
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్ అమలులోకి రానుంది.
ఏపీలో పెన్షన్‌దారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి రూ.3వేల పెన్షన్ అమలులోకి రానుంది. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment