Pension distribution program
-
AP: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00ల వరకూ 23.99 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. 15.87 లక్షల మందికి సుమారు రూ.469 కోట్లు పెన్షన్ల అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఠంఛన్‌గా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1961.13 కోట్లను విడుదల చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ పరిధిలో ఉండే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రూ.1,961.13 కోట్లను బుధవారం ఉదయానికే జమ చేసింది. ఆయా సచివాలయాల సిబ్బంది బుధవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీని దాదాపుగా పూర్తి చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. -
అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్న తమ్మినేని సీతారాం
-
54.96 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద గురువారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామ, వార్డు వలంటీర్లు కరోనా జాగ్రత్తలను పాటిస్తూ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ము అందించారు. మొత్తం 60,96,369 మంది పెన్షనర్లకుగాను గురువారం రాత్రి 7 గంటల సమయానికి 54,96,924 మందికి (90.17 శాతం) పింఛన్లు అందించారు. జూన్ నెలకు సంబంధించి జూలైలో చెల్లించాల్సిన పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,485.12 కోట్లు విడుదల చేయగా తొలిరోజు దాదాపు రూ.1,325.72 కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగనుంది. సామాజిక పెన్షన్లు, వైద్య పెన్షన్లను ప్రతినెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిచేతికే అందించాలన్న సీఎం జగన్ సంకల్పంతో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. 2.66 లక్షలమంది వలంటీర్లు, 15 వేలమంది వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలతో పాటు ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకుముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని పెన్షన్లను పంపిణీ చేశారు. తొలిరోజే 90.17 శాతం పెన్షన్లను పంపిణీ చేసిన వలంటీర్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. పెళ్ళైన 48 గంటల్లోనే విధుల్లో వలంటీర్ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని 27వ డివిజన్ గౌస్‌నగర్–2 సచివాలయానికి చెందిన వలంటీర్ షేక్ సబ్జావలీకి జూన్ 29న వివాహం జరిగింది. పెళ్ళైన రెండోరోజే గురువారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. పెళ్లయిన రెండోరోజే వచ్చి తమకు పింఛను ఇచ్చిన ఆయన్ని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అభినందించారు. – కడప కార్పొరేషన్ కోవిడ్ రోగికి పింఛను శ్రీకాళహస్తి 29వ వార్డు వలంటీరు దివ్య.. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న దొరస్వామి కృష్ణమూర్తి (72)కి పింఛను అందజేశారు. సంబంధీకులే దగ్గరకు వెళ్లడానికి సంకోచిస్తున్న సమయంలో వలంటీరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తనకు పింఛను సొమ్ము ఇవ్వడంతో కృష్ణమూర్తి భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. – శ్రీకాళహస్తి -
పింఛన్ల పండుగ
-
ఏపీ: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు 72.54 శాతం పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీతో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. 39 లక్షల 66 వేల మందికి ఒక్కపూటలో గ్రామ వాలంటీర్లు పించన్లు అందజేశారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా అత్యధికంగా కడప జిల్లాలో 84.43 శాతం, నెల్లూరులో 83.18 శాతం పింఛన్లను పంపిణీ చేశారని పెద్దిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటింటికి పింఛన్లు అందజేశామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేశారు. పింఛన్ల కోసం ఫిబ్రవరి నెల రూ. 1,320 కోట్లు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. ఇంటింటికి పింఛన్లను డోర్ డెలివరీ చేయడం దేశంలో ఎక్కడా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. (రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్' ప్రారంభం) -
పింఛన్ వస్తుందో.. రాదోనని ఆందోళన
సామాజిక సీలింగ్ నిబంధనతో కులాల వారీగా తుదిజాబితా రెండు రోజులు పడుతుందంటున్న అధికారులు ఇంటికొకరికేనంటూ మరికొందరి పేర్లు గల్లంతు ఆధార్‌కార్డులో 65 ఏళ్లు లేకపోతే నో పింఛన్ పింఛన్.. పింఛన్.. పింఛన్... వారంరోజులుగా జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట. ‘ఆసరా’ పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి కార్మికులకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామాల్లో రచ్చబండల నుంచి కలెక్టరేట్ దాకా చర్చ జరుగుతోంది ఈ పింఛన్ల గురించే. దరఖాస్తుల ఆహ్వానంనుంచి.. పంపిణీ ప్రారంభం వరకు అంతా హడావిడిగా, వాడీవేడిగా జరుగుతున్న పింఛన్ల ప్రహసనంపై ‘సాక్షి’ ఫోకస్... క్షేత్రస్థాయిలో ఎన్నో ఆటంకాలు, అనుమానాలు, ఆందోళనలు, ఆవేదనల నడుమ ‘ఆసరా’ పిం ఛన్ల పంపిణీ సాగుతోంది. వాస్తవానికి దరఖాస్తుదారుల సంఖ్య ఈసారి భారీఎత్తున పెరగగా, అందులో కూడా ప్రభుత్వంటార్గెట్ విధించి కోత పెడుతోందన్న ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే కొత్తగా తెరపైకి వచ్చిన ‘సామాజిక సీలింగ్’ నిబంధన గ్రామస్థాయిలో వృద్ధులను కలవరపెడుతోంది. మరోవైపు సమగ్రసర్వే, ఆధార్‌కార్డుకు లింకులు పెట్టి ఏదోసాకుతో పింఛన్ కోసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. అసలు తుది జాబితాలు సిద్ధంకాక ముందే పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం, ఎంపిక చేసిన వారికి పెన్షన్లు ఇస్తుండడంతో, మిగిలినవారు తమకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో అర్హులెంతమంది ఉన్నా, ఒక్కరికే పింఛన్ ఇస్తామని, వివిధ కేటగిరీల్లో ఉంటేనే అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది తమకు పింఛన్ రాదేమోననే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, డ్వాక్రాగ్రూపుల్లో తమవంతు వాటా చెల్లించి పింఛన్ పొందుతున్న ‘అభయహస్తం’ లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.500 పింఛన్ వస్తుండగా, ఇప్పుడు వీరికి రూ.1000 పింఛన్ అమలుచేస్తారా లేక అదే కొనసాగిస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. ఇక, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి విషయంలో కూడా సామాజిక సీలింగ్ అమలు చేస్తున్నారన్న ప్రచారమే నిజమైతే కుష్ఠు ఎయిడ్స్ రోగులకు కూడా పింఛన్లో కోతపడే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధిం చిన వివరాలన్నీ ఆన్లైన్లో అన్ని మండలాల్లో నమో దు కాకుండానే సర్వేకు, పింఛన్‌కు లింకుపెడుతున్నారని, ఆధార్ కార్డులో 65 ఏళ్ల వయసు నమోదు కాకపోయినా పింఛన్ తీసేస్తున్నారని జరుగుతున్న ప్రచారం వృద్ధులను రోడ్లెక్కేలా చేస్తోంది. రెండు రోజులుగా పింఛన్ల పంపిణీపై ఆందోళనలు జిల్లావ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తికార్మికులు తమ పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులంటున్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కలెక్టర్ చిరంజీవులు అధికారికంగా ప్రకటనలు చేస్తుం డడం కొంత భరోసా కలిగిస్తున్నా, అధికారిక తుది జాబితాలు వచ్చి తమ పేర్లను చూసుకునేంతవరకు దరఖాస్తుదారుల్లో ఇదే ఆవేదన కొనసాగనుంది. -
కొందరికేనా!?
ప్రభుత్వ పథకాలు నకిలీలకు అందకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. ‘సమగ్ర సర్వే’ పేరిట జనాన్ని జల్లెడ పట్టింది. అసలు సిసలు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అధికార యంత్రాంగం ఇంటిం టికీ తిరిగి సర్వే జరిపింది. పూర్తిస్థాయి నిఘా నేత్రాన్ని సారించి నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సి పాలిటీలు, గ్రామీణ ప్రాం తాలలో 2,03,314 మందిని మొదటి విడతగా అర్హులుగా ప్రకటించింది. సామాజిక పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. అయినా లబ్ధిదారులను సందేహాలు వీడడం లేదు. -సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘ఆసరా’పై అనుమానాలు * దరఖాస్తుదారులలో ఆందోళన * తొలి జాబితాలో చాలా మందికి దక్కని చోటు * మిగతా అర్జీలపై సాగుతున్న విచారణ * గతంతో పోలిస్తే పెరిగిన విన్నపాలు * పంపిణీని ప్రారంభించినా చేతికందని డబ్బులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని సర్కారు శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. అన్ని పథకాలలో నకిలీలను నివారించేందు కు ‘సమగ్ర సర్వే’ ఇంటింటి పరిశీలన తదితర కార్యక్రమాలను నిర్వహించిం ది. గత ప్రభుత్వం హయాంలో చెల్లించి న ఫించన్‌ను పెంచుతూ అర్హులకే అం దజేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత, సామాజిక ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై 300 బృందాలు విచారణ జరిపాయి. ముందుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనే త, గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 3,78,920 దరఖాస్తులు రాగా 2,03,314 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఇందు లో 300 మందికి శనివారం కలెక్టరేట్ మైదానంలో అర్హత పత్రాలను అందజేశారు. వీరందరికీ ఈ నెల 15 నుంచి ఫించన్లు అందుతాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్ర కటించారు. అయితే, మిగిలిన 1,75,606 మంది పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే పెరిగిన దరఖాస్తులు గత ప్రభుత్వం కూడ సామాజిక భద్రత పథకాలను అమలు చేసింది. జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 2,76,118 మందికి నెల నెలా రూ.7,02,70,100 పంపిణీ చేసింది. ఇందులో పలువురు ‘బోగస్’ లబ్ధిదారులున్నారన్న ఫిర్యాదు లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారు ఇష్టారాజ్యంగా వ్య వహరించి అనర్హులకు కూడా లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బోగస్ లబ్ధిదారులను ఏరి వేసేందుకు పూనుకుంది. అందుకే ఫి ంచన్లు పొందుతున్నవారందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లావ్యాప్తంగా 3,78,920 దరఖాస్తు లు వచ్చాయి. అంటే, గతంతో పోలిస్తే 1,02,802 అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నమాట. అధికారులు సోమవారం ప్ర కటించిన జాబితాలో 2,03,314 మంది ఉన్నారు. దీని ప్రకారం, ఏరివేతకు ముందు వరకు పింఛన్ పొందుతున్నవారితో పోలిస్తే 72,804 మంది తగ్గా రు. ఈ నేపథ్యంలో మిగిలిన 1,75,616 దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇం కెంత మందిని అర్హులుగా ప్రకటిస్తారు? ఫింఛన్దారులు తగ్గుతారా? పెరుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని, అర్హుల వారు ఎంతమం ది ఉన్నా.. అందరికీ ఫించన్లు అందజేస్తామని చెబుతున్నా సందేహాలు వీడ డం లేదు. సాగుతున్న కసరత్తు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫిం చన్లు తదితర దరఖాస్తుల నుంచి ఇంకా అర్హుల ఎంపికపై కసరత్తు జరుగుతుం దని అధికారులు చెబుతున్నారు. సెప్టెం బర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ముందుగా చెప్పినా, 20 వరకు కొనసాగించారు. దీంతో ఊహించిన దానికంటే అధికం గా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆహారభద్రత కింద 7,25,723, సామాజిక భ ద్రత ఫించన్ కోసం 3,78,9200, కుల ధ్రువీకరణకు 1,12,011, ఆదాయం 1,00,531, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ 300 బృందాలను రంగలోకి దిం పారు. చాలా వరకు అధికారులు బాగా పని చేసినా, నిజామాబాద్ కార్పొరేషన్ లాంటిచోట అడుగడుగునా జాప్యం, నిర్లక్ష్యం కనిపించింది. సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమీషనర్ మంగతయారుపై అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆర్మూరు, కామారెడ్డి, బో ధన్ మున్సిపాలిటీల అధికారులను కూ డ మందలించారు. ఎట్టకేలకు శుక్రవా రం నాటికి సర్వే ముగిసిందనిపించిన అధికారులు మొదటి విడత జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ఆసరా’ కొందరికా? అందరికా? అన్న చర్చ జరుగుతోంది. -
నీ అంతు చూస్తా...
ఎమ్మెల్యేను బెదిరించిన టీఆర్ఎస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చందానగర్: అధికారిక కార్యక్రమానికి పార్టీ నేతలను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే అంతుచూస్తానని బెదిరించాడో టీఆర్ఎస్ నాయకుడు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో సదరు ఎమ్మెల్యే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం... చందానగర్‌లో ఆదివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగానికి ముందు నాయకులందరి పేర్లూ సంభోదించారు. అయితే, వేదిక ముందు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఇన్చార్జి కొమరగౌని శంకర్ గౌడ్ పేరు ప్రస్థావించలేదంటూ ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకొని... ఇది అధికార కార్యక్రమం, ఆయన ను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శంకర్ గౌడ్ నీకెందుకూ... కూర్చో అంటూ... ఎమ్మెల్యేను వేదికపైనే అన్నాడు. మంత్రి జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేసేందుకు వేదిక దిగి కిందకు వ చ్చారు. మంత్రి, ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేస్తుండగా ‘నీ సంగతి చూస్తా...అని దుర్భాషలాడుతూ బెదిరించినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటాపోటీ నినాదాలు... కార్యక్రమం ముగించుకొని బయటకి వచ్చిన ఎమ్మెల్యే గాంధీని చూస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ.. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు దీనికి ప్రతిగా నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపివేయడంతో ఉద్రిక్తత సడలింది. -
భారమే అయినా..
నిజామాబాద్ సిటీ: ప్రభుత్వానికి భారమైనప్పటికీ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ‘ఆసరా’ కల్పించాలనే ఉద్దేశంతోనే వారికిచ్చే పింఛన్ డబ్బులను పెంచామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, వితంతువులకు రూ. 200 ఉన్న పింఛన్ రూ. 1000కి, వికలాంగులకు రూ. 500 ఉన్న పింఛన్ రూ. 1500కు పెంచడంతో కేసీఆర్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చినట్లయ్యిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ. 75 మాత్రమే పింఛన్ ఇచ్చేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200కు పెంచినా అది లబ్ధిదారులకు ఏ మాత్రం సరి పోకపోయేదన్నారు. గత ప్రభుత్వాలకు పింఛన్ల భారం రూ. 1000 కోట్లు ఉంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఆ భారం రూ. 4 వేల కోట్లకు పెరిగిందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పింఛన్ల కోసం 3.29 లక్షల దరఖాస్తులు రాగా 1.73 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. నగరంలో 49 వేల దరఖాస్తులు రాగా, 30 వేల ద రఖాస్తులకు మంజూరు లభించిదన్నారు. ఇంకా అనేక దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోండి అర్హులు ఎంతమంది ఉంటే అంత మందికీ పింఛన్లు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. వారంతా ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీలకు 38,378, ఎస్టీలకు 17,703, బీసీలకు 97,057, ఓసీలకు 14,946, మైనార్టీలకు 11,221 పింఛన్లు మంజూరు చేసామని తెలిపారు. ఈ వర్గాల వధువులందరికీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వివాహానికి ముందే రూ. 51 వేల రూపాయల చెక్కులను అందజేస్తామన్నారు. గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజ లకు రూ. 3.50 లక్షలతో 125 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించామని మంత్రి పోచారం తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లను బీటి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కిలో మీటరుకు రూ. 13 లక్షల చొప్పున 14,500 కిలో మీటర్ల బీటీ రోడ్లు, కిలో మీటరుకు రూ.39 లక్షల చొప్పున 4,160 కిలో మీటర్ల కంకర రోడ్డు, కిలో మీటరుకు రూ. 3 లక్షల చొప్పున మట్టి రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. దీని కోసం ఆర్అండ్బీ శాఖకు రూ.10 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. కొత్తగా నిర్మించబోయే వంతెనలకు రూ.250 కోట్లు కేటాయించామన్నారు.సమస్యా త్మకంగా మారిన డిచ్పల్లి నిజామాబాద్ రోడ్డును నాలుగు వరసల రహదారిగా మార్చేందుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. పనులు అతి త్వరలో మొదలు కా నున్నాయని తెలిపారు. నిజామాబాద్ రింగు రోడ్లకు రూ. 1550 కోట్లు, 600 చెరువుల పునరుద్ధరణకు రూ. 200 కోట్లు రూపాయలు కేటాయించామన్నారు. ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసు రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు ఏం కావాలో సీఎం కేసీఆర్ బాగా ఆలోచించి ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అన్నా రు. పట్టణ ప్రాంతాలలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారన్నారు. పిల్లల కోసం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యా సీఎం బాధ్యత తీసుకున్నారన్నారు. కొన్ని పార్టీలు పింఛన్లు తొలగిస్తున్నారని అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బోగస్ పింఛన్లు మాత్రమే తొల గించి నిజమైన అర్హులకు ఇస్తున్నామన్నారు. నగరంలో ఇంకా సర్వే పూర్తి కాలేదని, సర్వే పూర్తి అయ్యాక పింఛన్ డబ్బులు చేతికి అందుతాయన్నారు. కొత్త రాష్ట్రంలో పెద్ద బడ్జెట్ సమైక్య రాష్ట్రం బడ్జెట్ రూ. లక్ష కోట్లు ఉంటే, సీఎం కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ కూడా రూ. లక్ష కోట్లతో బడ్జెట్ రూపొందించారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బా జిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇదే, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపిస్తోందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ పించన్లు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని సూచిం చారు. వృద్ధుల పింఛన్లను కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి తీసుకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు ఆకుల సుజాత, కలెక్టర్ రొ నాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫయీమ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి, నిజామాబాద్ మండల అధ్యక్షుడు యాదగిరి, జడ్పీటీసీ పుప్పాల శోభ, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఆర్డీఓ యాదిరెడ్డి, నిజామాబాద్ మండల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆసరా అందించండి
సంగారెడ్డి అర్బన్: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ‘ఆసరా’ను శనివారం అధికారికంగా ప్రారంభించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పింఛన్ల పంపిణీ నిర్వహించాలన్నారు. దీనిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. పెన్షన్లు ఇచ్చేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచి తీసుకువచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. లబ్ధిదారులను క్షేమంగా తిరిగి వారి గ్రామాలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం యథావిధిగా ఆయా గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. పింఛన్లు అందజేసే చోట వైద్య శిబిరం మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ డివిజన్ నుంచి జేసీ డా.ఎ.శరత్ , డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ ఇన్చార్జ్ సీఈవో, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓలు మధుకర్‌రెడ్డి, వనజాదేవి, ముత్యంరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.