
సాక్షి, గుంటూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లగా మంత్రి సోమిరెడ్డిని రైతులు అడ్డుకుని నిలదీశారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లారు. పంటలను పరిశీస్తుండగా పలువురు స్థానిక రైతులు పలు సమస్యలపై మంత్రి సోమిరెడ్డిని నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment