కింగ్ కోబ్రాను బంధిస్తుండగా ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు
కంచిలి: కింగ్ కోబ్రా గురువారం రాత్రి హల్‌చల్ చేసింది. డోల గోవిందపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్.. పోలేరు గ్రామానికి చీకటి పడిన తర్వాత తన మోటారు సైకిల్ మీద వెళుతుండగా, గ్రామం ప్రారంభంలో ఆంజనేయస్వామి విగ్రహం జంక్షన్‌లో ఈ పాము ఎదురుపడింది. అంత పెద్ద పామును చూసి ఆయన భయపడి బైక్ వదిలేశారు. దీంతో బైక్ పాము మీద పడింది. అంతలోనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. సోంపేటలో ఉండే పాములు పట్టే రాజారావుకు ఫోన్ చేశారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. సర్పం 13 అడుగుల పొడవు, 16 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment