రూ.2.42 కోట్ల బ్యాంకు నిధుల రికవరీ
Published Fri, Oct 21 2016 11:20 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM
ప్రత్తిపాడు :
స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలో బినామీ ఖాతాలకు మళ్లిన నిధులు రికవరీ అవుతున్నాయి. ప్రత్తిపాడు ఎస్‌బీహెచ్‌లో రూ.2.65 కోట్లు దారి మళ్లిన కేసు లో రూ.2.42 కోట్లు రికవరీ అయినట్లు బ్యాంక్ మేనేజర్ సత్యానందం తెలిపారు. రూ.1.38 కోట్లు రికవరీ అనంతరం పోలీసు కావడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్న ఎడ్ల ఉష సత్యసూర్యవెంకట రాకేష్ (చిన్నా) బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు జనరల్ లెడ్జర్ (బీజీఎల్) ఖాతాలోని ఈ సొమ్మును పక్కదారి పట్టించాడు. ఈ సొమ్మును ప్రత్తిపాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలకు చెందిన 9 మంది ఖాతాలకు 29 పర్యాయాలు ట్రా¯Œ్సఫర్ చేశాడు. 2016 మే నుంచి సెప్టెంబర్ వరకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు రూ.1.38 కోట్లు వెనక్కి రాబట్టారు. మిగిలిన సొమ్ము రికవరీ, నిందితులు చిన్నాపై బ్యాంక్ అధికారులు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం కావడం, బ్యాంక్ విజిలెన్సు అధికారులు ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నారు. గురువారం మరోరూ.1,04,50,000 రికవరీ చేశామని బ్యాంక్ మేనేజర్ సత్యానందం తెలిపారు.
Advertisement
Advertisement