
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం రూ. 2,750ని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు పెన్షన్ వారోత్సవాలు నిర్వహించనున్నారు. కొత్తగా 2 లక్షల 31 వేల మందికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి పైగా ఏపీలో పెన్షన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ నిలిచింది.
జనవరి 3న రాజమండ్రిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. కాగా ఇప్పటి వరకు రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను 2,750కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఈటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన మొత్తాన్ని జనవరి 1 నుంచి లబ్దిదారులకు అందజేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment