prathipadu
-
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు
-
ప్రత్తిపాడు YSRCP నాయకుని ఇంటిపై TDP నాయకుల దాడి పలువురికి గాయాలు
-
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకుల దాడి
-
ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ ఇంఛార్జ్ గా వరుపుల సుబ్బారావు
-
ప్రత్తిపాడు టీడీపీ ఇన్ ఛార్జ్ రామాంజనేయులకు నిరసన సెగ
-
సీఎం జగన్ నమ్మకానికి అనుగుణంగా పని చేస్తా : వరుపుల సుబ్బారావు
-
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసింది
-
సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్
-
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపుగా వెళ్తున్న ఇసుక లారీ అదుపుతప్పి డివైడర్ దాటి మరొక లారీని ఢీ కొట్టింది. ప్రమాద ఘటనలో క్యాబిన్లో మంటలు వ్యాపించాయి. క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అవ్వగా, ఆసుప్రతికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి! -
ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్‌తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు. గతంలో ఎన్నో ఇబ్బందులు గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్.. గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు. దీక్ష యాప్ లేకున్నా.. తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్‌ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ఎంతో ఉపయుక్తం క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. – సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు కొత్తగా.. ఆసక్తిగా ఉంది క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. – గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్ -
దర్జాగా తిరుగుతున్న పులి.. చిక్కేదేలే.. తగ్గేదేలే.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
ప్రత్తిపాడు రూరల్(కాకినాడ జిల్లా): ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో పులి దర్జాగా తిరుగుతోంది. రెండు రోజులుగా బోనులను ఏర్పాటు చేసినా పరిస్థితులను పసిగట్టిన పులి చిక్కకుండా తప్పించుకుంటోంది. శనివారం రాత్రి అది బోను వరకూ వెళ్లినా చిక్కలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీఎఫ్ఓ శరవణన్, డీఎఫ్ఓ ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సెల్వం, సబ్ డీఎఫ్ఓ సౌజన్య, స్క్వాడ్ డీఎఫ్ఓ ఎంవీ ప్రసాదరావు, ఐఎఫ్ఎస్ ట్రైనీ భరణి, రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వైల్డ్ లైఫ్ రేంజర్ వరప్రసాద్, డీఆర్ఓ రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రవిశంకర్‌నాగ్, ఎన్ఎస్టీఆర్ బృందాల సారధ్యంలో అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. చదవండి: 20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..? నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్) బృందాలను పులిని ట్రాప్ చేసేందుకు రంగంలోకి దింపారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాలు, ట్రాప్ కెమెరాల్లో చిత్రాలను అధికారుల బృందం క్షుణంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ఏకకాలంలో ఎనిమిది బోనులను ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. పులి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఎన్ని బోనులు ఏర్పాటు చేసినా చిక్కే పరిస్థితి కనిపించడం లేదు. లేకుంటే ఆఖరి ప్రయత్నంగా ట్రాంక్విలైజర్ గన్‌తో పులికి మత్తు మందు ఇచ్చి బంధించే అవకాశం ఉంది. బోనులు ఏర్పాటు చేస్తున్న అధికారులు ఆచితూచి అడుగులు ట్రాంక్విలైజర్ గన్‌తో ఇచ్చే మత్తు మందు మోతాదు అటు, ఇటు అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మోతాదు ఎక్కువైతే చనిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువైతే ప్రశాంతంగా ఉన్న పులిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఆ సమయంతో పులి క్రూరంగా తయారై ప్రజలకు హాని కలిగించే పరిస్థితి ఉంది. అందుకే అధికారులు పులిని బంధించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికారుల ఆలోచనలను చిత్తు చేస్తూ బోనులకు చిక్కకుండా అది దర్జాగా తప్పించుకొంటూ తిరుగుతోంది. అటుగా వెళ్లనీయకుండా.. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా అధికారులు తమ అ«దీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోకి పశువులు, జనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా పులికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి అటవీ ప్రాంతం వైపు తరలించే దిశగా చర్యలు చేపడుతూనే బోనులను ఏర్పాటు చేశారు. ఇందులో ఏది జరిగినా పులి గండం నుంచి గట్టెక్కినట్టే అవుతుంది. గత 15 రోజులు ప్రజలు సహకరించారని, మరికొద్ది రోజులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని తరలించేందు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, ఉత్తరకంచి, పాండవులపాలెం ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. -
20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..?
ప్రత్తిపాడు రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్తిపాడు మండలంలోని పులి సంచారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటువంటి ఈ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం పులులు విస్తారంగా సంచరించేవన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పటి తరం వారికి మాత్రం పులుల సంచారం, స్థానిక వేటగాళ్ల ధైర్య సాహసాల గురించి బాగా తెలుసు. తమ సైనికులకు రక్షణ కల్పించాలంటూ అప్పటి వేటగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం అర్థించింది. ప్రత్తిపాడు పరిసరాలు, నాగులకొండ ప్రాంతాల్లో పులులు, చిరుత పులులు విస్తారంగా సంచరించేవట. అనుకోని అతిథిలా ప్రత్తిపాడు ప్రాంతానికి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ తూర్పుకనుమల్లో కనిపించడం ఇదే ప్రథమం. అయితే ఈ ప్రాంతంలో పులులు లేవా, ఉంటే ఏమయ్యాయి అన్నదానిపై సమాచారం సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 పులులను సంహరించిన చిట్టిరాజు జగ్గంపేట మండలం రాయవరానికి చెందిన చిట్టిరాజు ప్రపంచంలోనే ప్రముఖ వేటగాడు జిమ్ కార్బెట్ సమకాలికుడు. 1918 – 1926 మధ్య నరమాంస భక్షకిగా హడలెత్తించిన రుద్ర ప్రయోగ చిరుతపులిని చంపడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న వేటగాళ్ల కోసం గాలించింది. అందులో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చిట్టిరాజు ఒకరు. సరిగ్గా అదే సమయంలో ప్రత్తిపాడు అటవీ ప్రాంతంలో గుర్రాల మీద వెళ్లే బ్రిటిష్ సైనికులను పులులు చంపి తినేస్తుండటంతో బ్రిటిష్ అధికారులు కొట్టాం సంస్థానం, తుని రాజా వారికి పులులను సంహరించే బాధ్యతలను అప్పగించారు. రామచంద్రరాజు వేటాడిన బెంగాల్ టైగర్ ఆ పనిని తుని రాజా వారు చిట్టిరాజుకి అప్పగించారు. మనం చేయాల్సిన పనిని పులులు చేస్తున్నాయి. అటువంటి పులులను తాను సంహరించలేనని దేశభక్తి భావంతో ఆయన నిరాకరించారట. అయితే బ్రిటిష్ సైనికులతో పాటు స్థానిక ప్రజలు పులి దాడిలో మృతి చెందటంతో రాజాజ్ఞ ప్రకారం పులులను సంహరించే బాధ్యతను స్వీకరించారు. పులిని సంహరించిన తర్వాత ఏ తెల్లదొర తనతో కరచాలనం చేయరాదని షరతుతో పులిని వేటాడినట్టు తెలిసింది. ఆయన జీవిత కాలంలో మనుషులకు హాని కలిగించే 20 పులులను సంహరించినట్లు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రుద్రయాగ చిరుత పులి సంహారానికి రమ్మని చిట్టిరాజుకు కూడా వర్తమానం పంపారట. జిమ్ కార్బెట్ అప్పటికే అక్కడ పులి వేటలోకి దిగిపోయారు. ఐదు వందల చదరపు మైళ్లు తిరిగి, రెండున్నర నెలలు పాటు మాటు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం రుద్రప్రయోగ పులి 125 మందిని చంపిందని చెబుతున్నా అనధికారికంగా రెండు వేలకు పైనే చనిపోయి ఉంటారు. రాజుబాబు వేటాడిన చిరుత ఆంధ్ర జిమ్ కార్బెట్.. రాజబాబు చిట్టిరాజు తర్వాత రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుదూర్ (రాజబాబు)ను ప్రధానంగా చెబుతారు. ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో కొందరికి వేటాడ్డానికి అనుమతులు ఉండేవి. ఆంధ్ర జిమ్ కార్బెట్గా చెప్పుకునే రామచంద్రపురం రాజబాబు వేటాడిన వాటిలో 5 బెంగాల్ టైగర్లు ఉండగా 20 వరకూ చిరుత పులులు ఉన్నాయట. ఇప్పటికీ రామచంద్రపురంలో రాజబాబు వధించిన పులుల కళేబరాలు గోడలకు అలంకరించి ఉన్నాయి. చిరుత నోటిలో చేయి పెట్టిన కృష్ణమూర్తిరాజు జగ్గంపేట మండలం మల్లిసాలకి చెందిన వత్సవాయి కృష్ణమూర్తిరాజు పదికి పైగా చిరుత పులులను వేటాడినట్టు చెబుతారు. ఈయన చిట్టిబాబురాజు మనువడు. చిరుతపులి వేటలో కృష్ణమూర్తిరాజు ధైర్యసాహసాలు, శక్తి యుక్తులను ప్రదర్శించి చిరుత నోటిలోనే తన చేతిని నెట్టి త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నారట. అయితే అప్పటికే పులికి కృష్ణమూర్తిరాజు తూటా దెబ్బ తగిలి ఉంది. దెబ్బ తిన్న పులి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం చిన్నవిషయం కాదు. చిరుత నోటిలో పెట్టిన చేతిని చిరుత చప్పరించేసిందట. అనంతరం వేటలో ఉండగా పరుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. పులికి ఎదురెళ్లిన సూరిబాబురాజు ఇంకొకరు రాజోలు మండలం చింతపల్లికి చెందిన అల్లూరి సూరిబాబురాజు దేశం నలుమూలలా తెలిసిన వేటగాడు. ఈయన చిరుత పులులతో పాటు, బెంగాల్ టైగర్స్‌ను కూడా వేటాడారు. మారేడుమిల్లి అడవిలో రోడ్డు మీద ఎదురుపడ్డ పులికి ఎదురెళ్లిన వేటగాడు సూరిబాబుని పాతతరం వారు చెబుతుంటారు. సూరిబాబు ఇటీవల కాకినాడలో మృతి చెందారు. -
దళిత మహిళా సర్పంచ్‌కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు
సాక్షి, ప్రత్తిపాడు (గుంటూరు): కులం పేరుతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ దళిత మహిళా సర్పంచ్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా గొట్టిపాడు సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన ఆది ఆంధ్రా కాలనీకి చెందిన ప్రత్తిపాటి మరియరాణి గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా టీడీపీకి చెందిన ముఖుంద శివరంజనిని పంచాయతీ సభ్యులు ఎన్నుకున్నారు. నాటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అనేకమార్లు పంచాయతీ కార్యాలయంలోనే వివాదాలు, వాగ్వాదాలు జరిగాయి. సర్పంచ్‌గా మరియరాణి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉపసర్పంచ్ భర్త నిమ్మగడ్డ శ్రీకాంత్ ఆమెను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడు. ఇటీవల ఖాళీ చెక్కులపై సంతకాలు చేయాలంటూ శ్రీకాంత్, పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ రామ్మూర్తి కలిసి మరియరాణిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై పంచాయతీకి వెళ్లనని శ్రీకాంత్ ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. చదవండి: (విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్) ఆ తర్వాత కూడా మళ్లీ ‘నాతోనే క్షమాపణ చెప్పిస్తావా?, ...దానివి నీకెందుకు సర్పంచ్ కుర్చీ. మేం ఎలా చెబితే అలా చేయాలి లేకుంటే చంపేస్తాం’ అంటూ శ్రీకాంత్ బెదిరింపులకు దిగాడు. వేధింపులు తాళలేని మరియరాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
అభివృద్ధిని చూసి ప్రతిపక్షలు ఓర్వలేకపోతున్నాయన్న:సీఎం జగన్
-
ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్
సాక్షి, గుంటూరు జిల్లా: మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామన్నారు. నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానన్నారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం ‘‘పెన్షన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా?. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేది. మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నాం. అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. పడిగాపులు లేకుండా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. లబ్ధిదారులకు ఇబ్బంది ఏర్పడితే వాలంటీర్లను కలవాలి. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటీఎస్ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు.. ప్రారంభించిన సీఎం జగన్
Live Updates గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పెంచిన పింఛన్లను అవ్వాతాతలకు సీఎం జగన్ పంపిణీ చేశారు. ►నూతన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని సీఎం అన్నారు. ►గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్ ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. గత ప్రభుత్వం చాలా మంది పెన్షన్లను తొలగించిందన్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చేరుకున్నారు. కాసేపట్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: జీవన ప్రమాణాలు పెంపు, సామాజిక భద్రతకు రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం శనివారం మరో పెద్ద ముందడుగు వేసింది. ఇప్పడు రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మందికి.. ♦అసరా కోరుకునే వారికి సామాజిక భద్రత కల్పించే పింఛన్ల అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చూపించే ఉదారతను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉదహరించాల్సిందే. ♦రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పట్లో రూ.75గా ఉండే పింఛన్‌ను 2006 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాదిలో ఏకంగా 23 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అప్పట్లో ఇదే విషయాన్ని కాగ్ రిపోర్టు సైతం పేర్కొంది. ♦కొత్తగా పింఛన్ల మంజూరులో, లబ్ధిదారుల ఇబ్బందుల పరిష్కారం విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉదారత చూపిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆదే తరహాలో మేలు చేస్తోంది. ♦2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని అధికార వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జనవరి 1న గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని హెలిప్యాడ్ స్థలాన్ని, వాహనాల పార్కింగ్, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌లతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం హోంమంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నారని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడులో నిర్వహించడం, దీనికి సీఎం విచ్చేయనుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ,రైతుభరోసా) ఎ.ఎస్. దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.రాజకుమారి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం), కె.శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఆనంద్‌నాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ మాధవిసుకన్య, డీఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్ పాల్గొన్నారు. సీఎం పర్యటనపై సమీక్ష అనంతరం రాష్ట్ర హోం మంత్రి సుచరిత కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలోనూ హోంమంత్రి, ఎమ్మెల్సీలు ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతోనూ సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై చర్చించారు. చదవండి: (Jagananna Pala Velluva: సాధికారతకు ఊతం) సీఎం పర్యటన ఇలా.. గుంటూరు వెస్ట్: జనవరి 1న జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ వివరాలను సీఎంఓ బుధవారం ఖరారు చేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం కార్యాలయం నుంచి బయలుదేరి 10.35 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10.55 గంటలకు ప్రత్తిపాడు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55 గంటల నుంచి 11.10 గంటల వరకు ప్రత్తిపాడులో స్థానిక ప్రజాప్రతినిధులతో ముచ్చటిస్తారు. 11.11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శిస్తారు. 11.15 గంటల నుంచి 12.30 గంటల వరకు ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో పెన్షనర్లకు నగదు అందజేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభా స్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని 12.55 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన 2.30 గంటలపాటు సాగనుంది. -
ప్రతి చోటా అవమానాలే.. ఫోటోలు, వీడియో తీసుకురా అంటున్నారు..
సాక్షి, ప్రత్తిపాడు: ‘నా భర్త నన్ను వదిలేసి కనిపించకుండా పోయాడు.. న్యాయం కోసం మూడు వారాలుగా పోలీస్ స్టేషను చుట్టూ తిరుగుతున్నా.. నన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారే గానీ న్యాయం చెయ్యడం లేదు.. అదేమంటే నీ భర్తను నువ్వే వెతుక్కో.. ఎక్కడున్నాడో తెలిస్తే మాకు చెప్పు.. మేమొచ్చి తీసుకొస్తామంటున్నా’రంటూ వివాహిత తీవ్ర ఆవేదన చెందిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. ప్రత్తిపాడుకు చెందిన భార్గవీలత ఇదే గ్రామానికి చెందిన డి. బాజిబాబు ప్రేమించుకున్నారు. పలు వివాదాల అనంతరం లాక్డౌన్ సమయంలో స్థానిక పరమేశ్వరస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత కొద్దిరోజులకే భర్త మొఖం చాటేయడంతో భార్గవీలత భర్త ఇంటి ముంగిట బైటాయించి పోరాటం చేసింది. దీంతో పంచాయతీ స్టేషనుకు చేరడం, ఇరువర్గాలతో పోలీసులు మాట్లాడి భార్యభర్తలిద్దరికీ సర్దిచెప్పి కాపురానికి పంపారు. అయితే, తాజాగా మరోసారి వివాదం తెరమీదకొచ్చింది. గత నెల 22న భర్త ఇంటి నుంచి వెళ్లి పోవడంతో భార్గవి ప్రత్తిపాడు పోలీసుల్ని ఆశ్రయించింది. 23న పోలీసులు వెతికి భర్తను అప్పగించారు. రెండు రోజులు సవ్యంగా ఉన్న భర్త 26న మరలా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి స్టేషను చుట్టూ నిత్యం తిరుగుతోంది. బుధవారం రాత్రి స్టేషనుకు వెళ్లిన భార్గవికి పోలీసులు ‘నీ భర్తను నువ్వే వెతికి ఎక్కడున్నాడో ఫోటోలు, వీడియో తీసుకుని రా.. అప్పుడు మేమొస్తామని చెబుతూ చులకనగా మాట్లాడా’రని భార్గవి ఆరోపిస్తుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించేందుకు తలుపులు వేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు పగలగొట్టి భార్గవిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ భర్త కోసం ఎక్కడికి వెళ్లినా వెళ్లిన ప్రతి చోటా తనకు అవమానాలే ఎదురవుతున్నాయని, ప్రస్తుతం తాను మూడవ నెల గర్భవతిని అని వాపోయింది. చదవండి: (స్టాక్మార్కెట్లో పెట్టుబడి.. పట్టాలపై శవమై తేలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్) అయితే, ఈ విషయమై ఎస్ఐ విజయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా మొదట మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వగానే వెతికి పట్టుకొచ్చి భర్తను అప్పగించామని, మరలా వెళ్లాడని చెప్పడంతో పలు ప్రాంతాల్లో వెతికామని చెప్పారు. అయినప్పటికీ, అతను కనిపించలేదని చెప్పారు. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తానని చెప్పామని, దానికి ఆమె అంగీకరించడం లేదని ఎస్ఐ తెలిపారు. -
కింగ్ కోబ్రా కలకలం: అమ్మో ఎంత పెద్దదో..
ప్రత్తిపాడు రూరల్: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో సంచరిస్తుంది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తూ భయాందోళనకు గురిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు పాము ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. తమకు ఎటువంటి అనవాళ్లు లభించలేదని తెలిపారు. -
కాళ్లకు బురద అంటిందని క్వారీ గుంతలోకి.. నలుగురు గల్లంతు
సాక్షి,ప్రత్తిపాడు: అప్పటివరకూ అంతా కలిసి తిరిగారు.. ఒకే బండిపై చక్కర్లు కొట్టారు. కలిసి తాగారు. కలిసి తిన్నారు. సరదాగా గడిపారు. చివరికి క్వారీ గుంతలో గల్లంతయ్యారు. ఆ క్షణంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించారు. ఆఖరి గడియల్లోనూ స్నేహబంధాన్ని వీడలేదు. కాళ్లకు బురదైందని.. ప్రత్తిపాడుకు చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్ (21), బిళ్లా సాయి ప్రకాష్ (23), ఇగుటూరి వీరశంకర్ రెడ్డి (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్ స్నేహితులు. ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్రవాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం డైట్ కళాశాల సమీపంలోని కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయ్యింది. దీంతో కాళ్లను కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన (సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు) క్వారీ గుంతలోకి ముందుగా శంకర్ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తరువాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన వంశీ, వెంకటేష్ దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితోపాటు వీరూ మునిగిపోయారు. బంధువుల ఆర్తనాదాలు నలుగురు యువకులు నీటి క్వారీ గుంతలో పడి గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది. విషయం దావానంలా వ్యాపించడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కలవారు ఘటనా స్థలానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. ఓ బిడ్డా.. నన్ను వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ గల్లంతైన వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అర్ధరాత్రీ కొనసాగిన గాలింపు చర్యలు ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ క్వారీలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్ఐ అశోక్, తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావుతో పాటు అధికారయంత్రాంగమంతా అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈత రాకున్నా.. నేనున్నా నేస్తం అంటూ. ఓ దశలో సాయిప్రకాష్ చేతులు పైకిలేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుడిని కాపాడేందుకు నీళ్లలోకి దిగి సాయికి చేయి అందించాడు. అతడిని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు. చివరికి ఫలితం లేకపోవడంతో సాయి చేయిని విడవక తప్పలేదని యశ్వంత్ కన్నీరుమున్నీరయ్యాడు. -
బిడ్డలకు బరువైంది.. కానీ భర్తకు కాదు..
కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మ యుక్తఃఖలు ధర్మనాథః పనులు చెయ్యడంలో ఒక యోగిలా ప్రతిఫలం ఆశించకూడదు. కుటుంబాన్ని నడపడం, కార్యాలను నిర్వహించడంలో నేర్పు, సంయమనంతో వ్యవహరించాలి. రూపంలో కృష్ణుడిలా, ఓర్పు లో రాముడిలా ఉండాలి. భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖాల్లో కుటుంబానికి మిత్రునిలా అండగా ఉండాలి. మంచి చెడ్డల్లో పాలు పంచుకోవాలి. ఇవి ఆచరించేవాడే ఉత్తమ భర్తని పై శ్లోకం సారాశం. మేడికొండూరు మండలం జంగంగుంటపాలేనికి చెందిన కత్తి గురవమ్మ, ఏసు భార్యాభర్తలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు పెళ్లి చేశారు. ఉన్న ఇంటినీ సంతానానికే ఇచ్చేశారు. రోజులు గడిచే కొద్దీ బిడ్డలకు తల్లిదండ్రులు బరువయ్యారు. నరాల బలహీనతతో గురవమ్మకు చూపు పోయింది. మోకాలి చిప్పలు అరిగిపోయి కాళ్లూ నడవలేని స్థితికి చేరుకున్నాయి. మూడు చక్రాల బండే దిక్కయింది. ఏసుకు కూడా ఓ ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఆపరేషన్ జరిగింది. ఇద్దరికీ ఆకలి పోరాటం తప్పలేదు. నడవలేని భార్యకు ఏసు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నాడు. నలుగురినీ యాచించుకుంటూ, బస్ షెల్టర్లలో బసచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. ఆదివారం ప్రత్తిపాడు – పెదనందిపాడు మార్గంలో ఈ దంపతులు ‘సాక్షి’కి కనిపించారు. –ప్రత్తిపాడు -
సొసైటీలో అక్రమాలు.. టీడీపీ నేతపై కేసు
సాక్షి, కాకినాడ : డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత టీడీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో రైతు రుణాల పేరుతో రూ. 16 కోట్ల 50 లక్షల నిధులు అక్రమాలు జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. లంపకలోవ సోసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయాని గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో దిమ్మతిరిగే అవినీతి వాస్తవాలు వెల్లడయ్యాయి. (దృఢ సంకల్పంతో ముందడుగు: సీఎం జగన్) చనిపోయిన రైతులు పేరు మీద సోసైటీలో రైతులకు తెలియకుండా స్వల్పకాలిక పంట రుణాలను కాజేసినట్లు గుర్తించారు. అధికారం అడ్డుపెట్టుకుని 450 నకిలీ పాస్ పుస్తాకాలను తయారు చేసి వాటితోను రుణాలను కాజేశారు. ఈ అవినీతి అక్రమాలకు కారకులుగా వరుపుల రాజా తో పాటుగా... అప్పటి సొసైటీ ఉద్యోగులపై విచారణా అధికారి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు వరుపుల రాజాతో పాటుగా నలుగురు మాజీ ఉద్యోగులపై ప్రత్తిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
తెలుగుదేశం పార్టీ శవ రాజకీయం
సాక్షి, ప్రత్తిపాడు/కాకుమాను: గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నవ శ్రీనివాసరావు(47) ఈ నెల 11వ తేదీన ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 12వ తేదీన జీజీహెచ్‌లో పోలీసులు శ్రీనివాసరావు భార్య అనసూయ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అప్పుల బాధతోనే తన భర్త పురుగు మందు తాగాడని ఆమె పేర్కొంది. 15వ తేదీన శ్రీనివాసరావు మరణించాడు. అయితే, అతడి మరణాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శుక్రవారం ప్రత్తిపాడులో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాసరావు ఏ తప్పు చేయకున్నా దొంగ కేసు పెట్టి, హింసించి, వేధించి వైఎస్ జగన్ ప్రభుత్వం చంపేసిందంటూ ఆరోపించారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీనివాసరావుపై ఓ కేసు నమోదైంది. తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రత్తిపాడుకు చెందిన నాగమణి 2018 జూలై 22న ఉన్నవ శ్రీనివాసరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోకేష్ పద్ధతి మార్చుకోవాలి: హోం మంత్రి శవ రాజకీయాలు చేస్తున్న నారా లోకేష్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం హితవు పలికారు. టీడీపీ పాలనలో అధికారులకు సైతం రక్షణ లేకుండా చేసిన మీరా ప్రజల గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. -
పశువుల కాపరి ఆర్తనాదాలు; కాపాడిన ఫైర్ సిబ్బంది
-
పశువుల కాపరి ఆర్తనాదాలు; కాపాడిన ఫైర్ సిబ్బంది
సాక్షి, కాకినాడ : వాగులో కొట్టుకుపోతున్న పశువుల కాపరిని ఫైర్ సిబ్బంది కాపాడిన ఘటన ప్రత్తిపాడు మండలం లంపకలోప వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాచపల్లికి చెందిన కొల్లు వీరబాబు పశువుల మేత కోసం సుద్దగడ్డ వాగు దగ్గరకు వచ్చాడు. ఈ నేపథ్యంలో పశువుల మేత తీస్తుండగా ఒక్కసారిగా కాలు జారి వాగులో పడిపోయాడు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరబాబు చెట్ల కొమ్మలను పట్టుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పశువుల కాపరిని బయటకు తీశారు. -
ఒక్కో టీవీఎస్‌కు.. ఒక్కో సంవత్సరం జైలు శిక్ష
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు) : అతనో ఘరానా దొంగ. చూడటానికి దివ్యాంగుడే అయినప్పటికీ అతని కన్ను పడితే మాత్రం టీవీఎస్ మాయమే. అలాంటి మాయల మరాఠీని ప్రత్తిపాడు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసులకు ఎనిమిది సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీవీఎస్‌లు వరుస చోరీలకు గురవుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అప్పటి ఎస్ఐ ఏ.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన సంగేపు అర్జునరావు (40)ను పట్టుకున్నారు. అతని నుంచి సుమారు ఇరవైవరకు టీవీఎస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముద్దాయిపై 379 ఐపీసీ సెక్షన్ కింద 76/19, 81/19, 82/19, 83/19, 84/19, 85/19, 87/19, 89/19 మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వాటిలో ఈనెల 20వ తేదీన రెండు కేసుల్లో, 21వ తేదీన 3 కేసుల్లో, 22న 3 కేసుల్లో శిక్షలు విధిస్తూ ఆరవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అరుణ తీర్పు ఇచ్చారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసుల్లో ఎనిమిది సంవత్సరాలు శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రత్తిపాడు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రత్తిపాడు రూరల్ (తూర్పు గోదావరి): రెప్పతీస్తే జననం.. రెప్ప మూస్తే మరణం అన్నాడో కవి. నిద్ర మరణానికి మరో రూపం అంటారు. అదే వారి కొంపముంచింది. కొత్తగా టాటా ఏస్ కొనుక్కున్న సంబరంతో మిత్రులతో కలసి తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా దాన్ని నడుపుతున్న చెల్లుబోయిన మరిడియ్యకు నిద్రమత్తుతో రెప్ప పడగా రోడ్డుపక్కన ఆటోను ఢీకొన్నాడు. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాస్ టాటా ఏస్ కొనుక్కొన్నాడు. అదే గ్రామానికి చెందిన పదకొండుమంది బంధు మిత్రులతో శనివారం రాత్రి తలుపులమ్మవారి దర్శనానికి బయల్దేరాడు. అమ్మవారిని దర్శించుకొని ఆదివారం వారు తిరుగుప్రయాణమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెంది న చెల్లుబోయిన మరిడియ్య (ఆటో డ్రైవర్) (36), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపల్లి ఏడుకొండలు (42) మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి ప్రత్తిపాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎ.రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్‌లో క్షతగాత్రులు కాకినాడ: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆదివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. యాండ్ర హరికృష్ణ, యాంత్ర పరమేష్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన శివప్రసాద్, బొంతు సత్య శ్రీనివాసరావుతో పాటు వ్యాన్ డ్రైవర్ రాపాక శ్యామ్బాబులను జీజీహెచ్‌కు తీసుకురాగా యాంత్ర పరమేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యులు చెబుతున్నారు. వీరందరినీ అత్యవసరవిభాగంలో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. గాజులగుంటలో విషాదం పి.గన్నవరం: ధర్మవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామానికి చెందిన మట్టపర్తి ఏడుకొండలు (చిన్న) (52) మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీ పని చేసుకొనే ఏడుకొండలుకు భార్య పద్మావతి, కుమార్తెలు వర్ణిక, మౌనిక ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఏడుకొండలు గ్రామంలో అం దరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణ వార్తను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మట్టపర్రు శోకసంద్రం మలికిపురం(రాజోలు): ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామానికి చెందినవారి అల్లుడు మరణించడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం వార్త ఆదివారం రాత్రి గ్రామస్తులకు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లుబోయిన వీర వెంకట సత్యనారాయణ కొబ్బరి ఒలుపు కార్మికుడు. అతని భార్య, కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. మరొక మృతుడు చెల్లుబోయిన మరిడియ్య ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అరుణ ఉపాధికోసం విదేశాల్లో ఉంటోంది. మరిడియ్య కుమార్తె బాలదుర్గకు వివాహం కాగా కుమారుడు శ్రీరామ కృష్ణ చదువుకుంటున్నాడు. గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ, వెంకట రమణలకు మరిడియ్య అల్లుడు. వెంకట రమణకు స్వయానా సోదరుడు. చిన్నప్పటి నుంచి అక్కే అతనిని పెంచి పెద్ద చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. మరిడియ్య మరణంతో వెంకట రమణ– సత్యనారాయణ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక మృతుడు మట్టపల్లి ఏడుకొండలు మట్టపర్తికి చెందిన యాండ్ర సత్యనారాయణకు అల్లుడు. అతను శనివారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. ఏడుకొండలు బావ మరిది హరి కృష్ణ, బంధువులతో కలిసి లోవ వెళ్లాడు. ఏడుకొండలు స్వగ్రామం పి. గన్నవరం మండలం గాజుల గుంట. అల్లుడి మృతి వార్త తెలిసి అత్తింటి వారు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు బావమరిది హరి కృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామం అంతా రోదనలతో నిండి పోయింది. ఆదివారం అర్ధ రాత్రి వరకూ బంధువులకు మృతి వివరాలు తెలియ లేదు. -
‘తూర్పు’న ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని మలికిపురం మండలం మట్టపర్తి గ్రామానికి చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంపై తుని సమీపంలోని తలుపులమ్మ లోవ దేవస్థానానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ధర్మవరం వద్ద నిద్రమత్తు రావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చెల్లుబోయిన మరిడియ్య (36) (డ్రైవర్), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపర్తి ఏడుకొండలు (42) మృతి చెందారు. వీరిలో మట్టపర్తి ఏడుకొండలు పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామస్తుడు. ప్రమాదంలో మట్టపర్తి గ్రామానికి చెందిన బొంతు సత్య శ్రీనివాసరావు, కాదాల సత్యనారాయణ, కలుకలంక కృష్ణ, వెండ్ర రమేష్, చెల్లుబోయిన శివప్రసాద్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, మండ్ర హరికృష్ణ, రాపాక సారంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్ఐ రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రచారంలో ప్రతిపాడి టీడీపీ అభ్యర్థి రాజా భార్యకు చేదు అనుభవం
-
ప్రత్తిపాడు ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
‘అందుకే మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చా’
సాక్షి, కాకినాడ: తన తోడల్లుడు జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తారని చెబితే టీడీపీలో చేరానని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వెల్లడించారు. సోమవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తనకు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు వైఎస్ఆర్, గత ఎన్నికల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ తనను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని.. వారి వల్లే రెండు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. అలాంటి వ్యక్తుల గుర్తింపు మరిచిపోయి పార్టీ ఫిరాయించి పొరపాటు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మనవడే కదా అని వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే తాతకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడని వాపోయారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించి మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చినట్టు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి పదవులు వద్దని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో కష్టపడి పనిచేస్తాని వరుపుల సుబ్బారావు అన్నారు. -
శ్రీమంతుడి సవతి ప్రేమ
‘అనంతవరప్పాడు గ్రామాభివృద్ధి చరిత్రలో ఓ నూతన అధ్యాయం. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా చేశారు..’ ఇదీ ఎంపీ గల్లా జయదేవ్ దత్తత తీసుకున్న వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామాభివృద్ధిపై సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ‘సాక్షి’ ఆ గ్రామానికి వెళ్లగా పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. గ్రామస్తులను పలకరించగా.. బీసీలు నివసించే కాలనీలో సీసీ రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీలు, ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టలేదని ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామ జనాభా సుమారు 5 వేలు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ గ్రామాన్ని 2014లో ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కింద దత్తత తీసుకున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమా తరహాలో తమ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశపడ్డారు. ఐదేళ్లు గడిచిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. గ్రామంలోని బీసీ కాలనీలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. పలుచోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా.. బీసీ కాలనీలో మాత్రం ఇవేమీ చేయలేదు. వీటి నిర్మాణానికి ఎంపీ గల్లా శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. వీళ్లంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే అక్కసుతోనే పట్టించుకోలేదని బీసీ కాలనీ వాసులు వాపోతున్నారు. ఎస్సీ కాలనీ నిర్లక్ష్యానికి గురైంది. ఎస్టీలు దుర్భర స్థితిలో బతుకీడుస్తున్నారు. ఊరి బయలే గుడారాలు అనంతవరప్పాడులో సుమారు 50 వరకూ ఎస్టీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కనీస అవసరాలు తీరే పరిస్థితి లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో ఎస్టీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టిస్తామని ఎంపీ వాగ్దానం చేశారు. ఆ హామీ నెరవేరకపోవటంతో ఎస్టీ కుటుంబాలు నేటికీ ఊరిబయట గుడారాల్లోనే బతుకీడుస్తున్నాయి. ఆ ప్రాంతానికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. అభివృద్ధికి ఆమడ దూరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించటం లేదు. ఎస్సీల్లో ఎవరైనా మరణిస్తే.. మృతదేహాన్ని ఖననం చేయడానికి కూడా దిక్కులేదు. శ్మశానం కోసం స్థలం కేటాయించాలని ఎంపీ గల్లా జయదేవ్ దృష్టికి తీసుకువెళ్లగా.. పట్టించుకోలేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజున పాఠశాలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన ఎంపీ ఈ ఊసే మర్చిపోయారని వాపోయారు. బేతపూడిలోనూ అదే దుస్థితి ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామాన్ని 2017 జనవరిలో ఎంపీ దత్తత తీసుకున్నారు. కానీ.. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. 5,700 జనాభా ఉన్న బేతపూడిలో 3,025 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినా.. అది అలంకార ప్రాయంగానే మారింది. ఇప్పటికీ అందులో నీరు నింపలేదు. చైతన్య నగర్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వైఎస్సార్ హయాంలో వేసిన ఒక్క సీసీ రోడ్డు మాత్రమే ఉంది. ఆ తరువాత ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు. 300 మంది ఓటర్లున్న చైతన్యనగర్‌లో ఎక్కువ భాగం వైఎస్సార్ సీపీ అభిమానులు ఉన్నందునే పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. చుట్టపు చూపుగా అయినా రాలేదు ఎంపీ జయదేవ్ దత్తత తీసుకున్న గ్రామాలకు చుట్టపు చూపుగా కూడా వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. నాలుగైదుసార్లు కూడా గ్రామాలకు పోలేదంటే అతిశయోక్తి కాదు. దత్తత గ్రామాలను విస్మరించిన ఎంపీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారో చూస్తామని, ఓటుతోనే సమాధానం చెబుతామని అక్కడి ఓటర్లు అంటున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే.. మా కాలనీలో నివసిస్తున్న వారంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే ఇక్కడ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించకుండా ఆపేశారు. ఎంపీ దత్తత తీసుకున్నా మా సమస్యలు తీరలేదు. –బి.రామ్మూర్తి, బీసీ కాలనీ వాసి, అనంతవరప్పాడు పొలం గట్లను ఆశ్రయిస్తున్నాం నాలుగేళ్ల క్రితం ఎంపీ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎస్సీలకు శ్మశాన వాటిక స్థలం కావాలని కోరాం. నేటికీ మంజూరు చేయలేదు. ఎవరైనా మరణిస్తే పొలం గట్లమీద ఖననం చేస్తున్నాం. మండల పరిషత్ పాఠశాలనూ అభివృద్ధి చేయలేదు.– కొమ్మనూరి లక్ష్మణరావు,ఎస్సీ కాలనీ వాసి, అనంతవరప్పాడు చిన్నచూపు చూస్తున్నారు ఎంపీ దత్తత తీసుకున్న గ్రామం అయినా అభివృద్ధికి నోచుకోలేదు. వైఎస్సార్ సీపీ అభిమానులమని మా కాలనీల్లో రోడ్లు వేయలేదు. మా సమస్యల్ని గ్రామదర్శినిలో అధికారులకు చెప్పుకోడానికి వెళితే అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎస్సీలంటే చిన్నచూపు చూస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతాం. – జి.ఏడుకొండలు, ఎస్సీ కాలనీ, అనంతవరప్పాడు తాగునీటి సమస్యతో సతమతం బేతపూడిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పట్టించుకునే నాథుడే లేడు. కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ అలంకార ప్రాయంగా మారింది. ఎంపీ దత్తత తీసుకుంటే గ్రామంలో సమస్యలు తీరతాయని ఆశపడ్డాం. కానీ ఏం లాభం లేదు. – షేక్ ఖాజావలి, బేతపూడి ఎన్నికలప్పుడే గుర్తొస్తాం ఎన్నికలొస్తేనే నాయకులకు మేం గుర్తొస్తాం. మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న ఎంపీ కనీసం అప్పుడప్పుడైనా వచ్చిన పాపాన పోలేదు. రోడ్లు, డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ మాత్రం అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకోవడం ఎందుకు. పత్రికల్లో ప్రచారం చేసుకోవడం తప్ప. – షేక్‌జాకీర్, బేతపూడి -
టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా
-
టీడీపీకి గుడ్‌బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే
-
టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయితే సుబ్బారావు 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు. అయితే అధికార పార్టీలో చేరిన సుబ్బారావు అక్కడ తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. గురువారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారావు.. టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ తనకు చేసిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరాలని పలువురు కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు గమనిస్తే ప్రత్తిపాడులో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ప్రత్తిపాడులో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ
తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులున్నాయి. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబసభ్యులు రాజీనామా చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రత్తిపాడులో పర్వత కుటుంబసభ్యులు టీడీపీకి సేవలందిస్తూ వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పర్వత రాజబాబు, ఆయన సతీమణి జానకీదేవీలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారి కంటే అవినీతి పరులకే టీడీపీలో సముచిత స్థానం ఇచ్చారని పర్వత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్, బాపనమ్మ కుటుంబసభ్యులను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రేపు(బుధవారం) వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పర్వత కుటుంబసభ్యులు పార్టీలో చేరనున్నారు. -
అమ్మా.. నువ్వు లేని లోకంలో ఉండలేను..
గుంటూరు , యనమదల (ప్రత్తిపాడు): ‘ఆరేళ్ల కిందట నాన్న మరణించాడు.. కష్టమంటే ఏంటో తెలీకుండా పెంచిన అమ్మ కూడా ఏడాది కిందట నన్ను విడిచి వెళ్లిపోయింది. నన్ను చూసి ఈ లోకం అనాథ అంటూ సూటిపోటి మాటలంటోంది. అమ్మా, నాన్న లేని ఈ లోకంలో నేను ఉండలేను. అమ్మా.. నేనూ నీ వద్దకే వస్తున్నా..’ అంటూ ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు నగరం కొరిటెపాడుకు చెందిన డొంకేని సాయిసందీప్ (23) తండ్రి శ్రీనివాసరావు ఆరేళ్ల కిందట మృతిచెందాడు. తల్లి రాధాకుమారి సంరక్షణలో సాయిసందీప్ డిగ్రీ పూర్తి చేశాడు. ఏడాది కిందట తల్లికూడా మృత్యువాత పడటంతో అతని జీవితం తల్లకిందులైంది. కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొన్ని నెలల నుంచి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకు ఎవరూ లేరన్న బాధను దిగమింగుకోలేక, అనాథ అన్న మాటను జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఎంతసేపటికీ సాయిసందీప్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని అన్నమ్మ తలుపులు గట్టిగా తట్టి చూసింది. సందీప్ చీరకు వేలాడుతూ కనిపించడంతో నివ్వెరపోయిన ఆమె స్థానికులకు చెప్పి.. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఎస్.రవీంద్ర అక్కడికి చేరుకున్నారు. వీఆర్వో కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా సాయిసందీప్ రాసిన సూసైడ్ నోట్ స్థానికులను కలచివేసింది. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం
రౌతులపూడి (ప్రత్తిపాడు) : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయమని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఎన్ఎన్ పట్నంలో పార్టీనాయులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైస్ రాజశేఖర్‌రెడ్డి, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల ప్రారంభోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రజా సంక్షేమం పట్టని బాబుకు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్షలు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో కుమ్మక్కై ప్యాకేజికోసం హోదాను అడ్డుకున్న బాబు హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టకట్టారని, అయితే దురదృష్టవశాత్తూ ఆ ఎమ్మెల్యే టీడీపీ గేలానికి చిక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అంతకు ముందు దివంగత మహానేత సతీమణి, జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ జన్మదినం సందర్భంగా స్థానిక నేత సింగంపల్లి చిట్టిబాబు స్వృగృహంలో జన్మదిన కేక్‌ను కట్‌చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచారు. అనంతరం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, మండల కన్వీనర్లు జిగిరెడ్డి శ్రీను, కూనిశెట్టి మాణిఖ్యం, బెహరా దొరబాబు, ఎంపీటీసీ సభ్యురాలు సింగంపల్లి వెంకటలక్ష్మి, దళే చిట్టిబాబు, సీహెచ్ వీరవెంకట సత్యనారాయణ, గాబు కృష్ణ, అడపా సోమేష్, సకురు గుర్రాజు, యెనుముల కోటిబాబు, మానివెల్తి వెంకటరమణ, వడల సత్యనారాయణ, చిట్రా రెడ్డి, మాదాసు దొంగబాబు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, గుంటూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లగా మంత్రి సోమిరెడ్డిని రైతులు అడ్డుకుని నిలదీశారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లారు. పంటలను పరిశీస్తుండగా పలువురు స్థానిక రైతులు పలు సమస్యలపై మంత్రి సోమిరెడ్డిని నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు. -
వరుపులపై ఉరుములు
- రోడ్డునపడ్డ ప్రత్తిపాడు ‘దేశం’ - సీనియర్లను దూరంపెడుతున్న ఎమ్మెల్యే - తాడోపేడో తేలుస్తామంటున్న వైరి వర్గం - ‘వరుపుల’పై ‘బాబు’కు లేఖాస్త్రం రాజకీయ లబ్ధి కోసం టీడీపీలోకి గోడ గెంతిన నేతలతో తలనొప్పులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో పార్టీ తరుఫున పోరాడి ఓడిన తెలుగు తమ్ముళ్లు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి స్వప్రయోజనాల కోసం పచ్చ కండువా వేయించుకున్న నేతలే భస్మాసుర హస్తాలేస్తూ భయోత్పాతం సృష్టించడంతో బహిరంగంగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యుడు వరుపుల సుబ్బారావు వైఖరిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండమే కాకుండా ఆ పంచాయితీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య వైరుధ్యాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ప్లేటు ఫిరాయించిన నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తీరుపై నియోజకవర్గంలో పార్టీ సీనియర్లు కత్తులు నూరుతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని పార్టీ జెండాను భుజాన మోసిన వారిని పక్కనపెట్టేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్న వరుపులపై పార్టీ సీనియర్లు తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యే అయ్యాక ప్రలోభాల ఫలితంగా టీడీపీలోకి వచ్చి సీనియర్లను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెడుతున్నారంటున్నారు. ప్రత్తిపాడులో గత సార్వత్రిక ఎన్నికల్లో వరుపుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగగా టీడీపీ తరఫున దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు పోటీపడ్డారు. వీరిలో చిట్టిబాబు ఓటమిపాలవగా అనంతరం ఆయన మరణించారు. చిట్టిబాబు మృతిచెందినా పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా ఆ వర్గం అలానే కొనసాగుతోంది. ఇంతలో చిట్టిబాబుపై గెలుపొందిన సుబ్బారావు టీడీపీలో ఫిరాయించడంతో నియోజకవర్గ టీడీపీలో పాత, కొత్త నేతలు రెండుగా చీలిపోయారు. అందుకు వరుపుల తీరే కారణమని వైరి వర్గం దుమ్మెత్తిపోస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పోటీచేసే ఉద్ధేశం సుబ్బారావుకు లేకపోవడంతోనే పార్టీని నియోజకవర్గంలో అపఖ్యాతి పాల్జేస్తున్నారని చంటిరాజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రెండు రోజుల కిందట రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. కక్ష సాధింపుల దిశగా... 2014 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని కక్షగట్టి టీడీపీ నేతలే లక్ష్యంగా వరుపుల వేధింపులకు గురిచేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులు బుద్దరాజు చంటిరాజు, దలే చిట్టిబాబులపై వరుపుల వర్గీయుల వేధింపులు పెరిగిపోవడంతో ఆ విభేదాలతో రోడ్డెక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు చిత్తశుద్ధితో పనిచేయడమే తాము చేసిన నేరంగా ఎమ్మెల్యే భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన బుద్దరాజు చంటిరాజు వర్గాన్ని సోదిలో లేకుండా చేయాలనే వ్యూహంతో వరుపుల వర్గం కుయక్తులు పన్నుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పనిచేస్తున్న బుద్దరాజు చంటిరాజును రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి నుంచి చంటిరాజును ఎమ్మెల్యే అకారణంగా ఉద్వాసన పలికారు. అతని స్థానంలో బుద్దరాజు సుబ్బరాజు (గోపిరాజు) వర్గీయుడైన మాజీ సర్పంచి దంతులూరి వీరభద్రరాజును అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా చేశారు. అభివృద్ధి కమిటీలో ఉన్న మిగిలిన వారందరినీ అలానే ఉంచేసి ఒక్క చైర్మన్ చంటిరాజును మాత్రమే తొలగించడం ద్వారా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా అని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీకి దూరం చేసే కుట్రలో భాగంగా.. వరుపుల టీడీపీలోకి వచ్చాక టీడీపీ జన చైతన్య యాత్రలు ప్రారంభమైన దగ్గర నుంచి వైరివర్గాన్ని దాదాపు పార్టీకి దూరం చేసే ఎత్తుగడలతోనే వ్యవహరిస్తున్నారని వైరి వర్గం బాహాటంగానే ఆక్షేపిస్తోంది. జనచైతన్య యాత్రల్లో రాచపల్లికి వచ్చిన వరుపుల ఆ గ్రామ సర్పంచి, చంటిరాజు భార్య రామలక్ష్మికి కనీస సమాచారం లేకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గంగా ఉన్న సర్పంచి రామలక్ష్మి, ఆమె భర్త చంటిరాజు సహా నేతలు పెద్ద ఎత్తున వరుపులను గ్రామం నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కక్షకట్టి రాచపల్లి సహా పలు గ్రామాల జన్మభూమి కమిటీలను రద్దుచేసి తన వర్గీయులతో నింపేసుకుని పార్టీ అంటే పడిచచ్చే వారిని గెంటేస్తున్నారంటున్నారు. పలు గ్రామాల్లో గృహ నిర్మాణాలు, పింఛన్ల మంజూరులో కూడా పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా చేసి తన వెనకాల తిరిగే వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చంటిరాజు స్వయంగా ప్రకటించడం పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలకు అద్దంపడుతున్నాయి. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయామని ఇక ముందు తాడోపేడో తేల్చుకుంటామని చంటిరాజు ఎమ్మెల్యేపైన, అతని వర్గంపైనా బహిరంగంగానే కత్తి దూశారు. అంతటితోనే ఆగకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఎమ్మెల్యే వర్గం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తామేదో సహకరించడం లేదని ఎదురుదాడి చేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందంటున్నారు. ఈ విషయంలో వాస్తవాలేమిటో తేల్చుకుందామంటూ చర్చకు ‘సై’ అంటూ ఎమ్మెల్యేకు వైరి వర్గం బాహాటంగానే సవాల్ విసిరింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. -
ప్రత్తిపాడు ఫొటోగ్రాఫర్‌కు కేసీపీ అవార్డు
ప్రత్తిపాడు : కోనసీమ చిత్రకళా పరిషత్ (కేసీపీ) ఇటీవల నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రత్తిపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ సలాది కృష్ణకు అవార్డు లభించింది. మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) విభాగంలో ‘గోయింగ్ టు ఫీల్డ్’ పేరిట తీసిన ఫొటోకు ఈ అవార్డు లభించిందని కృష్ణ సోమవారం విలేకరులకు తెలిపారు. ప్రదర్శన ముగింపు సందర్భంగా అమలాపురం మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్, పరిషత్ అధ్యక్షుడు మెట్ల రమణబాబుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నాని చెప్పారు. కృష్ణను ఫొటోగ్రాఫర్ల సంఘ నాయకులు నామన వెంకట భాస్కర్, కొమ్ముల ఆనంద్, చవల శ్రీను, ధర్మవరం సంఘ నాయకులు గుత్తుల వీరరాఘవులు, పాలిక ఆంజనేయులు, అంబటి రాజు, దేవాడ బాబ్జీ తదితరులు అభినందించారు. -
ప్రత్తిపాడు వద్ద దారిదోపిడీ
పెంటపాడు : ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్సై వాసంశెట్టి సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనుకు చెందిన చిక్కాల ఏసు, పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన ఉప్పులూరి నాగలక్ష్మి వరుసకు అక్కాతమ్ముళ్లు. వీరు వారి గ్రామాల నుంచి శుభకార్యం నిమిత్తం ఈనెల 7న తాడేపల్లిగూడెం మండలం కడియద్ద వెళ్లారు. తిరిగి రాత్రి మోటార్‌సైకిల్‌పై ఆరుగొలను వెళ్లేందుకు కడియద్ద నుంచి జాతీయరహదారి దిగి క్వారీ లారీల మార్గం నుంచి వెళుతున్నారు. ఆ ప్రదేశంలో ఇద్దరు దుండగులు వీరిని అడ్డగించి నాగలక్ష్మి వద్ద నున్న బంగారు వస్తువులు అపహరించేందుకు యత్నించారు. ఏసు వారిని వారించడంతో వారిలో ఒకడు కర్రతో ఏసును కొట్టి ఇద్దరి వద్ద నుంచి 4 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 8 వేల నగదు, వెండి ఉంగరం, రెండు సెల్ఫోన్లు లాక్కున్నారు. ఈ ఘటనపై ఏసు సోమవారం పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధుబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. -
ఎమ్మెల్యే ఒత్తిడితో నలుగురి అరెస్టు
కాకినాడ : ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన గతంలో తన గెలుపుకోసం కృషి చేసిన పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టించిన ఎమ్మెల్యే తీరుపై ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిరసన వ్యక్తమౌతోంది. కష్టకాలంలో ఆయనకు దన్నుగా ఉండి∙గత అసెంబ్లీ ఎన్నికల్లో సదరు ప్రజాప్రతినిధి విజయానికి కారణమైన నలుగురిపై పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి కేసునమోదు చేయించి అరెస్టు చేయించడం ద్వారా ఆ ప్రజాప్రతినిధి తన అధికారదర్పాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఈ ఏడాది ఏప్రిల్ 8న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన సమయంలో తనతోపాటు రావాలని అనుయాయులు పలువురిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకొనే ఓ చోటా నాయకుడు కొందరిని పార్టీమారాలని హుకుం జారీచేశాడు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో వారిపై కక్షకట్టారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా యర్రవరంలో ఆయన ఫ్లెక్సీబోర్డు ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు «ధ్వంసం చేయడంతో ఇదే అదునుగా ఎమ్మెల్యే, అతని అనుచరులు అప్పట్లో పార్టీఫిరాయింపునకు ఒప్పుకోని పెద్దనాపల్లికి చెందిన గొల్లపల్లి రాము, సూరిశెట్టి దుర్గ, పెంటకోట శ్రీను, బలిశెట్టి వీరబాబులపై అక్టోబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారిపై ఒత్తిడి తెచ్చి శనివారం వారిని అరెస్టు చేయించారు. ఎమ్మెల్యే, ఆయన అనుయాయుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
రూ.2.42 కోట్ల బ్యాంకు నిధుల రికవరీ
ప్రత్తిపాడు : స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలో బినామీ ఖాతాలకు మళ్లిన నిధులు రికవరీ అవుతున్నాయి. ప్రత్తిపాడు ఎస్బీహెచ్లో రూ.2.65 కోట్లు దారి మళ్లిన కేసు లో రూ.2.42 కోట్లు రికవరీ అయినట్లు బ్యాంక్ మేనేజర్ సత్యానందం తెలిపారు. రూ.1.38 కోట్లు రికవరీ అనంతరం పోలీసు కావడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్న ఎడ్ల ఉష సత్యసూర్యవెంకట రాకేష్ (చిన్నా) బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు జనరల్ లెడ్జర్ (బీజీఎల్) ఖాతాలోని ఈ సొమ్మును పక్కదారి పట్టించాడు. ఈ సొమ్మును ప్రత్తిపాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలకు చెందిన 9 మంది ఖాతాలకు 29 పర్యాయాలు ట్రా¯Œ్సఫర్ చేశాడు. 2016 మే నుంచి సెప్టెంబర్ వరకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్వహించిన ఆడిట్లో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు రూ.1.38 కోట్లు వెనక్కి రాబట్టారు. మిగిలిన సొమ్ము రికవరీ, నిందితులు చిన్నాపై బ్యాంక్ అధికారులు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం కావడం, బ్యాంక్ విజిలెన్సు అధికారులు ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నారు. గురువారం మరోరూ.1,04,50,000 రికవరీ చేశామని బ్యాంక్ మేనేజర్ సత్యానందం తెలిపారు. -
మంత్రి రావెలకు అసమ్మతి సెగ
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది. ప్రత్తిపాడులో మంత్రి రావెల శుక్రవారం పర్యటించారు. వట్టి చెరుకూరు మండలం వింజనంపాడులో స్థానిక టీడీపీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెప్పపాటులో ఘోరం
ప్రత్తిపాడు : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. రహదారిపై నెత్తుటేరు పారింది. వేగంగా వస్తున్న ఓ కారు.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. అనపర్తికి చెందిన పాస్టర్ కోరాటి నిత్యజీవ స్తోత్రపతిరాజు (40) తన భార్య క్రాంతికుమారి (30), అక్కలు కోరాటి రాణి, ఎలిచెర్ల స్తోత్రకుమారి (55), బావ, అడ్వకేట్ అయిన ఎలిచెర్ల సుదర్శన్‌కుమార్(60)లతో కలిసి తైలాభిషేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం కారులో విశాఖ వెళ్లారు. మంగళవారం సాయంత్రం అదే కారులో తిరుగుపయనమయ్యారు. పుత్ర చెరువు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కంకర లోడుతో రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను వారి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ సీటులో ఉన్న స్తోత్రపతిరాజు, ఆయన పక్కన ఉన్న భార్య క్రాంతికుమారి, వెనుక సీటులో ఉన్న అక్క ఎలిచర్ల స్తోత్రకుమారి, బావ సుదర్శన్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో మహిళ రాణి తీవ్రంగా గాయపడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారు ఢీకొన్న సమయంలో వెలువడిన శబ్దానికి జాతీయ రహదారిపై పాదచారులు ఏం జరిగిందోనని భయంతో పరుగులు పెట్టారు. యువజన సంఘం నాయకుడు గోపిశెట్టి శ్రీను అటుగా వెళ్తున్న లారీని ఆపి, డ్రైవర్ సాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అతి కష్టంమీద కోరాటి రాణిని వెలుపలికి తీసి, 108లో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎస్.రాజశేఖర్, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కె.నాగ మల్లేశ్వరరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తదితరులు పరిశీలించారు. ప్రత్తిపాడు సీఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్తంభించిన ట్రాఫిక్ ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. డీఎస్పీ రాజశేఖర్ క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను, కారును తొలగించి, ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ఎక్కువ సమయం శ్రమించాల్సి వచ్చింది. అనపర్తిలో విషాదఛాయలు అనపర్తి(బిక్కవోలు) : గ్రామంలో అందరితో ఆప్యాయంగా ఉండే ఆ కుటుంబం దైవ ప్రార్థనలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్న విషయం మంగళవారం రాత్రి తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అనపర్తి పాత హరిజనపేటలో పాస్టర్‌గా అందరికీ సుపరిచితమైన కోరాటి స్త్రోత్రపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం విశాఖపట్నంలో జరిగే దైవప్రార్థనలకు వెళ్లారు. సాయంత్రానికి ప్రార్థనల కార్యక్రమం ముగించుకుని స్తోత్రపతి రాజు∙సోదరుడు పాస్టర్ డాక్టర్.రాజు వారి కుటుంబ సభ్యులతో కలసి అనపర్తి సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. అయితే మిగిలిన పనులు చూసుకుని బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
రెప్పపాటులో ఘోరం
ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు అనపర్తికి చెందిన నలుగురి దుర్మరణం ఒకరి పరిస్థితి విషమం ప్రత్తిపాడువద్ద ప్రమాదం ప్రత్తిపాడు : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. రహదారిపై నెత్తుటేరు పారింది. వేగంగా వస్తున్న ఓ కారు.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. అనపర్తికి చెందిన పాస్టర్ కోరాటి నిత్యజీవ స్తోత్రపతిరాజు (40) తన భార్య క్రాంతికుమారి (30), అక్కలు కోరాటి రాణి, ఎలిచెర్ల స్తోత్రకుమారి (55), బావ, అడ్వకేట్ అయిన ఎలిచెర్ల సుదర్శన్‌కుమార్(60)లతో కలిసి తైలాభిషేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం కారులో విశాఖ వెళ్లారు. మంగళవారం సాయంత్రం అదే కారులో తిరుగుపయనమయ్యారు. పుత్ర చెరువు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కంకర లోడుతో రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను వారి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ సీటులో ఉన్న స్తోత్రపతిరాజు, ఆయన పక్కన ఉన్న భార్య క్రాంతికుమారి, వెనుక సీటులో ఉన్న అక్క ఎలిచర్ల స్తోత్రకుమారి, బావ సుదర్శన్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో మహిళ రాణి తీవ్రంగా గాయపడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. కారు ఢీకొన్న సమయంలో వెలువడిన శబ్దానికి జాతీయ రహదారిపై పాదచారులు ఏం జరిగిందోనని భయంతో పరుగులు పెట్టారు. యువజన సంఘం నాయకుడు గోపిశెట్టి శ్రీను అటుగా వెళ్తున్న లారీని ఆపి, డ్రైవర్ సాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అతి కష్టంమీద కోరాటి రాణిని వెలుపలికి తీసి, 108లో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎస్.రాజశేఖర్, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కె.నాగ మల్లేశ్వరరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తదితరులు పరిశీలించారు. ప్రత్తిపాడు సీఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్తంభించిన ట్రాఫిక్ ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. డీఎస్పీ రాజశేఖర్ క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను, కారును తొలగించి, ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ఎక్కువ సమయం శ్రమించాల్సి వచ్చింది. అనపర్తిలో విషాదఛాయలు అనపర్తి(బిక్కవోలు) : గ్రామంలో అందరితో ఆప్యాయంగా ఉండే ఆ కుటుంబం దైవ ప్రార్థనలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్న విషయం మంగళవారం రాత్రి తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అనపర్తి పాత హరిజనపేటలో పాస్టర్‌గా అందరికీ సుపరిచితమైన కోరాటి స్త్రోత్రపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం విశాఖపట్నంలో జరిగే దైవప్రార్థనలకు వెళ్లారు. సాయంత్రానికి ప్రార్థనల కార్యక్రమం ముగించుకుని స్తోత్రపతి రాజు∙సోదరుడు పాస్టర్ డాక్టర్.రాజు వారి కుటుంబ సభ్యులతో కలసి అనపర్తి సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. అయితే మిగిలిన పనులు చూసుకుని బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
అభివృద్ధి పనుల్లో ‘అవినీతి’ రాజ్యం
కాంట్రాక్టర్ల చేతిలోనే క్వాలిటీ కంట్రోల్! మూణ్ణాళ్ల ముచ్చటగా రోడ్ల నిర్మాణాలు అధికారులకు లంచాల మేత కొమ్ముకాస్తూ బిల్లులు చేస్తున్న యంత్రాంగం ప్రత్తిపాడు : అభివృద్ధి పనుల పేరుతో అవినీతి అడ్డగోలుగా రాజ్యమేలుతోంది. ప్రతి పనిలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. దీంతో నాణ్యత మచ్చుకైనా కనిపించటం లేదు. క్వాలిటీ కంట్రోల్ కాస్తా అధికారుల చేతిలో నుంచి కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లిపోతుండటంతో అభివృద్ధి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. లంచాల మేత ప్రభావంతో మంత్రి రావెల కిశోర్‌బాబు ఇలాకాలో అవినీతి ఊట రోడ్లపై ఏరులై పారుతోంది. అందుకు సజీవ సాక్ష్యాలే ఇవి. రూ.10 లక్షలతో మరమ్మతులు.. మండల పరిధిలో ప్రత్తిపాడు నుంచి పాత మల్లాయపాలెం వెళ్లే ప్రధాన రహదారికి ఇటీవలే రూ.10 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. పనులు నాసిరకంగా చేయడంతో ఇప్పుడు ఆ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కంకర రాళ్లు పైకి లేచి ప్రయాణికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. నాణ్యతను, నిబంధనలను గాలికొదిలేసి ‘క్వాలిటీ కంట్రోల్’ను తమ చేతుల్లోకి తీసుకోవడంతో రహదారి దారుణంగా తయారైంది. నాలుగు నెలలు కూడా తిరగకుండానే అక్షరాలా పది లక్షల రూపాయలు రాళ్లపాలయ్యాయి. ఏడాది తిరక్కుండానే.. తిక్కిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పూర్తిగా ఛిద్రమైపోవడంతో కొంతమేర తారురోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రూ.10 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 550 మీటర్ల మేర సుమారు పది నెలల కిందట తారురోడ్డును నిర్మించారు. దాని నాణ్యత మేడిపండు చందంగా మారింది. నిర్మించిన రెండు నెలలకే స్పీడ్‌బ్రేకర్ ఉన్నచోట పూర్తిగా ఛిద్రమై, పగుళ్లివ్వడంతో గతంలోనే అతుకులు వేశారు. ఇప్పుడు రోడ్డు ఆరంభంలో పెద్దగుంత పడింది. దానిని పూడ్చేందుకు మధ్యలో ఓ రాయిని పడేశారు. రూ.53 లక్షల ‘తారు’ణం.. మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారి నుంచి తిక్కిరెడ్డిపాలెం వరకు రూ.53 లక్షల రూపాయల పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నిధులతో సుమారు మూడు నెలల కిందట తారు రోడ్డును నిర్మించారు. అనంతరం రోజుల వ్యవధిలోనే ఆ రోడ్డు మార్జిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పగుళ్లిచ్చి అధికారుల నిర్వాకాన్ని, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణను వెక్కిరిస్తున్నాయి. రెండు నెలలకే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంపై జనం పెదవి విరుస్తున్నారు. సబ్‌ప్లాన్ పనుల్లోనూ పగుళ్లే.. గొట్టిపాడు ఆది ఆంధ్రా కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి సుమారు కోటీ 3 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. సీసీ రోడ్డుకు సపోర్టు ఉండేందుకు గాను రోడ్డుకిరువైపులా నిర్మిస్తున్న కాంక్రీట్ పనులు నాసిరంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క కాంక్రీట్‌తో పోసిన సపోర్టులు పగిలిపోతుండటం ఈ పనుల్లో అవినీతికి తార్కాణం. -
పెళ్లి కళ కల్లలైన వేళ..
ప్రత్తిపాడు: మరో నెల రోజుల్లో కల్యాణ వీణ మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరులో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలిన ఘటనలో వరుడు కావాల్సిన యువకుడు మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ఇక్కుర్తి జాన్, రాయేలు దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్నవాడైన బూసి సలోమన్ (21)కు నరసరావుపేటకు సమీపంలోని ఇక్కుర్తి రాయపాడుకు చెందిన యువతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. జూన్ 9వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గుంటూరులో రాడ్ బెండింగ్ పనికి వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలిన ఘటనలో అతను మృతి చెందాడు. పెళ్లి ఖర్చులకు డబ్బు సంపాదిస్తామని వెళ్లి అటే వెళ్లిపోయాడంటూ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
విషాదంలోనూ వికసించిన దాతృత్వం
పత్తిపాడు/కిర్లంపూడి : వివాహం జరిగి కొన్ని ఘడియలే అయ్యాయి. మంగళ వాయిద్యాలు ఇంకా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. ఆ ఆనందానుభూతులు నెమరువేసుకుంటూ బయలుదేరిన పెళ్లి బృందంపై మృత్యువు విరుచుకుపడింది. హాహాకారులు చేస్తూ.. వారంతా తేరుకునేలోగానే.. ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలోనే ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోవడంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది. జాతీయ రహదారిలో ప్రత్తిపాడు వద్ద మంగళవారం జరిగిన దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కండెల్ల రాజబ్బాయి(60)కి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె గౌరి వివాహం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ వివాహానికి 13 మంది మినీ వ్యాన్‌లో కొడవలి వెళ్లారు. వివాహ తంతు ముగిశాక విందు ఆరగించి, సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. రాచపల్లి అడ్డ రోడ్డు జంక్షన్ సమీపంలో రాంగ్ రూట్లో కలప లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను మినీ వ్యాన్ ఢీకొంది. వాహనంలో చిక్కుకుని రాజబ్బాయి, బలసా సూర్యకాంతం (55) మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా బలసా ధర్మరాజు (65), రాజబ్బాయి రెండో కుమార్తె చినతల్లి కుమారుడు రాజాల రాజబాబు(బాలు)(14) చనిపోయారు. ఈ సంఘటనలో గాయపడిన మేడపాడుకు చెందిన తండ్రీకొడుకులు రాయి కాశీ, సాయి మణికంఠ, వేలంక గ్రామానికి చెందిన కండెల్ల సన్యాసమ్మ, విజయకుమారి, నీలాంజలి, ఏడిద భూషణం, మినీవ్యాన్ డ్రైవర్ బచ్చల సూరిబాబును ప్రత్తిపాడు సీహెచ్‌సీకి, వేమగిరి రాణి, చిక్కాల వేగులమ్మను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.వీరిలో చిక్కాల వేగులమ్మ మినహా మిగిలిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఈ సంఘటనలో ఏడిద ఆషా (15) సురక్షితంగా బయటపడింది. గంటకు పైగా శ్రమించి.. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మినీ వ్యాన్ ముందు సీటులో కూర్చున్న రాజబ్బాయి ఉన్న వైపు ట్రాక్టర్‌ను తాకడంతో, వాహనం లోపలికి నొక్కుకుపోయింది. అందులో ఇరుక్కున్న రాజబ్బాయిని ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు, స్థానికులు బయటకుతీశారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక.. వృద్ధ దంపతులు చావులోనూ ఒకటయ్యారు. ఈ సంఘటనలో భార్య బలసా సూర్యకాంతం (55) వాహనంలో చిక్కుకుని మరణించగా.. భర్త ధర్మరాజు (65) స్థానిక సీహెచ్‌సీలో మరణించారు. వ్యవసాయ కూలీలైన భార్యాభర్తలకు నలుగురు సంతానం.ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా, వివాహితుడైన కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు. కోడలు, మనవడు నంది అబ్బు, మనవరాలు బుల్లి రాఘవను ధర్మరాజు పోషిస్తున్నారు. అబ్బు, రాఘవ కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. కొడుకు మరణించడంతో కన్న కొడుకు మరణించడంతో శోకసంద్రంలో మునిగిన తల్లి.. అంతటి విషాదంలోనూ దాతృత్వాన్ని చూపించింది. ఈ సంఘటనలో మరణించిన రాజబాబు(బాలు) మృతదేహాన్ని చూసేందుకు స్థానిక సీహెచ్‌సీకి వచ్చిన బాలు తల్లి చినతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకునూ, తండ్రి రాజబ్బాయిని కోల్పోయిన ఆమెను ఊరడించడం ఎవరితరం కాలేదు. పుత్ర శోకంతో తల్లిడిల్లుతూనే తన కుమారుడి నేత్రాలను దానం చేయాలని కోరింది. ఆమె దాతృత్వానికి చూపరులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఈ ‘బ్లాక్ బ్యూటీ’ ధర రూ. 3 లక్షలు!
ప్రత్తిపాడు: ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ ‘బ్లాక్ బ్యూటీ’ని చూడండి. ఎంతందంగా ఉందో. ఆకారంతో పాటు దీని ధర కూడా ఎక్కువే. పాల పోటీలకు ఉపయోగపడే ఈ హర్యానా జాతి గేదె వెల 3,01,116 రూపాయలు. ఇది ప్రతి రోజూ సుమారు పాతిక నుంచి ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది. దీనిని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ ఏడు నెలల కిందట ఇంకొల్లు సమీపంలోని ముప్పారం డైరీలో లక్షా పాతిక వేలకు కొనుగోలు చేశాడు. అతని వద్ద నుంచి ఈ గేదెను తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన నూనె శ్రీనివాస్ శనివారం 3,01,116 రూపాయలకు కొనుగోలు చేశాడు. రెండవ ఈతకే ముప్పై లీటర్లు పాలు ఇస్తుందని, మూడవ ఈతకు మరింత పెరిగే అవకాశం ఉందని సురేష్ తెలిపారు. -
ఆటో బోల్తా: నలుగురికి గాయాలు
గుంటూరు(ప్రత్తిపాడు): ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. చీరాల నుంచి గుంటూరుకు వెళుతున్న ఆటో ప్రత్తిపాడు వద్ద రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. బాధితులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్
గుంటూరు: భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తాటికొండలో కొండవీటివాగు ఉగ్రరూపం దాల్చింది. కొండవీటివాగులో ఓ యువతి గల్లతైంది. ప్రత్తిపాడులో చెరువు పొంగి పక్కనేవున్న ఎస్సీకాలనీలోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. -
గుండె నిండా ఆశ..దారిలో ఆగిన శ్వాస
ప్రత్తిపాడు : కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ మండలం వీరపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఏడుగురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ప్రత్తిపాడు మండలంలో వేర్వేరు గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు మూడేళ్ల క్రితం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలేనికి చెందిన బంధం లోవరాజు, వేములపాలేనికి చెందిన తుట్టా నాగభూషణం కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో ఇడ్లీలు అమ్ముకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాగభూషణం స్థానిక బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రుణ మాఫీ కోసం ఆధార్, రేషన్ కార్డు తీసుకురమ్మని చెప్పడంతో నాగభూషణం తన భార్య నాగమణితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. పెద్దిపాలేనికి చెందిన బంధం లోవరాజు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు భార్య కాసులమ్మతో కలిసి వస్తున్నాడు. మరి కొంతమందితో కలిసి ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో ఉన్న వ్యాన్‌లో వారు ప్రయాణిస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బంధం లోవరాజు (46), తుట్టా నాగభూషణం (45), నాగమణి (40) అక్కడికక్కడే మరణించగా, కాసులమ్మ తీవ్రంగా గాయపడింది. రెండు గ్రామాల్లో విషాదఛాయలు ఈ ప్రమాదం కారణంగా పెద్దిపాలెం, వేములపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఊళ్లో పనులు లేకపోవడంతో.. నాలుగు రూకలు కూడబెడదామని మూడేళ్ల క్రితం ఆయా కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి.లోవరాజు, కాసులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె లక్ష్మికి వివాహం చేసి, అత్తారింటికి పంపించారు. ఇద్దరు కుమారులు 21 ఏళ్ల రాంబాబు, 19 ఏళ్ల శివ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం కుమారులిద్దరికీ వ్యాపారాన్ని అప్పగించి, బంధువుల ఇంట జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు వారు బయలుదేరారు. పమాదంలో కుటుంబ పెద్ద లోవరాజు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటయింది. హైదరాబాద్‌కు వలస వెళ్లిన నాగభూషణం, నాగమణి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు రమణ వారి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రెండో కుమారుడు మల్లేషు, కుమార్తె దుర్గ స్వగ్రామమైన వేములపాలెంలో పెద తండ్రి సూర్యనారాయణ సంరక్షణలో ఉంటున్నారు. గతంలో తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆశతో, ఆధార్, రేషన్ కార్డును బ్యాంకులో అందజేసేందుకు వారు పయనమయ్యారు. వ్యాపారాన్ని పెద్ద కుమారుడికి అప్పగించి, భార్యాభర్తలు బయలుదేరాడు. తల్లిదండ్రుల మరణవార్త విని వారి కుమారుడు రమణ, కుమార్తె దుర్గ కుప్పకూలిపోయారు. చాలాకాలం తర్వాత వస్తున్న తల్లిదండ్రులను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా, వారు ఇక లేరన్న కబురు అందడంతో వారు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి, బోరున విలపిస్తున్న తీరు చూపరులును కంటతడి పెట్టించింది. డ్రైవర్ అజాగ్రత్తే కారణం విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్ జంక్షన్ రూరల్) : ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటు డ్రైవర్ అజాగ్రత్తగా వ్యాన్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన డ్రైవరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు. -
నాడు శిక్ష తప్పినా.. నేడు కక్ష కాటేసింది
ప్రత్తిపాడు : వారిద్దరూ బంధువులు. అంతేకాదు.. 24 ఏళ్ల కిందట ఒక హత్య కేసులో నిందితులు కూడా. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. చివరకు సుప్రీం కోర్టులో కేసు వీగిపోవడంతో బయటపడ్డారు. వారే మూడేళ్లుగా శత్రువులుగా మారారు. ఇంటి దారి విషయంపై వివాదం పగను రగిల్చింది.దాని ఫలితమే మంగళవారం గజ్జనపూడిలో చోటుచేసుకున్న దారుణ ఘటన. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో బొబ్బిలి సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులను గారా తాతాబ్బాయి వర్గీయులు పాశవికంగా చంపిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సత్యనారాయణ, తాతాబ్బాయిలు బంధువులే. వీరిద్దరు 1990లో ఒక హత్య కేసులో నిందితులు కాగా న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడంతో కేసు నుంచి బయట పడ్డారు.ఇంటిదారి విషయంలో మూడేళ్లుగా జరగుతున్న గొడవ ఈ ఘాతుకానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాతబ్బాయితో పాటు 12 మంది పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి సత్యనారాయణ, అతడి ఇద్దరు కొడుకులు లక్ష్మీనారాయణ, అర్జుబాబులను హత్య చేశారు. మృతదేహాలకు బుధవారం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శవపరీక్ష నిర్వహించారు. హతుడు లక్ష్మీనారాయణ భార్య గంగాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు పోస్టుమార్టం కోసం బుధవారం సత్యనారాయణ, అతని ఇద్దరు కొడుకుల మృతదేహాలను గజ్జనపూడి నుంచి ప్రత్తిపాడు సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. మృతుల బంధువులు, భార్యాపిల్లలు అక్కడకు చేరుకున్నారు. సత్యనారాయణకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణకు భార్య గంగాభవాని, కుమార్తెలు శివదుర్గ, లోవలక్ష్మి (8వ తరగతి), కుమారుడు అయ్యప్పస్వామి (5వ తరగతి) ఉన్నారు. మూడో కుమారుడు అర్జుబాబుకు భార్య సత్యవతి, కుమార్తె సింధు (3), ఏడాది వయసున్న కనకారావు సంతానం. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం పథకం ప్రకారం తన తండ్రి, సోదరులను హత్య చేశారని సత్యనారాయణ మిగిలిన ఇద్దరు కుమారులు వీరబాబు, త్రిమూర్తులు విలపించారు. కాలు దెబ్బతిన్న గేదెకు కట్టుకట్టే ప్రయత్నంలో ఉన్న తన తండ్రి, సోదరులను కత్తులతో నరికి హత్య చేశారని తెలిపారు. ఆ సమయంలో తాము సమీప పొలంలో గొర్రెలను మేపుతున్నామని, సంఘటన విషయం తెలిసిన వెంటనే తాము పారిపోయామన్నారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వద్ద పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, రేచుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, టీడీపీ నాయకులు పర్వత సురేష్, పల్లా గోపి, కొమ్ముల కన్నబాబు, గజ్జనపూడి సర్పంచ్ శింగిడి వెంకటేష్, గొనగాల వెంకటరమణ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెండు దశాబ్దాల కిందట.. రెండు దశాబ్దాల క్రితం అంటే 1990లో... ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో భూముల స్వాధీన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో బుగత బంగార్రాజు, పల్లా నూకరాజు తదితరులపై పోలీసులు టాడా కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. ఈ కేసులకు కారకుడుగా భావించి, గారా తాతబ్బాయి (నిందితుడు), బొబ్బిలి సత్యనారాయణ (హతుడు) తదితరులు గజ్జనపూడిలో మొల్లి అప్పారావు అనే వ్యక్తిని కత్తులు, బళ్లేలతో దాడి చేసి, హత్య చేశారు. ఆ సమయంలో పౌరహక్కుల నేత దివంగత కె.బాలగోపాల్ గజ్జనపూడి సందర్శించారు. ఈ కేసులో సత్యనారాయణ, తాతబ్బాయిలకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని హైకోర్టు కూడా ఖరారు చేసింది.సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుని, కేసు నుంచి బయటపడ్డారు. వారిద్దరి తరఫున ఈ కేసును పౌర హక్కుల ఉద్యమ నేత కేజీ కన్నాభిరాన్ వాదించారు. ఈ కేసులో తాతబ్బాయి, సత్యనారాయణ నాలుగేళ్ల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. పోస్టుమార్టం పూర్తి ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం పూర్తయ్యింది. గజ్జనపూడిలో మంగళవారం సాయంత్రం బొబ్బిలి సత్యనారాయణ, అతడి కొడుకులు లక్ష్మినారాయణ, అర్జుబాబులను గారా తాతబ్బాయి వర్గీయులు కత్తులతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోలీసులు బుధవారం ఉదయం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వాటికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు సూర్యనారాయణ, సుంకర మురళీమోహన్, ఎస్సై వై.రవికుమార్‌లు పోస్టుమార్టం పూర్తయ్యేవరకు సీహెచ్‌సీలోనే ఉన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్ సీహెచ్‌సీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రత్తిపాడులో నేడు అత్యధిక వర్షపాతం
విశాఖపట్టణం: ఆకాశానికి చిల్లు పడినట్టుగా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రబావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రికార్డుస్థాయిలో వర్షాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో 26 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. మిగతా ప్రాంతాల్లో ఈ రోజు నమోదయిన వర్షపాతం వివరాలు విశాఖపట్నం - 16 సెం.మీ.లు శ్రీకాకుళం జిల్లా టెక్కలి - 15 సెం.మీ.లు గుంటూరు జిల్లా రెంటచింతల - 15 సెం.మీ.లు కృష్ణా జిల్లా అవనిగడ్డ - 14 సెం.మీ.లు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం - 13 సెం.మీ.లు ప.గో.జిల్లా కోడేరు - 13, నరసాపురం 11 సెం.మీ.లు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం - 11 సెం.మీ.లు ప్రకాశం జిల్లా కందుకూరు - 11 సెం.మీ.లు కృష్ణా జిల్లా గుడివాడ - 11 సెం.మీ.లు గుంటూరు జిల్లా మాచర్ల - 10 సెం.మీ.లు విశాఖ జిల్లా యలమంచిలి -10 సెం.మీ.లు కృష్ణా జిల్లా కైకలూరు - 11 సెం.మీ.లు శ్రీకాకుళం జిల్లా మంధస - 10 సెం.మీ.లు