
మంత్రి రావెలకు అసమ్మతి సెగ
ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది.
వట్టి చెరుకూరు మండలం వింజనంపాడులో స్థానిక టీడీపీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.