Pensions Door Delivery
-
ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు
విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది... వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. మోసపోయాం: వలంటీర్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా. ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా!చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు. -
సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్దిదారుల ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 65,18,496 మందికి పెంచిన మొత్తాన్ని ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ఇచ్చి న హామీ మేరకు ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1న రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే జూన్‌కు సంబంధించిన ఎరియర్ల సొమ్ము నెలకు రూ.వెయ్యి చొప్పున మూడునెలల ఎరియర్స్ మూడువేలతో కలిపి మొత్తం రూ.7,000లను పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు, నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛను సొమ్మును పంపిణీ చేయాలని ఆయన సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలోలాగే ఎలాంటి మార్పులేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలన్నారు. 1వ తేదీనే పంపిణీఇక పెంచిన పింఛన్లను జూలై 1న రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది పింఛనుదారులకు ఒక్కరోజులోనే పంపిణీకి ఏర్పాట్లుచేయాలని నీరబ్‌కుమార్ చెప్పారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల మంది పింఛనర్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రం వెలుపల ఉండే 0.43 లక్షల పింఛనర్లు.. బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1న ఉ.6.00 గంటల నుండి పింఛనర్ల ఇంటివద్దే పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలనూ వినియోగించుకోవాలని సీఎస్ చెప్పారు. అలాగే, ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున అప్పగించేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారంకల్లా పూర్తిచేయాలన్నారు.సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని.. అవసరమైతే రెండోరోజు కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డి్రస్టిబ్యూషన్ సరి్టఫికెట్ కూడా జారీచేయాలని నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
AP: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00ల వరకూ 23.99 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. 15.87 లక్షల మందికి సుమారు రూ.469 కోట్లు పెన్షన్ల అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఠంఛన్‌గా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1961.13 కోట్లను విడుదల చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ పరిధిలో ఉండే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రూ.1,961.13 కోట్లను బుధవారం ఉదయానికే జమ చేసింది. ఆయా సచివాలయాల సిబ్బంది బుధవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీని దాదాపుగా పూర్తి చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. -
AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు
సాక్షి, అమరావతి/కాకినాడ: అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈనెల నుంచి రూ.మూడు వేలకు సీఎం వైఎస్ జగన్ సర్కారు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛను పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వలంటీర్లు ఓ వైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా.. మరోవైపు రెండ్రోజులుగా వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. నాలుగున్నర ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచి్చన మాట ప్రకారం రూ.3,000ల పెన్షన్ అమలుపై వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు కాకినాడ ఉత్సవాలకు సీఎం జగన్.. ఈ నేపథ్యంలో.. బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్‌ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్‌కుమార్ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు. సీఎం షెడ్యూల్ ఇలా.. – ఉ.9.30కు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.20 గంటలకు కాకినాడకు చేరుకుంటారు. – ఉ.10.40కు బహిరంగ సభ జరిగే రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. – 11.55 వరకూ వైఎస్సార్ పింఛన్ పెంపు ఉత్సవంలో పాల్గొంటారు. – మ.12 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయల్దేరుతారు. – మ.2 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,33,349 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సోమవారం (మే 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పింఛన్ల పంపిణీకి గాను రూ.1,747.38 కోట్లను ప్రభుత్వం శనివారమే విడుదల చేసి ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. శనివారం సాయంత్రానికే సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి ఆ నిధులను డ్రా చేసి వలంటీర్లకు అందజేసినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. వలంటీర్లు సోమవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేపడతారని ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయంలోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్డీఏ పీడీ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
తొలిరోజే 55 లక్షలమందికి రూ.1,516 కోట్ల పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలతో పాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు ఒకటో తేదీ బుధవారం ఠంచన్‌గా పింఛను డబ్బులు చేతికి అందాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభించిన గ్రామ, వార్డు వలంటీర్లు రాత్రి ఎనిమిది గంటలకల్లా 55,03,498 మందికి రూ.1,516.10 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 63.87 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,759.99 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజునే 86.16 శాతం మందికి పంపిణీ పూర్తయిందని, మరో నాలుగురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు చెప్పారు. శభాష్ వలంటీర్.. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఆపరేషన్ అయి నడవలేని స్థితిలో ఉండి కూడా.. తన కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సకాలంలో పింఛను నగదు అందించేందుకు బుధవారం తెల్లవారుజామునే వాకింగ్ స్టాండ్‌తో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చిత్తశుద్ధి చాటుకున్నారు ఈ వలంటీర్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 168 సచివాలయం పరిధిలో వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సప్పా శ్రీనివాసరావు గతనెలలో ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఎడమకాలు విరగటంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి ఐరన్ ప్లేట్స్ వేశారు. కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా శ్రీనివాసరావు వాకింగ్ స్టాండ్ సహాయంతో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. – వించిపేట (విజయవాడ పశ్చిమ -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ.. ఊరూ వాడా సంబరం
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా సామాజిక పింఛన్ రూ.2,750కి పెంపుపై లబ్ధిదారులు ఆనందభరితులయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వారి ఇళ్ల వద్ద సందడి నెలకొంది. పెరిగిన పింఛన్‌పై వివిధ రూపాల్లో తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల వివిధ రకాల పింఛన్ లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ దీవెనలను వ్యక్తపరిచారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి నెలా వలంటీర్లు తమ ఇంటి వద్దకే వచ్చి.. పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్మోహన్రెడ్డిని లబ్ధిదారులు కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పింఛన్ మంజూరుకు పడే పాట్లు, ప్రతినెలా పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు, చాంతాడంత క్యూలో నిలుచోలేక పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తున్నారని కొనియాడారు. పింఛన్ పెంపును పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రాసిన లేఖను లబ్ధిదారులకు పింఛన్ సొమ్ముతో పాటు అందజేశారు. అవ్వాతాతల్లో ఆనందం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో పలుచోట్ల లబ్ధిదారులు సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలో ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ► వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్ పరిధిలోని శంకరాపురంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పింఛన్ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, డబ్బులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పింఛన్ల పెంపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ► నెల్లూరు జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు కార్డు, పెరిగిన పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖను చదివి వినిపించారు. ► పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురంలో ఆదివారం తెల్లవారు జామున రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెంచిన పింఛను సొమ్మును, స్వీటు ప్యాకెట్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ► శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులతో ముచ్చటించారు. పింఛన్ల పెంపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖలను అందజేసి, పెరిగిన పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ► పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీనగర్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. సత్తెనపల్లి ఆరవ వార్డులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరు మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పింఛన్లు పంపిణీ చేశారు. ► గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆగతవరపుపాడులో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, బాపట్లలో కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అధికారులు, వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులతో మాట్లాడారు. సీఎం వారికి రాసిన లేఖలను అందజేయడంతో పాటు పింఛన్లు పంపిణీ చేశారు. తొలిరోజే 71.26% పంపిణీ 1వ తేదీ (ఆదివారం) రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,65,076 మందికి పెరిగిన పింఛను డబ్బుల పంపిణీ పూర్తయింది. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,257.25 కోట్లు అందజేశారు. తొలిరోజునే 71.26 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. 1వ తేదీ సెలవు రోజు అయినప్పటికీ 13 జిల్లాల్లో 75 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని తెలిపారు. -
ఏపీలో పింఛన్ల పండగ (ఫొటోలు)
-
సీఎం జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు 57.88 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 37.07 లక్షల మందికి రూ.1021.02 కోట్లు అందజేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి దాకా.. ప్రతి నెలా వీరు రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 1 నుంచి జరిగే పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి పండుగ వాతావరణంలో వారోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. జనవరి 3వ తేదీన సీఎం వైఎస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. 64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. జనవరి ఒకటి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది. మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు ► 1వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. 7వ తేదీ వరకు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విడతల వారీగా అన్ని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్, నగర కార్పొరేషన్ల వారీగా ఫించను లబ్ధిదారుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు స్థానిక ప్రజా ప్రతిని«ధులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3వ తేదీ రాజమండ్రిలో పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపు వారోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణకు ప్రభుత్వం మండల కేంద్రానికి రూ.10 వేలు, మున్సిపాలిటీకి రూ.15 వేలు, కార్పొరేషన్‌కు రూ.50 వేలు, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద కార్పొరేషన్లకు రూ.లక్ష.. విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.1.50 లక్షలు విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.20 వేల చొప్పున ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. కొత్తగా బియ్యం.. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ► పింఛన్లు రూ.2,750కి పెంపుతో పాటు కొత్తగా పెన్షన్, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను (జూలై 2022 నుంచి నవంబర్ 2022 వరకు) అర్హులైన వారికి మంజూరు కార్డులను వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. ► 44,543 మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు, 14,401 కుటుంబాలకు కొత్తగా ఆరోగ్యశ్రీ, మరో 14,531 కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ► వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింఛన్ల కోసం రూ.62,500 కోట్లు ఖర్చు పెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తాజాగా 64.06 లక్షలకు పెరిగింది. పెరిగిన పింఛన్లపై ఏటా రూ. 21,180 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా.. ► చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పింఛన్‌ను జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రూ.2,250కు పెంచడంతో పాటు.. 2022 జనవరిలో రూ.2,500కు, ఈ జనవరి నుంచి రూ.2,750కి పెంచుకుంటూ వచ్చారు. ► గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నెల వారీగా పింఛన్ల పంపిణీకి అరకొరగా రూ.400 కోట్ల చొప్పున పంపిణీ చేయగా, 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ల వ్యయం ఏకంగా మూడున్నర రెట్లు పెంచి రూ.1,350 కోట్లు ఖర్చు చేసింది. ► గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తద్వారా 2019లో 52.17 లక్షలకు, 2022లో 62.31 లక్షలకు, 2023లో 64.06 లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది. లంచం, వివక్ష లేకుండా పింఛన్ల మంజూరు కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే తారతమ్యాలు లేకుండా.. లంచాలు, వివక్షకు అవకాశం ఇవ్వకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం సంతప్త స్థాయిలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు మంజూరు అవుతున్నాయి. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించే పద్దతే ఉండేది కాదు. లంచాలు.. లేదంటే వివక్షే కనిపించేది. టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అర్హులను గుర్తించేవి. వాళ్లు లంచాలు ఇస్తేనో లేక తమ వర్గం, తమ పార్టీ వాళ్లో అయితేనే పింఛన్లు మంజూరు చేసేవారు. ఒక్కొక్క గ్రామానికి ఇన్ని పింఛన్లే అని కోటా పెట్టుకొని, ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పింఛన్లు ఇచ్చే వారు కాదు. మాకు పింఛను అర్హత ఉంది కదా అని ఎవరైనా అడిగితే.. మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి స్థానంలో ఇస్తామని నిస్గిగ్గుగా చెప్పేవారు. పింఛన్లు తీసుకోవడం కోసం వృద్దులు, దివ్యాంగులు ప్రతి నెలా చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల డబ్బులు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కూడా పూర్తి పాదర్శకంగా చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. పేదలకు పెద్దన్న సీఎం జగన్ కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛను పెంపు ద్వారా పేదల కళ్లల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు, ఆత్మ గౌరవం తీసుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏకంగా 64.06 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సీఎం జగన్.. తన సంక్షేమాభివృద్ధి పాలన ద్వారా రాష్ట్రంలో పేదలకు పెద్దన్నగా మారారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామినైనందుకు గర్వ పడుతున్నాను. – బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి -
పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్రంలో సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం వినాయక చవితి పండుగ అయినప్పటికీ.. ఒకటో తేదీ (గురువారం) తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయానికే రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ మంగళవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చే చేశారన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే పంపిణీకి సిద్ధంగా ఉండాలని సెర్ప్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామన్నారు. అలాగే రియల్ టైమ్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్బీఐఎస్) విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్‌సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామన్నారు. -
శరవేగంగా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా 60,87,399 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారికి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ చేసింది. రూ.1,547.63 కోట్ల మొత్తాన్ని వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెలలో 61.51 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.75 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 99 శాతం మందికి పంపిణీ పూర్తి చేశారు. గరిష్టంగా కర్నూలు జిల్లాలో 99.2 శాతం మందికి పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం లోహరిజోలకు చెందిన వృద్ధురాలు పల్లి మిన్నమ్మ ఒడిశా రాష్ట్రం ఖండవ గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి రాలేకపోవడంతో వలంటీర్ గోర్జన శేషగిరిరావు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి మిన్నమ్మకు పింఛన్ అందించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్‌కుమార్ కిడ్నీ సమస్యతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పింఛనుదారులైన అతని భార్య, తల్లి కూడా అతనికి సాయంగా అక్కడికి వెళ్లారు. ఆ ముగ్గురికీ సచివాలయ ఉద్యోగి లోకేశ్ తిరుపతి వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశాడు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు బీఎస్ కండ్రిగకు చెందిన కుమారి దామోదరం అనే వృద్ధుడు చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ పాకం సాయికృష్ణ అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశాడు. అనంతపురం జిల్లా చీకలగురికికి చెందిన వృద్ధురాలు గంగమ్మ కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా... వలంటీర్ మారుతి శనివారం 170 కి.మీ. దూరం ప్రయాణించి గంగమ్మకు పింఛన్ అందజేశాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నిడిగుంట గ్రామానికి చెందిన రామమూర్తి ఆపరేషన్ నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చేరాడు. వలంటీర్ యమున శనివారం అక్కడికే వెళ్లి పింఛన్ అందించింది. -
60.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: పింఛను రూ.2,500కు పెంపు పండుగ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా కొనసాగాయి. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కొత్తగా పింఛన్లు మంజూరైనవారికి మంజూరు పత్రాలను అందజేసి పెన్షన్‌ను పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60,50,768 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు పెరిగిన పింఛను డబ్బులను అందజేశారు. 97.99 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,539.03 కోట్లు పంపిణీ చేశారు. బుధవారం కూడా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీతో పాటు పింఛన్ల పెంపు కార్యక్రమాలు కొనసాగుతాయని సెర్ప్ అధికారులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం, కాజులూరుల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మామిడికుదురులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రావులపాలెం, ఆత్రేయపురాల్లో ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, ఐపోలవరంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, మాచర్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కిలారి వెంకటరోశయ్య లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కె.పి.నాగార్జునరెడ్డి, ఇంకొల్లులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి రామనాథంబాబు పింఛన్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, పెంటపాడులో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో ఎమ్మెల్యే ఎలీజా, ఉండ్రాజవరం మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, బ్రహ్మసముద్రంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, పాల్తూరులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్‌బాబు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద తామరాపల్లిలో ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, పాలకొండలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, లావేరు మండలం మురపాకలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కవిటి మండలం లండారిపుట్టుగలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, నందిగాం మండలం కణితూరులో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పెన్షన్లు అందజేశారు. విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్ అడపా శేషు పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం కమ్మోళ్లపల్లెలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎస్ఆర్పురం మండలం కటికపల్లెలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మదనపల్లె మండలం మాలేపాడులో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, పీలేరు నియోజకవర్గం కలకడలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఎమ్మెల్సీ భరత్ పింఛన్లు పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా, కర్నూలు జిల్లాల్లో కూడా పింఛన్ల పంపిణీ చురుగ్గా కొనసాగింది. దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్ల పంపిణీ ► హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ పేషెంట్‌కు.. ► నెల్లూరు వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళకు.. గాలివీడు/కమలాపురం (వల్లూరు): వైఎస్సార్ జిల్లాకు చెందిన ఇద్దరు వలంటీర్లు దూరప్రాంతాలకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గాలివీడు మండలం గోరాన్‌చెరువు గ్రామం కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన శివప్రసాద్ డయాలసిస్ కోసం 20 రోజుల కిందట హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అతడికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పెన్షన్‌ను వలంటీర్ వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ వెళ్లి అందజేశారు. కమలాపురం మండలం టి.చదిపిరాల్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మ ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని నెల్లూరులో కుమార్తె దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది. ఆమెకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛనును వలంటీర్ రవీంద్ర మంగళవారం నెల్లూరు వెళ్లి అందజేశారు. వలంటీర్ల సేవాభావాన్ని లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులు ప్రశంసించారు. -
58.16 లక్షల మందికి అందిన పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికి 58,16,016 మందికి రూ.1,394.49 కోట్ల పింఛను సొమ్ము అందజేశారు. రెండో రోజుకు 95.15 శాతం పంపిణీ పూర్తయిందని, శనివారం కూడా వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు. -
సేవకు అవమానం.. టార్గెట్ వలంటీర్!
వారు నేరస్తులా? ► ఎవరైనా నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడినప్పుడు వారి వద్ద ఉండే ఫోన్‌ను స్వాదీనం చేసుకుంటారు. వారి కదలికలపై నిఘా పెడతారు. ఇలాంటిదేదీ లేకుండా, ఏ ఆధారం చూపకుండా వలంటీర్ల పట్ల ఎస్ఈసీ ఈ రీతిలో వ్యవహరించడం ముమ్మాటికీ వారిని అవమానించడమే. అనుమానించడమే. ► చేయరాని నేరం చేసిన నిందితుల మాదిరి పరిగణించి ఆదేశాలు జారీ చేయడం పట్ల వలంటీర్లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తమ కదలికలను నిశితంగా పరిశీలించాలని ఆదేశాలివ్వడాన్ని తప్పు పడుతున్నారు. ► ఇతర ప్రభుత్వ ఉద్యోగులెవరిపై లేని అనుమానాలు తెలుగుదేశం పార్టీ తమపైనే ఎందుకు వ్యక్తం చేస్తోందని, వారి మాటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల సేవల పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం టీడీపీ పెద్దల కను సైగ మేరకు వీరిని అవమానిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నెపంతో క్షేత్ర స్థాయిలో వలంటీర్లు ప్రజలకు సేవలందించడంలో అత్యంత కీలకమైన మొబైల్ ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించడం ముమ్మాటికీ తుగ్లక్ చర్యే. ప్రతి పథకం బయోమెట్రిక్‌పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాల్లోని అంతరంగం ఇట్టే అర్థమవుతోంది. టీడీపీకి ప్రాణం పోయాలన్న ఆత్రం అడుగడుగునా కనిపిస్తోంది. నిమ్మగడ్డ ఆదేశాల రీత్యా రెగ్యులర్‌గా ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇస్తున్న పింఛన్లను ఇప్పుడు బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేయడం సాధ్యం కాదుకదా! ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేకుండా మామూలుగా పని చేసుకోవాలని చెప్పడం వరకు తప్పు లేదు. అయితే ఫోన్లను స్వాదీనం చేసుకోవాలని, వారిపై నిఘా పెట్టాలని అడ్డగోలుగా ఆదేశించడం నిజంగా పిచ్చి పని. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నది చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేరవేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై నిమ్మగడ్డకు ఏమాత్రం అవగాహన లేదా? లేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఇతర నేతలు ఫిర్యాదు చేశారని ఈ ఆదేశాలు జారీ చేశారా? పరిధి దాటి.. శ్రుతి మించి.. వాస్తవం చెప్పాలంటే నిమ్మగడ్డ తన పరిధి దాటి, టీడీపీని బతికించేందుకు శ్రుతి మించి చేస్తున్న ప్రయత్నమిది. ఇప్పటికే పలు విషయాల్లో శ్రుతి మించి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డను పలు సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించింది. నేరుగా, స్పష్టంగా తప్పు పడుతూ మొట్టికాయలు వేసింది. అయినా ఆయన తన వైఖరి మార్చుకోక పోవడం చూస్తుంటే టీడీపీ కోసం ఎంతకైనా బరితెగిస్తారని మరోమారు స్పష్టమైంది. ఇటీవల రేషన్ బియ్యం ఇంటింటికీ సరఫరా చేసే విషయమై ఇదే నిమ్మగడ్డ టీడీపీ నేతలకు మించి నానా యాగీ చేశారు. తుదకు కోర్టు ఉత్తర్వులతో మిన్నకుండిపోయారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలను సైతం అడ్డుకుని, అధికార పక్షానికి ఇబ్బందులు కల్పించాలన్న తాపత్రయం ఆయన ప్రతి అడుగులోనూ కనిపిస్తోందని రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వలంటీర్లు సేవలు అందిస్తున్నందున, ప్రతి పథకం లబ్ధిదారుని వివరాలు వారి ఫోన్‌కు లింక్ అయి ఉంటాయన్న కనీస పరిజ్ఞానం ఎస్ఈసీకి లేదా అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వలంటీర్ల సేవలను అడ్డుకోవడం పట్ల ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సేవాభావంపై ప్రశంసలు ► గతంలో పింఛను తీసుకోవడానికి తీవ్ర కష్టాలు పడిన అవ్వాతాతల ఇబ్బందులను పూర్తిగా మరిపిస్తూ ప్రతి నెలా 1వ తేదీ మధ్యాహ్నం కల్లా వలంటీర్లు అందరి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా నాలుగైదుసార్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగ క్షేమాలు కనుక్కుంటున్నారు. ► ఆయా కుటుంబాల్లో వారికి అర్హత ఉండీ, ప్రభుత్వ పథకాలేవన్నా అందక పోతే వారే దరఖాస్తు తీసుకెళ్లి పూర్తి చేసి వాటిని మంజూరు చేయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం తప్ప ఇతర ప్రతిఫలాపేక్ష లేకుండా సేవాభావంతో వారు చేసున్న కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వలంటీర్ల సేవలను కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వలంటీర్లను రెచ్చగొట్టి.. లబ్ధి పొందాలనుకుని.. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో ప్రతి 50–60 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. కేవలం చదువుకున్న యువతీ యువకులకు అధికారుల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి పూర్తి పారదర్శక విధానంలో ఈ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయ్యే ముందు సరిగ్గా 20 రోజుల కిత్రం వలంటీర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. పలుచోట్ల వారు కలెక్టర్ కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేలా టీడీపీ నేతలు ఉసిగొల్పారు. ► ఈ విషయాన్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్ వెంటనే అసలు విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తూ లేఖ రాశారు. దీంతో టీడీపీ అధినేత కుటిల బుద్ధిని వారు అర్థం చేసుకుని ప్రభుత్వ బాటలో సాగుతున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే తాజాగా ఎస్ఈసీ ద్వారా టీడీపీ అధినేత వీరిపై కక్ష తీర్చుకుంటున్నారు. ► ఇందులో భాగంగా వలంటీర్ల సేవలను కించపరుస్తూ వారిని మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వంటి టీడీపీ నేతలు.. వలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఇవే చిలుక పలుకులు పలకడం గమనార్హం. -
పింఛన్లు ఇస్తూ.. శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: న్యూఇయర్ సందడి గురించి తెలియని ఎంతోమంది అవ్వాతాతల మోములో ఈ ఏడాది తొలిరోజు ఆనందంతో పాటు కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. నూతన సంవత్సరం తొలిరోజు తెల్లవారుజాము నుంచే వలంటీర్లు అవ్వాతాతలకు న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ, వారి చేతిలో పింఛను డబ్బులు పెట్టడంతో వారంతా ఉబ్బితబ్బిబయ్యారు. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒకటో తేదీ వస్తే చాలు వానొచ్చినా, సెలవురోజైనా, పండుగైనా లబ్ధిదారుల ఇంటికే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. 62,472 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు.. రాష్ట్రవ్యాప్తంగా 62,472 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల కొత్తగా పింఛన్లు మంజూరు చేసి వారికి కూడా డబ్బులు పంపిణీ చేసింది. తీవ్ర అనారోగ్యం పాలై ఇబ్బందిపడుతున్న 2,873 మందికి తోడు 59,599 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. వీటితో కలిపి మొత్తం 61,72,964 మందికి ప్రభుత్వం రూ.1,487.34 కోట్లు మంజూరు చేసింది. తొలిరోజు 57.53 లక్షల మందికి పింఛన్లు అందజేత కాగా, శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 57,53,964 మందికి వలంటీర్లు పింఛన్ల పంపిణీని పూర్తిచేశారు. తద్వారా రూ.1,377.51 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం మూడ్రోజులపాటు కొనసాగుతుందని, తొలిరోజు 93.21 శాతం మందికి పంపిణీ పూర్తిచేసినట్లు సెర్ప్ సీఈఓ రాజాబాబు తెలిపారు. మొదటిరోజు తీసుకోని వారికి శని, ఆదివారాల్లో పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు.. రెండు నెలలుగా వివిధ కారణాలతో పింఛను డబ్బులు తీసుకోలేకపోయిన 1,75,800 మందికి పాత బకాయిలతో కలిపి ఈనెల అందజేశారు. ఇక పింఛన్ల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు ఇవీ.. ► కర్నూలు జిల్లా దేవనకొండకి చెందిన వలంటీర్ నరేష్ శుక్రవారం తన వివాహం ఉన్నప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశాడు. ► రెండు నెలలుగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి చిత్తూరు జిల్లాకు చెందిన వలంటీరు వెంకటలక్ష్మి 160 కిలోమీటర్లు దూరం సొంత ఖర్చులతో ప్రయాణించి పింఛను అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన రెడ్డెమ్మ స్విమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ నాగేంద్ర అక్కడకు వెళ్లి మరీ పింఛన్ అందించాడు. ► చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ పరిధిలోని నక్కలదిన్నెలో గురువారం అర్ధరాత్రి 12.06 నిమిషాలకు ఐదుగురికి పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్ లలిత లబ్ధిదారులకు డబ్బులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ
-
ఏపీలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఉదయం 6 గంటల నుంచే వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నాటికి 37.47 లక్షల మందికి పింఛన్లు అందాయి. 2.68 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల చేతికే పింఛన్లను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.68లక్షల మంది లబ్ధిదారులు ఉండగా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 1,496.07 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కొత్తగా 90,167 మందికి పింఛన్ల పంపిణీ జరిగింది. కొత్త పింఛన్‌దారుల కోసం 21.36 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ( 11.42 లక్షల కొత్త పింఛన్లు ) కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్ ఫొటోలతో పింఛన్లు అందిస్తున్నారు. కాగా, సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. -
కొండలు.. గుట్టలు దాటుకుంటూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థ విశాఖ మన్యంలో పటిష్టంగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల గడప వద్దకు చేర వేసేందుకు వలంటీర్లు ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రధానంగా పింఛన్ సొమ్ము పంపిణీలో వీరి పాత్ర కీలకం. రహదారులుండవు.. ఉన్నా ఎక్కడ కిందపడతామో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితిలో వలంటీర్లు ఎంతో శ్రమకోర్చి పింఛన్లు పంపిణీ చేస్తుండటం ‘సాక్షి’ పరిశీలనలో కనిపించింది. రానుపోను 10 కి.మీ. పాడేరు రూరల్: పాడేరు మండలం దేవాపురం పంచాయతీ పరిధిలోని పందిగుంట మూరు మూల ఉంటుంది. మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్లు.. పంచాయతీ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన పాంగి కొండమ్మ అనే గిరిజన మహిళ వితంతు పింఛన్ తీసుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కేంద్రమైన దేవాపురం గ్రామానికి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వచ్చి వెళ్లేది. ప్రస్తుతం కొమ్మ రాంబాబు అనే గ్రామ వలంటీర్ పింఛన్ సొమ్మును నేరుగా ఆమె ఇంటి వద్దే అందజేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలో టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని అక్కడే ఉంచి, సుమారు 3 కిలోమీటర్లు నడిచి ఆ గ్రామానికి వెళ్లాడు. ఆమె ఇంటి వద్ద లేదు. పొలానికి వెళ్లిందని తెలుసుకుని.. అక్కడికే వెళ్లి పింఛన్ అందజేశాడు. వచ్చే నెల నుండి పింఛన్ రూ.2,500 అందుతుందని వలంటీర్ రాంబాబు చెప్పడంతో కొండమ్మ సంతోషం వ్యక్తం చేసింది. మా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చే రోజు వస్తుందని ఊహించలేదంది. వలంటీర్ రాంబాబు తిరుగు ప్రయాణంలో బండిని కొంత దూరం తోసుకుంటూ వచ్చి, పంక్చర్ వేయించుకుని ఇంటికి వచ్చే సరికి సాయంత్రం 4 గంటలైంది. గిరి శిఖరాలపై ఉన్నా.. సీతంపేట : ఆ ఊరు పేరు రాజన్నగూడ. కొండ అంచున ఉన్న గ్రామమది. మధ్యాహ్నం వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గిరిజనులంతా కొండపోడు పనులకు వెళ్లిపోయారు. గ్రామంలో వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో ‘అమ్మా.. నీకు పింఛన్ వచ్చింది తీసుకో’ అంటూ మంచంపై పడుకున్న బామ్మ సింగమ్మిని లేపారు వలంటీర్ సవర ఆనంద్. ఇంతకు ముందు పింఛన్ తీసుకోవడానికి ఆ బామ్మ కొండ దిగి వెళ్లడానికి నానా అవస్థలు పడేది. ఇప్పుడా కష్టం తప్పింది. వలంటీరు కొండ మీద ఉన్న తన ఇంటికి వచ్చి మరీ పింఛన్ ఇస్తున్నాడు. దీంతో ఆమె సంబరపడిపోతున్నారు. మరో గ్రామమైన కానంగూడను సందర్శించగా అక్కడ సవర బాపడు అనే వృద్ధుడు కదలలేని స్థితిలో ఉంటే అక్కడి గ్రామ వలంటీర్ రామారావు.. పింఛన్ ఇవ్వగానే ఎంతో ఆనందించాడు. కర్రగూడ గ్రామంలో వృద్ధుడు తోటయ్యకు వలంటీర్ పింఛన్ ఇవ్వగానే నిత్యావసర సరుకులు కొనుక్కుంటానంటూ బయలుదేరాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలోని ప్రతి గిరిజన గ్రామంలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో సుమారు 470 గిరిజన గ్రామాలున్నాయి. కొండలపై ఉన్న గ్రామాలు సుమారు 350 వరకు ఉంటాయి. ఇక్కడ ఉంటున్న పింఛన్‌దారులందరికీ వలంటీర్లు ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లోనే విధులకు.. అమడగూరు: అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని గోపాల్‌నాయక్ తండాలో వలంటీర్ రాజశేఖర్‌నాయక్ పెళ్లి పీటల నుంచి నేరుగా వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాడు. గోపాల్‌నాయక్ తండాకు చెందిన వలంటీర్ రాజశేఖర్ నాయక్‌కు కదిరి సమీపంలోని తండాకు చెందిన ఇందిరతో ఈనెల 1న వివాహం జరిగింది. అయితే అదే రోజు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండటంతో ఉదయం 6 గంటలకు తాళి కట్టగానే పెళ్లి పీటల పైనుంచి నేరుగా వెళ్లి 50 మంది లబ్ధిదారులకు పింఛన్‌ను అందజేశాడు. కొండ పైకే పెన్షన్ సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, రంపచోడవరం/కూనవరం: ఒకవైపు శబరి, మరోపక్క గోదావరి.. మిగిలిన రెండు దిక్కులూ ఎల్తైన కొండలే. మధ్యలో కూనవరం మండలం. రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాలతో చింతూరు ఐటీడీఏ ఏర్పాటైంది. దీని పరిధిలో ఉన్న 4 మండలాల్లో కూనవరం ఒకటి. ఈ మండలంలో 56 చిన్నా, పెద్దా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల జనాభా 26,800. మండలంలోని కొండలపై 10 ఆదివాసీ పల్లెల్లో 70 మంది (గతంలో 36 మందే) పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో గబ్బిలాల గొంది అనే పల్లెలో పింఛన్ల పంపిణీ ఇలా సాగింది. ► మంగళవారం ఉదయం 6 గంటలు కావస్తోంది. కూనవరం మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వలంటీర్ సూట్రు లక్ష్మారెడ్డి టేకులొద్ది చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి సమయం 7 గంటలు అయింది. ► టేకులొద్ది నుంచి ముందుకు వెళ్లాలంటే దారి కనిపించలేదు. అక్కడి నుంచి కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. కనిపిస్తోన్న చిన్న కాలిబాట పట్టుకుని రెండు కొండలు ఎక్కి.. దిగడానికి మూడు గంటల సమయం పట్టింది. అంటే గబ్బిలాలగొంది గిరిజన ఆవాసం చేరుకునే సరికి ఉదయం 10 గంటలు అయింది. ► అలా సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన కొండలు ఎక్కుతూ దిగుతూ ప్రయాణించాక గబ్బిలాలగొంది గ్రామం వచ్చింది. ► గ్రామంలో తొమ్మిది మంది పింఛన్ దారులున్నారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు. వారందరికీ వలంటీర్ పింఛన్ పంపిణీ చేశాడు. ఇలా కొండపైకి వచ్చి ఇంటి పట్టునే పింఛన్ ఇత్తారని కలలో కూడా అనుకోలేదయ్యా.. అంటూ వారు చాలా సంతోషపడ్డారు. గతంలో అష్టకష్టాలు పడి రెండు కొండలు ఎక్కి దిగి ఎల్లాల్సిందేనయ్యా అని చెప్పారు. చేతికి పిండికట్టుతోనే.. ఒంగోలు టౌన్: ఒంగోలు 29వ డివిజన్లోని వార్డు వలంటీర్ తోట లక్ష్మీవరప్రసాద్ పదిరోజుల క్రితం బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఎడమ చేయి విరగడంతో వైద్యులు పిండికట్టు వేసి 40 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. లక్ష్మీ వరప్రసాద్ క్లస్టర్ పరిధిలో 25 మంది పింఛన్లు పొందుతున్నారు. జూన్ 1న వారికి పింఛన్లను ఎలాగైనా అందించాలని అనుకున్న లక్ష్మీవరప్రసాద్ తన కుమార్తె వర్షిత సాయంతో 25 మందికీ పింఛన్లు అందించి వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు. -
లాక్‌డౌన్‌లోనూ వీడని సంకల్పం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వృధ్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల ఒకటోతేదీనే పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి కరోనా వైరస్ నియంత్రణ నిబంధనలు కూడా తలవంచాయి. పండుటాకుల చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు లాక్ డౌన్ నిబంధనలు ఆటంకం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయి. వైఎస్సార్ పెన్షన్ల పంపిణీకి ప్రస్తుతం అమలు అవుతున్న కరోనా నియంత్రణ నిబంధనల వల్ల ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళనలకు ప్రభుత్వ ముందుచూపు చర్యలు చెక్ పెట్టాయి. ఒకవైపు లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ... సామాజికదూరంను పాటిస్తూ... కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ... ప్రభుత్వ యంత్రాంగం మొక్కవోని దీక్షతో ఒకటోతేదీన (బుధవారం) 93 శాతంకు పైగా పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందించడం ద్వారా తన చిత్తశుద్దిని చాటుకుంది. ఈ ప్రక్రియలో సచివాలయంలోని సీనియర్ ఐఎఎస్ అధికారుల నుంచి గ్రామస్థాయిలోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వరకు భాగస్వాములయ్యారు. ఒకవైపు కరోనా నియంత్రణ జాగ్రత్తలను తాము పాటిస్తూ... పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందిస్తూ... కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పెన్షన్ డబ్బును లబ్దిదారుల చేతికే అందించే క్రమంలో వారి నుంచి తీసుకునే బయో మెట్రిక్ వల్ల కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదంను నివారించేందుకు చర్యలు తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించింది. దానిలో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్ ను వాలంటీర్లు నిర్ధారించడం, జియోట్యాగింగ్ తో లబ్ధిదారుల ఫోటోను యాప్ లో అక్కడికక్కడే తీసుకోవడం ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేశారు. ఎక్కడా లబ్దిదారులను నేరుగా తాకకుండా, అందరికీ ఉపయోగించే బయోమెట్రిక్ ను వాడకుండానే ఈ యాప్ తో పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించినట్లు సెర్ఫ్ సిఇఓ రాజాబాబు తెలిపారు. ఉదయం నుంచే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన వైఎస్సార్ పెన్షన్ కానుకను ఉదయం ఎనిమిదిన్నర గంటలకే 53శాతం పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ దారులకు డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వృద్దులకు, వివిద వ్యాధులతో బాధపడుతున్న వారికి వివరించారు. ఉదయం పదిగంటలకే 77శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా 88.27 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రం అయిదు గంటల వరకు 93శాతం పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. మొత్తం 58,08,404 మంది పెన్షన్లకు గానూ ( సాయంత్రం 5గంటల వరకు) 52,49,802 మందికి పెన్షన్లను అందచేశారు. ఈనెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం 1395.75 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనిలో 93శాతం వరకు సాయంత్రంలోగానే పంపిణీ చేయడం విశేషం. చదవండి: అధైర్యపడొద్దు .. నేనున్నా ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం -
పవన్ ‘కరోనా’ రాజకీయం సిగ్గుచేటు..
సాక్షి. విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కరోనా కట్టడికి కొండంతా అండగా నిలుస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని కేఎల్ రావు నగర్లో బుధవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెన్షన్ డబ్బులతోపాటు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకకుండా ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి ) విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూనే పేదలకు ఇబ్బంది కలగకూడదనే అరవై లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆపదకాలంలో అండగా నిలవకపోగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం తగదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనాను కూడా రాజకీయం చేయటం సిగ్గుచేటన్నారు. ఇక మంత్రి స్వయంగా వచ్చి పెన్షన్ డబ్బు అందజేయటంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్ట కాలంలో సైతం ఇంటికే పెన్షన్ అందజేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకు గాయాలు ) -
సూపర్ వలంటీర్..!
దేవరాపల్లి(మాడుగుల): లబ్ధిదారుల చెంతకు పథకాలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఒక్క వృద్ధురాలికి పింఛన్ ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి నాటుపడవలో ఏరుదాటి అతికష్టం మీద గ్రామానికి చేరుకుని తన అంకితభావాన్ని చాటుకున్నాడు ఓ వలంటీర్. దేవరాపల్లి మండలం తామరబ్బ పంచాయతీ పరిధిలోని లోవ ముకుందపురం గ్రామంలో ఏటికి అవతలి వైపు వృద్ధురాలు వంతె పోతమ్మకు చెందిన ఒక్క కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుట్టలు, కొండల్లో ఏడు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాలి. లేదంటే నాటుపడవలో ఏరును దాటి.. మూడు కిలోమీటర్లు నడవాలి. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో స్థానిక వలంటీర్ టేడ సింహాచలం నాటు పడవలో ప్రయాణించి అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. పోతమ్మకు వృద్ధాప్య పింఛన్ సొమ్మును అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటికి తీసుకొచ్చిన వలంటీర్‌ను పోతమ్మ కుటుంబ సభ్యులు అభినందించారు. గతంలో పింఛన్ అందుకోవాలంటే చాలా కష్టాలు పడాల్సివచ్చేదని గుర్తుచేసుకుంది పోతమ్మ. పథకాల్ని ఇంటికి చేర్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో తమకు బాధలు తప్పాయని ఆనందం వ్యక్తం చేసింది. -
తెల్లవారుజామునే ఇంటికే పింఛన్
-
ఏపీ: ఠంచన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: పింఛను డబ్బులు తీసుకోవడానికి అవ్వా తాతలు నడవలేని స్థితిలో అష్టకష్టాలు పడే రోజులు తొలగిపోయాయి. ఒకటో తేదీన ఉదయాన్నే నిద్రకూడా లేవక ముందే వలంటీరు ఇంటికి వచ్చి తలుపు తట్టి పింఛను చేతికి అందించే రోజులు వచ్చాయి. మార్చి 1వ తేదీ.. ఆదివారం.. సెలవు రోజు అయినా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఒక్క రోజులోనే 87.61% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. 51,53,215 మంది లబ్ధిదారులకు అక్షరాలా రూ.1,272.87 కోట్లు అందజేశారు. పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు 92 శాతానికిపైగా పింఛన్ల పంపిణీ పూర్తి కావటం గమనార్హం. తెల్లవారుజామునే ఇంటికే పింఛన్ అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెల పింఛను డబ్బులను అందజేసేందుకు ఆదివారం తెల్లవారుజామునే ఇళ్ల వద్దకు వలంటీర్లు రావడం చూసి పింఛనుదారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం భీమునిపాడులో వృద్ధురాలు నూతేటి గంగమ్మకు పొలం వద్ద పింఛన్ అందజేస్తున్న వలంటీరు 7 గంటలకే 7 లక్షల మందికి.. ఉదయం 7 కల్లా దాదాపు 7 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి కావడం గమనార్హం. 8 గంటల కల్లా 16,43,201 మందికి పెన్షను అందజేశారు. ఉదయం 9 గంటల సమయానికే మొత్తం లబ్ధిదారుల్లో సగానికంటే ఎక్కువగా 31,78,792 మందికి పంపిణీ పూర్తయింది. అంటే 54.04 శాతం. మధ్యాహ్నం 2 గంటలకు 47 లక్షల పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇంటిలో ఉన్నా.. పొలంలో ఉన్నా.. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా వలంటీర్ల అక్కడికే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. అర్హులైనప్పటికీ గత నెలల్లో పింఛను అందని వారికి ఫిబ్రవరి, మార్చి నెలల డబ్బులను వలంటీర్లు ఆదివారం ఒకేసారి అందజేశారు. సత్తా చాటిన వలంటీర్ల వ్యవస్థ సెలవు రోజు అయినప్పటికీ కేవలం గంటల వ్యవధిలో దాదాపు రూ.1,272.87 కోట్లను లబ్ధిదారులకు అందజేసిన వలంటీర్ల వ్యవస్థపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. వలంటీర్ల వల్ల ప్రయోజనం ఏమిటో ఇప్పుడు అర్థమైందని పింఛను లబ్ధిదారుల కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. మార్చి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీపై ఉన్నతాధికారులు ఆదివారం సెలవు రోజు అయినా రియల్ టైం డేటాతో పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారుల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిల్లాల్లో ప్రత్యేక సెల్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగింది. మనవడా.. వెయ్యేళ్లు వర్థిల్లు ‘నా వయస్సు 85 ఏళ్లు. మాది గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేట. 15 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. పెద్ద కుమారుడు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఇన్నాళ్లూ పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చేది. నా మనవడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గతనెలలో మా ఇంటికే పింఛన్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే నేరుగా ఇక్కడికే వచ్చి పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. నాలాంటి వేల మందికి మేలు జరుగుతోంది. వెయ్యేళ్లు వర్థిల్లు మనవడా..’ ఉద్యోగులకు జీతం.. మాకు పింఛన్.. ‘జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒకటో తేదీన ఉద్యోగస్తుడికి జీతం ఇచ్చినట్లుగా పింఛను ఇస్తానన్నారు. ఇచ్చి చూపారు. ఆదివారం అయినా వలంటీరు మా ఇంటికి వచ్చి పింఛను డబ్బులు ఇచ్చి వెళ్లారు. గత నెలా ఇలాగే అందింది. గతంలో పింఛను కోసం చెట్టుకింద కూర్చోవాల్సి వచ్చేది. వేలిముద్ర పడకపోతే అంతా సాయంత్రం వరకూ నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు తెల్లవారుజామునే పింఛను ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. – వంక పెద్దోడు, తంతడి అచ్యుతాపురం మండలం, విశాఖ జిల్లా తలసేమియా బాధిత బాలుడికి రూ.10,000 పింఛను తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడులో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ఆదివారం రూ.10,000 పింఛను అందజేశారు. గ్రామానికి చెందిన పేరూరి శివశంకర్, మేరీకుమారి దంపతులకు ఆరేళ్ల క్రితం తొలి సంతానంగా నవీన్‌కుమార్ జన్మించాడు. అనంతరం ఏడాదిన్నరకు వివేక్ పుట్టాడు. పెద్ద కుమారుడు నవీన్‌కు పుట్టిన ఐదు నెలల నుంచి శరీర అవయవాల్లో కదలిక లేకపోవడంతో తుని, కాకినాడ ఆస్పత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. నవీన్‌కు తలసేమియా వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. శివశంకర్, మేరీకుమారి దంపతులు తమ కుమారుడి చికిత్స కోసం రూ.4 లక్షల దాకా ఖర్చు చేశారు. చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే నవీన్ తండ్రి శివశంకర్ అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడి మందులకు నెలకు రూ.5 వేలకు పైగానే ఖర్చవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పింఛను పెంచడం ఆ కుటుంబానికి వరంగా మారింది. గత నెలలో తన కుమారుడికి రూ.10,000 పింఛను మంజూరైందని మేరీకుమారి తెలిపారు. ఈ పింఛను రూ.10,000 నగదును స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కోడూరి దివానం, గ్రామ వలంటీర్ పేరూరి వీర వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ఆదివారం మేరీకుమారి, నవీన్‌కుమార్ అందుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ పింఛను తమలాంటి పేదలకు ఆర్థికంగా కొండంత ఆసరాగా ఉంటుందని మేరీకుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ : బొత్స
సాక్షి, విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున వారి పేర్లు జాబితాలో లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లారని తెలిపారు. ఇలాంటివి పరిగణలోకి తీసుకుని రీవెరిఫికేషన్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అర్హులకు రెండు నెలల పింఛన్ ఇవ్వాలని చెప్పారని, ఇలా రీవెరిఫికేషన్ చేయడం ద్వారా విజయనగరంలో నాలుగు వేల మంది అధికంగా ఇప్పుడు జాబితాలో చేరారని బొత్స తెలిపారు. ఉగాది రోజున అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై అయిదు లక్షల పట్టాలు ఇవ్వనున్నామని, ఇవి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాలు, పెన్షన్, రేషన్ కార్డుల జారీ వంటివి నిరంతర ప్రక్రియ అని, గత ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీల సిఫార్సులు చేసే వారికో, సొంత పార్టీ వారికో, డబ్బులిచ్చిన వారికో ఇవ్వడం కాదని అన్నారు. అర్హత కలిగినవారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారికి అందిస్తామని చెప్పారు. ఎవ్వరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. -
‘ఆ ప్రాంతంలో పేదలు ఉండకూడదా..’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటివద్దకే పింఛన్ల పంపిణీ అద్భుతమైన ఫలితాలనిస్తోందన్నారు. పటిష్టమైన గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగిందని.. మధ్యాహ్నానికే 80 శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇవాళ ఆదివారమైనా లబ్ధిదారులకు పింఛన్లు అందాయని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుంది.. వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. అవినీతికి తావులేకుండా సీఎం జగన్ పటిష్టమైన వ్యవస్థను నిర్మించారని తెలిపారు. ఏపీలో నిజమైన ప్రజా పరిపాలన సాగుతోందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. కియా మోటార్ వెళ్ళిపోతోందని టీడీపీ గందరగోళం సృష్టించిందని మండిపడ్డారు. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిని కలవడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు. (పింఛన్ల పంపిణీలో ఏపీ సర్కార్ రికార్డ్) రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా..? రాజధాని ప్రాంతంలో పేదలకు భూమి ఇస్తే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని రాంబాబు మండిపడ్డారు. ‘‘రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట. టీడీపీకి చెందిన వారు, ధనవంతులు మాత్రమే రాజధాని ప్రాంతాల్లో ఉండాలా.. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా? ఎప్పుడైనా పేదవాడికి సెంటు భూమిచ్చారా.. చాలా దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు’’ అని అంబటి దుయ్యబట్టారు. మేం ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మూడు గ్రామాల ప్రజలకు నేతగా మిగిలిపోయారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.