పింఛన్ల పంపిణీలో ఏపీ సర్కార్‌ రికార్డ్‌ | Government Of Andhra Pradesh Creates Record With Pensions Door Delivery | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో ఏపీ సర్కార్‌ రికార్డ్‌

Published Sun, Mar 1 2020 2:52 PM | Last Updated on Thu, Mar 21 2024 11:40 AM

సాక్షి, అమరావతి : ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వలంటీర్ల వ్యవస్థ సత్తా చాటింది. పొద్దు పొడవకముందే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మధ్యాహ్నం కంతా పూర్తయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పింఛన్ల పంపిణీపై పటిష్టమైన యంత్రాగం ఏర్పాటు చేసి,13 జిల్లాల్లోని 58.99లక్షల మంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్లకోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వాన్ని పూర్తిస్థాయిలో అరికట్టారు. మారుమూల ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు చేశారు. ఒకటోతేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు పింఛన్‌ నగదును అందజేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ సందర్భంగా తొలినెల(ఫిబ్రవరి–2020)లో ఎదురైన సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్‌ పెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement