సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00ల వరకూ 23.99 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. 15.87 లక్షల మందికి సుమారు రూ.469 కోట్లు పెన్షన్ల అందజేశారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఠంఛన్‌గా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1961.13 కోట్లను విడుదల చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ పరిధిలో ఉండే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రూ.1,961.13 కోట్లను బుధవారం ఉదయానికే జమ చేసింది.
ఆయా సచివాలయాల సిబ్బంది బుధవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీని దాదాపుగా పూర్తి చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment