63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు | Distribution of pensions from May 1 morning | Sakshi
Sakshi News home page

63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు

Published Mon, May 1 2023 5:00 AM | Last Updated on Mon, May 1 2023 9:25 AM

Distribution of pensions from May 1 morning - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,33,349 మంది అవ్వా­తా­తలు, వితంతు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులు, దీర్ఘ­కాలిక వ్యాధిగ్రస్తులకు సోమవారం (మే 1వ తేదీ) తెల్లవా­రుజా­ము నుంచే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పింఛన్ల పంపిణీకి గాను రూ.1,747.38 కోట్లను ప్రభుత్వం శనివారమే విడు­దల చేసి ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జ­మ చేసింది.

శనివారం సాయంత్రానికే సచివాలయాల సిబ్బంది బ్యాం­కుల నుంచి ఆ నిధులను డ్రా చేసి వలంటీర్లకు అందజేసినట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. వలంటీర్లు సోమవారం తెల్లవా­రు­జాము నుంచే లబ్ధి­దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేపడ­తారని ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ కార్యాలయంలోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల్లో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement