ఈ ‘బ్లాక్ బ్యూటీ’ ధర రూ. 3 లక్షలు! | haryana buffalo gives 30 liters milk in a day | Sakshi
Sakshi News home page

ఈ ‘బ్లాక్ బ్యూటీ’ ధర రూ. 3 లక్షలు!

Published Sun, Feb 28 2016 12:01 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఈ ‘బ్లాక్ బ్యూటీ’ ధర రూ. 3 లక్షలు! - Sakshi

ఈ ‘బ్లాక్ బ్యూటీ’ ధర రూ. 3 లక్షలు!

ప్రత్తిపాడు: ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ ‘బ్లాక్ బ్యూటీ’ని చూడండి. ఎంతందంగా ఉందో. ఆకారంతో పాటు దీని ధర కూడా ఎక్కువే. పాల పోటీలకు ఉపయోగపడే ఈ హర్యానా జాతి గేదె వెల  3,01,116 రూపాయలు. ఇది ప్రతి రోజూ సుమారు పాతిక నుంచి ముప్పై లీటర్ల పాలు ఇస్తుంది.

దీనిని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ ఏడు నెలల కిందట ఇంకొల్లు సమీపంలోని ముప్పారం డైరీలో లక్షా పాతిక వేలకు కొనుగోలు చేశాడు. అతని వద్ద నుంచి  ఈ గేదెను తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన నూనె శ్రీనివాస్ శనివారం 3,01,116 రూపాయలకు కొనుగోలు చేశాడు. రెండవ ఈతకే ముప్పై లీటర్లు పాలు ఇస్తుందని, మూడవ ఈతకు మరింత పెరిగే అవకాశం ఉందని సురేష్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement