Live Updates
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పెంచిన పింఛన్లను అవ్వాతాతలకు సీఎం జగన్ పంపిణీ చేశారు.
►నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని సీఎం అన్నారు.
►గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్ ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు..
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. గత ప్రభుత్వం చాలా మంది పెన్షన్లను తొలగించిందన్నారు.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సాక్షి, అమరావతి: జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం శనివారం మరో పెద్ద ముందడుగు వేసింది. ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి..
♦అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే.
♦రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్ రిపోర్టు సైతం పేర్కొంది.
♦కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంది.
♦2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment