
విజయవాడ రాజరాజేశ్వరి పేటలో ఓ అవ్వకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ శ్రీనివాస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికి 58,16,016 మందికి రూ.1,394.49 కోట్ల పింఛను సొమ్ము అందజేశారు. రెండో రోజుకు 95.15 శాతం పంపిణీ పూర్తయిందని, శనివారం కూడా వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment