సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఉదయం 6 గంటల నుంచే వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నాటికి 37.47 లక్షల మందికి పింఛన్లు అందాయి. 2.68 లక్షల మంది వాలంటీర్లు లబ్ధిదారుల చేతికే పింఛన్లను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.68లక్షల మంది లబ్ధిదారులు ఉండగా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 1,496.07 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కొత్తగా 90,167 మందికి పింఛన్ల పంపిణీ జరిగింది. కొత్త పింఛన్‌దారుల కోసం 21.36 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ( 11.42 లక్షల కొత్త పింఛన్లు )
కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్ ఫొటోలతో పింఛన్లు అందిస్తున్నారు. కాగా, సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment