కానుకను మంజూరు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల నిమిత్తం నెలనెలా సరాసరిన రూ.400 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్‌తో ఏకంగా రూ.2,000 కోట్లు వ్యయం చేస్తోంది.
నిజానికి.. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయకుండా ఎవరైనా మృతిచెందితేనే వారి స్థానంలో కొత్తవారికి మంజూరు చేసేవారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్లను మంజూరు చేస్తోంది. ఇక సామాజిక పెన్షన్ల కోసం నెలకు రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉదంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమే.
Comments
Please login to add a commentAdd a comment