ప్రత్తిపాడు రూరల్: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో సంచరిస్తుంది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తూ భయాందోళనకు గురిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు పాము ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. తమకు ఎటువంటి అనవాళ్లు లభించలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment