సాక్షి, గుంటూరు: చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులకు అవస్థలు పడుతున్నారు. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ పడింది. కేంద్ర వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు ఇబ్బందులు తప్పదు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే పెన్షన్ అందనుంది. దీంతో నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ జరిగేది. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పింఛన్లపై బాబు డబుల్ గేమ్
Comments
Please login to add a commentAdd a comment