విశాఖపట్టణం: ఆకాశానికి చిల్లు పడినట్టుగా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రబావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రికార్డుస్థాయిలో వర్షాలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో 26 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
మిగతా ప్రాంతాల్లో ఈ రోజు నమోదయిన వర్షపాతం వివరాలు
విశాఖపట్నం - 16 సెం.మీ.లు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి - 15 సెం.మీ.లు
గుంటూరు జిల్లా రెంటచింతల - 15 సెం.మీ.లు
కృష్ణా జిల్లా అవనిగడ్డ - 14 సెం.మీ.లు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం - 13 సెం.మీ.లు
ప.గో.జిల్లా కోడేరు - 13, నరసాపురం 11 సెం.మీ.లు
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం - 11 సెం.మీ.లు
ప్రకాశం జిల్లా కందుకూరు - 11 సెం.మీ.లు
కృష్ణా జిల్లా గుడివాడ - 11 సెం.మీ.లు
గుంటూరు జిల్లా మాచర్ల - 10 సెం.మీ.లు
విశాఖ జిల్లా యలమంచిలి -10 సెం.మీ.లు
కృష్ణా జిల్లా కైకలూరు - 11 సెం.మీ.లు
శ్రీకాకుళం జిల్లా మంధస - 10 సెం.మీ.లు
ప్రత్తిపాడులో నేడు అత్యధిక వర్షపాతం
Published Fri, Oct 25 2013 2:02 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement